raju gari gadhi
-
రాజు గారి గది 4 కథ రెడీగా ఉంది: ఓంకార్
బుల్లితెరపై యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టిన ఓంకార్ డిఫరెంట్ హోస్టింగ్ స్టైల్‌తో తక్కువ కాలంలోనే ఎక్కువ గుర్తింపు సంపాదించుకున్నాడు. ఎన్నో వైవిధ్యమైన రియాలిటీ షోలను ప్రేక్షకులకు పరిచయం చేసి అలరించిన ఆయన 'జీనియస్' చిత్రంతో దర్శకుడిగా మారాడు. కానీ ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోకపోవడంతో తిరిగి రియాలిటీ షోల మీద దృష్టి పెట్టాడు. ఆ తర్వాత ఓ హారర్ స్క్రిప్ట్‌తో మరోసారి వెండితెరపై తన లక్ పరీక్షించుకున్నాడు. అలా రాజుగారి గది సినిమాను తెరకెక్కించాడు. ఇది సూపర్ హిట్టవ్వడంతో అదే ఊపులో సీక్వెల్ తీశాడు. అదీ హిట్ టాక్ తెచ్చుకోవడంతో తన తమ్ముడు అశ్విన్, హీరోయిన్ అవికా గోర్ ప్రధాన పాత్రల్లో 'రాజు గారి గది 3' సినిమా రూపొందించాడు. కానీ ఇది ఆశించిన స్థాయిలో క్లిక్ అవ్వలేదు. దీంతో ఈ ఫ్రాంచైజీలో సినిమాలు రావని అంతా ఫిక్సయిపోయారు. కానీ ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ తన దగ్గర 'రాజు గారి గది 4' కథ సిద్ధంగా ఉందంటున్నాడు ఓంకార్. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'రాజు గారి గది 4' స్క్రిప్ట్ రెడీ అయిందన్నాడు. దీనితోపాటు ఓ థ్రిల్లర్, స్పోర్ట్స్, గ్రామీణ నేపథ్యంలో కథలు రాసుకున్నానని చెప్పుకొచ్చాడు. కానీ కరోనా వల్ల ఇవేవీ సెట్స్ మీదకు వెళ్లలేదన్నాడు. చదవండి: Sardar Ka Grandson: ‘సర్దార్ కా గ్రాండ్సన్’ మూవీ రివ్యూ -
జగదాంబ థియేటర్లో సందడి చేసిన హీరో
సాక్షి, విశాఖపట్నం : నగరంలోని జగదాంబ థియేటర్లో శుక్రవారం రాజుగారి గది 3 చిత్రం హీరో అశ్విన్ సందడి చేశారు. అశ్విన్ హీరోగా ఓంకార్ దర్శకత్వం వహించిన ‘రాజుగారి గది 3’ చిత్రం గత శుక్రవారం విడుదల అయిన విషయం తెలిసిందే. స్థానికంగా జరిగిన ఒక కార్యక్రమంలో హీరోతో పాటు బాలాజీ ఫిల్మ్స్ డిస్డ్రిబ్యూటర్ సురేష్ రెడ్డి, జగదాంబ థియేటర్ మేనేజర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రేక్షకులతో హీరో అశ్విన్ మాట్లాడుతూ.. రాజుగారి గది 3 చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షక దేవుళ్లకు మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ చిత్రంతో తాను మంచి మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నానని అన్నారు. చిత్రంలో కామెడీ బావుందని, కుటుంబ సమేతంగా చూసేలా తెరకెక్కడంతో.. అభినందనలు వెల్లువెత్తుతున్నాయని అన్నారు. చిత్రంలో హీరోయిన్గా తమన్నా నటించి ఉంటే మరింత హైప్ వచ్చి ఉండేదని అభిప్రాయపడ్డారు. సినిమా పాజిటిల్ టాక్ తెచ్చుకొవడంతో.. ఉత్తరాంధ్ర ప్రాంతమైన విశాఖ నుంచే విజయ యాత్రను ప్రారంభించామని పేర్కొన్నారు. విశాఖ అంటే తనకు చాలా ఇష్టమని, విశాఖ ప్రేక్షకులు మంచి సినిమాను ఎప్పుడూ ఆదరిస్తారని అభిప్రాయపడ్డారు. చివరగా ప్రేక్షకుల ఆదరణతోనే తాను నటుడిగా రాణిస్తున్నానని హర్షం వెలిబుచ్చారు. చదవండి: 'రాజుగారి గది 3' మూవీ రివ్యూ -
'రాజుగారి గది 3' మూవీ రివ్యూ
-
చిన్నారి దెయ్యం
-
భయపెట్టేందుకు వస్తున్నారు!
