Rama Chandra Khuntia
-
పరోక్ష ఓటింగ్ బిల్లుకు పూర్తి మద్దతు : కుంతియా
సాక్షి, సిటీబ్యూరో : సర్వీస్ ఓటరు తరహాలోనే ప్రవాస భారతీయులకు పరోక్ష ఓటింగ్ సదుపాయం కల్పించే బిల్లుకు రాజ్యసభలో పూర్తి మద్దతు ఇస్తామని ఆల్ఇండియా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి రామ్ చంద్ర కుంతియా ప్రకటించారు. హైదరాబాద్‌లో ఎమిగ్రంట్స్ వెల్పేర్ ఫోరం ఆధ్వర్యంలో ‘ఎన్నారైలకు ప్రాక్సీ ఓటింగ్– ఎన్నికల్లో గల్ఫ్ ప్రవాసుల ప్రభావం’ అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజాప్రాతినిధ్యం సవరణ బిల్లు–2017ను పార్లమెంట్ ఆమోదించగా, రాజ్యసభలో ఆమోదించాల్సి ఉందన్నారు. ఈ బిల్లు అమల్లోకి వస్తే సుమారు కోటిన్నర మంది ప్రవాస భారతీయలు ఓటు హక్కు ద్వారా ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుదని చెప్పారు. ప్రవాస భారతీయులకు ఓటు హక్కు గుర్తింపుతోపాటు సమస్యల పరిష్కారానికి ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం కూడా ప్రవాస భారతీయులకు ఓటు హక్కు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఎమిగ్రంట్స్ వెల్పేర్ ఫోరం అధ్యక్షుడు ఎం బీమ్‌రెడ్డి మాట్లాడుతూ ఆరు మాసాలు స్థానికంగా లేకుంటే ఓటు హక్కు తొలగిస్తున్నారని, ప్రవాస భారతీయులకు ఓటు హక్కు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం కోటిన్నర మంది ప్రవాస భారతీయులుంటే 25 వేలమంది కూడా ఓటర్లుగా నమోదు కాలేదని, తెలంగాణకు చెందిన 15 లక్షల మందికి గాను 1500 మంది కూడా ఓటరుగా నమోదు కాలేదని గుర్తు చేశారు. ఓటరు నమోదుపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఓటరుగా నమోదైతే తెలంగాణలోని 25 అసెంబ్లీ, రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లో ప్రవాస భారతీయులు గెలుపు ఓటములను ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదన్నారు. రాజకీయ పార్టీలు ప్రవాస భారతీయులకు సీట్ల కేటాయింపులో తగిన ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఈ సదస్సులో ప్రవాస భారతీయుల ప్రతినిధులు డాక్టర్ వినోద్ కుమార్, దేవేందర్‌రెడ్డి, అసీమ్ రాయ్, అజీజ్ , లిస్సీ డాక్టర్ రఘు, ప్రొఫెసర్ అడప సత్యనారాయణ, సురేష్ రెడ్డి, బసంత్‌రెడ్డి ఉపాస, హేమంత్, కేఎస్ రామ్, రేణుక శాంతిప్రియ, డీపీ రెడ్డి, భవానిరెడ్డి, బండ సురేందర్ తదితర సదస్సులో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. -
చేవెళ్ల సెంటిమెంట్!
