Rajakulu
-
రజకబంధు పథకం ప్రకటించాలి: ఆర్.కృష్ణయ్య
సాక్షి, కవాడిగూడ(హైదరాబాద్): రాష్ట్ర ప్రభుత్వం రజకబంధు పథకం ప్రకటించి ఒక్కో రజక కుటుంబానికి రూ.10లక్షలు అందించాలని బీసీ సంక్షేమసంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. అదేవిధంగా రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఇందుకోసం ప్రధాని మోదీ జాతీయస్థాయిలో కమిటీని వేయాలని కోరారు. అఖిల భారత రజక సంఘం ఆధ్వర్యంలో ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద గురువారం నిర్వహించిన ధర్నాకు ఆర్.కృష్ణయ్య సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రజకులకు ఫెడరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించడంతోపాటు వారికి ఆత్మగౌరవ భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు. కోఠి మహిళా కళాశాలకు ఐలమ్మ పేరు పెట్టాలని కోరారు. కార్యక్రమంలో అఖిల భారత రజక సంఘం జాతీయ అధ్యక్షుడు ముగ్గు అనిల్, బీసీ సంక్షేమసంఘం ఉపాధ్యక్షుడు గుజ్జకృష్ణ తదితరులు పాల్గొన్నారు. చదవండి: పాలన పక్కన పెట్టి కుట్రలు -
‘జగనన్న చేదోడు’కు జావెద్ హబీబ్ బిగ్ థ్యాంక్స్
ముంబై : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ప్రముఖ హేర్ స్టైలిస్ట్ జావెద్ హబీబ్ ప్రశంసల వర్షం కురిపించారు. నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు ఆర్థిక సాయం అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘జగనన్న చేదోడు’ పథకాన్ని ప్రారంభించడంపై జావెద్ హబీబ్ స్పందించారు.('పేదోళ్ల గుండెల్లో మీరు దేవుడిగా నిలిచిపోతారు') ‘కరోనా ప్రపంచం మొత్తాన్ని మార్చివేసింది. ఫ్రొఫెషన్లను కూడా మార్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ఒక కొత్త పథకాన్ని తీసుకువచ్చారు. ఆ పథకం పేరే జగనన్న చేదోడు. నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు అండగా నిలవడానికి తీసుకొచ్చిన పథకం ఇది. ఒకేసారి వీరికి రూ.10 వేల సాయం అందనుంది. దేశంలోనే ఇలాంటి పథకం తీసుకువచ్చిన మొదటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి’ బిగ్ థ్యాంక్స్ అంటూ ‘జగనన్న చేదోడు’ పథకంపై జావెద్ హబీబ్ ప్రశంసలు ఝల్లు కురిపించారు. మరోవైపు లాక్‌డౌన్‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి జగనన్న చేదోడు పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని సెలబ్రిటీ స్టైలీస్ట్ హర్మన్ కౌర్ అన్నారు. (వారికి వైఎస్ జగనే కరెక్ట్ : నాగబాబు) కాగా, వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కంప్యూటర్ బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.10,000 చొప్పున నగదు జమ చేసి జగనన్న చేదోడు పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా మొత్తం 2.47 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో.. రూ.247.04 కోట్లు జమ చేయనున్నారు. ‘జగనన్న చేదోడు’ ద్వారా నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందుతుంది. రాజకీయాలు, పార్టీలకతీతంగా.. గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేసి ప్రభుత్వం సహాయం అందిస్తోంది. (‘జగనన్న చేదోడు’ ప్రారంభం) తమ శ్రమను మాత్రమే నమ్ముకుని పనిచేస్తున్న గొప్ప మనుషుల కోసం ఈ పథకాన్ని ప్రారంభించినట్టు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావిస్తానని పునరుద్ఘాటించారు. ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నామని చెప్పారు. సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా అర్హులను ఎంపిక చేశామని.. ఇంకా అర్హులెవరైనా ఉంటే గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరికి చేయూత అందించడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. కులాలు, మతాలు, రాజకీయాలకతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. -
'పేదోళ్ల గుండెల్లో మీరు దేవుడిగా నిలిచిపోతారు'
సాక్షి, తాడేపల్లి: రజక, నాయీ బ్రాహ్మణ, దర్జీల సంక్షేమం కోసం 'జగనన్న చేదోడు' పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. బుధవారం రోజున సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో.. కంప్యూటర్ బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.10,000 చొప్పున నగదును జమచేశారు. కరోనా కష్ట కాలంలో ప్రభుత్వం చూపిన చొరవకు లబ్ధిదారులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు తూర్పుగోదావరి జిల్లాకి చెందిన కోటిపల్లి రామతులసి మాట్లాడుతూ.. ప్రతి పేద కుటుంబం సీఎం జగన్‌కు రుణపడి ఉంటుంది. నవరత్నాలు పేదల అభివృద్ధికి ఉపయోగపడుతున్నాయి. గవర్నమెంట్ ఉద్యోగులకు ఇచ్చినట్టుగా పెన్షన్లు ఇస్తున్నారు. ఇంక్రిమెంట్ పెరిగినట్టుగా పెన్షన్ పెంచుతున్నారు, అవ్వతాతలు మిమ్మల్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు. పేదోళ్ల గుండెల్లో మీరు దేవుడిగా నిలిచిపోతారు. నేనున్నానని చెప్పిన విధంగానే మాకు మీకు సాయపడుతున్నారు. కరోనా సమయంలో బయటకు వెళ్లి పనిచేసే పరిస్థితి లేకపోవడంతో మీరు అందించిన సాయం ఎంతగానే అక్కరకొచ్చింది. రాబోయే తరంలోనూ మీరే ముఖ్యమంత్రిగా ఉండాలి' అంటూ రామతులశమ్మ ఉద్వేగానికి లోనైంది. చదవండి: ‘జగనన్న చేదోడు’ ప్రారంభం వాలంటీర్ల వ్యవస్థ అద్భుతం చిన్న పిల్లలకు ఓటు హక్కు ఉండదని ఏ రాజకీయ పార్టీలు పట్టించుకోవు. అమ్మఒడి పథకం ద్వారా మా పిల్లలకు చేయూత ఇచ్చారు. సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ పేదలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. పేదలకు ఏ పథకం రావాలో వాలంటీర్లు నేరుగా ఇంటికొచ్చి చెప్తున్నారు. మా గురించి ఇంతగా ఆలోచించిన పాలకులు ఎవరూ లేరు. ఐదేళ్లలో చేయాల్సిన పనులను ఏడాదిలోనే చేసి చూపించారు. -ఎం. హేమావతి(రజకురాలు), అనంతపురం నాయీ బ్రాహ్మణులు మీకు రుణపడి ఉన్నారు వాలంటీర్ నేరుగా మా షాప్‌కు వచ్చి లబ్ధిదారుడిగా ఎంపిక చేశారు. 30 ఏళ్లుగా నేను ఇలాంటి స్కీమ్ చూడలేదు. లబ్ధిదారుల్లో నా పేరు ఉండటం సంతోషాన్ని కలిగించింది. నాయీ బ్రాహ్మణులు మీకు రుణపడి ఉన్నారు. మీ నాన్న దయగారి వల్ల నాకు ఇల్లు వచ్చింది. ఇప్పుడు మీ దయతో నా మేనల్లుడికి స్థలం వచ్చింది. తరతరాలకు మీరే ముఖ్యమంత్రిగా ఉండాలి. - పైడియ్య (నాయీ బ్రాహ్మణుడు) - శ్రీకాకుళం మా గుండెల్లో చిరస్థాయిగా నిలిపోతారు జగనన్న చోదోడుతో కరోనా సమయంలో లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపారు. మరో 50 ఏళ్లు జగన్ సీఎంగా ఉండాలి. గ్రామ సచివాలయాలు నిర్మించి ఎంతో మంచిపని చేశారు. గ్రామస్వరాజ్యాన్ని నిజం చేసిన నాయకుడు వైఎస్ జగన్. మీరు ధన్యులు సార్, మా గుండెల్లో చిరస్థాయిగా నిలిపోతారు. -రామకోటేశ్వరరావు (దర్జీ) - పశ్చిమ గోదావరి -
