rajeswara rao
-
సాహితీ విస్తరిలో అబ్బూరి వరదరాజేశ్వరరావు “కవన కుతూహలం”
వరద కాలం, కవన కుతూహలం అనేవి అబ్బూరి రాజేశ్వరరావు గారి సాహితీ కాలమ్స్. అబ్బూరి గారి నడకతో, శైలితో దీటుగా నడిచిన తెలుగు సాహితీ కబుర్ల రస గుళికలు అత్యంత పరమ అరుదు. సాహిత్య విస్తరి ముందు కూచున్న వారి భోజనం అబ్బూరి కాలమ్స్ చదవకుండా ఎప్పటికీ పూర్తి కానే కాదు.అబ్బూరి వరదరాజేశ్వరరావు “కవన కుతూహలం” నుండి చిన్న ముక్క.వెంకటశాస్త్రి గారంటే శ్రీశ్రీకి అపార గౌరవభక్తులుండేవి. శాస్త్రి గారితో పరిచయమయిన తరువాత శ్రీశ్రీ కొంచెం తడబడుతూ “కవిత్వం మీద తమ అభిప్రాయమేఁవి” టన్నాడు. అప్పటికే వయోవృద్ధులూ, అస్వస్థులూ అయిన శాస్త్రిగారు మందహాసం చేసి “నేను కవి నేనా?” అని అడిగారు. తనలా అడగటంతో ఏమన్నా పొరబాటు చేశానా అని సందేహిస్తూ “మీరు కాకపోతే ఈ ఆంధ్రదేశంలో మరెవ్వరండీ కవి?” అన్నాడు శ్రీశ్రీ గట్టిగా. శాస్త్రిగారు నవ్వారు. “కవిత్వం అంటే ఏదికాదో చెప్పటం సులభం కానీ, ఏది కవిత్వమో చెప్పటం కష్టం… మన కవిత్వానికి లక్షణం కంఠవశం కాగల రచన. మననం చేసుకోవటానికి అనువయిన పద సంచయనం చెయ్యాలి. కర్ణపేయంగా ఉండాలి. రసనాగ్ర నర్తకి! అంతవరకూ నేను సాధించాను”. శాస్త్రి గారు తనలో తాను నవ్వుకుంటూ పడకకుర్చీ మీద వెనక్కి తలపెట్టారు. ఆకస్మాత్తుగా ముందుకు వంగి “అయితే అంతమాత్త్రాన అది కవిత్వం అయిపోదు…” శాస్త్రిగారెవర్నో లోపలినుంచి పిలిచారు. మేము లేచాం. శ్రీశ్రీని చూస్తూ శాస్త్రి గారన్నారు. -“నువ్వు చెప్పు కవిత్వం అంటే ఏఁవిటో… అంత సులభఁవటయ్యా? అసలు నిర్ణయించేవారే లేరే ఈ దేశంలో. నీకు నేనూ నాకు నువ్వూ తప్ప…అంచేతనే కాబోలు మనం అనువాదాలూ, అనుసరణలతో ప్రారంభించాం… పోయిరండి” అన్నారు.-అన్వర్ సాక్షి -
అవార్డులూ.. బహుమతులూను
‘అవార్డులు రావు. కష్టపడి సంపాదించుకోవాలి’ అని అబ్బూరి వరద రాజేశ్వరరావు ఒకసారి అన్నారు. సాహిత్యం, ఆ మాటకొస్తే ఏ కళైనా ప్రచారం కోరుకుంటుంది. ప్రచారం దేనికి? కీర్తి కోసం అనుకునేవారు కొందరు. కళ నిర్వర్తించాల్సిన పరమార్థం కోసం అనుకునేవారు కొందరు. ఉత్కృష్టమైన కళ మబ్బుల చాటు సూరీడు వలే ఎల్లకాలం దాగి ఉండదు. జనులకు తెలిసే తీరుతుంది. ఆదరణ పొందుతుంది. కాని బంగారు చేటకు కూడా గోడచేర్పు అవసరం అన్నట్టు కొన్నిసార్లు కళ ప్రచారం కావడానికి, ఫలానా కళాకారుడి కృషి చూడండహో అని తెలుపడానికి అవార్డులూ, బహుమతులూ ఉపయోగపడతాయి. అయితే కాలక్రమంలో ఇడ్లీ కంటే చట్నీకి విలువెక్కువైనట్టు కళ కంటే ఈ అవార్డులకు విలువ ఎక్కువై అవార్డు వచ్చినవారు ‘గొప్పవారేమో’ అనే భావన జన సామాన్యులలో ఏర్పడే పరిస్థితి వచ్చింది. ముళ్లపూడి వెంకటరమణ ‘ఎన్ని ఫ్యాన్లున్నా ఒక్క ఏసీకి సమానం కావు గందా’ అని ఏదో పాత్ర చేత అనిపిస్తారు. చచ్చు పుచ్చు పుస్తకాలు ఎన్ని రాసినా ఒక సరైన అవార్డు కొడితే తల ఎగరేస్తూ తిరగొచ్చు కదా అనుకునే స్త్రీ పురుష సాహితీకారులు నేడు ఇరు రాష్ట్రాలలో తగు మోతాదులో మేట వేశారనే వాస్తవిక అపోహ ఉంది. జోకులు చలామణీలో ఉన్నాయి. ఒక ప్రఖ్యాత కవికి సరస్వతీదేవి ప్రత్యక్షమై ‘వత్సా! కవిత్వం కావలెనా? న్యూఢిల్లీ వారి ఫలానా సాహితీ అవార్డు కావలెనా?’ అని అడిగితే ఆ కవి సెకను తొట్రుపడకుండా ‘కవిత్వమే దయచేయి తల్లీ! అవార్డును ఎలాగోలా మేనేజ్ చేసుకుంటాను’ అన్నాట్ట! మనుషులంటూ ఉన్న ప్రతిచోటా తప్పులు, పొరపాట్లు ఉన్నట్టే అవార్డు అనే మాట ఉన్న చోటల్లా తప్పులూ, పొరపాట్లూ, రాజకీయాలూ, బానిసలకు వరాలూ ఉంటాయి. సాహిత్యంలో సర్వోన్నతమైనదిగా భావించే నోబెల్ పురస్కారం టాల్‌స్టాయ్‌కి రాలేదు. ఆయనకు కాకుండా ఆ తర్వాత దాదాపు 39 మంది నవలాకారులకు నోబెల్ ఇచ్చారు. వారంతా ‘మేము టాల్‌స్టాయ్‌కి వారసులం మొర్రోయ్’ అన్నారు. గాంధీకి నోబెల్ శాంతి ఇవ్వలేదుగాని ఆయన ద్వారా స్ఫూర్తి పొందిన మార్టిన్ లూథర్ కింగ్‌కు ఇచ్చారు. చైతన్య స్రవంతికి ఆద్యుడైన జేమ్స్ జాయిస్‌కి నోబెల్ రాలేదు. కథా చక్రవర్తయిన సోమర్సెట్ మామ్‌కు ఎందుకివ్వలేదయ్యా అనంటే ‘అతడు అక్కరకు మించిన ప్రచారం పొందాడు’ అని సాకు చెప్పారు. మన దగ్గర రవీంద్రనాథ్ టాగోర్‌కి సరే, ప్రేమ్‌చంద్, శరత్‌లు నోబెల్‌కు ఏం తక్కువ అని తూకం వేసి నిరూపిస్తే సదరు అవార్డు కమిటీ ఏం చెబుతుందో ఏమో! భారతదేశం వంటి దేశంలో రచయితలు, కవులు కేవలం తన రచనలతో బతికే పరిస్థితులు లేవు. ఎంతో గొప్ప అంకితభావం, ప్రతిభ, రచనాశక్తి, జనహిత అభిలాష కలిగిన రచయితలైనా బతుకు బాదరబందీలకు అవస్థలు పడుతూ కవిత్వమో, కథో రాయాలి. అప్పొసప్పో చేసి పుస్తకాలు వేసుకోవాలి. అవి అమ్ముడు పోకపోతే అటక మీద గుడ్డ కప్పి దాచుకోవాలి. ఇలాంటి సందర్భాలలో వీరికి తృణమో పణమో ఇచ్చి అవార్డు చేతపెట్టి గౌరవించుకుందాం అనే సదుద్దేశ సాహితీ సంస్థలు అనేకమే వచ్చాయి. ఇవి తమ తమ అభిరుచి, అభిలాషల మేర అవార్డులు ఇచ్చి ప్రోత్సహించినా, వాటిలో ప్రతిష్ఠాత్మకస్థాయి కలిగినవి బహు స్వల్పం కావడంతో ప్రభుత్వపరంగా వచ్చే రాష్ట్ర అవార్డులు, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డులు ప్రతిష్ఠాత్మకమై కూచున్నాయి. ‘షేక్స్పియర్కు ఏ అవార్డు వచ్చిందని నేటికీ చదువుతున్నారు’, ‘వేమనకు ఎవరు అవార్డిచ్చా రని ప్రతి నాలుక మీద పలుకుతున్నాడు’ అని ఎవరు ఎన్ని కబుర్లు చెప్పినా యోగ్యులైన సాహితీ కారులకు యోగ్యమైన అవార్డు వచ్చి తీరాలి. లేకుంటే అయోగ్యులు ఆ అవార్డులు పొందుతూ అవార్డుకు అయోగ్యతను తెచ్చి పెడతారు. అసలు సాహితీకారులు తమ వల్ల అవార్డుకు గౌరవం రావాలని కోరుకోవాలేగాని అవార్డు వల్ల తమకు గౌరవం రావాలనుకుంటున్నారంటేనే వీరెంత నిరుపేదలో అర్థం చేసుకోవచ్చు. ఇందుకై ఏళ్ల తరబడి పి.ఆర్ చేయుట, పెద్దలను మచ్చిక చేసుకొనుట, పథకాలు రచించుట, దొంగ పద్ధతిలో షార్ట్‌లిస్ట్‌లో చేరుట, కుల సమీకరణలు, ప్రాంతీయ సెంటిమెంట్లు.. ఇన్ని పతన సోపానాల మీద నడిచి అవార్డు తెచ్చుకుని అల్మారాలో పెట్టుకుని పొద్దున్నే అద్దంలో ముఖం ఎలా చూసుకుంటారో వీరు! నలుగురూ తిరిగే చోట తమ పుస్తకం పెట్టి, దాని మీద డబ్బు పెడితే ఆ డబ్బు కోసమైనా ఎవరూ పుస్తకాన్ని తీసుకెళ్లని నాసిరకం రచయితలు, కవులు కూడా ఫలానా అవార్డు కోసం పైరవీ చేసేవారే! వీరికి ఊ కొట్టే దిక్కుమాలిన జ్యూరీలు! ‘అవార్డు వస్తే ఏమవుతుంది’ అనంటే ‘నోరు మూతబడుతుంది’ అనేది ఒక జవాబు. ప్రభుత్వానికి ప్రత్యర్థిగా ఉండాల్సిన కవులు, రచయితలు ప్రభుత్వపరమైన అవార్డులు తీసుకున్నాక ప్రభుత్వానికి ములాజా అవుతారు. ఈ కారణం చేత కూడా ప్రభుత్వాలు అవార్డులను సృష్టిస్తాయి, ఇచ్చి ప్రోత్సహిస్తాయి. తమిళ రచయిత జయమోహన్ తనకొచ్చిన ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని ఈ కారణం చేతనే తిరస్కరించాడు. అయితే సరైన రచయితలు తమకు అవార్డుల వల్ల వచ్చిన అదనపు గుర్తింపును జనం కోసం ఉపయోగించడం మంచి స్ట్రాటజీనే! ప్రస్తుతం తెలుగునాట అవార్డుల దుమారం రేగి ఉంది. అవార్డు ఇస్తాం అనంటే గౌరవప్రదమైన సాహితీకారులు పరిగెత్తి పోరిపోయే స్థితి ఉంది. నాణ్యమైన రచనల పట్ల తెలుగు పాఠకలోకం ఉదాసీనత మాని, వాటిని అక్కున జేర్చుకుంటూ, ఆ రచనలకు సముచిత స్థానం కల్పిస్తూ వెళ్లడమే దీనికి విరుగుడు. పాఠకుడి అవార్డులు, బహుమతులే ఇప్పుడు తెలుగు సాహిత్యానికి శ్రీ సరస్వతీ రక్ష. -
సీఎం కేసీఆర్ ఇంట విషాదం
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇంట విషాదం నెలకొంది. కేసీఆర్ సోదరి భర్త పర్వతనేని రాజేశ్వరరావు (84) శనివారం మృతి చెందారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మర్రిమడ్లకి చెందిన రాజేశ్వరరావు నగరంలోని అల్వాల్ మంగాపురం కాలనీలో నివాసం ఉంటున్నారు. కేసీఆర్ మధ్యాహ్నం 12 గంటలకు అల్వాల్ చేరుకుని పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. రాజేశ్వరరావు మరణవార్త తెలుసుకున్న మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు ఉదయమే అక్కడికి చేరుకుని పార్థివదేహానికి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్‌లు రాజేశ్వరరావు కుటుంబసభ్యులను పరామర్శించారు. మధ్యాహ్నం తిరుమలగిరి స్వర్గదామ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు అంత్యక్రియలు పూర్తయ్యే వరకు రాజేశ్వరరావు నివాసంలోనే ఉన్నారు. కాగా, సీఎం సోదరి, రాజేశ్వరరావు సతీమణి విమలాదేవి గతేడాది చనిపోయారు. -
పోతనాంతరంగం భాగవతం
భాగవతం అమృతఫలం అందించిన పోతన నాదోపాసకుడు. సంగీత, సాహిత్య మర్మములెరిగి నవాడు. ఈ విషయం పోతన పద్యనడకల్లో బహిర్గ తమవుతుంది. భాగవతాన్ని అనుభవించి ఆ అను భవ, అనుభూతులను పద్యమకరందంలో అందిం చిన ధన్యుడు కూడా పోతన అన్నది విదితమే. భాగవతం ద్వితీయ స్కందంలో అద్వితీయంగా నాదోపాసనను గురించి స్పష్టం చేశాడు పోతన. దానికి ప్రత్యక్షోదాహరణం ఈ పద్యం ‘‘సీ. సాంద్ర శరచ్చంద్ర చంద్రికా థవళిత విమల బృందావన వీధియందు దనరి దైవత రుషభ గాంధార నిషాద పంచమ షడ్జమధ్యమ స్వరములోని గళాలు జాతులు మూర్చనల్ గలుగ వేణు నాళ వివరాంగుళాన్యాస లాలనమున మహిత గతింబాడె నవ్యక్త మధురముగను బంకజాక్షుండు దారువు లంకురింప’’ (భాగవతం 2–188) పై పద్యం ద్వారా పోతన తనకు గల సంగీత పాండిత్యాన్ని బహిర్గతం చేశాడు. పద్యాదిలో చంద్రిక రాగ ప్రస్తావన కనబడుతుంది. అంతేగా కుండా చంద్రిక రాగ ప్రస్తారాన్ని ఆరోహణ, ఆవ రోహణల్లో నిర్దేశించాడు. పైపద్యం ఒక్కటిచాలు పోతన సంగీత పాండిత్యాన్ని తెలుసుకోవడానికి. అలాగే