
అది ప్రశంస కాదు.. సర్టిఫికెట్: రాజమౌళి
బాహుబలి సినిమా అద్భుతంగా చిత్రీకరించారని డైరక్టర్ రాజమౌళికి ట్విట్టర్ ద్వారా ప్రపంచ నలుమూలల నుంచి పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
హైదరాబాద్: బాహుబలి సినిమా అద్భుతంగా చిత్రీకరించారని డైరెక్టర్ రాజమౌళిని ప్రపంచ నలుమూలల నుంచి పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. వీరిలో తమిళ ప్రఖ్యాత దర్శకుడు శంకర్ కూడా ఉన్నారు. శంకర్ ప్రశంసలు రాజమౌళిని అమితానందం కలిగించాయి. శంకర్ పొగడ్తలు.. సర్టిఫికెట్ లాంటివని రాజమౌళి అన్నారు. మీ ప్రశంసలు.. బాహుబలి టీంకు ఎంతో సంతోషాన్నిచ్చాయని శంకర్కి ట్విట్టర్ లో రిప్లే ఇచ్చారు. మీరు పంపిన మెసేజ్ ఒక పొగడ్త మాత్రమే కాదు..మా సినిమాకు సర్టిఫికెట్ ఇచ్చినట్టేనంటూ తెలిపారు.
'పాత్రలని మలచిన తీరు, హీరోయిజాన్ని చూపించిచ వైనం, అద్భుతమైన ఆలోచనలు, కవిలా ఊహించి స్టన్ అయ్యేలా విజువల్ ఎఫెక్ట్స్ని ఉపయోగించడం నిజంగా ఒక అద్భుతం. ఈ ఘనత రాజమౌళిది, బాహుబలి చిత్రానికి పని చేసిన వారందరిది' అని శంకర్ ట్విట్టర్ ద్వారా పొగడ్తలతో ముంచెత్తారు.
Bahubali-Epic Thoughts!Poetic Imagnatn!Strong Characterisatns!Super Heroism!Executd wit Stuning Visuals! Vowww! Cheers 2 Rajmouli n his team
— Shankar Shanmugham (@shankarshanmugh) July 14, 2015