Rajeshwar
-
ఐదేళ్లకే అబ్బురపరుస్తున్న హిమాన్షు! కేవలం కొన్ని సెకండ్ల వ్యవధిలో..
ఆదిలాబాద్: భైంసా పట్టణానికి చెందిన జిలకరి హిమాన్షు ఐదేళ్ల వయసుకే అబ్బురపరుస్తున్నాడు. వయసుకు మించి ప్రతిభతో రాణిస్తూ అందరిచేత ఔరా అనిపించుకుంటున్నాడు. భైంసా పట్టణానికి చెందిన జిలకరి రాజేశ్వర్–రజిత దంపతులు ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు కాగా వీరికి ఇద్దరు సంతానం. పెద్దవాడైన హిమాన్షు ప్రస్తుతం గుజిరిగల్లి శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతుండగా, సెకండ్ల వ్యవధిలో అన్ని రాష్ట్రాలు–రాజధానుల పేర్లు చెబుతూ ఆశ్చర్యపరుస్తున్నాడు. అంతేగాక తోటి పిల్లలు ఏ ఫర్ ఆపిల్, బి ఫర్ బాల్ అని నేర్చుకుంటుంటే తను మాత్రం ఆంగ్ల అక్షరాలతో పురాణ పురుషుల పేర్లు కంఠస్తంగా చెబుతుండడంతో ఉపాధ్యాయులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఏ ఫర్ అర్జున, బి ఫర్ బలరామ అంటూ జెడ్ ఫర్ జాంబవంత వరకు పురాణ పురుషుల పేర్లు పొల్లు పోకుండా చెబుతున్నాడు. తల్లిదండ్రులు సైతం తమ కుమారుడి ప్రతిభ చూసి మరింత ప్రోత్సహిస్తున్నారు. ఇవి చదవండి: వసుధైక కుటుంబం.. ఐదు తరాల అనుబంధం -
పని పూర్తి చేయమంటే 'పేపర్ అమ్మమన్నాడు'!
సాక్షి, హైదరాబాద్: ఉపాధి హామీ పథకం పనుల ఆలస్యంపై ఓ సర్పంచ్ కుమారుడిని ప్రశ్నించడంతోనే తిరుపతయ్య తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పరీక్ష పేపర్ల లీకేజీ స్కామ్‌లో భాగస్వామి అయ్యాడని తెలుస్తోంది. ఇతడితో పాటు ఇద్దరు అభ్యర్థులను అరెస్టు చేసిన సిట్ అధికారులు వీరిని తమ కస్టడీలోకి తీసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరోపక్క లీకేజీ కేసులో జైలుకు వెళ్లిన టీఎస్పీఎస్సీ మాజీ ఉద్యోగులు షమీమ్, సురేశ్, రమేశ్‌లను పోలీసులు బుధవారం తమ కస్టడీలోకి తీసుకున్నారు. టీఎస్పీఎస్సీ కార్యదర్శికి వ్యక్తిగత సహాయకుడిగా పని చేసిన ప్రవీణ్ కుమార్ నుంచి రేణుక, ఆమె భర్త డాక్యాలకు ఏఈ పరీక్ష ప్రశ్నపత్రాలు అందిన విషయం తెలిసిందే. వీటిని విక్రయించడానికి ఈ భార్యాభర్తలు ఏర్పాటు చేసుకున్న దళారుల్లో తమ స్వగ్రామమైన మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం మన్సూర్‌పల్లి తండాకు చెందిన కేతావత్ రాజేశ్వర్ అలియాస్ రాజు ఒకరు. రాజేశ్వర్ తల్లి మన్సూర్‌పల్లి తండాకు సర్పంచ్‌గా పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ తండాకు సంబంధించిన అభివృద్ధి పనులను రాజేశ్వర్ పర్యవేక్షించేవాడు. సల్కర్‌పేట గ్రామానికి చెందిన తిరుపతయ్య ఉపాధి హామీ పథకంలో టెక్నికల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. ఇతడు ఎనిమిదేళ్లుగా గండీడ్ మండలంలో పని చేస్తున్నాడు. దీంతో తిరుపతయ్య, రాజేశ్వర్ మధ్య పరిచయాలు ఉన్నాయి. మన్సూర్‌పల్లి తండాలో జరిగే ఓ అభివృద్ధి