లక్షణ శ్రీకృష్ణుని పరిణయ మాడిన వైనాన్ని తెలుపుతున్న (దశమస్కందం ఉత్తర భాగం 1096) సందర్భంలో పోతన పద్యాన్ని ఇలా రాగబద్ధం చేశాడు. ‘చం. కొలదిక మీరంగా డమరు గోముఖ డిండిమ.... నటీనటనముల్ దనరాశి’’(భాగవతం 10 ఉభా –1096) పై పద్యంలో పదిహేను వాద్య విశేషాలను తన నాదోపాసనా ప్రతిభకు తార్కాణంగా తెలియ చేశాడు పోతన. మరోపద్యం భాగవతం దశమ స్కందంలో 767 పద్యంలో.. ‘‘తే. మౌళి పించము కంఠధామమున మెరయ విలసిత గ్రామముగ నొక్క వేణువందు బ్రహ్మగాంధర్వ గీతంబు పరగజేసె జతుర నటమూర్తి గోపాలచక్రవర్తి’ పై పద్యంలో భువనమోహినీ రాగాల ప్రస్తా వన కనిపిస్తుంది. పోతన భాగవతంలో ప్రయోగిం చిన పదప్రయోగాల లాలిత్యానికి సంగీతం ఒక భాగమైంది. భాగవతాన్ని సంగీత సాహిత్య సమ లంకృతంగా శ్రీవాణి పదార్చన చేసి ఆ భాగవత ఫలాన్ని శ్రీరామాంకితం చేసి తను ధన్యుడై ప్రపంచ జాతిని ధన్యుల్ని చేశాడు. శిక్షలు, వివాహ వేడుకలు, ఆటలు, చల్దులు, ఊరగాయలు తెలుగువారికి చవిచూపిన చతు రుడు పోతన అంటే అతిశయోక్తి కాదేమో. పోతన నానుడులు కూడా అసలైన తెలుగుతనంతో దర్శిం పచేశాడు. ’ఊరకరారు మహాత్ములు’, ’వారిజాక్షు లందు వైవాహికములందు’ వంటివి గూడా పరి చయం చేశాడు. కుచేలుని ’బహుకుటుంబి’గా పరి చయం చేస్తాడు. అంతే కాకుండా తన భాగవ తంలో భక్తిచేత మాత్రమే భగవంతుడు సంతసి స్తాడని ప్రహ్లాదుని చేత పలికిస్తాడు. భగవంతుడు నిరంతరం భక్తులను కనిపెట్టుకుని ఉంటాడనే సత్యానికి ఒక ఉపమానాన్ని కూడా జోడిస్తాడు. ‘‘నాకు మేలుగోరు నా భక్తుడగువాడు భక్త జనుల కాన పరమగతియు భక్తుడెందు చనిన బరతెంతు వెనువెంట గోవు వెంట దగులు కోడె భంగి’’ (9–118) పై పద్యం అంతలో ‘గోవు వెంట దగులు కోడె భంగి’ అనే ప్రయోగం అర్థవంతమైన అర్థాలం కారంతో అలరారింది. పోతన భాగవతంలో ప్రయోగించిన ప్రతి అంశం ఒక నిర్దిష్ట ప్రమా ణంలో ఉంటుంది. గజేంద్రమోక్ష ఘట్టంలో సార్వజనీన తత్వం, సార్వకాలీనత్వం కనిపిస్తుంది. నిత్యం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడే జీవు లంతా కూడా గజేంద్రుని వంటి వారే. నిరంతరం భగవంతుని కరుణకైప్రార్థిస్తున్న వారే. ఈ విష యాన్ని నాడే గజేంద్రుని నోట పోతన ఇలా పల్కించాడు. ‘‘భక్తజనముల దీనులి పాలివాడు వినడె చూడడె తలపడ వేగరాడె’’ (8–87) అలాగే నిర్గుణ పరబ్రహ్మ తత్వాన్ని పోతన గజేంద్రమోక్షంలో అద్భుతంగా తెలియజేశాడు. ‘‘లావొక్కింతయు.... సంరక్షింపు భద్రాత్మకా’’ పద్యం పోతన తెలియజేసిన పరబ్రహ్మ తత్వానికి సాక్షీభూతంగా నిలుస్తుంది. పోతన గజేంద్రుని మొరను అతనిపరంగానే కాక విశ్వం లోని జీవులందరి పరంచేస్తూ తెలియజేశాడు. విద్య అవసరాన్ని నాడే పోతన గుర్తించి వ్యక్తి, వ్యవస్థల పరంగా ఇలా తెలియజేశాడు. ‘‘చదువని వాడజ్ఞుండగు చదివిన సరసద్వివేక చతురత కలుగున్ జదువగ వలయును జనులకు జదివించెద నార్యులొద్ద జదువుము తండ్రీ’’ పోతన భాగవత సమాజాన్ని మనసుతోనూ, తాను ఉన్న సమాజాన్ని ధర్మదృష్టితోనూ పరిశీలిం చాడు. వ్యక్తి వ్యవస్థ పరస్పరం ఒక ఆధారభూతం అంటూ అందుకు అనేక తార్కాణాలతో భాగవత ఆంధ్రీకరణలో తెలియజేశాడు. వ్యక్తి సత్యవ్రతం వ్యవస్థకు ఆదర్శం కావాలని