పూర్వం రజకులు సవారీలు మోసేవాళ్లు. ఆ అల వాటుతోనే కాబోలు 1983 నుంచి వీరిలో అత్యధి కులు తెలుగుదేశం పార్టీ సవారీ మోస్తున్నారు. ఇన్నేళ్లుగా ఓట్లేయించుకుంటున్న టీడీపీ రజకుల కోసం ఏం చేసింది? 33 ఏళ్ల ప్రస్థానంలో ఆ పార్టీ ఏ ఒక్క రజకుడికీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. కార్పొ రేషన్ చైర్మన్ ఇవ్వలేదు. కానీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కార్పొరేషన్ చైర్మన్ పదవులకన్నా సామాన్య రజ కులు ఎస్సీ రిజర్వేషన్ కోసమే టీడీపీ మీద ఆశలు పెట్టుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోల్లో రజ కులను ఎస్సీ జాబితాలో చేరుస్తామని హామీ ఇచ్చే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు గానీ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడుగాని ఈ అంశం మీద ఏనాడూ అసెం బ్లీలో మాట్లాడలేదు.
1985లో ఎన్టీ రామారావు ప్రభు త్వం అప్పటి ఎస్సీ కులాల జాబితా సమగ్ర పునర్వి మర్శ (కాంప్రిహెన్సివ్ రివిజన్)లో భాగంగా రజకు లను ఎస్సీ జాబితాలో చేర్చాలని మే 28న కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. 30 ఏళ్లు గడచి పోయాయి. ఆ రోజు మొదలు ఈ రోజు వరకూ ఆ సిఫారసు చట్టంగా రూపొందలేదు. కానీ రజకులను ఎస్సీ జాబితాలో చేర్చేందుకు తెలుగుదేశం ప్రభు త్వం కట్టుబడి ఉందని ఈ సిఫారసును భూతద్దంలో చూపిస్తున్నారు. ఇంతకీ ఆ సిఫారసులో ఏముంది? ఎస్సీ రిజర్వేషన్ కల్పించే విషయంలో రజకుల అర్హ తను ఒక పేరాగా, రజకుల అనర్హతను ఒక పేరాగా రాసి చివరగా ఆర్థికంగా, సామాజికంగా వెనుక బాటుకు గురైనందున రజకులను ఎస్సీ జాబితాలో చేర్చమని మాత్రమే కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
దేశంలో మెజారిటీ రాష్ట్రాలలో, కేంద్ర పాలిత ప్రాంతాలలో రజకులు ఎస్సీలే. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం రజకులు, దాని ఉపకులాలను ఒకే కులంగా గుర్తించడంతో మొదలైన అన్యాయం నేటికీ కొన సాగుతోంది. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో పొదం వన్నాన్ అనే చాకలి కులాన్ని ఎస్సీ జాబితాలో చేర్చారు. వీరిదీ, ఆంధ్రదేశంలోని దేశ, గోల్కొండ చాకళ్లదీ ఒకే జీవన విధానం. అయినా తెలుగుదేశం ఈ వాస్తవం గుర్తించలేదు. అలాగే రాష్ట్రంలో కొన్ని చోట్ల రజకులు అంటరాని వారే. ఈ వాస్తవాన్నీ గుర్తించలేదు. ఎన్నో కారణాలతో ఎస్సీ రిజర్వేషన్ అడుగుతున్న కులానికి ఆ హోదా కల్పిస్తే రాజకీయ లబ్ధి చేకూరుతుందా లేదా అన్నదే చంద్రబాబు నాయుడి యోచన. 30 ఏళ్ల నుంచి ఆయనకు ఈ అంశం మీద శ్రద్ధ లేదు. ఇప్పటికైనా రజకులు వాస్తవాన్ని గమనించి ఎస్సీ హోదా కోసం పోరాడాలి.
(రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని 1985లో ఎన్టీ రామారావు ప్రభుత్వం కేంద్రానికి సిఫారసు చేసి 30 ఏళ్లు గడచిన సందర్భంగా)
పి. జయరాం (ప్రధాన కార్యదర్శి, ఏపీ మాచిదేవ సమితి)
కె. ఉప్పలపాడు, ప్రకాశం జిల్లా
రజకులు పునర్విమర్శ చేసుకోవాలి
Published Thu, Jun 4 2015 1:12 AM | Last Updated on Wed, Oct 17 2018 4:53 PM
Advertisement
Advertisement