rama krishna reddy
-
ఏడు చోట్ల EVM ధ్వంసలు జరిగాయి..కృష్ణం రాజు రియాక్షన్
-
అధ్యాపకులే కేంద్రంగా విద్యాభివృద్ధి
విద్యాబుద్ధులు నేర్పించాలనేది మన ప్రాచీన కాలం నుండి వస్తున్న సంస్కృతి. విద్యాబుద్థులు నేర్పిం చాలి, నేర్చుకోవాలి అనేవి మన సాంఘిక అవసరంగా గుర్తించారు. నాడు గురుకుల వ్యవస్థ చాలా ప్రాచుర్యంలో వుండేది. విద్యతోపాటు బుద్ధి నేర్పించే విధివిధానాలుండేవి. కానీ నేటి విద్యావిధానంలో బుద్ధి నేర్పించే అంశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కాలక్రమేణా గురుకుల వ్యవస్థ అంతరించి, ఉపాధ్యాయ పాఠశాల వ్యవస్థ ఏర్పడింది. నాటి గురువులు విద్యనూ బుద్ధినీ సమానమైన రీతిలో అభ్యాసం చేయించేవారు. కానీ నేడు విద్యార్జనకు మాత్రమే ప్రాధాన్యతనిస్తున్నారు. అందుకే సాంఘిక విలువలు పతనావస్థ స్థితికి చేరుతున్నాయని గుర్తించవచ్చు. ప్రస్తుత మన విద్యా విధానంలో విలువలతో కూడిన అధ్యయనం చేయించే ప్రణాళికలు చాలా తక్కువ. పోటీతత్వాన్ని పెంచే దిశగా ప్రయాణం చేస్తుండటంతో ఇప్పుడు విలువలకు పెద్దగా ప్రాముఖ్యత లేదు. నూతన విద్యావిధానంలోని సూచనలు బహుళ ప్రయోజనకారిగా ఉన్నాయని చెప్పవచ్చును. స్కూల్ విద్యా విధానాన్ని మూడు దశలుగా విభజించారు. ఇది విజయవంతం కావాలంటే శాస్త్రీయ పద్ధతిలో దశలవారీ శిక్షణ పొందిన అధ్యాపకులను ఏరికోరి నియమించాలి. విజ్ఞానవంతులైన, క్రమశిక్షణ కలిగిన ఉపాధ్యాయులు మన విద్యా విధాన భవిష్యత్తుకు మూలస్తంభాలు. నూతన విద్యావిధానంలో విద్యార్థులను విద్యావంతులుగా తీర్చిదిద్దే ప్రణాళికాబద్ధమైన సూచన చేశారు కానీ, బుద్ధిమంతులను చేసే ప్రక్రియకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని చెప్పవచ్చు. విద్యార్థి పోగు చేసుకునే సమాచార సంచయనాన్నే సంపదగా మార్చే ప్రయత్నం జరుగుతోంది కానీ దాన్ని నాలెడ్జ్ బ్యాంక్‌గా మార్చే ప్రయత్నం తక్కువగా జరుగుతున్నది. మనదేశంలో విద్యావిధానాన్ని పాఠశాల విద్యాభ్యాసం, కళాశాల విద్యాభ్యాసం, పరిశోధన అధ్యయన విధానం అనే మూడు దశలుగా విభజించారు. పాఠశాల విద్యాభ్యాస విధానంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. పాఠశాల విద్యావిధానంలో ముఖ్యంగా మేధావులైన అధ్యాపకుల సూచనల ఆధారంగా ప్రణాళికలు తయారు చేయటంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయి. మన రాష్ట్రంలో నూతన విద్యావిధానం అమలు చేయబోతున్న సందర్భంలో అధ్యాపకులకు దశలవారీ ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతోవుంది. దీనివల్ల మనదేశ మూల సంపద వేగవంతంగా పెరుగుతుంది. అన్ని దశల్లోనూ అధ్యాపకులకు శిక్షణ, అభివృద్ధి ప్రణాళికలు శాస్త్రీయంగా వుండేలా సూచిస్తేనే వివిధ దశలలో విద్యాభ్యాసం విభజనకు అర్థం వుంటుంది. వివిధ దశలలో బోధనా ప్రక్రియకు అధ్యాపకులకు