Ramachandra Guha
-
గంగూలీ.. ఇది ఎక్కడైనా ఉందా?
న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్‌ను కామెంట్రీ ప్యానల్ నుంచి తప్పించడంపై క్రికెట్ పరిపాలన కమిటీ(సీఓఏ) మాజీ సభ్యుడు రామచంద్ర గుహ మండిపడ్డారు. సంజయ్ మంజ్రేకర్ విషయంలో బీసీసీఐ వ్యవహరించిన తీరు దారుణమన్నారు. గతేడాడి వరల్డ్‌కప్ సమయంలో రవీంద్ర జడేజాను బిట్స్ అండ్ పీసెస్ క్రికెటర్ అని వ్యాఖ్యానించడం మంజ్రేకర్‌కు ముప్పుతెచ్చింది. అతన్ని కామెంట్రీ ప్యానల్ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. దాంతో ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌కు సైతం మంజ్రేకర్ కామెంట్రీ చెప్పలేకపోయాడు. తను కామెంట్రీ ప్యానల్లో చేర్చాలని మంజ్రేకర్ మొరపెట్టుకున్నా బోర్డు మాత్రం ముందు నిర్ణయానికే కట్టుబడింది. దాంతో మంజ్రేకర్‌కు ఐపీఎల్ కామెంట్రీ చెప్పే అవకాశం రాలేదు. అయితే భారత క్రికెట్ జట్టు.. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మంజ్రేకర్ కామెంట్రీ చెప్పనున్నాడు. అయితే ఇక్కడ బీసీసీఐ తరఫున కాకుండా, సోనీ అతన్ని కామెంట్రీ చెప్పడానికి కొనుగోలు చేసింది. తమ ఇంగ్లిష్ కామెంట్రీ ప్యానల్లో చేర్చింది. (‘ఆ క్లిప్స్ చూస్తూ కోహ్లి బిగ్గరగా నవ్వుతాడు’) కాగా, మంజ్రేకర్‌పై ఇంతటి కక్ష సాధింపు ధోరణి సరికాదంటూ రామచంద్ర గుహ పేర్కొన్నారు. అసలు కామెంటేటర్లపై బీసీసీఐ తన అధికారాన్ని చూపించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. ఇలా ప్రపంచ క్రికెట్లో ఎక్కడైనా జరిగిందా అంటూ నిలదీశారు. ‘ ఈ తరహా విధానం బీసీసీఐకి మంచిది కాదు. బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ కామెంటేటర్ల వ్యవహారంలో ప్రవర్తిస్తున్న తీరు హాస్యాస్పదంగా ఉంది. ఇక్కడ తనను తిరిగి తీసుకోవాలని మంజ్రేకర్ బోర్డుకు విన్నవించడం చాలా దారుణం. కామెంటేటర్లపై పెత్తనం చెలాయించాలనుకోవడం అర్థం లేనిది. ఈ విషయంలో బోర్డు అజమాయిషీ ఏమిటి. ప్రపంచ క్రికెట్లో ఎక్కడైనా ఇలా జరిగిందా?, ఒక్కసారి ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్‌లో జరుగుతున్న దానిని ఒక్కసారి ఊహించుకోండి’ అని గుహా విమర్శించారు.(‘రాయుడ్ని ఎంపిక చేయకపోవడం మా తప్పే’) -
‘అది మనిషి సృష్టించిన అతిపెద్ద విషాదం’
న్యూఢిల్లీ: లాక్డౌన్ వల్ల దేశవ్యాప్తంగా కోట్లాది మంది వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావడం... దేశ విభజన తర్వాత మనిషి సృష్టించిన అతిపెద్ద విషాదమని ప్రముఖ చరిత్రకారుడు, ఆర్థికవేత్త రామచంద్ర గుహ అభివర్ణించారు. ప్రధానమంత్రి మోదీ ఒక వారం సమయం ఇచ్చి లాక్డౌన్ ప్రకటిస్తే వలస కార్మికుల ఇక్కట్లు తగ్గేవని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దేశ విభజన సమయంలో భయంకరమైన మత కలహాలు చెలరేగాయని, లక్షలాది మంది వలస వెళ్లారని గుర్తుచేశారు. హింస జరగకపోయినా ఇప్పటి పరిస్థితి మాత్రం దేశ విభజన తర్వాత మనిషి సృష్టించిన అతిపెద్ద విషాదమని పేర్కొన్నారు. దీని దుష్పరిణామాలు సమాజంపై తప్పకుండా ఉంటాయన్నారు. కూలీలు ఇప్పట్లో మళ్లీ పనులకు వచ్చేందుకు ఆసక్తి చూపబోరని అన్నారు. -
రాహుల్‌ను మరోసారి ఎన్నుకోకండి
తిరువనంతపురం : కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీపై ప్రముఖ చరిత్రకారుడు రామచంద్రగుహ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ను వయనాడ్ ఎంపీగా గెలిపించి కేరళ ప్రజలను తప్పు చేశారని అన్నారు. ప్రస్తుత యంగ్ ఇండియాకు ఐదో తరానికి చెందిన రాహుల్ నాయకత్వం అవసరంలేదని వ్యాఖ్యానించారు. ఆయనతో పోల్చకుంటే ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న తెలివితేటలు ఎంతో గొప్పవని అభిప్రాయపడ్డారు. రాహుల్ అసమర్థతే మోదీకి ఎంతో ప్రయోజమని అన్నారు. తిరువనంతపురంలో జరుగుతున్న ‘కేరళ లిటరేచర్ ఫెస్టివల్’ రెండోరోజు సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచంద్రగుహా ‘దేశభక్తి-మతోన్మాదం’ అంశంపై ప్రసంగించారు. ‘ఎంతో ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ నేడు నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతోంది. రాహుల్‌పై నాకు ఎలాంటి చెడు అభిప్రాయం లేదు. నేటి యంగ్ జనరేషన్‌కి ఐదో తరానికి చెందిన రాహుల్ గాంధీ నాయకత్వం అవసరం లేదు. ఆయన కుటుంబ కంచుకోట అయిన అమేథిలోనే ఓటమి చెందారు. రాహుల్‌ను కేరళ ప్రజలు ఎంపీగా ఎన్నుకుని తప్పిదం చేశారు. 