raitu deeksha
-
నేడు కలెక్టరేట్ల ఎదుట టీజేఎస్ దీక్షలు
కాజీపేట అర్బన్/భూపాలపల్లి రూరల్: భూములపై రైతుల హక్కు కోసం రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల ఎదుట సోమవారం రైతు దీక్షలు చేపట్టనున్నట్లు తెలంగాణ జనసమితి (టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫె సర్ కోదండరాం తెలిపారు. హన్మకొండలో ఆదివారం ఆయన టీజేఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళనతో అనేకమంది రైతులు భూమిపై హక్కులను కోల్పోయారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 9,11,241 రెవెన్యూ రికార్డుల్లో తప్పులు దొర్లాయని, ఫలితంగా జరిగిన ఐదుగురు రైతుల మరణానికి ప్రభుత్వం జవాబు చెప్పాలని ఆయన నిలదీశారు. వెంటనే ప్రభుత్వం రెవెన్యూ రికార్డులను సరిచేసి రైతులకు భూమిపై హక్కులను కల్పించాలని డిమాండ్ చేశారు. ఎల్కతుర్తి మండలంలో రెవెన్యూ అధికారులు చేసిన తప్పులను ప్రశ్నించినందుకు రైతుపై దాడి చేసి కేసులు బనాయించడం దారుణమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 46 శాతం మంది రైతులకు పట్టాదారు పాసు బుక్కులు రాలేదని, వారికి పాస్‌బుక్కులు అందని పక్షంలో సెప్టెంబర్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు నిర్వస్తామని ఆయన హెచ్చరించారు. అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకు పోయిందని కోదండరాం విమర్శించారు. భూపాలపల్లిలో ఆదివారం ఏర్పాటు చేసిన పార్టీ భూపాలపల్లి జిల్లా సమావేశంలో మాట్లాడుతూ రైతుబంధు పథకం వల్ల భూస్వాములకే ప్రయోజనం చేకూరిందని, చిన్న, సన్నకారు రైతులకు ఒరిగిందేమీ లేదన్నారు. -
చంద్రబాబుకు రాజధాని పాడిఆవు లాంటిది
-
రాబోయే రోజుల్లో చంద్రబాబు ఆంధ్రా ’తుప్పు’
-
రైతుల్ని మరిచి బాబు డ్యాన్సులు వేసుకుంటున్నాడు
-
రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వ ద్వంద్వ వైఖరి
26, 27 తేదీల్లో హైదరాబాద్‌లో రైతుదీక్ష టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు టవర్‌సర్కిల్ : రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వం ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని, ఎక్స్‌గ్రేషియా విషయంలో జిల్లాకో రకమైన నీతి పాటిస్తుందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు అన్నారు. జిల్లాకేంద్రంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో మూడు వేల పైచిలుకు రైతులు ఆత్మహత్యలకు చేసుకుంటే ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 339 మంది ఉన్నారని, అయితే 76 మందే చనిపోయినట్లు ప్రభుత్వం లెక్కలు చూపుతోందన్నారు. కేవలం 15 మందికి రూ.1.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించారని తెలిపారు. మెదక్ జిల్లాలో ఒక్కో రైతు కుటుంబానికి రూ.6లక్షలు ఇచ్చారని అన్నారు. మెదక్‌లో మాత్రమే పూర్తిస్థాయిలో ఎక్స్‌గ్రేషియా ఇవ్వడం, మిగతా ప్రాంత రైతు కుటుంబాలను విస్మరించడం టీఆర్ఎస్ ప్రభుత్వానికే చెల్లిందని విమర్శించారు. రైతు ఆత్మహత్యలు, ఎక్స్‌గ్రేషియా, రుణాల మంజూరు తదితర సమస్యలపై ఈ నెల 26, 27 తేదీల్లో హైదరాబాద్‌లోని ఇందిరాపార్కుల వద్ద చేపట్టే రైతు ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. నాయకులు తాజొద్దీన్, గంట రాములు, కళ్యాడపు ఆగయ్య, రొడ్డ శ్రీనివాస్, పుట్ట నరేందర్, దామెర సత్యం, చెల్లోజి రాజు, జాడి బాల్‌రెడ్డి, ఎర్రబెల్లి రవీందర్, దూలం రాధిక, తీట్ల ఈశ్వరి, మాదవి, ఇందు, వాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర మైనార్టీసెల్ అధ్యక్షుడిగా నియమితులైన తాజొద్దీన్‌ను పార్టీ నాయకులు సన్మానించారు. -
కేసీఆర్‌ను మేల్కొలిపేందుకే రైతు దీక్ష
- వైఎస్సార్సీపీ నేత శివకుమార్ వెల్లడి - మైనార్టీ సోదరులందరూ తరలిరావాలని విజ్ఞప్తి - పోస్టర్ విడుదల హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొని రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు... ఈ విపత్కర పరిస్థితుల్లో సీఎం కేసీఆర్‌ను మేల్కొలిపేందుకు రైతన్నకు అండగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి రైతుదీక్ష చేపడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ తెలిపారు. శుక్రవారం వైఎస్సార్ సీపీ నగర మైనార్టీ కమిటీ అధ్యక్షుడు షేక్ అర్షద్ ఆధ్వర్యంలో లోటస్ పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రచార పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు భరోసా కల్పించడం ద్వారా ఆత్మహత్యలకు పాల్పడకుండా నిరోధించే ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు శ్రీనివాస రెడ్డి దీక్ష చేపడుతున్నారన్నారు. అక్కడ ఏపీ రాష్ట్రంలోనూ ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాల్లో ధైర్యం నింపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఈ నెల 11 నుంచి తిరిగి అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్ర చేపడుతున్నారని తెలిపారు. హైదరాబాద్ నగర మైనార్టీ కమిటీ అధ్యక్షుడు షేక్ అర్షద్ మాట్లాడుతూ తెలంగాణ జిల్లాల్లోని మైనార్టీ సోదరులందరూ ఎంపీ శ్రీనివాస రెడ్డి చేపట్టే దీక్షలో పాల్గొనాలని కోరారు. గారడీ మాటలొద్దు: వైఎస్సార్ సీపీ నగర యువజన విభాగం రైతులు కరువు పరిస్థితులు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతుంటే, వడగండ్ల వర్షాలు మరింత నష్టం తెచ్చిపెట్టాయని ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధప్రాతిపదికన ఆదుకోవాల్సిన సీఎం కేసీఆర్ గాల్లో తిరుగుతూ గారడీ మాటలు చెబుతున్నారని వైఎస్సార్ సీపీ నగర విభాగం అధ్యక్షుడు ఎ. అవినాష్ గౌడ్ తీవ్రంగా విమర్శించారు. శుక్రవారం ఆదర్శ నగర్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో నగర యువజన విభాగం ఆధ్వర్యంలో రైతు దీక్ష ప్రచార పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు. వేరువేరు చోట్ల జరిగిన ఈ పోస్టర్ల విడుదల కార్యక్రమంలో నగర మైనార్టీ విభాగం కార్యదర్శి ఎం.రిజ్వాన్ హుస్సేన్, కమిటీ సభ్యులు ఎం అల్తాఫ్ ఉద్దీన్, ఎం.ఇస్మాయిల్, ఫైషల్ షా, అబుల్ ఖైర్ సిద్దికీ, నగర యువజన విభాగం నాయకులు కపిల్, ఫైజల్, మాజీద్ తదితరులు పాల్గొన్నారు.