చేవెళ్ల: మరోసారి ‘చేవెళ్ల సెంటిమెంట్’ కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని భావిస్తున్న ఆ పార్టీ ఇక్కడి నుంచే రాజకీయ యాత్రకు శ్రీకారం చుట్టాలని సంకల్పించింది. ఈనెల 26న చేవెళ్లలో ప్రారంభమయ్యే బస్సు యాత్ర మే 15 వరకు కొనసాగనుంది. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుబాటకు కారణమైన వైఎస్ ప్రజాప్రస్థానం, జైత్రయాత్రల తరహాలోనే ఈ సారి ఎన్నికలకు చేవెళ్ల సెటింమెంట్ అస్త్రాన్ని హస్తం పార్టీ ప్రయోగించనుంది. వైఎస్ హఠాన్మరణంతో కాం గ్రెస్ పార్టీకి పరాజయాలే ఎదురయ్యాయి. వచ్చే ఎన్నికల్లో విజయానికి బాటలు వేసుకునేందుకు బస్సు యాత్రను ఎక్కడి నుంచి ప్రారంభించాలనే విషయంపై గాంధీభవన్‌లో తర్జనభర్జనలు పడిన నేతలు చివరకు.. కాంగ్రెస్‌కు తిరుగులేని విజయాలను అందించిన చేవెళ్ల సెంటిమెంట్‌కే ఓకే చెప్పారు. 2004లో ఉమ్మడి రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ముందు ప్రతిపక్షనేతగా ఉన్న దివంగత నాయకుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేవెళ్ల నుంచి ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర ప్రారంభించి పార్టీలో నూతనోత్తేజం తీసుకువచ్చారు. తదనంతరం ఎన్నికల ప్రచారాన్ని కూడా చేవెళ్ల నుంచి ప్రారంభించి కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని చేకూర్చారు. దీంతో చేవెళ్ల కాంగ్రెస్ పార్టీకి సెంటిమెంట్‌గా మారింది. 2009 ఎన్నికల్లో కూడా ప్రచార యాత్రను చేవెళ్ల నుంచే ప్రారంభించారు. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రభుత్వం ఏ పథకం చేపట్టినా చేవెళ్ల నుంచి ప్రారంభించారు. బస్సు యాత్ర సాగేదిలా.. కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ఇన్చార్జి కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు ఇతర ముఖ్యనేతలు అంతా కలిసి ఈ బస్సు యాత్రను చేవెళ్ల నుంచి ప్రారంభించేందుకు నిర్ణయించారు. ఈనెల 26న మధ్యాహ్నం చేవెళ్లలో ప్రారంభమై అదే రోజు సాయంత్రం వికారాబాద్ జిల్లాకు చేరుకుంటుంది. అక్కడ నుంచి 27న తాండూరుకు చేరుకొని అదే రోజు రాత్రికి సంగారెడ్డి జిల్లాలోకి వెళ్తుంది. -
కాంగ్రెస్ ఇన్చార్జిగా దిగ్విజయ్ తొలగింపు
- తెలంగాణ పర్యవేక్షకుడిగా కుంతియాకు బాధ్యతలు న్యూఢిల్లీ: రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుస కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇప్పుడిప్పుడే కోలుకొంటున్న కాంగ్రెస్ పార్టీలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణలో పార్టీ వ్యవహారాల ఇన్చార్జిగా ఉన్న దిగ్విజయ్ సింగ్‌ను మంగళవారం ఆ పదవి నుంచి తొలగించారు. ఆయన స్థానంలో మరో సీనియర్ నేత, కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి అయిన రామచంద్ర కుంతియా(ఆర్.సి. కుంతియా)ను తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా నియమిస్తూ ఆలిండియా కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) ఒక ప్రకటనను విడుదల చేసింది. కుంతియాకు సెక్రటరీగా మరోనాయకుడు సతీశ్ నియమితులయ్యారు. తన పదవీ కాలంలో దిగ్విజయ్ సింగ్.. పని తీరుతో కంటే పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఆ మధ్య ఐసిస్ సానుభూతిపరుల విషయంలో, ఇటీవల వెలుగు చూసిన డ్రగ్స్ రాకెట్ కేసులోనూ డిగ్గీ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పలు సందర్భాల్లో పార్టీ సైతం ఇరుకున పడేలా వ్యవహించిన ఆయను ఉన్న పళంగా తప్పించడం వెనుక కారణాలు ఏమిటనేది తెలియాల్సిఉంది. దీనిపై స్థానిక కాంగ్రెస్ నేతలు స్పందించాల్సిఉంది.