పనిని తిరుపతయ్య పర్యవేక్షిస్తున్నాడు. అది నిర్ణీత సమయానికి పూర్తికాకపోవడంతో ఆలస్యానికి కారణం ఏమిటంటూ రాజేశ్వర్‌ను ప్రశ్నించాడు. అప్పటికే ఏఈ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల వేటలో ఉన్న రాజేశ్వర్ అదే విషయం తిరుపతయ్యకు చెప్పి, ఆ బిజీలో ఉండటంతో అభివృద్ధి పనిని పర్యవేక్షించడం సాధ్యం కాలేదని, ఎవరైనా అభ్యర్థులు ఉంటే తీసుకురావాలని సూచించాడు. ప్రశ్నపత్రం విక్రయించగా వచ్చిన సొమ్ములో కమీషన్ ఇస్తానని చెప్పాడు. దీనికి అంగీకరించిన తిరుపతయ్య.. ఉపాధి హామీ పథకంలో పరిచయమైన రాజేంద్రకుమార్, ప్రశాంత్‌ను సంప్రదించాడు. వీరిని రాజేశ్వర్ వద్దకు తీసుకువెళ్లి, డాక్యా ద్వారా కర్మన్‌ఘాట్‌లోని ఓ లాడ్జి వద్ద ప్రశ్నపత్రం ఇప్పించాడు. వీరి నుంచి అడ్వాన్సుగా రూ.8 లక్షలు తీసుకున్నట్లు తెలిసింది. కస్టడీకోసం కోర్టులో సిట్ పిటిషన్ ఈ కేసులో వీరిని మరింత లోతుగా ప్రశ్నించడంతో పాటు నగదు రికవరీ కోసం తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సిట్ పోలీసులు బుధవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు ప్రకారం గ్రూప్–1 ప్రిలిమ్స్ పేపర్ ప్రవీణ్, రాజశేఖర్ల ద్వారా ఈ ముగ్గురితో పాటు రాజశేఖర్ సమీప బంధువు ప్రశాంత్‌రెడ్డి వద్దకు మాత్రమే వెళ్లింది. రమేశ్, సురేశ్‌లకు ప్రవీణ్ ఇవ్వగా.. షమీమ్‌తో పాటు ప్రశాంత్‌రెడ్డిలకు రాజశేఖర్ ఇచ్చాడు. అయితే ఆ పేపర్ ఈ ఐదుగురితో పాటు ఇంకా ఎవరికైనా చేరిందా? అనే కోణంలో సిట్ వీరిని ప్రశ్నించనుంది. సిట్ అధికారులు గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షల్లో 100కు పైగా మార్కులు సాధించిన 121 మందిని ప్రశ్నించడం కొనసాగిస్తున్నారు. బుధవారం నాటికి 84 మందిని ప్రశ్నించారు. కాగా, ఏఈ ప్రశ్నపత్రం మాదిరిగా గ్రూప్–1 పేపర్ వ్యవహరంలో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవని ఓ అధికారి వ్యాఖ్యానించారు. -
ఆపద్బంధు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: బాధిత కుటుంబాలకు ఆపన్నహస్తం అందించే ‘ఆపద్బంధు’పథకాన్ని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలకు వర్తించే ఈ పథకం గతేడాది నవంబర్ ఒకటో తేదీతో ముగిసింది. అయితే, తాజాగా ఈ పథకాన్ని ఈ ఏడాది నవంబర్ ఒకటి వరకు పొడిగిస్తూ సోమవారం విపత్తుల నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ ఉత్తర్వులు జారీ చేశారు. 