ఎటువంటి శిక్షణ, అభివృద్ధి ప్రయత్నాలు చేయవలసి ఉంటుందనేది నూతన విద్యావిధానంలో విపులంగా లేదు. అవసరానికనుగుణంగా విద్య అధ్యయనం జరుగుతుంది. ఈనాటి విద్య ఉత్పత్తి ఎలా చేయాలి? చేసిన విద్యా ఉత్పత్తిని మార్కెట్లో ఎలా అమ్ముకోవాలి? అనేదే ప్రధానాంశంగా వుంది. అంతేకాకుండా సేవా రంగం వైపు ఆలోచనలు, వాటి ద్వారా వచ్చే ప్రయోజనాలు నేటి విద్యా అధ్యయనంలో ప్రధానమయ్యాయి. ఇటువంటి సందర్భాల్లో విద్యావికాసానికి చోటు లేదు. వికాసవంతమైన జీవితానికి తోడ్పడే విద్యావిధానం రానురాను తగ్గుముఖం పట్టింది. విజ్ఞాన సంపద వైపు ప్రస్తుత సమాజం పయనిస్తున్నది. విజ్ఞానసంపదే నికరమైన సంపద. ఈ సంపద దీర్ఘకాలిక ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది. విజ్ఞాన సంపద ఎలా సంపాదించాలి అనేదే ముఖ్యమైన అంశం. మానవ చరిత్రలో ఎప్పుడూ లేనంత విజ్ఞానభరితమైన జీవితాన్ని మానవుడు గడుపుతున్నాడని గమనించవచ్చు. ఆర్థికాభివృద్ధి చెందిన వర్గాలే విజ్ఞానసంపద భరితమైన సుఖజీవనం సాగిస్తున్నారు. నూతన విద్యావిధానంలో ‘బోధనా విధానం అధ్యయన ప్రక్రియ అన్వేషణాత్మకంగాను, అనుభవ పూర్వకంగాను ప్రభావవంతంగా ఉండాలని’ సూచించారు. బోధనా వృత్తిని స్వీకరించేవారిలో మనోప్రవృత్తిని గమనించి అవకాశం కల్పించాలి. ఆ వృత్తిని స్వీకరించిన తర్వాత వారికి ఎటువంటి శిక్షణ అవసరమనేది నిర్ణయించాలి. అధ్యాపక వృత్తి ఒక విలక్షణమైన ప్రవృత్తి. ఒక వితరణ గుణం కలిగిన వృత్తిగా పరిగణించి అధ్యాపకుల జీవన విధానముండాలి. నూతన జాతీయ విద్యావిధానంలో అధ్యాపకులు అనుభవపూర్వకంగా విద్యను నేర్పాలని సూచించారు. ఎటువంటి అనుభవాలు ఉండాలి? అనే సూచనలు చేయలేదు. అధ్యాపకులు అన్వేషణాత్మక ప్రాతిపదికగా విద్యాబోధన చేయాలని సూచించారు. అధ్యాపకులను అన్వేషణాత్మక పరమైన భావనలు ఉండే వారిని ఎలా ఎంపిక చేయాలో ఇందులో సూచించలేదు. అనుభవపూర్వకంగాను, ప్రభావవంతమైన విద్యను అందించాలని సూచించారు. అనుభవమే లేకపోతే అనుభవపూర్వకమైన విద్యను ఎలా అందించగలరన్నది ప్రశ్న. అలాగే ప్రభావితం చేయగల అధ్యాపకులను ఎన్నిక చేయటం చాలా క్లిష్టమైన ప్రక్రియ. నూతన విద్యా విధానం సఫలీకృతం కావాలంటే వివిధ దశలవారీ నైపుణ్యమున్న అధ్యాపకులను నియమించాలి. ముఖ్యంగా ప్రాథమిక విద్యాదశలో డ్రిల్ టీచర్ లాంటివారు, తల్లిపిల్లి వంటి సంస్కారంగల బాధ్యతతో ప్రవర్తించే వారై వుండాలి. అదేవిధంగా మాధ్యమిక, పై చదువులకు ఉత్తేజపరిచే శక్తిగల ఉపాధ్యాయులను నియమించాలి. ఈ ప్రక్రియ చాలా వ్యయప్రయాసలతో కూడుకున్నది. అలాగే ఉత్తేజపరిచే అధ్యాపకులు, అనుభవసంపన్నులైన ఉపాధ్యాయులు ఉన్నత విద్యకు చాలా ముఖ్యం. అధ్యాపకుడిని ఆచార్యుడు అని కూడా అంటారు. అంటే ఆచరించి చెప్పువాడు అని అర్థం. అధ్యాపకులుగా ఉన్నవారంతా ఆచార్యులుగా మారితే విద్యాభివృద్ధి గణనీయంగా