రాజుగారి గది, రాజుగారి గది2 సినిమాలతో వరుస విజయాలు అందుకున్న ఓంకార్ ఇప్పుడు అదే సిరీస్‌లో మూడు చిత్రాన్ని సిద్ధం చేస్తున్నారు. స్వీయ దర్శకత్వంలో తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా రాజుగారి గది3 చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమాతో లాంగ్ గ్యాప్ తరువాత అవికా గోర్ తెలుగు సినిమాలో నటిస్తున్నారు. అలీ, బ్రహ్మాజీ, ధనరాజ్, అజయ్ ఘోష్, ఊర్వశి, హరితేజలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ తాజాగా సీనియర్ హీరో విక్టరి వెంకటేష్ చేతుల మీదుగా ట్రైలర్‌ను విడుదల చేశారు. థ్రిల్లింగ్ విజువల్స్‌తో రూపొందించిన ఈ ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది. షబీర్ సంగీతమందిస్తున్న ఈ సినిమాను దసరా సందర్భంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
తమన్నా ప్లేస్‌లో అవికానా!
బుల్లితెరపై సత్తా చాటిన ఓంకార్ తరువాత రాజుగారి గది సినిమాతో వెండితెర మీద కూడా దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో ఏకంగా నాగార్జున, సమంత లాంటి స్టార్స్‌తో రాజుగారి గది 2 సినిమాను తెరకెక్కించాడు. అయితే ఆ సినిమా రిజల్ట్ బెడసి కొట్టింది. అందుకే తదుపరి సినిమాకు లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. ఇటీవల తన తమ్ముడు అశ్విన్ హీరోగా రాజుగారి గది 3 చిత్రాన్ని ప్రారంభించాడు ఓంకార్. హారర్ జానర్లో తెరకెక్కనున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్గా నటిస్తుందని ప్రకటించారు. కానీ ఓ బాలీవుడ్ సినిమా కోసం తమన్నా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారట. దీంతో చేసేదేమి లేక మరో హీరోయిన్‌తో సినిమాను కంటిన్యూ చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే తమన్నా లాంటి గ్లామరస్ స్టార్‌ను తీసుకోవాలనుకున్న ప్లేస్‌లో ఇప్పుడు ఉయ్యాల జంపాల ఫేం అవికా గోర్‌ను తీసుకున్నారట. అవికా టాలీవుడ్‌ను వదిలేసి చాలా కాలం అవుతుంది. ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాలో కనిపించినా అది అతిథి పాత్రే. మరి ఈ సమయంలో అవికా రాజుగారి గది 3కి ఎంత వరకు ప్లస్ అవుతుందో చూడాలి. -
‘రాజుగారి గది 3’ మూవీ ప్రారంభం
-
ఆ హర్రర్ సినిమాకు మరో సీక్వెల్
బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఓం కార్ తరువాత వెండితెర మీద కూడా సత్తా చాటాడు. జీనియస్ సినిమాతో దర్శకుడిగా మారిన ఓంకార్ రాజుగారి గది సినిమాతో తొలి విజయాన్ని అందుకున్నాడు. అదే ఊపులో నాగార్జున లాంటి స్టార్ హీరోతో రాజుగారి గది 2 చిత్రాన్ని తెరకెక్కించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా తరువాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఓంకార్ ఓ సినిమా చేస్తున్నట్టుగా వార్తలు వినిపించాయి. కానీ ప్రస్తుతం బుల్లితెరపై బిజీ అవుతున్నాడు ఓంకార్. సిక్త్స్ సెన్స్ అనే రియాలిటీషోకు వ్యాఖ్యతగా వ్యవహిరస్తున్నాడు. బుల్లితెరపై రీ ఎంట్రీ ఇచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఓంకార్ సినిమాలను పక్కన పెట్టే ఉద్దేశం లేదని తెలిపాడు. త్వరలో రాజుగారి గది 3ని ప్రారంభించబోతున్నట్టుగా ప్రకటించాడు ఓంకార్. అయితే ఈ సినిమానే బెల్లంకొండ హీరోగా తెరకెక్కిస్తాడా లేక..? మరో కథను రెడీ చేస్తాడా..? తెలియాల్సి ఉంది. -
