rajmouli
-
గ్యాంగ్ స్టార్ గా మహేష్ బాబు...!
-
మహేష్, రాజమౌళి సినిమా పై రానా సంచలన కామెంట్స్
-
ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ఎంట్రీపై నెటిజన్ ట్వీట్.. ఘాటుగా స్పందించిన మంచు విష్ణు
దర్శకధీరుడు రాజమౌళి సినిమా 'ఆర్ఆర్ఆర్' ఆస్కార్‌కు నామినేట్ కాకపోవడంతో అభిమానులు, సినీనటులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. ది కశ్మీర్ పైల్స్, ఆర్ఆర్ఆర్ను వెనక్కి నెట్టి గుజరాతీ ఫిల్మ్ 'ఛెల్లో షో' ఎంపికైంది . అయితే ఈ విషయంలో ఆర్ఆర్ఆర్కు మద్దతు కోసం చిత్రబృందం క్యాంపెయిన్ మొదలుపెట్టింది. మొత్తం 15 విభాగాల్లో ఆస్కార్ నామినేషన్స్ కోసం చిత్ర బృందం క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. తాజాగా ఈ అంశంపై టాలీవుడ్ హీరో, మా అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆయన ఘాటుగా బదులిచ్చారు. ఆస్కార్‌లో బెస్ట్ క్రింజ్ మూవీ అనే కేటగిరీ ఏదైనా ఉందా? అలాగైతే ఆర్ఆర్ఆర్ కచ్చితంగా ఆ విభాగంలో ఆస్కార్ గెలుస్తుందని ఓ నెటిజన్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. దీనికి మంచు విష్ణు బదులిస్తూ.. 'భారతీయ సినిమాగా మనం ఎందుకు జరుపుకోకూడదు సోదరా? ఇది కేవలం ప్రాంతీయ చిత్రానికి దక్కే గౌరవం కాదు.. జాతీయంగా దేశం మొత్తం గర్వించదగ్గ విషయం' అంటూ పోస్ట్ చేశారు. ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధులు కలిస్తే ఎలా ఉంటుందనే థీమ్‌తో జక్కన్న రూపొందించిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మారథం పట్టారు. వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ రూ. రూ. 1200 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇంతటి ప్రజాధారణ పొందిన ఈ చిత్రం భారతదేశం నుంచి ఆస్కార్ అవార్డులకు ఎంపిక అవుతుంది అని అందరూ భావించారు. హాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఈ మూవీ ఆస్కార్ బరిలో నిలవాలని కోరుకున్నారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గుజరాతీ మూవీ ఛైల్లో షోను ఆస్కార్స్‌కు నామినేట్ చేసింది. Why don’t we celebrate Indian cinema my brother? Now it ain’t about regional pride but national pride. https://t.co/81kNIXgRMQ — Vishnu Manchu (@iVishnuManchu) October 9, 2022 -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - రాజమౌళి
-
బాహుబలికి మరో గౌరవం
తెలుగు సినిమా స్థాయిని పెంచిన బాహుబలి రిలీజ్ అయ్యి ఏడాది దాటిన ఇప్పటికీ రికార్డ్ల వేట కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్న బాహుబలి, పలు జాతీయ అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శింపబడింది. తాజాగా మరో అరుదైన గౌరవం బాహుబలి ఖాతాలో చేరింది. ప్రతిష్టాత్మక బ్రిక్స్ సమిట్‌లో బాహుబలి చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. భారత్‌తో పాటు బ్రెజిల్, రష్యా, చైనా, సౌత్ ఆఫ్రికాలు భాగంగా ఉన్న బ్రిక్స్ సమిట్ సెప్టెంబర్ 2 నుంచి 6 వరకు ఢిల్లీ జరగనుంది. ఈ సమిట్‌లో ప్రతీ దేశం నుంచి నాలుగు సినిమాలను ప్రదర్శిస్తారు. ఈ ఏడాది భారత్ తరుపున ప్రదర్శనకు అర్హత సాధించిన సినిమాలో బాహుబలి కూడా ఉండటం విశేషం. బాహుబలితో పాటు బాజీరావ్ మస్తానీ, సినిమావాలా(బెంగాళీ), తితీ(కన్నడ) చిత్రాలను ప్రదర్శించనున్నారు. -