పెరుగుతుంది. అధ్యాపకులందరూ డ్రిల్ టీచర్ గుణాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే తాను చూపించి, నేర్పించేవాడు డ్రిల్ టీచర్. అదేవిధంగా అనుభవాన్ని ప్రదర్శించి నేర్పించగలిగేవారే నిజమైన అధ్యాపకుడు. అంతేకాకుండా గురి చూపేవాడు గురువు. అధ్యాపకులు తమ విద్యార్థులను బహుముఖ అభివృద్ధి, వారిసచ్ఛీలతా అభివృద్ధి కోసం ప్రయత్నం చేయాలి. పద్ధతి ప్రకారం విద్యను నేర్పే వ్యక్తి ఉపాధ్యాయుడు. సహజ సిద్ధంగా విద్యను అధ్యయనం చేయించే వ్యక్తి అధ్యాపకుడు. ఉపాధ్యాయున్ని అధ్యాపకుడుగా మార్చగలిగితే ఆ దేశ యువతకు ఒక వరం. అదే విధంగా అధ్యాపకున్ని గురువు స్థానానికి చేర్చగలిగితే అది దేశానికి శాశ్వతమైన సంపద. పైన సూచించిన మార్పులను ఆహ్వానించి, ప్రోత్సహించి, గౌరవించి అధ్యాపక బృందాన్ని ఏర్పర్చుకుంటే మన దేశ ప్రగతి సుస్థిరమవుతుంది. -ఆచార్య కాడా రామకృష్ణారెడ్డి వ్యాసకర్త పూర్వ ఉపకులపతి, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ‘ 94408 88066 -
కత్తి మహేశ్ ప్రమాదంపై విచారణలో డ్రైవర్ సురేశ్ ఏమన్నాడంటే..
సినీ క్రిటిక్ కత్తి మహేశ్ మృతిపై ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ అనుమానం వ్యక్తం చేస్తూ విచారణ జరిపించాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కొవ్వూరు సీఐ ప్రమాదంలో కత్తి మహేశ్ కారు డ్రైవింగ్ చేస్తున్న సురేశ్‌ను పిలిచి విచారించారు. ఈ విచారణలో డ్రైవర్ ప్రమాదం జరిగిన తీరును ఇలా వివరించాడు. నిద్ర సమయం కావటంతో నెల్లూరులో ఆగి విశ్రాంతి తీసుకోవాలనుకున్నామని, ఆ లోపే ఈ ఘటన జరిగిందన్నాడు. కంటైనర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించాడు. ప్రమాదం సమయంలో కత్తి మహేశ్ నిద్రలో ఉన్నారని, సీటు బెల్టు కూడా పెట్టుకోకపోవడం వల్ల ఆయన ముందుకు పడినట్లుగా సురేశ్ వెల్లడించాడు. ఈ క్రమంలో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినప్పటికీ పగిలిన అద్దాల ముక్కలు మహేశ్ కంటికి గుచ్చుకున్నాయని అన్నాడు. ఆయనకు రక్తస్రావం అవుతుండటంతో హైవే పెట్రోలింగ్ పోలీసుల సాయంతో మహేశ్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించామన్నాడు. అయితే అక్కడ ఐ స్పెషలిస్టు లేకపోవటంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రి తరలిచించామని తెలిపాడు. మరీ ఈ ప్రమాదంలో మీకేందుకు గాయాలు కాలేదని పోలీసులు అడగడంతో తను సీటు బెల్టు పెట్టుకోవడం వల్లే గాయాలు కాలేదని సురేశ్ సమాధానం ఇచ్చాడని పోలీసులు తెలిపారు. ఈ విచారణ అనంతరం సురేశ్ మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని, ఈ కేసులో తనని అనుమానించాల్సిన అవసరం లేదన్నాడు. అవసరమైతే మళ్లీ పోలీసుల విచారణకు సహకరిస్తానని సురేశ్ పేర్కొన్నాడు. ఇక సీఐ రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సాక్షి ట్వీట్‌తో మహేశ్ ప్రమాద ఘటనపై విచారణ జరిపాం అన్నారు. ఈ మేరకు కారు నడిపిన సురేశ్‌ను పిలిచి విచారించామని, ప్రమాదం జరిగిన తీరు గురించి వివరాలు అడిగినట్లు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి మరికొంత మందిని విచారించాల్సి ఉందని సీఐ తెలిపారు. -