రాజుగారి గది
సూర్యనారాయణరాజు చనిపోయి సరిగ్గా రెండు సంవత్సరాలవుతుంది.కానీ ఆ చిన్న ఊళ్లో ఆయన్ను ఎవరూ మరిచిపోలేదు. మంచికి, చెడుకి ఆయన పేరు ఎక్కడో ఒక చోట వినబడుతూనే ఉంది. సూర్యనారాయణరాజు నాన్న పెద్ద జమీందారు. ఆయన ముగ్గురు కొడుకుల్లో సూర్యనారాయణరాజు చిన్నవాడు.అందరూ ‘చిన్నరాజుగారు’ అని పిలిచేవారు. అన్నలిద్దరిలో ఉండే లక్షణాలు చిన్నరాజుగారిలో బొత్తిగా ఉండేవి కాదు. వాళ్లేమో... ‘మామూలు మనుషులు వేరు. మనం వేరు’ అన్నట్లుగా ఉండేవాళ్లు. తమకు తామే ప్రత్యేకత ఆపాదించుకునేవారు. కానీ... చిన్నరాజుగారు అలా కాదు.పేదా, గొప్ప అనే తేడా లేకుండా... అందరితో కలిసిపోయేవారు. ఎక్కువ సమయం కోటలోని తన గదిలో పుస్తకాలు చదువుతూ గడిపేవారు. జమీందారు, ఆయన భార్య కాలం చేశారు. ఆయన కొడుకుల్లో ఒకరు అమెరికా, మరొకరు ఇంగ్లండ్‌లో సెటిలయ్యారు. రాజుగారు మాత్రం ఆ పెద్ద కోటలో చిన్న గదిలో ఒంటరిగా సంగీతం వినడం, పుస్తక పఠనంతో గడిపేవారు. ఎందుకనో ఏమో... ఆయన పెళ్లికి దూరంగా ఉన్నారు.కొన్ని సంవత్సరాల తరువాత... చిన్న రాజుగారు మానసికంగా దెబ్బతిన్నారు. మతి చలించింది.ఏవేవో పిచ్చి పిచ్చిగా మాట్లాడేవారు. కనిపించిన వారినల్లా ఎప్పుడూ... ఏవో ప్రశ్నలు అడిగి... వాటికి సమాధానం ఇవ్వమని అడిగేవారు. రాజుగారి ఆరోగ్యం బాగా దెబ్బతినడంతో... ఒకరోజు ఆయన చనిపోయారు. ఇద్దరు అన్నలు విదేశాల్లో ఉండడంతో... ఊరి వాళ్లే రాజుగారి అంత్యక్రియలు చేశారు. రాజుగారు చనిపోయిన తరువాత... కోట బీడు పడింది. ఎవరూ లేని ఎడారిగా మారింది. రాజుగారి గది గురించి రకరకాల పుకార్లు పుట్టుకొచ్చాయి. రాజుగారు దెయ్యమై తిరుగుతున్నారని, కోటలోని ఆయన గది నుంచి అర్ధరాత్రి నవ్వులు వినిపిస్తున్నాయని కూడా అనుకునేవారు. ఆ గదిలో విలువైన అభరణాలేవో ఉన్నాయట. వీటిని కాజేయడానికి కొందరు దొంగలు ప్రయత్నించారట, వారికి నగలు దక్కకపోగా... సంవత్సరం తిరక్కుండానే... ఏవేవో కారణాలతో చనిపోయారట. కోటలో ఎక్కడికైనా వెళ్లొచ్చుగానీ... ఆ గదిలోకి వెళ్లలేమట! వెళితే ఏమవుతుంది? ‘హఠాత్తుగా... రాజుగారు ప్రత్యక్షమై వికటాట్టహాసం చేస్తారట. అంతే కాదు... కొన్ని ప్రశ్నలు అడుగుతారట. వాటికి సరిగ్గా జవాబు చెబితే సరి. నగలు కూడా ఇస్తారట. చెప్పలేకపోయామా హాని చేస్తారట. రాము, శ్రీను అనే ఇద్దరు కుర్రాళ్లు ఒక రాత్రి నగల కోసమని వెళ్లి ఆ గదిలో ఇరుక్కుపోయారట. ‘‘నేను అడిగే ప్రశ్నలకు మీ ఇద్దరిలో ఏ ఒక్కరు జవాబు చెప్పినా ఇద్దరినీ విడిచిపెడతాను’’ అని కొన్ని ప్రశ్నలు అడిగారట రాజుగారు. వాటికి రాము సరిగ్గా జవాబు చెప్పడంతో... పెద్ద ముప్పు తప్పిందట. ఆ ప్రశ్నలు కింద ఉన్నాయి. వాటికి రాము ఏ సమాధానం చెప్పి ఉంటాడో చెప్పగలరా? రాజుగారు అడిగిన ప్రశ్నలు: 1. ముట్టుకోకుండానే గాయపడేవి, కలపకుండానే విషం వెదజల్లేవి, నోరు విప్పకుండానే నిజాలు, అబద్ధాలు చెప్పేవి ఏమిటి? 2. దానికి పేరు ఉంది... కాని అది దాని పేరు కాదు. వయసు ఉంది. కానీ అది కూడా తనది కాదు. చనిపోతే పుడుతుంది. అందరూ దీని చుట్టూ తిరుగుతారుగానీ... ఇది మాత్రం ఒక్క అంగుళం కూడా కదలదు. ఏమిటది? 3. ఎనిమిది ఎనిమిదులను... వెయ్యిగా చేసి చూపండి. 4. అది పక్షి నుంచే పుడుతుంది కానీ ఆకాశంలో ఉండదు. అది సముద్రంలో ఈదుతుంది. కానీ తడవదు. ఏమిటది?