‘జగనన్న చేదోడు’ ప్రారంభం
సాక్షి, అమరావతి: పేదల అభ్యున్నతి కోసం వరుసగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో పథకానికి శ్రీకారం చుట్టారు. జగనన్న చేదోడు పథకాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కంప్యూటర్ బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.10,000 చొప్పున నగదు జమ చేశారు. ఈ పథకం ద్వారా మొత్తం 2.47 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో.. రూ.247.04 కోట్లు జమ చేయనున్నారు. ‘జగనన్న చేదోడు’ ద్వారా నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందుతుంది. రాజకీయాలు, పార్టీలకతీతంగా.. గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేసి ప్రభుత్వం సహాయం అందిస్తోంది. తమ శ్రమను మాత్రమే నమ్ముకుని పనిచేస్తున్న గొప్ప మనుషుల కోసం ఈ పథకాన్ని ప్రారంభించినట్టు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావిస్తానని పునరుద్ఘాటించారు. ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నామని చెప్పారు. సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా అర్హులను ఎంపిక చేశామని.. ఇంకా అర్హులెవరైనా ఉంటే గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరికి చేయూత అందించడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. కులాలు, మతాలు, రాజకీయాలకతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. 3.58 కోట్ల మంది పేదలకు సంక్షేమ పథకాలు అందించామని వెల్లడించారు. అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, వాహనమిత్ర, నేతన్న నేస్తం, జగనన్న చేదోడు, ఆరోగ్యశ్రీ, సున్నా వడ్డీ వంటి ఎన్నో పథకాలు చేపట్టామన్నారు. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పాదయాత్రలో చెప్పిన ప్రతి మాటను నెరవేర్చగలిగానని సీఎం జగన్ అన్నారు. (ప్రత్యేక విప్లవాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్) -
రజకుల్ని బాదిపడేస్తున్న బాబు
తెలుగుదేశం పార్టీకి 35 ఏళ్ళుగా ఓట్లేస్తున్న రజకుల్ని ఆర్థికంగా, సామాజి కంగా, రాజకీయంగా ముందుకు తీసుకెళ్ళడానికి కనీస ప్రయత్నం చేయని చంద్రబాబు నాయకత్వాన్ని నమ్మి రజకులు వందేళ్ళు వెనక్కిపోయారు. బాబు పాలనలో రజకుల స్థితి కార్పొరేట్ సంస్థల దగ్గర బట్టలుతికే కూలీల స్థాయికి పడిపోయింది. ఎన్టీఆర్ ప్రభుత్వం 1985లో రజకుల్ని ఎస్సీ జాబి తాలో చేర్చాలని కేంద్రానికి ఇచ్చిన సిఫారసుకు కృతజ్ఞతగా రజకులు టీడీపీకి ఓటు బ్యాంకయ్యారు. 1995లో జరిగిన వెన్నుపోటు కుట్ర ద్వారా బాబు సీఎం అయ్యాక రజకులు అన్ని రంగాల్లో నిర్లక్ష్యానికి గురయ్యారు. దేశమంతా బట్టలుతికేది రజకులైతే, తిరుమల తిరుపతి దేవస్థానంలో బట్టలు ఉతికేది బాబు బంధువులు. టీటీడీలో బట్టలుతికే కాంట్రాక్టును తన బంధువుల ఏజెన్సీకి కట్టబెట్టి, బాబు రజకుల నోట్లో మట్టి కొట్టారు. 