rakshasi
-
ప్లాంట్ మాన్ ప్రయోగం
‘కాలింగ్ బెల్, రాక్షసి’ వంటి హారర్ చిత్రాలు తెరకెక్కించిన దర్శకుడు పన్నా రాయల్ దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన చిత్రం ప్లాంట్ మాన్’. డీఎం యూనివర్సల్ స్టూడియోస్ స్థాపించి కె. సంతోష్బాబుని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని నిర్మించారు . పన్నా రాయల్. ‘‘సైంటిఫిక్ కామెడీ మూవీగా ఈ చిత్రాన్ని నిర్మించాం. ఒక కొత్త తరహా ప్రయోగంతో పూర్తి వినోద ప్రధానంగా రూ΄పొందించాం’’ అన్నారు పన్నా రాయల్. ఇక ప్రస్తుతం పన్నా రాయల్ దర్శకత్వంలో రూ΄పొందిన ‘ఇంటి నెం.13’ చిత్రం త్వరలో విడుదల కానుంది. ప్లాంట్ మాన్ పొస్టర్ -
మీకు అర్థం కాదా : జ్యోతిక ఫైర్
చెన్నై : వైద్య విద్యలో ప్రవేశాలకై నిర్వహించే నీట్ పరీక్ష కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు జీవితాలు కోల్పోతున్నారని నటి జ్యోతిక ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా 35 శాతం మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని, అందులో మాతృబాషలో విద్యాభ్యాసం చేసే విద్యార్థులు నీట్లో ఎలా రాణించగలరని ప్రశ్నించారు. పెళ్లి తర్వాత తిరిగి సినిమాల్లో ప్రవేశించిన జ్యోతిక ప్రస్తుతం ‘రాక్షసి’ అనే మూవీలో నటిస్తున్నారు. ఇందులో ప్రభుత్వ ఉపాధ్యాయురాలి పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కార్యక్రమంలో ఆమె విద్యా వ్యవస్థ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మానసిక పరిస్థితి అర్థం కాదా? ‘అసలే ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల హాజరు చాలా తక్కువగా ఉంటుంది. ఇక నీట్ వంటి పరీక్షలకు విద్యార్థులు ప్రత్యేకంగా శిక్షణ ఎలా తీసుకుంటారు. జాతీయ స్థాయిలో ఇటువంటి ప్రతిష్టాత్మక పరీక్షలు నిర్వహించేటప్పుడు ప్రభుత్వ పాఠశాలలు, మాతృభాషలో విద్యాభ్యాసం చేసే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందస్తుగానే ప్రణాళికలు రూపొందించాల్సి ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల నుంచి ఒక్కసారిగా నీట్ వంటి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల మానసిక పరిస్థితి ఎలా వుంటుందో ప్రభుత్వాలకు అర్థం కాదా. ఇప్పటికైనా విద్యార్థుల భవిష్యత్తుకై ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే లక్షలాది మంది జీవితాలు బాగుంటాయి’ అని జ్యోతిక అభిప్రాయపడ్డారు. కాగా వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్లో ఉత్తీర్ణులు కాకపోవడంతో పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. -
పాఠశాలల గతిని మార్చే రాక్షసి
వివాహానంతరం, అదీ ఇద్దరు పిల్లల తల్లి అయిన తరువాత జ్యోతిక నటిగా పునఃప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. తనకు తగ్గ పాత్రలను, అదీ కథానాయకి ప్రాముఖ్యత కలిగిన పాత్రలను ఎంచుకుని నటిస్తూ విజయాలను సాధిస్తున్నారు. అలా జ్యోతిక తాజాగా నటిస్తున్న చిత్రం రాక్షసి. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్.ప్రకాశ్, ఎస్ఆర్.ప్రభు నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా సై.