ఎన్నికల నిబంధనలు అందరికి సమానమే
-
కిషోర్ కుటుంబసభ్యులను పరామర్శించిన ఆర్కే
-
టీడీపీ శిబిరాల్లోె ఉన్నవారంతా పెయిడ్ ఆర్టిస్ట్ లే
-
ఏపీ డీజీపీని కలసిన ఎమ్మెల్యే ఆర్కే
-
‘పవన్ ప్యాకేజీ తీసుకొని సీపీఐకి కేటాయించారు’
సాక్షి, విజయవాడ : జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీ ప్యాకేజీ తీసుకొని నారా లోకేష్‌పై పోటీ చేయకుండా మంగళగిరి సీటును సీపీఐకి కేటాయించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారప్రతినిధి ఆళ్ల రామకృష్ణ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా టీడీపీ.. పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తుందని మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంగళగిరిలో సర్వేల పేరిట కోడ్ ఉల్లంఘన జరుగుతోందన్నారు. తెలంగాణకు చెందిన కొంతమంది విద్యార్థులతో ఓటర్లను ప్రభావితం చేసే విధంగా సర్వేలు చేయిస్తున్నారని తెలిపారు. సర్వేలు చేస్తున్నవారిని పట్టుకుని పోలీసులకు అప్పజెప్పామన్నారు. అధికారపార్టీ ఆగడాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. చంద్రబాబు అక్రమ మార్గంలో గెలవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. కోడ్‌ను ఉల్లంఘిస్తూ.. సెల్ఫోన్లు, బైకులు పంచుతున్నారన్నారు. మంగళగిరిలో లోకేష్‌కు బదులు చంద్రబాబు పోటీచేయాలని సవాల్ విసిరారు. మనిషి చనిపోతే పరవశించి పోయే నాయకుడు లోకేషని విమర్శించారు. పోలీసులు పారదర్శకంగా ఉండాలని, కానీ డీజీపీ.. పార్కు అక్రమించారని కోర్టుకు వెళ్లానని తనపై కక్ష కట్టారన్నారు. ఇంటిలిజెన్స్ అధికారి ఏవీ వెంకటేశ్వరరావు.. టీడీపీకి కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. భూములు కాజేసేందుకే మంగళగిరికి లోకేష్ వచ్చారని, అప్రజాస్వామికంగా కుల ప్రాతిపాదికన ఓట్లు చేర్చారని ధ్వజమెత్తారు. పవన్ కల్యాణ్‌ను టీడీపీ మేనేజ్ చేసిందని, భూములు తీసుకుంటే ఆమరణ దీక్ష చేస్తానన్న పవన్.. ఏమి చేయలేదన్నారు. -
ఏపీ సర్కార్‌పై ఎమ్మెల్యే ఆర్కే ఫైర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మంగళగిరి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ...ఏపీ రాజధాని ప్రాంతంలో అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవేల కోసం 1500 ఇళ్లు తొలగించాలన్న ప్రభుత్వ నిర్ణయం దారుణమన్నారు. ఏ ఒక్క ఇల్లు తొలగించినా చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. -