35 ఏళ్ళుగా ఓట్లేస్తున్న రజకులపట్ల అభిమానం గానీ, కృతజ్ఞతగానీ, ఎస్సీ ఇన్‌క్లూజన్ హామీ అమలు చెయ్యాలన్న సంకల్పం గానీ బాబుకు లేదు. మెజారిటీ రజకులు తన ప్రత్యర్థి పార్టీకి ఓటు బ్యాంకుగా ఉన్నా వైఎస్సార్ ఏనాడూ రజకుల పట్ల వివక్ష చూపలేదు. వైఎస్సార్ రజక సామాజిక వర్గానికి చెందిన బసవరాజు సారయ్య, పాండు, రాజారత్నంలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. 2004 ఎన్నికల్లో వైఎస్సార్ రజకులకు ఎస్టీ ఇన్‌క్లూజన్ హామీ ఇచ్చి, సీఎం అయ్యాక కేంద్రానికి సిఫారసు కూడా చేశారు. వైఎస్ మరణం రజకుల ఎస్టీ రిజర్వేషన్ మీద తీవ్ర ప్రభావం చూపింది. వైఎస్సార్‌లానే వైఎస్ జగన్ కూడా రజకులకు ప్రాధాన్యత ఇచ్చారు. 2019లో అధికారంలోకి వస్తే రజకులకు ఎమ్మెల్సీ ఇస్తామని, ఎస్సీ జాబితాలో చేరుస్తామని, ఇనాం/ మాన్యం భూముల్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. మాట తప్పని వైఎస్ జగన్ పక్షాన ఉండాల్నో, రజకుల్ని నమ్మించి మోసం చేసిన బాబు పక్షాన నిలవాల్నో.. తేల్చుకోవాల్సిన సమయం వచ్చేసింది. దేశం శాస్త్ర, సాంకేతిక పరంగా పరుగెడుతుంటే, చాకలోళ్ళు కాబట్టి చాకిరేవులోనే ఉండాలన్న ఫ్యూడల్ తత్వంతో రజక బిడ్డలకు ఇస్త్రీ పెట్టెలు ఇచ్చిన బాబు పాలన కావాల్నో, ఫీజు రీయింబర్స్మెంట్ తెచ్చి రజక బిడ్డల్ని ఇంజనీర్లని, ఉన్నత విద్యావంతుల్ని చేసిన రాజన్న రాజ్యం రావాల్నో తేల్చుకోవాల్సిందీ, తమ బిడ్డల తలరాతలు రాసుకోవాల్సిందీ రజకులే. -పొటికలపూడి జయరాం, రాష్ట్ర అధ్యక్షులు, రజక రిజర్వేషన్ పోరాట సమితి మొబైల్ : 85000 16809 -
రక్షణ చట్టం ఏర్పాటుచేయాలి
రజక వత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మన్నూరు నాయుడుపేట : రజకులకు ప్రత్యేక రక్షణ చట్టం ఏర్పాటుచేయాలని రజక వత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మన్నూరు భాస్కరయ్య కోరారు. నాయుడుపేటలోని గరిడివీధిలో ఆదివారం సంఘం 5వ జిల్లా మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీల కోసం తీసుకువచ్చిన అట్రాసిటీ చట్టం మాదిరిగానే రజకుల కోసం చట్టం తేవాలన్నారు. రజకులు ఎదుర్కొంటున్న సమస్యలపై 70 ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నా ఫలితం కనిపించడంలేదన్నారు. సంఘం నాయకులు పసుపులేటి రమేష్, జానకిరామ్, జే సుబ్రమణ్యం, మాధవయ్య, మధు, కలత్తూరు రమణయ్య, జే హుస్సేన్, మనోరమ్మ, చందన పాల్గొన్నారు. -
రజకులు పోరుబాట పట్టాలి
– రజక అభివృద్ధి సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు అంజయ్య పిలుపు కడప రూరల్ : రాష్ట్రంలోని రజకులు తమ సమస్యల పరిష్కారం కోసం పోరుబాట పట్టాలని రజక అభివృద్ధి సంస్థ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎం.అంజయ్య పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక హరిత హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశంలోని తొమ్మిది రాష్ట్రాలలో మినహా అన్ని రాష్ట్రాలలో రజకులు ఎస్సీ జాబితాలో కొనసాగుతున్నారని తెలిపారు. ఏళ్ల తరబడి రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని పోరాటాలు చేస్తున్నా, ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సీఎం చంద్రబాబు రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. తమను ఎస్సీ జాబితాలో చేర్చాలని కోరుతూ చంద్రబాబును, ప్రధాని నరేంద్రమోదీని కలిసి వినతిపత్రాలను సమర్పించనున్నట్లు తెలిపారు. అనంతరం నగరంలోని స్కౌట్ హాలులో జిల్లా రజక మహాసభను ఆ సంఘం జిల్లా అ«ధ్యక్షులు సి.వెంకట రమణ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.మునెయ్య, పి.పార్వతి, పి.కమ్మన్న, పెద్ద సంఖ్యలో రజకులు పాల్గొన్నారు. -
