భాగవతం అమృతఫలం అందించిన పోతన నాదోపాసకుడు. సంగీత, సాహిత్య మర్మములెరిగి నవాడు. ఈ విషయం పోతన పద్యనడకల్లో బహిర్గ తమవుతుంది. భాగవతాన్ని అనుభవించి ఆ అను భవ, అనుభూతులను పద్యమకరందంలో అందిం చిన ధన్యుడు కూడా పోతన అన్నది విదితమే. భాగవతం ద్వితీయ స్కందంలో అద్వితీయంగా నాదోపాసనను గురించి స్పష్టం చేశాడు పోతన. దానికి ప్రత్యక్షోదాహరణం ఈ పద్యం
‘‘సీ. సాంద్ర శరచ్చంద్ర చంద్రికా థవళిత
విమల బృందావన వీధియందు
దనరి దైవత రుషభ గాంధార నిషాద
పంచమ షడ్జమధ్యమ స్వరములోని
గళాలు జాతులు మూర్చనల్ గలుగ వేణు
నాళ వివరాంగుళాన్యాస లాలనమున
మహిత గతింబాడె నవ్యక్త మధురముగను
బంకజాక్షుండు దారువు లంకురింప’’ (భాగవతం 2–188)
పై పద్యం ద్వారా పోతన తనకు గల సంగీత పాండిత్యాన్ని బహిర్గతం చేశాడు. పద్యాదిలో చంద్రిక రాగ ప్రస్తావన కనబడుతుంది. అంతేగా కుండా చంద్రిక రాగ ప్రస్తారాన్ని ఆరోహణ, ఆవ రోహణల్లో నిర్దేశించాడు. పైపద్యం ఒక్కటిచాలు పోతన సంగీత పాండిత్యాన్ని తెలుసుకోవడానికి.
అలాగే లక్షణ శ్రీకృష్ణుని పరిణయ మాడిన వైనాన్ని తెలుపుతున్న (దశమస్కందం ఉత్తర భాగం 1096) సందర్భంలో పోతన పద్యాన్ని ఇలా రాగబద్ధం చేశాడు.
‘చం. కొలదిక మీరంగా డమరు గోముఖ డిండిమ.... నటీనటనముల్ దనరాశి’’(భాగవతం 10 ఉభా –1096)
పై పద్యంలో పదిహేను వాద్య విశేషాలను తన నాదోపాసనా ప్రతిభకు తార్కాణంగా తెలియ చేశాడు పోతన. మరోపద్యం భాగవతం దశమ స్కందంలో 767 పద్యంలో..
‘‘తే. మౌళి పించము కంఠధామమున మెరయ
విలసిత గ్రామముగ నొక్క వేణువందు
బ్రహ్మగాంధర్వ గీతంబు పరగజేసె జతుర
నటమూర్తి గోపాలచక్రవర్తి’
పై పద్యంలో భువనమోహినీ రాగాల ప్రస్తా వన కనిపిస్తుంది. పోతన భాగవతంలో ప్రయోగిం చిన పదప్రయోగాల లాలిత్యానికి సంగీతం ఒక భాగమైంది. భాగవతాన్ని సంగీత సాహిత్య సమ లంకృతంగా శ్రీవాణి పదార్చన చేసి ఆ భాగవత ఫలాన్ని శ్రీరామాంకితం చేసి తను ధన్యుడై ప్రపంచ జాతిని ధన్యుల్ని చేశాడు.
శిక్షలు, వివాహ వేడుకలు, ఆటలు, చల్దులు, ఊరగాయలు తెలుగువారికి చవిచూపిన చతు రుడు పోతన అంటే అతిశయోక్తి కాదేమో. పోతన నానుడులు కూడా అసలైన తెలుగుతనంతో దర్శిం పచేశాడు. ’ఊరకరారు మహాత్ములు’, ’వారిజాక్షు లందు వైవాహికములందు’ వంటివి గూడా పరి చయం చేశాడు. కుచేలుని ’బహుకుటుంబి’గా పరి చయం చేస్తాడు. అంతే కాకుండా తన భాగవ తంలో భక్తిచేత మాత్రమే భగవంతుడు సంతసి స్తాడని ప్రహ్లాదుని చేత పలికిస్తాడు. భగవంతుడు నిరంతరం భక్తులను కనిపెట్టుకుని ఉంటాడనే సత్యానికి ఒక ఉపమానాన్ని కూడా జోడిస్తాడు.