రైతుల గుండెల్లో గునపాలు
సాక్షి, గుంటూరు: మంత్రులు ట్రాక్టర్లు ఎక్కి ఇనుప నాగళ్ళతో పొలాలను దున్నేస్తున్న దృశ్యాలు రైతుల గుండెల్లో గునపాలను దించుతున్నట్లున్నాయని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే) అన్నారు. శనివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ 33 వేల ఎకరాల రైతుల భూములను రూపాయి ఖర్చు లేకుండా సమీకరించామని ప్రపంచమంతటా డబ్బా కొట్టుకుంటున్న చంద్రబాబుకు చెక్కుల పంపిణీ ఎందుకు చిక్కులు తెచ్చిపెడుతోందని ప్రశ్నించారు. సమీకరించామని చెప్పుకుంటున్న భూముల యజమానుల్లో పదిశాతం కూడా చెక్కులు తీసుకొనేందుకు ముందుకు రాకపోవటం వెనుక రైతుల గుండెకోత ఉందన్న వాస్తవాన్ని గుర్తించాలన్నారు. రైతులు కార్యాలయాలకు రాకపోవటంతో నాయకులు, అధికారులు వారి ఇళ్లకు వెళ్లి బతిమాలి మరీ చెక్కులు అందజేస్తున్నారని ఆర్కే ఎద్దేవా చేశారు. ఎలాగోలా రైతులను ఒప్పించి సంతకాలు పెట్టించుకొంటే తన లక్ష్యం నెరవేరుతుందని మంత్రి నారాయణ ఇక్కడే మకాం వేసి మంత్రాంగం నడుపుతున్నారన్నారు. ఈ ఏడాది చెక్కులు ఇస్తున్న నారాయణ ప్రతి ఏడాదీ ఇలాగే అందరికీ చెక్కులు ఇస్తారా అని ఆయన ప్రశ్నించారు. అనధికారిక రెవెన్యూ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన 13 లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాంకును తయారు చేసే పనిలో పడ్డారని, మరెందరో రైతులను మభ్యపెట్టాల్సిన గురుతర బాధ్యతను చంద్రబాబు ఆయనకు అప్పగించారని తెలిపారు. రుణాలు మాఫీ కాక హైద రాబాద్ చుట్టూ తిరుగుతున్నట్లుగానే వచ్చే ఏడాది నుంచి కౌలు చెక్కుల కోసం రైతులంతా నారాయణ కాలేజిల గేట్ల ముందు పడిగాపులు కాయాలా అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే పదేళ్ళ పోస్ట్ డేటెడ్ చెక్కులు లేదా కాలావ్యవధి బాండ్లను రైతులకు ఇప్పుడే అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు కౌలు చెక్కులతో పాటు రైతుకూలీలకు రూ. 2,500 చొప్పున భృతి ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. కౌలు రైతులు, చేతి వృత్తిదారులు, వ్యవసాయ అనుబంధ వృత్తుల వారి గతి ఏమిటని ప్రశ్నించారు. నాలుగేళ్ళవరకు ఎన్నికలు లేవన్న ధైర్యం తో నియంతృత్వ నిర్ణయాలకు తెగబడుతున్న చంద్రబాబు అండ్ కోకు న్యాయస్థానాలు బుద్ధి చెబుతాయని ఆర్కే హెచ్చరించారు. -
క్రూడ్ ఆయిల్‌కు అనుగుణంగా పెట్రోలు ధరలు తగ్గించాలి