రజకులు పునర్విమర్శ చేసుకోవాలి
పూర్వం రజకులు సవారీలు మోసేవాళ్లు. ఆ అల వాటుతోనే కాబోలు 1983 నుంచి వీరిలో అత్యధి కులు తెలుగుదేశం పార్టీ సవారీ మోస్తున్నారు. ఇన్నేళ్లుగా ఓట్లేయించుకుంటున్న టీడీపీ రజకుల కోసం ఏం చేసింది? 33 ఏళ్ల ప్రస్థానంలో ఆ పార్టీ ఏ ఒక్క రజకుడికీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. కార్పొ రేషన్ చైర్మన్ ఇవ్వలేదు. కానీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కార్పొరేషన్ చైర్మన్ పదవులకన్నా సామాన్య రజ కులు ఎస్సీ రిజర్వేషన్ కోసమే టీడీపీ మీద ఆశలు పెట్టుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోల్లో రజ కులను ఎస్సీ జాబితాలో చేరుస్తామని హామీ ఇచ్చే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు గానీ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడుగాని ఈ అంశం మీద ఏనాడూ అసెం బ్లీలో మాట్లాడలేదు. 1985లో ఎన్టీ రామారావు ప్రభు త్వం అప్పటి ఎస్సీ కులాల జాబితా సమగ్ర పునర్వి మర్శ (కాంప్రిహెన్సివ్ రివిజన్)లో భాగంగా రజకు లను ఎస్సీ జాబితాలో చేర్చాలని మే 28న కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. 30 ఏళ్లు గడచి పోయాయి. ఆ రోజు మొదలు ఈ రోజు వరకూ ఆ సిఫారసు చట్టంగా రూపొందలేదు. కానీ రజకులను ఎస్సీ జాబితాలో చేర్చేందుకు తెలుగుదేశం ప్రభు త్వం కట్టుబడి ఉందని ఈ సిఫారసును భూతద్దంలో చూపిస్తున్నారు. ఇంతకీ ఆ సిఫారసులో ఏముంది? ఎస్సీ రిజర్వేషన్ కల్పించే విషయంలో రజకుల అర్హ తను ఒక పేరాగా, రజకుల అనర్హతను ఒక పేరాగా రాసి చివరగా ఆర్థికంగా, సామాజికంగా వెనుక బాటుకు గురైనందున రజకులను ఎస్సీ జాబితాలో చేర్చమని మాత్రమే కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దేశంలో మెజారిటీ రాష్ట్రాలలో, కేంద్ర పాలిత ప్రాంతాలలో రజకులు ఎస్సీలే. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం రజకులు, దాని ఉపకులాలను ఒకే కులంగా గుర్తించడంతో మొదలైన అన్యాయం నేటికీ కొన సాగుతోంది. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో పొదం వన్నాన్ అనే చాకలి కులాన్ని ఎస్సీ జాబితాలో చేర్చారు. వీరిదీ, ఆంధ్రదేశంలోని దేశ, గోల్కొండ చాకళ్లదీ ఒకే జీవన విధానం. అయినా తెలుగుదేశం ఈ వాస్తవం గుర్తించలేదు. అలాగే రాష్ట్రంలో కొన్ని చోట్ల రజకులు అంటరాని వారే. ఈ వాస్తవాన్నీ గుర్తించలేదు. ఎన్నో కారణాలతో ఎస్సీ రిజర్వేషన్ అడుగుతున్న కులానికి ఆ హోదా కల్పిస్తే రాజకీయ లబ్ధి చేకూరుతుందా లేదా అన్నదే చంద్రబాబు నాయుడి యోచన. 30 ఏళ్ల నుంచి ఆయనకు ఈ అంశం మీద శ్రద్ధ లేదు. ఇప్పటికైనా రజకులు వాస్తవాన్ని గమనించి ఎస్సీ హోదా కోసం పోరాడాలి. (రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని 1985లో ఎన్టీ రామారావు ప్రభుత్వం కేంద్రానికి సిఫారసు చేసి 30 ఏళ్లు గడచిన సందర్భంగా) పి. జయరాం (ప్రధాన కార్యదర్శి, ఏపీ మాచిదేవ సమితి) కె. ఉప్పలపాడు, ప్రకాశం జిల్లా