'రాజమౌళి, చిరంజీవిల కాంబినేషన్ అయితేనా.. '
హైదరాబాద్: మెగా వీరాభిమానులందరం బాహుబలి సినిమాను మించి చిరంజీవి 150వ చిత్రం ఉండాలని కోరుకుంటున్నామని ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మ అన్నారు. బాహుబలిని మించి చిరు 150వ సినిమా లేకపోతే.. ప్రజారాజ్యం పార్టీని ప్రారంభించిన దానికంటే మరింత పెద్ద తప్పు అవుతుందని వర్మ ట్విట్ చేశారు. రాజమౌళి తప్ప మరే ఇతర దర్శకులు చిరు 150వ సినిమాకి న్యాయం చేయలేరని భావిస్తున్నట్టు తెలిపారు. రాజమౌళి, ప్రభాస్‌ల కాంబినేషన్ ఆకాశమంత ఎత్తుకు వెళితే..మెగాస్టార్ చిరంజీవి, రాజమౌళిల కాంబినేషన్ అంతరిక్షాన్ని అందుకుంటుందని అన్నారు. I truly think except for Rajmouli nobody can do justice to Mega stars 150th film..with any other director it will be ULTRA MEGA THANDA — Ram Gopal Varma (@RGVzoomin) July 16, 2015 If Rajmouli Prabhas can go sky high Mega star Rajmouli can go space high ..Any other director will pull 150 down to earth — Ram Gopal Varma (@RGVzoomin) July 16, 2015 As the biggest fan of Mega Star me nd millions of his other fans want to see his 150th film bigger than the biggest which is Bahubali — Ram Gopal Varma (@RGVzoomin) July 16, 2015 If Mega star does not pitch his 150th film bigger than Bahubali it will be a bigger mistake than starting Praja Rajyam party — Ram Gopal Varma (@RGVzoomin) July 16, 2015 -
అది ప్రశంస కాదు.. సర్టిఫికెట్: రాజమౌళి
హైదరాబాద్: బాహుబలి సినిమా అద్భుతంగా చిత్రీకరించారని డైరెక్టర్ రాజమౌళిని ప్రపంచ నలుమూలల నుంచి పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. వీరిలో తమిళ ప్రఖ్యాత దర్శకుడు శంకర్ కూడా ఉన్నారు. శంకర్ ప్రశంసలు రాజమౌళిని అమితానందం కలిగించాయి. శంకర్ పొగడ్తలు.. సర్టిఫికెట్ లాంటివని రాజమౌళి అన్నారు. మీ ప్రశంసలు.. బాహుబలి టీంకు ఎంతో సంతోషాన్నిచ్చాయని శంకర్‌కి ట్విట్టర్ లో రిప్లే ఇచ్చారు. మీరు పంపిన మెసేజ్ ఒక పొగడ్త మాత్రమే కాదు..మా సినిమాకు సర్టిఫికెట్ ఇచ్చినట్టేనంటూ తెలిపారు. 'పాత్రలని మలచిన తీరు, హీరోయిజాన్ని చూపించిచ వైనం, అద్భుతమైన ఆలోచనలు, కవిలా ఊహించి స్టన్ అయ్యేలా విజువల్ ఎఫెక్ట్స్‌ని ఉపయోగించడం నిజంగా ఒక అద్భుతం. ఈ ఘనత రాజమౌళిది, బాహుబలి చిత్రానికి పని చేసిన వారందరిది' అని శంకర్ ట్విట్టర్ ద్వారా పొగడ్తలతో ముంచెత్తారు. Bahubali-Epic Thoughts!Poetic Imagnatn!Strong Characterisatns!Super Heroism!Executd wit Stuning Visuals! Vowww! Cheers 2 Rajmouli n his team — Shankar Shanmugham (@shankarshanmugh) July 14, 2015 @shankarshanmugh thanks a ton for the appreciation, sir. The team is overjoyed. Your message is not just a compliment, but a certificate.. — rajamouli ss (@ssrajamouli) July 14, 2015