17 కేటగిరీల కింద ప్రమాదవశాత్తు చనిపోయిన వారి కుటుంబీకులు ఈ పథకానికి అర్హులు. ఆపద్బంధు కింద రూ.50 వేల సాయాన్ని ప్రభుత్వం అందజేస్తుంది. అల్లర్లు, శాంతిభద్రతల విఘాతంలో ప్రాణాలొదిలినా, రోడ్డు ప్రమాదాల్లో చనిపోయినా, పడవ ప్రమాదంలో కొట్టుకుపోయినా, వరదలు, తుపాను, ఉప్పెన, నీట మునిగినా, వంతెన/భవనాలు కూలిన ఘటనలో ప్రాణాలు కోల్పోయినా.. వారికి ఆపద్బంధు వర్తించనుంది. అలాగే, అగ్ని ప్రమాదం, విద్యుదాఘాతం, భూ కంపాలు, తీవ్రవాదుల దాడుల్లో చనిపోయిన వారు కూడా అర్హులే. అత్యాచార వేధింపులకు గురైన ఎస్సీ, ఎస్టీ బాధిత కుటుంబాలను కూడా ఈ పథకం కింద పరిగణనలోకి తీసుకోనున్నారు. కల్లు గీత కార్మికులకు కూడా ఆపద్బంధు సాయం అందనుంది. అయితే, ఎక్సైజ్ శాఖ ఇన్సూరెన్స్ కవర్ కాకుంటేనే.. దీన్ని పరిగణనలోకి తీసుకుంటారు. అలాగే, కుక్కకాటు/రెబీస్ బారిన పడి 12 నెలల్లోపు మృతి చెందినవారికీ ఆపద్భందు వర్తించనుంది. పాము కాటు, వన్య మృగాల దాడిలో చనిపోయినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలితే ఈ పథకం కింద ఆర్థిక చేయూత లభించనుంది. వడదెబ్బ, ఇతర ప్రమాదాల్లో మృత్యువాత పడ్డవారికి కూడా ఆపద్బంధు రానుంది. ఈ తొమ్మిది కేటగిరీలకు వర్తించదు.. ఆత్మహత్యకు పాల్పడినా, మద్యం సేవించి మరణించినా ఆపద్బంధు వర్తించదు. అలాగే, సుఖ వ్యాధులు, మానసిక రోగంతో మరణించినా, చట్టాన్ని ఉల్లంఘిస్తూ చనిపోయినవారు అనర్హులే. యుద్ధం, అణు విస్పోటనం, గర్భవతులు, ప్రసవ సమయంలో చనిపోయినవారి కుటుంబాలకు కూడా ప్రయోజనం లభించదు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సాయుధ బలగాలకు ఈ పథకం వర్తించదు. -
రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ
వేములవాడఅర్బన్ : వేములవాడ రాజన్న సన్నిధానం భక్తులతో కిటకిటలాడింది. సోమవారం వివిధ ప్రాంతాల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ధర్మగుండంలో స్నానాలు చేసిన భక్తులు తలనీలాలు, కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అభిషేక మంటపంతో పాటు, బాలత్రిపురాసుందరీదేవి అమ్మవారి ఆలయంలో కుంకుమ పూజలు చేశారు. రద్దీ పెరిగిపోవడంతో క్యూలైన్లలో గంటల తరబడి నిరీక్షించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఈవో కృష్ణాజీరావు, ఏఈవోలు గౌరీనాథ్, ఉమారాణి ఏర్పాట్లను పరిశీలించారు. సోమవారం ఆలయానికి రూ. 9 లక్షల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. నేడు రాజన్న ఆలయ ఈవో ఉద్యోగ విరమణ వేములవాడఅర్బన్ : వేములవాడ రాజన్న ఆలయ ఈవో కృష్ణాజీరావు మంగళవారం ఉద్యోగ విరమణ పొందనున్నారు. ఇన్ని రోజులు ఇక్కడ సేవలందించి, అందరితో కలుపుగోలుగా ఉన్న ఆయనను ఘనంగా సన్మానించేందుకు ఉద్యోగ సంఘాలు సమాయత్తమవుతున్నాయి. అయితే తనకెలాంటి ఆర్భాటాలు అవసరం లేదని, సాదాసీదాగానే ఉద్యోగ విరమణ చేస్తానని ఈవో ఉద్యోగులతో అన్నట్లు సమాచారం. రాజన్న ఆలయ ఈవోగా రాజేశ్వర్ కరీంనగర్ కల్చరల్: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఇన్చార్జి ఈవో గా కరీంనగర్ దేవాదాయశాఖ సహాయ కమిషనర్ దూస రాజేశ్వర్‌ను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయంలో ముఖ్య కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్న క ృష్ణాజీరావు మంగళవారం రిటైర్డ్ కానున్నారు. రాజేశ్వర్ మంగళవారమే బాధ్యతలు స్వీకరిస్తారు. -