గౌతమ్‌రాజ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతున్న ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ.. మన పాఠశాలలో జరుగుతున్న, జరగాల్సిన విషయాల గురించి తనకెందుకులే అనుకోకుండా టీచర్ ధైర్యంగా ప్రశ్నిస్తుంటే ఈమె హీరో అని విద్యార్థులకు అనిపిస్తుందన్నారు. అలాంటి రాక్షసి టీచర్ సీతారాణి ఇతివృత్తమే ఈ సినిమా అని తెలిపారు. ప్రశ్నించడంతో సరిపెట్టుకునే వారిని కొంత కాలం తరువాత మరచిపోతామన్నారు. అయితే దాన్ని ఆచరణలో చూపించేవారే చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. దాన్నే తాను తెరపై ఆవిష్కరించానని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో మార్చు తీసుకురావాలన్న విషయంలో మరో మాటకు తావు ఉండదన్నారు. ప్రభుత్వ పాఠశాలల తలరాతను మర్చే చిత్రంగా రాక్షసి ఉంటుందని దర్శకుడు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల స్థాయిని, ఆ పాఠశాలల్లో చదివే విద్యార్థుల ఉన్నతిని పెంచాలన్నదే ఈ చిత్ర ఉద్దేశంగా పేర్కొన్నారు. తమిళనాడు వ్యాప్తంగా ఎందరో ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల ఉన్నతి కోసం ఒంటరిగా పోరాడుతున్నారని, వారందరికీ సెట్యూట్ చేస్తున్నామని అన్నారు. ఇందులో నటి జ్యోతిక మినహా మరెవరూ రాక్షసి పాత్రలో అంత కచ్చితంగా నటించేవారు కాదని ఆయన తెలిపారు. -
రాక్షసి టీచర్
‘తప్పు చేసినవాళ్లు భయపడాలి. మనం సరిగ్గా ఉన్నప్పుడు ఎవ్వరికీ భయపడకూడదు’ అనే మనస్తత్వం కలిగిన టీచర్ ఆమె. ఓ గవర్నమెంట్ స్కూల్‌కు టీచర్‌గా వెళ్లింది. పిల్లలు చదవకపోతే బెత్తం పట్టుకుని సరిదిద్దింది. వ్యవస్థలోనూ చిన్న చిన్న తప్పులుంటే ప్రశ్నించింది. సిస్టమ్‌ను సరిచేయాలనుకుంది. మరి ఆ టీచర్ అనుకున్నది సాధించిందా? లేదా? అనే కథాంశంతో జ్యోతిక కొత్త చిత్రం ‘రాక్షసి’ తెరకెక్కింది. గౌతమ్ రాజ్ దర్శకత్వం వహించగా, యస్.ఆర్ ఫ్రభు నిర్మించారు. ఈ చిత్రంలో జ్యోతిక లుక్, టైలర్‌ను రిలీజ్ చేశారు. జూన్‌లో సినిమా రిలీజ్ కానుంది. -
టీచర్ పోరాటం
స్కూల్ టీచర్‌గా మారారు జ్యోతిక. విద్యార్థులకు పాఠాలు చెప్పడంతోనే తన బాధ్యత పూర్తి అయ్యిందనుకోలేదు. విద్యా వ్యవస్థలోని లోపాలను సరిచేయాలని పోరాటం మొదలుపెట్టారు. మరి.. ఆమె పోరాటం ఫలించిందా? అనే విషయాన్ని వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే. జ్యోతిక ప్రధాన పాత్రలో ఎస్ఆర్ ప్రభు ఓ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో ఎస్. రాజ్ దర్శకునిగా పరిచయం కాబోతున్నారు. ఇందులో జ్యోతిక స్కూల్ టీచర్‌గా నటిస్తున్నారని తెలిసింది. ఈ సినిమాలో పాత్ర పరంగా విద్యా వ్యవస్థలోని లోటుపాట్లపై ఆమె పోరాటం చేస్తారట. 2003లో వచ్చిన ‘కాక్క కాక్క’ తర్వాత జ్యోతిక టీచర్‌గా నటిస్తున్నది ఇప్పుడే కావడం విశేషం. ఈ చిత్రానికి ‘రాక్షసి’ అనే టైటిల్ అనుకుంటున్నారని తెలిసింది. ఈ సినిమా సంగతి ఇలా ఉంచితే... ‘గులేబకావళి’ ఫేమ్ కల్యాణ్ దర్శకత్వంలో జ్యోతిక, రేవతి ముఖ్య పాత్రధారులుగా ఓ సినిమా తెరకెక్కనుంది. వేసవిలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళుతుందట. -
‘రాక్షసి’గా జ్యోతిక
నటి జ్యోతిక నట జీవితం వివాహానంతరం కూడా అప్రతిహతంగా కొనసాగుతోంది. ఇటీవల మణిరత్నం దర్శత్వంలో నటించిన సెక్క సివంద వానం, రాధామోహన్ దర్శకత్వంలో హీరోయిన్ సెంట్రిక్ పాత్రలో నటించిన కాట్ట్రిన్ మొళి చిత్రాల విజయాలబాటలో నడిచాయి. ప్రస్తుతం కొత్త దర్శకుడు రాజ్ దర్శకత్వంలో నటిస్తున్నారు జ్యోతిక. ఈ సినిమాలో కూడా జ్యోతిక కీలక పాత్రలో నటిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఆర్ఎస్.