Raj Ballabh Yadav
-
అతడు బయటే ఉంటే.. నా కూతురు బతకదు
పాట్నా: మైనర్ బాలిక రేప్ కేసులో నిందితుడిగా ఉండి ఇటీవల బెయిల్‌పై విడుదలైన ఆర్జేడీ ఎమ్మెల్యే రాజ్ బల్లబ్ యాదవ్ బయటే ఉంటే తన కూతురు పనైపోయినట్లే అని బాధితురాలి తండ్రి ఆవేదన వ్యక్తంచేస్తున్నాడు. అతడు బయటే ఉంటే నేను పోరాడలేను. ఇక నా కూతురు పనైపోయినట్లే అని చిన్న పాన్‌షాప్ నిర్వహిస్తున్న బాలిక తండ్రి జాతీయ మీడియాతో మాట్లాడుతూ శుక్రవారం ఆందోళన వ్యక్తంచేశాడు. ఇటీవల బాధిత బాలిక 'నాపై అత్యాచారానికి పాల్పడిన యాదవ్ జైలు నుంచి బయటకొచ్చాడు. నాకు జరిగిన సంఘటనతో ఇప్పటికే నేను చచ్చిపోయిన దాన్ని. నేను కోల్పోయేందుకు ఇంకేం లేదు. నేను ఇప్పుడు నా కుటుంబం గురించి భయపడుతున్నాను అంటూ వాట్సప్‌లో మీడియాకు తెలపడం బీహార్‌లో తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. దీంతో పాట్నా హైకోర్టు రాజ్ బల్లాల్‌కు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దుచేయాలని కోరుతూ బీహార్ ప్రభుత్వం సుప్రింకోర్టును ఆశ్రయించింది. దీని విచారణ శనివారం జరగనుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 6న ఆర్జేడీలోని శక్తిమంతమైన నాయకుల్లో ఒకరైన రాజ్ బల్లబ్ యాదవ్ పదో తరగతి చదువుతున్న బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఓ మహిళ ద్వారా ఆ అమ్మాయిని అటకాయించి ఈ దారుణానికి దిగాడు. కాగా ఆర్జేడీ ఇప్పటికే రాజ్ బల్లబ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే.. శుక్రవారం ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తో రాజ్ బల్లబ్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
'రేపిస్టు బడా నేత బయటకొచ్చాడు.. భయంగా ఉంది'
పట్నా: తనపై లైంగిక దాడికి పాల్పడిన పవర్ ఫుల్ రాజకీయనాయకుడు బెయిల్ పై బయటకొచ్చాడని, ఇప్పుడు తనకు చాలా భయంగా ఉందని, తన కుటుంబాన్ని నాశనం చేస్తాడేమోనని బెంబేలెత్తిపోతున్నానని ఓ పది హేనేళ్ల బాలిక బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు విజ్ఞప్తి చేసుకుంది. అతడు చాలా పలుకుబడి ఉన్న నాయకుడని, ఎవ్వరినైనా ఏమైనా చేయగలడని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 6న ఆర్జేడీలోని శక్తిమంతమైన నాయకుల్లో ఒకరైన రాజ్ బల్లాబ్ యాదవ్ పదో తరగతి చదువుతున్న బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఓ మహిళ ద్వారా ఆ అమ్మాయిని అటకాయించి ఈ దారుణానికి దిగాడు. అనంతరం బాలికకు రూ.30 వేలు తీసుకొమ్మని ఆఫర్ చేశాడు. అయితే, తనపై దాడికి పాల్పడిన వ్యక్తిని గుర్తించిన బాలిక ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. నెల రోజులపాటు పరారీలో ఉన్న రాజ్ బల్లాబ్ అనంతరం లొంగిపోగా జైలులో వేసి విచారిస్తున్నారు. అతడికి ఇటీవలె గత శనివారం బెయిల్ వచ్చి బయటకొచ్చాడు. ఈ నేపథ్యంలో తీవ్ర ఆందోళనకు గురైన బాధిత బాలిక వాట్సాప్ ద్వారా తన విజ్ఞప్తిని ముఖ్యమంత్రి నితీశ్ కు చేయాలంటూ జర్నలిస్టులకు, ఇతర ప్రముఖ వ్యక్తులకు సమాచారం పంపించింది. ఆ బాలిక వాట్సాప్ లో ఏం పంపించిందంటే.. 'నాపై అత్యాచారానికి పాల్పడిన యాదవ్ జైలు నుంచి బయటకొచ్చాడు. నేను ఇప్పుడు నా కుటుంబం గురించి చాలా భయపడుతున్నాను. వారికి ఏదైనా జరుగుతుందేమో. నాకు జరిగిన సంఘటనతో ఇప్పటికే నేను చచ్చిపోయిన దాన్ని. నేను కోల్పోయేందుకు ఇంకేం లేదు. అతడు నన్ను నా కుటుంబాన్ని ఏక్షణంలో నైనా చంపగలడు. అతడికి పోలీసులు కూడా భయపడుతున్నారు' అంటూ ఆ బాలిక మొరపెట్టుకుంది. కాగా, రాజ్ కు హైకోర్టు ఇచ్చిన బెయిల్ వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుకు వెళ్లింది. దానిపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ ఘటన అనంతరం రాజ్ ను ఆర్జేడీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ పగతో అతడు తన కుటుంబాన్ని ఏమైనా చేస్తాడేమోనని బాలిక భయపడుతోంది. -
ఆ ఎమ్మెల్యేపై బాధితురాలి వాట్సప్ మెసేజ్!
తనపై అత్యాచారం చేసిన ఎమ్మెల్యే బెయిల్ పై విడుదల కావడంతో తాను, తన కుటుంబం భయంభయంగా బతుకుతున్నామని, తనను, తన కుటుంబాన్ని అతను హతమార్చే అవకాశముందని బాధితురాలు వాట్సప్ మెసేజ్ లో తెలిపింది. అధికార ఆర్జేడీ పార్టీకి చెందిన బిహార్ ఎమ్మెల్యే రాజ్ బలభ్ యాదవ్ నాగాలాండ్ కు చెందిన అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. నలంద స్కూల్ లో పదో తరగతి చదువుతున్న అమ్మాయిని అతడు రేప్ చేశాడు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆర్జేడీ అతన్ని పార్టీ నుంచి బహిష్కరించింది. ఇటీవల బాధితురాలు పదో తరగతి పరీక్షలు రాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆరు నెలల జైలలో ఉన్న నిందితుడు రాజ్ బలభ్ యాదవ్ కు పట్నా హైకోర్టు బెయిల్ ఇచ్చింది. ఎమ్మెల్యే యాదవ్ కు బెయిల్ రావడంతో తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తూ బాధితురాలు వాట్సాప్ ద్వారా మీడియాకు ఓ సందేశం పంపించారు. 'అతను జైలు నుంచి బయటకు వచ్చాడు. నా కుటుంబ రక్షణ గురించి నాకు భయం కలుగుతోంది. నాపై జరిగిన దారుణానికి నేను ఇప్పటికే చనిపోయాను. ఇంకా నేను కోల్పోయేదేమీ లేదు' అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 'శక్తిమంతుడైన యాదవ్ ముందు నేను, నా కుటుంబం పెద్ద లెక్క కాదు. అతను నన్ను, నా కుటుంబాన్ని ఎప్పుడైనా చంపగలడు. పోలీసులే అతన్ని చూస్తే భయపడతారు' అంటూ ఆమె తన ఆవేదన వ్యక్తం చేసింది.