రాజమహేంద్రవరంగా పేరు మార్చండి
కోటగుమ్మం (రాజమహేంద్రవరం) : రాజమహేంద్రవరం పేరును ఇంకా చాలా ప్రాంతాల్లో, చాలామంది రాజమండ్రిగానే వినియోగిస్తున్నారని రాజమహేంద్రవరం ఇన్చార్జి ఆర్డీఓ శ్రీరామచంద్రమూర్తి అన్నారు. వెంటనే ఆ పేరు మార్చాలని సూచించారు. నగరంలోని సినిమా థియేటర్లు, హోటళ్లు, చాంబర్ ఆఫ్ కామర్స్ తదితర సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులతో మంగళవారం ఆయన సబ్‌కలెక్టర్ కార్యాలయంలో సమావేశమయ్యారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాజమండ్రికి బదులుగా రాజమహేంద్రవరం అని వాడుకలోకి తీసుకురావాలని సూచించారు. ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాలు తదితర సంస్థలన్నీ తమ బోర్డులు, తదితర విషయాల్లో రాజమహేంద్రవరం అనే రాయాలన్నారు.