అభిలషించాడు. అలాగే వ్యక్తి ప్రవర్తనపరంగా గర్వం కూడనిదని, గర్వించిన వారంతా కనుమరుగయ్యారని వామనా వతార ఘట్టంలో రాక్షసరాజు బలి నోట పలికిం చాడు (8.590). ‘కారే రాజులు రాజ్యముల్గలు గవే గర్వోన్నతింబొందరే, వారేరి సిరిమూట గట్టు కుని పోవంజాలిరే’ అనే తన ప్రకటిత భావానికి బలిని ఎంచు కుని పై భావాన్ని తెలియజేశాడు. తన జీవితంలో తృప్తిని ఎంతగా పొందాడో దాన్నే వామనునిచే తెలియజేశాడు. ‘దృప్తిం చెందని మనుజుడు సప్త ద్వీపములైన జక్కంబడునె’ (8–573) అని తెలిపాడు. ఇది ఒక రకంగా చెప్పా లంటే పోతన అంతరంగ ఆవిష్కరణే. వ్యక్తి వికాసం నడవడిలోనే ఉందని అది సామాన్యు నికైనా, అసమాన్యునికైనా సర్వసాధారణంగా తెలి యజేశాడు. జ్ఞానకాండను భాగవతం ద్వారా నిక్షిప్తం చేశాడు. పోతన భాగవతంలో శ్రీకృష్ణుడు మానవునిగా తన మాట, చేత తత్వాలను తెలియ జేయడానికి నటించాడనే విషయం పోతన ఆధా రాల సహితంగా నిరూపితం చేశాడు. మానవుల జీవిత గమనాలను నియంత్రణం చేసి ఆత్మ తత్వ స్వరూపుడైన భగవంతుని ఉనికిని తన భాగవతంలో అంతరంగ ఆవిష్కరణతో శాశ్వతం చేసి మానవ జాతికి దివ్య మార్గదర్శనం చేసిన పోతన కవి సంగీతకర్త (నాదోపాసకుడు), దార్శనికునిగా స్థిర చిర యశస్వి అయ్యాడు. భక్తి జ్ఞానకాసారం భాగవతంగా అందించిన పోతన తెలుగు సాహిత్య పేటి. (పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో 30–12–2019న ‘పలికెద భాగవతం’ పద్యపఠన పోటీల బహుమతి ప్రదానోత్సవం సందర్భంగా) -డాక్టర్ నోరి రాజేశ్వరరావు మొబైల్ : 73370 85511 -
‘సెప్టెంబర్ 26 తర్వాత అనూహ్య మార్పులు’
హైదరాబాద్: సెప్టెంబర్ 26వ తేది తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులొస్తాయి.. దాని కోసం తమ పార్టీ శ్రేణులు తీవ్రంగా శ్రమిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజేశ్వరరావు అన్నారు. ఆయన బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అప్రజాస్వామిక, కుటుంబ పాలన పోవాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఉద్యమాలు చేయొద్దని టీఆర్ఎస్ నేతలు అనడం దివాళాకోరుతనమన్నారు. కేసీఆర్ అహంకారానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని తెలిపారు. టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లెలా.. 50 లక్షల ఇళ్లకు వెళ్లి అందరినీ కలిసి వివరస్తామని అన్నారు. -
ఎస్పీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో ఏఆర్ కానిస్టేబుల్ రాజేశ్వరరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్పీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ గురువారం ఆర్థరాత్రి తన వద్దనున్న గన్‌తో తనకు తాను కాల్చుకున్నాడు. దాంతో అతడు రక్తపు మడుగులో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఎస్పీ కార్యాలయం సిబ్బంది వెంటనే స్పందించి రాజేశ్వరరావును నగరంలోని ఆసుపత్రికి తరలించారు. రాజేశ్వరరావు అప్పటికే మృతి చెందాడని వైద్యులు వెల్లడించారు. కుటుంబ కలహాల కారణంగానే రాజేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు. -
విద్యాశాఖ.. గాడిన పడేనా..
