rajyavardhan singh rathod
-
తుపాకులు, పుస్తకాలు..పెయింటింగ్స్
రాజస్తాన్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లలో పలువురు అభ్యర్థులు తుపాకులు, లగ్జరీ కార్లు, పెయింటింగులు, పుస్తకాలే తమ ఆస్తులుగా చూపిం చారు. కేంద్ర సహాయ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ తన దగ్గర 15 తుపాకులు ఉన్నాయని, వాటి విలువ 9 లక్షల రూపాయలని పేర్కొన్నారు. రాథోడ్ పేరొందిన షూటర్ అన్న సంగతి తెలిసిందే. ఈ తుపాకుల్లో పది తనకు బహుమానంగా వచ్చాయని ఆయన అఫిడవిట్లో వివరించారు. జల్వార్–బరన్ నుంచి పోటీలో దిగిన దుష్యంత్ సింగ్ తనకు ఐదు రోల్స్‌రాయస్ కార్లు ఉన్నాయని పేర్కొంటే, అజ్మీర్ కాంగ్రెస్ అభ్యర్థి రిజు ఝన్‌ఝన్‌వాలా 16 లక్షల రూపాయల విలువైన కళాఖండాలను తన ఆస్తులుగా అఫిడవిట్లో ప్రకటించారు. భారతీయ జనతా పార్టీ తరపున రాజ్‌సమంద్ నుంచి పోటీ చేస్తున్న జైపూర్ యువరాణి దియా కుమారి తనకు 64.89 లక్షల రూపాయల విలువైన నగలున్నాయని తెలిపారు. ఇక కోటా నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేస్తున్న రాం నారాయణ్ మీనా దగ్గర 25,500 రూపాయల విలువైన పుస్తకాలు ఉన్నాయట. -
ఫిట్నెస్ చాలెంజ్.. పొలిటికల్ ఫైట్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీకి ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫిట్నెస్ చాలెంజ్‌ను విసిరాడు. అలాగే తాను జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోను కూడా ట్విట్టర్లో పోస్టు చేశాడు. అందుకు మోదీ స్పందిస్తూ ‘సవాలును స్వీకరిస్తున్నా. త్వరలో నా ఫిట్నెస్ వీడియోను పోస్టు చేస్తాను’ అంటూ ట్వీట్ చేశారు. ఫిట్‌నెస్‌పై కోహ్లీ, మోదీలు చేసిన ఈ ట్వీట్లు ఇప్పుడు అంతటా ఆసక్తిని రేపుతున్నాయి. కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ట్విట్టర్లో ఈ ఫిట్నెస్ చాలెంజ్‌కు పిలుపునిచ్చారు. # Hum Fit Toh India Fit (మనం దృఢంగా ఉంటే దేశం దృఢంగా ఉంటుంది) పేరిట రాథోడ్ ఈ పిలుపునిస్తూ.. దేశ ప్రజల్లో వ్యాయామం పట్ల ఆసక్తి పెంపొందించేందుకు తన ఫిట్నెస్ చాలెంజ్‌ను స్వీకరించాలని క్రికెటర్ విరాట్ కోహ్లీ, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌కు ట్వీట్ చేశారు. ఫిట్నెస్ ఎంత ముఖ్యమో ప్రధాని మోదీ చెప్పిన విషయాన్ని అందులో వెల్లడించడంతో పాటు.. భారతీయులు వ్యాయామం చేయాలని ఆయన సూచించారు. ఫిట్నెస్ వీడియోల్ని Fitness Challenge, Hum Fit Toh India Fit హ్యాష్‌ట్యాగ్‌లతో పోస్టు చేయాలని సూచించారు. రాథోడ్ పిలుపునకు కోహ్లీ స్పందిస్తూ.. ‘నేను రాథోడ్ సార్ చాలెంజ్‌ను స్వీకరిస్తున్నాను. అయితే నా భార్య అనుష్క శర్మను కూడా ఈ సవాలులో భాగం చేస్తున్నాను’ అని చెపుతూ ప్రధాని మోదీ, మరో ప్రముఖ క్రికెటర్ ఎంఎస్ ధోనీలను ట్యాగ్ చేశారు. దీనిపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారు. రాథోడ్ ఫిట్నెస్ సవాలుకు సైనా నెహ్వాల్, నటులు అమితాబ్ బచ్చన్, మనోజ్ తివారీ, సల్మాన్ ఖాన్, టైగర్ ష్రాఫ్, రెజ్లర్ బబిత ఫోగట్, పారా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి మానసి జోషితో పాటు పలువురు స్పందించారు. ట్విట్టర్లో తమ వీడియోలను పోస్టు చేశారు. అలాగే ప్రముఖులు కూడా వరుసగా ఈ చాలెంజ్‌పై ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. మోదీజీ.. మా చాలెంజ్‌కు సిద్ధమా: రాహుల్ ట్విట్టర్లో జోరుగా సాగుతున్న ఫిట్నెస్ చాలెంజ్ ఆసక్తికరంగా రాజకీయ మలుపు తీసుకుంది. కోహ్లీ సవాలుకు సిద్ధమంటూ మోదీ చేసిన ట్వీట్‌ను అస్త్రంగా చేసుకుని.. దేశంలోని సమస్యల్ని పరిష్కరించాలంటూ విపక్ష నేతలు మోదీకి సవాలు విసురుతున్నారు. ‘మోదీ గారు. మీరు విరాట్ కోహ్లీ ఫిట్నెస్ చాలెంజ్‌ను స్వీకరించినందుకు ఆనందంగా ఉంది. నా నుంచి కూడా ఒక చాలెంజ్. పెట్రో ధరలు తగ్గించండి.. లేదా మీరు రంగంలోకి దిగేలా చేసేందుకు కాంగ్రెస్ దేశ వ్యాప్త ఆందోళన నిర్వహిస్తుంది. మీ సమాధానం కోసం ఎదురుచూస్తుంటా’ అని # Fuel Challenge పేరిట కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా మోదీని సవాలు చేస్తూ.. ‘చమురు ధరలు వరుసగా 11వ రోజు పెరిగాయి. ప్రధాని మోదీ మాత్రం మౌనంగానే ఉన్నారు. చమురు ధరలు తగ్గిస్తే సంక్షేమ పథకాలపై ఖర్చు తగ్గిపోతుందని ఆయన కేబినెట్లోని మంత్రులు చెపుతున్నారు. గత నాలుగేళ్లుగా ఎక్సైజ్ రూపంలో దోచుకున్న రూ.10లక్షల కోట్లను ఇంధన ధరలు తగ్గించేందుకు ఉపయోగిస్తారా? దేశ ఆర్థిక సామర్థ్యాన్ని పునరుద్ధరించేందుకు ఫిట్నెస్ చాలెంజ్‌ను స్వీకరించండి’ అని ట్వీట్ చేశారు. మాజీ క్రికెటర్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కూడా సవాల్ విసురుతూ. ‘కోహ్లీ ఫిట్నెస్ చాలెంజ్‌ను మీరు అంగీకరించడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. యువతకు ఉద్యోగాలు కల్పించడం, రైతుల్ని ఆదుకోవడం, దళితులు, మైనార్టీలపై దాడులు జరగకుండా హామీ ఇస్తూ నా చాలెంజ్‌ను స్వీకరిస్తారా?’ అని ట్వీట్ చేశారు. -
క్రీడల మంత్రిగా రాజ్యవర్ధన్
న్యూఢిల్లీ: మోదీ సర్కారులో కొత్త క్రీడల మంత్రి కొలువుదీరారు. మాజీ స్టార్ షూటర్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ కేంద్ర క్రీడాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటివరకు సమాచార, ప్రసార శాఖ సహాయమంత్రిగా పనిచేసిన ఆయన శాఖను ఆదివారం జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ప్రధాని మోదీ మార్చారు. ఒక ఒలింపిక్ పతక విజేత క్రీడాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం విశేషం. కాగా... ఎన్డీఏ ప్రభుత్వంలో రాథోడ్ మూడో క్రీడాశాఖ మంత్రి. గతంలో శర్బానంద సోనోవాల్, విజయ్ గోయెల్ క్రీడల మంత్రులుగా పనిచేసిన సంగతి తెలిసిందే. 47 ఏళ్ల రాథోడ్ 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించారు. అప్పట్లో వ్యక్తిగత విభాగంలో ఇదే అత్యుత్తమ పతకం. తదనంతరం దీన్ని అభినవ్ బింద్రా 2008లో స్వర్ణంతో మార్చేశాడు. క్రీడాశాఖ కేటాయింపు సందర్భంగా రాథోడ్ మాట్లాడుతూ తన హయాంలో క్రీడాకారులందరికీ అత్యుత్తమ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని, క్రీడల్లో భారత్‌ను మేటి పోటీ దేశంగా నిలిపేందుకు శ్రమిస్తానని అన్నారు. ఆయన క్రీడల మంత్రి కావడం పట్ల క్రీడావర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. మాజీ షూటర్ అభినవ్ బింద్రా, గగన్ నారంగ్, బాక్సర్ మేరీకోమ్, జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, హాకీ స్టార్ వీరెన్ రస్కిన్హా, మాజీ క్రీడల మంత్రి అజయ్ మాకెన్ జాతీయ షూటింగ్ సంఘం (ఎన్ఆర్ఏఐ) అధ్యక్షుడు రణీందర్సింగ్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ క్రీడల మంత్రి విజయ్ గోయెల్ మాట్లాడుతూ ప్రభుత్వం ఒక్కటే క్రీడాసంస్కృతిని పెంపొందించలేదని చెప్పారు. తన మంత్రిత్వ శాఖను విజయవంతంగా తీర్చిదిద్దినందువల్లే ప్రధాని మోదీ తనకు కీలక బాధ్యతలను అప్పగించారని విజయ్ గోయెల్ తెలిపారు. కేబినెట్ విస్తరణలో ఆయనకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖను కేటాయించారు. -
‘ఆ సినిమాపై ఎలాంటి వినతి రాలేదు’
న్యూఢిల్లీ: ‘లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా’ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ) నిరాకరించిందని కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి రాజ్యవర్దన్ సింగ్ రాథోడ్ తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు బుధవారం ఆయన ఈ సమాధానం ఇచ్చారు. బోర్డు తన న్యాయపాలనకు లోబడి విధులు నిర్వర్తిస్తుందని తెలిపారు. ఈ విషయంలో సంబంధిత నిర్మాత అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు వెళ్లారని, తమ మంత్రిత్వ శాఖకు ఎలాంటి ఫిర్యాదు గానీ, విన్నపం గానీ రాలేదని తెలిపారు.