సాక్షి, హైదరాబాద్ : అంతర్జాతీయ మార్కెట్లో తగ్గిన క్రూడ్ ఆయిల్ ధరలకు అనుగుణంగా పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. పార్టీ శాసనసభాపక్షం కోఆర్డినేటర్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి శనివారం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద సంయుక్తంగా మీడియాతో మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు సగానికి తగ్గినా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ రేట్లను ఆ మేరకు తగ్గించడం లేదని తప్పు పట్టారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఈ విషయంలో ఏమీ మాట్లాడ్డం లేదని వారన్నారు. గత జూన్‌లో ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 115 డాలర్లుగా ఉంటే అది సగానికంటే తక్కువగా ప్రస్తుతం 47.5 డాలర్లకు పడిపోయిందనీ కానీ భారత దేశంలో ఆ మేరకు ధరలు తగ్గలేదని అన్నారు. ఒక బ్యారెల్ 115 డాలర్లుగా ఉన్నపుడు ఇక్కడ లీటరు పెట్రోలు ధర రు 80లుగా ఉండేదన్నారు. 47.5 డాలర్లకు తగ్గిన నేపథ్యంలో ఒక లీటరు పెట్రోలు ధర రు 45లు, రు 50ల మధ్య ఉండాలనీ అయితే అదింకా రు67- 68 మధ్యే ఉందన్నారు. సార్క్ దేశాలైన బంగ్లాదేశ్, భూటాన్, పాకిస్తాన్లో కూడా భారత్ కంటే పెట్రోలు, డీజిల్ ధరలు తక్కువగా ఉన్నాయని వారు ప్రస్తావించారు. కేంద్రం మొక్కుబడిగా పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించిందే తప్ప నిష్పత్తి ప్రకారం ధరలను తగ్గించలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌పై పన్నులు వేసి వాళ్ల ఆదాయాన్ని పెంచుకుంటోందని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పన్నులు వసూలు చేస్తున్నారని వాటిని తగ్గించాల్సిన అవసరం ఉందని ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు డిమాండ్ చేసిన చంద్రబాబు ఇపుడు భారత్‌లో పెట్రోలు, డీజిల్‌పై ఎక్కువగా వసూలు చేస్తున్న పన్నులను తగ్గించాలని ఎన్డీయే ప్రభుత్వాన్ని ఎందుకు కోరడం లేదని వారు ప్రశ్నించారు. గతంలో ఇవే ధరలకు ముడిపెట్టి, ఆర్టీసీ, రైల్వే చార్జీలను అమాంతం పెంచేశారని, ఇపుడు తగ్గుతున్న ధరలను బట్టి వాటిని కూడా ఎందుకు తగ్గించడం లేదని వారు ప్రశ్నించారు. పెట్రో ధరల పేరు చెప్పి నిత్యావసర సరుకులు, ఎరువుల ధరలు కూడా ఆకాశానికి అంటాయని ఇపుడు వాటిని తగ్గించడానికి చర్యలు తీసుకోవడం లేదని వారు విమర్శించారు. ఈ విషయంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఘోరంగా విఫలమయ్యాయని వారు దుయ్యబట్టారు. -
ఖాకీ సైంటిస్ట్
ఎస్కేయూ, న్యూస్‌లైన్ : రాష్ట్ర పోలీసు డెరైక్టర్ జనరల్ (డీజీపీ) బయ్యారపు ప్రసాదరావుకు సమాజం, సైన్స్ రెండు కళ్లు లాంటివి. ఒకవైపు పోలీస్ బాస్‌గా రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షిస్తూనే... మరోవైపు భౌతిక శాస్త్రంలో విలువైన పరిశోధనలు చేస్తున్నారు. వృత్తి రీత్యా, ప్రవృత్తి రీత్యా సమాజ శ్రేయస్సుకు పాటుపడుతున్నారు. ఆయన పరిశోధనలకు గాను శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం బుధవారం డాక్టరేట్ ప్రదానం చేసింది. ప్రసాదరావు