ఇన్చార్జుల పాలనలో విద్యాశాఖ పది మండలాలకే రెగ్యులర్ ఎంఈవోలు డీఈవో త్రిపాత్రాభినయం నలుగురు ఉపవిద్యాధికారులూ ఇన్చార్జులే ఒంగోలు వన్‌టౌన్: జిల్లా విద్యాశాఖ ఇన్చార్జుల పాలనలో కుంటుపడుతోంది. కీలకమైన పోస్టులన్నీ ఖాళీగా ఉండటంతో పరిపాలన గాడి తప్పుతోంది. పర్యవేక్షణాధికారుల కొరతతో పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు అడుగంటుతున్నాయి. జిల్లాలో కొన్ని పాఠశాలలు దశాబ్దకాలంగా వార్షిక తనిఖీలకు నోచుకోలేదంటే జిల్లాలో విద్యాశాఖ పనితీరు ఎంత అధ్వానంగా ఉందో తెలుస్తోంది. జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారుల పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువులు గాలిలో దీపంలా మారాయి. జిల్లా విద్యాశాఖాధికారి పోస్టు 8 నెలలుగా ఖాళీగా ఉంది. కొన్నేళ్లుగా ఒంగోలు, కందుకూరు, మార్కాపురం ఉపవిద్యాధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలోని 56 మండలాలకుగాను కేవలం పది మండలాల్లోనే రెగ్యులర్ ఎంఈవోలుండగా మిగతా 46 మండలాలకు ఇన్చార్జులే దిక్కయ్యారు. వివిధ స్థాయిల్లో రెగ్యులర్ అధికారులు లేకపోవడంతో పాఠశాలల ఆకస్మిక సందర్శనలు, వార్షిక తనిఖీలు మందగించాయి. ఫలితంగా పాఠశాలల పనితీరు దిగజారింది. ఒంగోలులో విద్యాప్రమాణాలు కూడా ఆశించిన స్థాయిలో మెరుగవడం లేదు. డీఈవో త్రిపాత్రాభినయం: జిల్లా విద్యాశాఖలో కీలకమైన డీఈవో పోస్టు 8 నెలలుగా ఖాళీగా ఉంది. రెగ్యులర్ డీఈవోగా పనిచేస్తున్న రాజేశ్వరరావు గతేడాది మేలో ఇక్కడ నుంచి బదిలీపై తెలంగాణకు వెళ్లారు. అప్పటి నుంచి డీఈవో పోస్టు ఖాళీగానే ఉంది. పర్చూరు ఉపవిద్యాధికారిగా పనిచేస్తున్న బి.విజయభాస్కర్ జిల్లా విద్యాశాఖాధికారిగా కూడా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మైనంపాడులోని ప్రభుత్వ జిల్లా విద్యాశిక్షణా సంస్థ ప్రిన్సిపల్‌గా కూడా విజయభాస్కర్ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒకే అధికారి మూడు పోస్టులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోతున్నారు. డీఈవోలు మండల విద్యావనరుల కేంద్రాలను (ఎంఈఓ) ఆకస్మికంగా సందర్శించటంతో పాటు వార్షిక తనిఖీలను కూడా నిర్వహించాల్సి ఉంది. అదే విధంగా జిల్లా విద్యాశాఖాధికారిగా, ఉపవిద్యాధికారిగా తన డివిజన్ పరిధిలోని పాఠశాలలతో పాటు జిల్లాలోని వివిధ పాఠశాలలను కూడా సందర్శించాల్సి ఉంది. నలుగురు ఉపవిద్యాధికారులూ ఇన్చార్జులే.. జిల్లాలో ఐదు ఉపవిద్యాధికారుల పోస్టులుండగా నాలుగు పోస్టులకు ఇన్చార్జులే దిక్కయ్యారు. ఒంగోలు, కందుకూరు, మార్కాపురం, పర్చూరు విద్యాడివిజన్లతో పాటు జిల్లా పరిషత్ ఉపవిద్యాధికారి పోస్టు కూడా ఉంది. ఈ ఐదింటిలో పర్చూరు డివిజన్‌కు మాత్రమే బి.విజయభాస్కర్ రెగ్యులర్ ఉపవిద్యాధికారిగా కొనసాగుతుండగా, మిగిలిన నలుగురు ఇన్చార్జులే. జిల్లా పరిషత్ ఉపవిద్యాధికారికిగా ఇనమనమెళ్లూరు జెడ్పీ హైస్కూలు హెచ్ఎం కె.