నేడే ‘పురాధీశుల’ ఎన్నిక
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : మున్సిపల్ ఎన్నికల పర్వంలో తుది ఘట్టానికి నేడు తెరపడనుంది. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల పాలక మండళ్లు గురువారం కొలువు దీరనున్నాయి. ఆయా మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీల చైర్మన్ పీఠాలను దక్కించుకునేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉండగా, మంచిర్యాల, బెల్లంపల్లి పురపాలక సంఘాల అధ్యక్ష పదవులను కూడా కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. భైంసా మున్సిపల్ చైర్మన్ పీఠంపై కొనసాగుతున్న ఉత్కంఠకు గురువారం తెరపడనుంది. భైంసా బల్దియాలో ఎంపీ ఓటు హక్కు చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నికలో ఎక్స్అఫిషియో సభ్యులుగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్న మున్సిపాలిటీల వివరాలను జిల్లాలోని ఎంపీ, ఎమ్మెల్యేలు ఎన్నికల అధికారులకు సమర్పించారు. ఎంతో ఉత్కంఠ రేపుతున్న భైంసా మున్సిపాలిటీలో ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ ఓటు హక్కును వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఇక్కడ అత్యధికంగా 12 కౌన్సిలర్ స్థానాలను ఎంఐఎం గెలుచుకున్నప్పటికీ, అధికార టీఆర్ఎస్ పార్టీ ఈ మున్సిపాలిటీపైనా దృష్టి పెట్టింది. ఎంఐఎం మినహా అన్ని పార్టీల కౌన్సిలర్ల మద్దతుతో అధికార టీఆర్ఎస్ పార్టీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునే దిశగా పావులు కదుపుతోంది. ఇందుకోసం ఆదిలాబాద్ ఎంపీ ఓటును ఈ మున్సిపాలిటీలో వినియోగించుకోవాలని భావిస్తోంది. మరోవైపు ఎంఐఎం తో ఉన్న స్నేహ సంబంధాల మేరకు ఈ చైర్మన్ పీఠాన్ని ఎంఐఎంకు దక్కేలా సహకరించే అవకాశాలు కూడా లేకపోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లా మంత్రి రామన్న ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఓటు హక్కును వినియోగించుకోవాలని నిర్ణయించారు. పెద్దపల్లి ఎంపీ సుమన్ కరీంనగర్ జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఓటు వేయాలని భావిస్తున్నా రు. నిర్మల్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డి నిర్మల్ మున్సిపాలిటీలో, సిర్పూర్ ఎమ్మెల్యే కోనప్ప కాగజ్‌నగర్ బల్దియాలో, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు మంచిర్యాల మున్సిపాలిటీలో, బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఓటు హక్కును వినియోగించుకోవాలని భావిస్తున్నారు. ఈ మేరకు వీరంతా విల్లింగ్ లెటర్లను ఎన్నికల అధికారులకు ఇచ్చారు. కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం తర్వాతే చైర్మన్ ఎన్నికలు.. గురువారం