ప్రకాశ్, ఆర్ఎస్. ప్రభు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నటి పూర్ణిమా భాగ్యరాజ్, సత్యరాజ్, హరీశ్ పెరడీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో జ్యోతిక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలి పాత్రలో నటిస్తున్నట్లు తెలిసింది. ఇందుకోసం సుమారు రూ.50 లక్షల ఖర్చుతో పాఠశాల సెట్‌ను వేసి చిత్రీకరణను జరుపుతున్నారు. చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చిందది. దీంతో చిత్రానికి టైటిల్‌ను నిర్ణయించే పనిలో చిత్ర వర్గాలు నిమగ్నమయ్యారు. ఈ చిత్రానికి రాక్షసి అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తాజా సమాచారం. అదే విధంగా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సమ్మర్ తరువాత విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. నటి జ్యోతిక రాక్షసి చిత్రం పూర్తి కావస్తుండడంతో కొత్త చిత్రానికి రెడీ అయిపోతున్నట్లు తెలుస్తోంది. గులేభాకావళి చిత్రం ఫేమ్ కల్యాణ్ దర్శకత్వంలో 2డీ ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై తన భర్త సూర్య నిర్మించే చిత్రంలో నటించనున్నట్లు సమాచారం. అదే విధంగా తన మరిది కార్తీ నటించనున్న చిత్రంలోనూ ప్రధాన పాత్రను పోషించడానికి పచ్చజెండా ఊపినట్లు టాక్. -
కోలీవుడ్‌కు రాక్షసి
తమిళ సినిమా : బహుభాషా నటి పూర్ణ నటించిన తెలుగు చిత్రం రాక్షసి ఇప్పుడు తమిళంలోకి అనువాదం అవుతోంది. హర్రర్ ఇతివృత్తంతో కూడిన ఈ చిత్రాన్ని కుంతీ పేరుతో ఎస్ఎఫ్ఎఫ్ టీవీ సమర్పణలో అన్నై తిరైక్కణం పతాకంపై ఎంకే.ఉలగేశ్కుమార్ అనువదిస్తున్నారు. దీనికి మేటూర్ పీ.విజయరాఘవన్, ఎస్పీ.కార్తీరామ్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో పూర్ణతో పాటు ఆడుగాళం కిషోర్, ధీరన్ అధికారం ఒండ్రు చిత్ర విలన్ అభిమన్యుసింగ్, బేబీ తన్య, కృతిక ముఖ్య పాత్రలను పోషించారు. పన్నా రాయల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఏఆర్కే.రాజరాజా అనువాద రచన బాధ్యతలను నిర్వహించారు. చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ తెలుగులో రాక్షసి పేరుతో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ఈ కుంతీ చిత్రంలో నటి పూర్ణ ప్రధాన పాత్రను పోషించారన్నారు. భర్త ఇద్దరు పిల్లలతో ఆనందంగా సంసారం సాగిస్తున్న పూర్ణ జీవితంలో భయబ్రాంతులకు గురయ్యే సంఘటన చోటు చేసుకుంటుందన్నారు. తన సంతానాన్ని చంపుతానని భయపెట్టే దెయ్యం నుంచి వారిని ఎలా కాపాడుకుందన్నదే కుంతీ చిత్ర ఇతివృత్తం అని ఆయన అన్నారు. అరుంధతీ, చంద్రముఖి, కాంచన చిత్రాల తరహాలో ఉత్కంఠభరిత హర్రర్ సన్నివేశాలతో కూడిన చిత్రంగా కుంతీ ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా నటి పూర్ణ నటన అందరిని ఆకట్టకుంటుందన్నారు. ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు ఏఆర్కే.రాజరాజా తెలిపారు. -
రాక్షసి పిలుస్తోంది!
హారర్ నేపథ్యంలో ‘కాలింగ్ బెల్’ చిత్రం తెరకెక్కించిన దర్శకుడు పన్నా రాయల్, ఆ చిత్రానికి సీక్వెల్‌గా ‘రాక్షసి’ పేరుతో మరో చిత్రానికి దర్శకత్వం వహించారు. పూర్ణ, అభినవ్ సర్దార్, అభిమన్యు సింగ్, గీతాంజలి ముఖ్యపాత్రల్లో అశోక్ మందా, రాజ్ దళవాయ్, టోనీ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. నిర్మాత లగడపాటి శ్రీధర్ పోస్టర్, మరో నిర్మాత రాజ్ కందుకూరి లోగో రిలీజ్ చేయగా, మరో నిర్మాత కె.సురేష్‌బాబు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘‘ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి పంచే సినిమా ఇది’’ అని పన్నా రాయల్ అన్నారు. ‘‘ఈ సినిమాలో నాది ఇద్దరు పిల్లల తల్లి పాత్ర అనగానే ఆలోచించా. కథ విని, ఓకే చెప్పాను’’ అని హీరోయిన్ పూర్ణ తెలిపారు.