యూజీసీ-బీఎస్ఆర్ ఎమిరేటర్స్ శాస్త్రవేత్త ఆచార్య రాజూరి రామకృష్ణారెడ్డి పర్యవేక్షణలో ‘స్టడీస్ ఆన్ వేవ్-పార్టికల్ డ్యూయల్టీ ఆఫ్ లైట్’ అనే అంశంపై పరిశోధన చేశారు. వర్సిటీలోని ఫిజిక్స్ విభాగంలో జరిగిన వైవాలో ఆయన తన పరిశోధన గురించి వివరించారు. కాంతి.. కణ-తరంగ స్వభావాలు కలిగి ఉంటుందని న్యూటన్,హేగెన్, ప్రేనల్ లాంటి శాస్త్రవేత్తలు నిరూపించారు. న్యూటన్ కాంతి సిద్ధాంతాన్ని బలపరుస్తూ ప్రసాదరావు పరిశోధన కొనసాగింది. ప్రతి వస్తువుపై ఫ్లూయిడ్ కొద్ది మోతాదులో ఉంటుందని, దీనిపై ఒత్తిడి కలగజేస్తే న్యూటన్ వలయాల రూపంలో ఉన్న సాంద్రత తరంగాలు విస్తరిస్తాయని తన పరిశోధన ద్వారా నిరూపించారు. చమురు, సబ్బు నీరు తదితర ద్రవ పదార్థాలపై ఒత్తిడిని కలగజేసి... దీనివల్ల కలిగే న్యూటన్ వలయాలను విశ్లేషించి కాంతి స్వభావాన్ని తెలియజేశారు. కాంతితో కలసికట్టుగా ఉండే పోటాన్లను క్వాంటమ్ సిద్ధాంతం ద్వారా విశ్లేషించారు. ‘వ్యతికరణం-వివర్తనం’ అనే భావనలు కణ సిద్ధాంతంపై ఆధారపడి పనిచేస్తాయని వివరించారు. కానిస్టేబుల్ కొడుకు.. అసాధారణ మేధావి డీజీపీ ప్రసాదరావు తండ్రి శ్రీనివాస్ ఒక సాధారణ కానిస్టేబుల్. ప్రసాదరావు చిన్నతనం నుంచే కష్టపడి ఈ స్థాయికి ఎదిగారు. పదో తరగతిలో రాష్ట్రంలో 13వ ర్యాంకు సాధించారు. ఇంటర్, డిగ్రీ విజయవాడ లయోలా కాలేజీలో చదివా రు. మద్రాసు ఐఐటీలో ఎమ్మెస్సీ పూర్తి చేశారు. ఆ వెంటనే జూనియర్ లెక్చరర్‌గా ఎంపికై ప్రకాశం జిల్లా తాళ్లూరులో పనిచేశారు. రెండు నెలలు తిరగక ముందే ఎస్బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్ (పీఓ) ఉ ద్యోగం వచ్చింది. ఉద్యోగం చేస్తూనే వైజాగ్‌లో సివిల్ సర్వీసెస్‌కు సన్నద్ధమయ్యా రు. ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆప్షనల్స్‌గా తొ లి ప్రయత్నంలోనే ఐపీఎస్ సాధించారు. అత్యున్నత పోలీసు అధికారిగానే కా కుం డా ఓ శాస్త్రవేత్తగా, పరిశోధకుడిగా ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. అభినందనల వెల్లువ డాక్టరేట్ పొందిన డీజీపీ ప్రసాదరావును ఎస్కేయూ వీసీ ఆచార్య రామకృష్ణారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. వైవాకు వీసీ కూడా హాజరై రెండు గంటల పాటు ప్రసాదరావు వివరించిన విషయాలను ఆసక్తిగా విన్నారు. సర్వీసు అనంతరం ఆయన్ను ఎస్కేయూ విజిటింగ్ ప్రొఫెసర్‌గా తీసుకుంటామని తెలిపారు. అందరికీ థ్యాంక్స్ తాను నాలుగేళ్లుగా ఎస్కేయూలో పరిశోధనలు చేస్తున్నానని డీజీపీ ప్రసాదరావు తెలి పారు. తనకు సహకరిం చిన ఆచార్య రాజూరి రామకృష్ణారెడ్డి, వీసీ కాడా రామకృష్ణారెడ్డి, రిజిస్ట్రార్ ఆచా ర్య గోవిందప్ప, సహాయ ఆచార్యులు రామగోపాల్ తో పాటు తోటి పరిశోధక విద్యార్థులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.