‘‘నాకు మేలుగోరు నా భక్తుడగువాడు
భక్త జనుల కాన పరమగతియు
భక్తుడెందు చనిన బరతెంతు వెనువెంట
గోవు వెంట దగులు కోడె భంగి’’ (9–118)
పై పద్యం అంతలో ‘గోవు వెంట దగులు కోడె భంగి’ అనే ప్రయోగం అర్థవంతమైన అర్థాలం కారంతో అలరారింది. పోతన భాగవతంలో ప్రయోగించిన ప్రతి అంశం ఒక నిర్దిష్ట ప్రమా ణంలో ఉంటుంది. గజేంద్రమోక్ష ఘట్టంలో సార్వజనీన తత్వం, సార్వకాలీనత్వం కనిపిస్తుంది. నిత్యం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడే జీవు లంతా కూడా గజేంద్రుని వంటి వారే. నిరంతరం భగవంతుని కరుణకైప్రార్థిస్తున్న వారే. ఈ విష యాన్ని నాడే గజేంద్రుని నోట పోతన ఇలా పల్కించాడు.
‘‘భక్తజనముల దీనులి పాలివాడు
వినడె చూడడె తలపడ వేగరాడె’’ (8–87)
అలాగే నిర్గుణ పరబ్రహ్మ తత్వాన్ని పోతన గజేంద్రమోక్షంలో అద్భుతంగా తెలియజేశాడు. ‘‘లావొక్కింతయు.... సంరక్షింపు భద్రాత్మకా’’ పద్యం పోతన తెలియజేసిన పరబ్రహ్మ తత్వానికి సాక్షీభూతంగా నిలుస్తుంది. పోతన గజేంద్రుని మొరను అతనిపరంగానే కాక విశ్వం లోని జీవులందరి పరంచేస్తూ తెలియజేశాడు. విద్య అవసరాన్ని నాడే పోతన గుర్తించి వ్యక్తి, వ్యవస్థల పరంగా ఇలా తెలియజేశాడు.
‘‘చదువని వాడజ్ఞుండగు
చదివిన సరసద్వివేక చతురత కలుగున్
జదువగ వలయును జనులకు
జదివించెద నార్యులొద్ద జదువుము తండ్రీ’’
పోతన భాగవత సమాజాన్ని మనసుతోనూ, తాను ఉన్న సమాజాన్ని ధర్మదృష్టితోనూ పరిశీలిం చాడు. వ్యక్తి వ్యవస్థ పరస్పరం ఒక ఆధారభూతం అంటూ అందుకు అనేక తార్కాణాలతో భాగవత ఆంధ్రీకరణలో తెలియజేశాడు. వ్యక్తి సత్యవ్రతం వ్యవస్థకు ఆదర్శం కావాలని అభిలషించాడు. అలాగే వ్యక్తి ప్రవర్తనపరంగా గర్వం కూడనిదని, గర్వించిన వారంతా కనుమరుగయ్యారని వామనా వతార ఘట్టంలో రాక్షసరాజు బలి నోట పలికిం చాడు (8.590). ‘కారే రాజులు రాజ్యముల్‌గలు గవే గర్వోన్నతింబొందరే, వారేరి సిరిమూట గట్టు కుని పోవంజాలిరే’ అనే తన ప్రకటిత భావానికి బలిని ఎంచు కుని పై భావాన్ని తెలియజేశాడు.
తన జీవితంలో తృప్తిని ఎంతగా పొందాడో దాన్నే వామనునిచే తెలియజేశాడు. ‘దృప్తిం చెందని మనుజుడు సప్త ద్వీపములైన జక్కంబడునె’ (8–573) అని తెలిపాడు. ఇది ఒక రకంగా చెప్పా లంటే పోతన అంతరంగ ఆవిష్కరణే. వ్యక్తి వికాసం నడవడిలోనే ఉందని అది సామాన్యు నికైనా, అసమాన్యునికైనా సర్వసాధారణంగా తెలి యజేశాడు. జ్ఞానకాండను భాగవతం ద్వారా నిక్షిప్తం చేశాడు. పోతన భాగవతంలో శ్రీకృష్ణుడు మానవునిగా తన మాట, చేత తత్వాలను తెలియ జేయడానికి నటించాడనే విషయం పోతన ఆధా రాల సహితంగా నిరూపితం చేశాడు.
మానవుల జీవిత గమనాలను నియంత్రణం చేసి ఆత్మ తత్వ స్వరూపుడైన భగవంతుని ఉనికిని తన భాగవతంలో అంతరంగ ఆవిష్కరణతో శాశ్వతం చేసి మానవ జాతికి దివ్య మార్గదర్శనం చేసిన పోతన కవి సంగీతకర్త (నాదోపాసకుడు), దార్శనికునిగా స్థిర చిర యశస్వి అయ్యాడు. భక్తి జ్ఞానకాసారం భాగవతంగా అందించిన పోతన తెలుగు సాహిత్య పేటి.
(పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో 30–12–2019న ‘పలికెద భాగవతం’ పద్యపఠన పోటీల బహుమతి ప్రదానోత్సవం సందర్భంగా)
-డాక్టర్ నోరి రాజేశ్వరరావు
మొబైల్ : 73370 85511
Comments
Please login to add a commentAdd a comment