ఉదయం 11 గంటలకు కౌన్సిల్ సమావేశం ప్రారంభమవుతుం ది. ఎన్నికైన కౌన్సిలర్లు ముందుగా ప్రమాణస్వీకారం చేస్తారు. తర్వాత చైర్మన్ ఎన్నిక ఉంటుంది. చైర్మన్ అభ్యర్థిని ఒక సభ్యుడు ప్రతిపాదిస్తే.. మరో సభ్యు డు బలపరచాలి. మొత్తం సభ్యుల్లో 50 శాతం సభ్యులుంటేనే కోరం ఉన్నట్లుగా భావించి సమావేశాన్ని ప్రారంభిస్తారు. లేనిపక్షంలో గంట వరకు వేచి ఉండి, చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా వేస్తారని మున్సిపల్ ఎన్నికల జిల్లా ఇన్చార్జి, మెప్మా ప్రాజెక్టు డెరైక్టర్ రాజేశ్వర్ ‘సాక్షి’ప్రతినిధితో పేర్కొన్నారు. -
కొత్త డీఈఓగా రాజేశ్వర్
మెదక్/సంగారెడ్డి, న్యూస్‌లైన్: ఎట్టకేలకు జిల్లా విద్యాశాఖాధికారి గాజర్ల రమేష్ బదిలీ అయ్యారు. ఆదివారం ఉదయం కొత్త డీఈఓగా రాజేశ్వర్ ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మెదక్ పట్టణంలోని సీఎస్ఐ చర్చిని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రమేష్‌తో ఉపాధ్యాయ సంఘాలకు ఏర్పడిన భేదాభిప్రాయాల వల్ల విద్యాశాఖలో వివాదానికి దారి తీసిన విషయం విదితమే. 2012 ఏప్రిల్‌లో రమేష్ డీఈఓగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే విద్యాశాఖలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో ఉపాధ్యాయుల హాజరు, మధ్యాహ్న భోజనం, ప్రత్యేక తరగతుల నిర్వహణ, విద్యార్థుల స్థాయి, నిధుల వినియోగం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. తరచూ పాఠశాలలను సందర్శిస్తూ.. సమావేశాలు నిర్వహిస్తూ.. ఉపాధ్యాయుల పనితీరు మెరుగుపర్చడానికి చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో ఉపాధ్యాయుల పట్ల కఠినంగా వ్యవహరించారన్న వాదనలున్నాయి. 2013 ఫిబ్రవరిలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డిని సస్పెండ్ చేయడంతో ఉపాధ్యాయ వర్గాలు ఒక్కసారిగా ఆయనపై మండిపడ్డాయి. రమేష్ కఠిన వైఖరిని నిరసిస్తూ జిల్లాలోని ఉపాధ్యాయులంతా సంగారెడ్డిలోని డీఈఓ కార్యాలయం ఎదుట ధర్నా చేసేందుకు సిద్ధమయ్యారు. స్పందించిన అప్పటి కలెక్టర్ దినకర్‌బాబు ఉపాధ్యాయుల సంఘాలకు నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు. కాని డీఈఓకు ఉపాధ్యాయ సంఘాల మధ్య అంతరం అలాగే కొనసాగింది. రమేష్ పనిచేసిన రెండేళ్ల కాలంలో పలువురు ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులతోపాటు సుమారు 46 మంది ఉపాధ్యాయులను సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. అప్పట్లో ఓ ప్రైవేట్ పాఠశాల విషయమై సంగారెడ్డి ఎమ్మెల్యేకు డీఈఓ రమేష్ మధ్య వివాదం నెలకొంది. ఇదే సమయంలో డీఈఓ రమేష్ పదోన్నతులను ఇవ్వకపోవడం వల్ల ఉపాధ్యాయులు నష్టపోయారని, డీసీసీబీ నిధులను తన కార్యాలయానికి వినియోగించుకున్నారని ఆరోపిస్తూ ఉపాధ్యాయులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ వివాదాలు ముదిరి పాకాన పడటంతో ఫిబ్రవరి 2014లో డీఈఓ రమేష్‌ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే డీఈఓ రమేష్ అప్పటికే ఎన్నికల విధుల్లో భాగంగా మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ నోడల్ అధికారిగా పనిచేస్తున్నందున ఆయన బదిలీ ఆగిపోయింది. అనంతరం ఎన్నికల విధులు ముగిసినందున ఆదివారం రాజేశ్వర్ మెదక్ డీఈఓగా పదవీ బాధ్యతలు స్వీకరించగా, రమేష్ బదిలీపై డెరైక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌కు వెళ్లిపోయారు. సమష్టి కృషితోనే విద్యాభివృద్ధి: డీఈఓ రాజేశ్వర్ ఉపాధ్యాయులు, అధికారుల సమష్టి కృషితోనే విద్యాభివృద్ధి జరుగుతుందని డీఈఓ రాజేశ్వర్ తెలిపారు. ఆదివారం మెదక్ పట్టణంలోని సీఎస్ఐ చర్చిని సందర్శించిన ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మెదక్ జిల్లాను విద్యాపరంగా ప్రథమ స్థానంలో ఉంచేందుకు కృషి చేస్తానన్నారు. ఆయన వెంట విద్యాశాఖ అధికారులు భుజంగం, గీతా, చర్చి ప్రాపర్టీ మేనేజర్ సుబ్రహ్మణ్యం, సంగారెడ్డి డిప్యూటీ ఈఓ శోభారాణి తదితరులు ఉన్నారు. -
‘మనగుడి’ విజయవంతం చేయండి
కలెక్టరేట్/వేములవాడ, న్యూస్‌లైన్ : ఈనెల 11 నుంచి 17 వరకు నిర్వహించే ‘మనగుడి’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దేవాదాయశాఖ కమిషనర్ ముక్తేశ్వర్రావు సూచించారు. కరీంనగర్ కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఈవోలను ఆదేశించారు. ఈనెల 13న వేములవాడ రాజన్న ఆలయంలో లక్షబిల్వార్చన, అన్నపూజ నిర్వహించాలన్నారు. సాంస్కృతిక పునర్వైభవం తీసుకొచ్చేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ సంస్థ అధికారి వీరభద్రయ్య మాట్లాడుతూ ఆర్థికంగా స్థిరపడిన యువకులు తమ గ్రామాలను, ఆలయాలను అభివృద్ధి చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో రాజన్న ఆలయ ఈవో సీహెచ్‌వీ. కృష్ణాజిరావు, ఏఈవో హరికిషన్, కొండగట్టు ఈవో నర్సింహులు, ధర్మపురి ఈవో ఆంజనేయులు, అస్టెంట్ కమిషనర్ రాజేశ్వర్, జిల్లా ధర్మ ప్రచార మండలి అధ్యక్షుడు గండ్ర లక్ష్మణ్‌రావు, కార్యదర్శి కె.వి. శర్మ, సభ్యులు శ్రీరామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతికి రాజన్న ఆలయ బృందం.. రాజన్న క్షేత్రంలో అభివృద్ధి పనుల నిర్వహణకు నిధులు మం జూరు చేయాలని టీటీడీని కోరేందుకు ఈ ఆలయ బృందం శుక్రవారం తిరుపతి బయలుదేరి వెళ్లింది. ఆలయ ఈవో కృష్ణాజిరావు నేతృత్వంలో ట్రస్టుబోర్డు సభ్యులు అరుణ్‌తేజాచారి, సింగిరెడ్డి స్వామిరెడ్డి, చంద్ర మౌళి, మల్లారెడ్డి, ఆకునూరి బాల్‌రాజు, కముటాల శ్రీనివాస్, విజయరాజం, సగ్గుపద్మ వెళ్లిన వారిలో ఉన్నారు. ప్రధానంగా వంద గతుల చౌల్ట్రీ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తే, తాము స్థలం కేటాయిస్తామని ఈవో తెలిపారు.