వెంకట్రావు, ఒంగోలు ఉపవిద్యాధికారిగా ఒంగోలు మండల విద్యాధికారి ఇ.సాల్మన్, కందుకూరు ఉపవిద్యాధికారిగా ఎస్కె చాంద్‌బేగం, మార్కాపురం ఉపవిద్యాధికారిగా కాశీశ్వరరావు పని చేస్తున్నారు. పది మండలాలకే రెగ్యులర్ ఎంఈవోలు: జిల్లాలోని 56 మండలాల్లో కేవలం పది మండలాలకు మాత్రమే రెగ్యులర్ ఎంఈవోలున్నారు. కొన్నేళ్లుగా 46 మండలాల్లోని మండల విద్యాధికారుల పోస్టులు ఖాళీగా ఉండటంతో ఆయా మండలాల్లోని సీనియర్ ప్రధానోపాధ్యాయులే ఎంఈవోలుగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒంగోలు, మద్దిపాడు, సింగరాయకొండ, జె.పంగులూరు, మార్టూరు, ముండ్లమూరు, మార్కాపురం, గిద్దలూరు, వేటపాలెం, అద్దంకి మండలాలకు మాత్రమే రెగ్యులర్ ఎంఈవోలున్నారు. ఇన్స్పెక్షన్లు, విజిట్లు తూచ్: జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు అధికారుల విజిట్లు, ఇన్స్పెక్షన్లు నామమాత్రమయ్యాయి. విద్యాశాఖ నిబంధనల ప్రకారం మండల విద్యాధికారులు, ఉపవిద్యాధికారులు తప్పనిసరిగా ప్రతినెలలో ఐదు పాఠశాలలకు వార్షిక తనిఖీలు నిర్వహించాలి. 10 నుంచి 15 పాఠశాలల నుంచి ఆకస్మికంగా సందర్శించి పాఠశాలల పనితీరును మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే జిల్లాలోని కొన్ని ఉన్నత పాఠశాలలకు పదేళ్లుగా వార్షిక తనిఖీల్లేవంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గతంలో పాఠశాల వార్షిక తనిఖీ అంటే నెల ముందు నుంచే హడావుడి చేస్తూ పిల్లలను తనిఖీలకు సిద్ధం చేసేవారు. అయితే ప్రస్తుత తనిఖీలు తూతూమంత్రంగా మారాయి. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలయితే ఉపాధ్యాయులిచ్చిన తృణమో, పణమో తీసుకొని తనిఖీలను మమ అనిపిస్తున్నారు. సమావేశాలతోనే సరి.. ప్రభుత్వ నిర్వాకం కూడా అధికారుల పనితీరును దెబ్బతీస్తోంది. మండల విద్యాధికారులు, ఉపవిద్యాధికారులకు నెలలో కనీసం 10, 15 సమావేశాలు నిర్వహిస్తూ చిటికీమాటికి జిల్లా కేంద్రానికి పిలిపిస్తూ వారి సమయాన్ని అంతా హరించివేస్తున్నారు. పాఠశాలల సందర్శనలు, తనిఖీలకు తమ సమయాన్ని వెచ్చించి విద్యాప్రమాణాలు మెరుగుపరిచేందుకు కృషి చేయాల్సిన అధికారుల సమ యం అంతా సమావేశాలకు హాజరుకావడంతోనే సరిపోతోంది. ప్రభుత్వం ఇప్పటికైనా విద్యాశాఖ లో ప్రయోగాలకు స్వస్తి చెప్పి క్షేత్రస్థాయిలో పాఠశాలల పర్యవేక్షణాధికారుల పోస్టులన్నింటినీ భర్తీ చేసి పాఠశాలలను మరింత బలోపేతం చేయాలని విద్యాభిమానులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. -
ప్రేక్షకులు మెచ్చిందే మంచి సంగీతం
పేక్షకులు మెచ్చిందే మంచి సంగీతం, ఆమోదించిందే ఉత్తమ సాహిత్యమని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు తనయుడు కోటేశ్వరరావు (కోటి) అన్నారు. ఆర్డీ బర్మన్ పురస్కారం అందుకోవడానికి ఆదివారం నగరానికి వచ్చిన ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు. ప్రతి పదేళ్లకు ప్రేక్షకుల్లో మార్పు వస్తోంది. నాటి సినిమాల్లో నిర్మాతలు సాహిత్యానికి పెద్ద పీట వేసేవారని, నేడు వాయిద్యాల హోరు పాటను మింగేస్తుందనడం సరికాదన్నారు. ప్రేక్షకుల అభిరుచుల్లో మార్పు వల్ల ఈ పరిణామం అనివార్యమైందని ఆయన వివరించారు. ‘ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో’ పాట నాటి ప్రేక్షకులను అలరిస్తే, ఇప్పటి ప్రేక్షకులను ‘రింగా రింగా’ ఆకట్టుకుందని కోటి అన్నారు. వివిధ అంశాలపై ఆయన స్పందన ఆయన మాటల్లోనే... నాన్నగారి ప్రభావం... మెలోడిలో నాన్న గారి ప్రభావం, రిథమ్‌లో సినీసంగీత దర్శకుడు చక్రవర్తి ప్రభావం నాపై ఉంది. నాన్నగారిది చాలా సున్నితమైన మనస్తత్వం. ఆయన ఒప్పుకున్న సినిమాలు కన్నా, వదిలేసినవే ఎక్కువ. తొలి సినిమా... రాజ్-కోటి సంయుక్త సంగీత దర్శకత్వంలో 1983లో భలే బుల్లోడు సినిమాకు పనిచేశాను. రాజ్‌తో కలసి 200 సినిమాలు చేశాను. ఒక్కడినే సుమారు 275 సినిమాల వరకు చేశాను. వీటిలో హిందీ, తెలుగు, తమిళం, కన్నడ ఉన్నాయి. అరుంధతి నా అనుభవానికి తగ్గ సినిమా. హలో బ్రదర్, గోవిందా గోవిందా, మల్లీశ్వరి, నువ్వే కావాలి, పెదరాయుడు నాకు పేరు తెచ్చిన సినిమాలు. అన్నీ వ్యాపారపరంగా విజయం సాధించినవే... అవార్డులు-రివార్డులు నేను అవార్డులను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేయడం లేదు. వ్యాపారాత్మక సంగీతాన్ని అందించడమే నా పని...హలో బ్రదర్‌కు నంది అవార్డు వచ్చింది. నువ్వే కావాలి సినిమాకు కూడా కొన్ని అవార్డులు వచ్చాయి. నేటి తరానికి సలహా.. ఇప్పుడు సంగీతం చాలా తేలికైపోయింది. 1974లో గిటారిస్టుగా నా కెరీర్ ప్రారంభమైంది. పెండ్యాల, సుసర్ల దక్షిణామూర్తి, రమేష్ నాయుడు, రాజన్-నాగేంద్ర, జి.కె.వెంకటేష్, ఇళయరాజా, చక్రవర్తి, నాన్నగారు ఇలా ఎందరో ప్రముఖుల వద్ద గిటార్ మెళకువలు నేర్చుకున్నాను. 1975-83 మధ్య కాలంలో చక్రవర్తి వద్ద గిటారిస్ట్‌గా పని చేశాను. నేటి తరం సంగీత దర్శకులు ఏ వాయిద్యంతో ఏ స్వరం పలికించవచ్చునో ముందుగా తెలుసుకోవాలి. కష్టపడిన పాట, అభిమాన గేయ రచయిత ముఠామేస్త్రిలో ‘ఈ పేటకు నేనే మేస్త్రి’ కంపోజింగ్‌కు ప్రసవ వేదన పడ్డాను. లంకేశ్వరుడు సినిమాలో కూడా కొన్ని పాటలకు చాలా కష్టపడవలసి వచ్చింది. వేటూరి సుందర రామ్మూర్తి నా అభిమాన గేయ రచయిత. క్లాస్, మాస్ రెంటినీ ఒప్పించగల సమర్థుడు ఆయన. గోదావరి తీరమంటే అభిమానం... బంగారు బుల్లోడు సినిమాకు పాటలన్నీ మహాలక్ష్మి హోటల్లో కంపోజ్ చేశాం. గోదావరీ తీరమంటే నాకు అభిమానం. ఆర్డీ బర్మన్ పేరిట అవార్డు అందుకోవడం నా పూర్వజన్మ సుకృతం.. మహాన్ అనే సినిమాకు ఆయనతో కలసి 40 రోజులు పనిచేశాను. భవిష్యత్ ప్రణాళికలు నాన్నగారి పేరిట ఓ ట్రస్టును స్థాపించి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తా.