2024లో మరోసారి అదేపని చేస్తే మోదీకి ఎంతో లబ్ధిచేకూర్చినట్లు అవుతుంది. రాజకీయంలో మోదీకి ఉన్న పరిపక్వత రాహుల్‌కు లేదు. గుజరాత్‌కు ముఖ్యమంత్రిగా 15 ఏళ్లు పనిచేసి.. పరిపాలనాపరమైన అనుభవాలను మోదీ పొందారు. ఆయనకు ఉన్న కష్టించే తత్వం ముందు రాహుల్ నిలువలేరు. రాహుల్లా నెలలో 15 రోజులు మోదీ యూరప్ ట్రిప్పులకు వెళ్లరు. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ కేవలం ఢిల్లీకే పరిమితమైయ్యారు. దేశ వ్యాప్తంగా పార్టీ క్లిష్టపరిస్థితిని ఎదుర్కొంటోంది. కాగా రామచంద్రగుహ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తొలినుంచి మోదీకి వ్యతిరేకంగా ఉండే ఆయన.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. -
ప్రముఖ చరిత్రకారుడిపై బీజేపీ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, బెంగళూరు: ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహపై బీజేపీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ట్విటర్ వేదికగా ఆయనను అర్బన్ నక్సలైట్‌గా వర్ణించింది. ఆయన చీకటి ప్రపంచాన్ని నడుపుతున్నాడని ఆరోపించింది. ఈ మేరకు కర్ణాటక బీజేపీ శాఖ శనివారం తన అధికారిక ట్విటర్లో పోస్ట్ చేసింది. ‘‘ప్రశ్న: మీరు ఎవరు?. జవాబు: నా పేరు రామచంద్ర గుహ. చీకటి ప్రపంచంలో కార్యకలాపాలు నిర్వహించే అర్బన్ నక్సల్స్ గురించి సామాన్యులకు తెలియదు. తమ యజమానుల తరఫున హింసను ప్రేరేపించడం, ఆందోళనలు జరపడం ద్వారా తమ ఉనికిని ప్రదర్శించుకుంటారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ.. ఇప్పుడు వారంతా బయటికి వస్తున్నారు..’ అంటూ వ్యాఖ్యానించింది. దీనికి తోడు ఆయన మాట్లాడుతున్న ఓ వీడియోను కూడా ట్విటర్లో షేర్ చేసిది. కాగా ప్రభుత్వ నిషేధాజ్ఞలను ధిక్కరించి పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కి వ్యతిరేకంగా నిరసన తెలిపిన రామచంద్ర గుహను బెంగళూరు పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తనను నిర్బంధించడం తీవ్ర అప్రజాస్వామికమనీ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడుతున్నారు. -
పౌరసత్వ రగడ: పోలీసుల అదుపులో ప్రముఖులు
న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. నిరసనకారులను అదుపు చేసేందుకు దేశంలోని పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. అలాగే భారీగా పోలీసులను మోహరించారు. అయినప్పటికీ నిరసనకారులు, పలువురు ప్రముఖలు రోడ్లపైకి వచ్చి సీఏఏకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట వద్దకు నిరసకారులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వేలాది మంది నిరసకారులను పోలీసులు అక్కడి నుంచి తరలించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడికి చేరుకున్న స్వరాజ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తనను తీసుకెళ్లే సమయంలో ‘భారత్ మాతా కీ జై’ అంటూ యోగేంద్ర యాదవ్ నినాదాలు చేశారు. సీఏఏకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగడంతో పోలీసులు ఢిల్లీ-గురుగ్రామ్ హైవేపై బారీకేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. దీంతో 5 కి.మీ మేర ట్రాఫిక్ జామ్ అయింది. అలాగే ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంతో పాటు..16 మెట్రో స్టేషన్ల గేట్లను మూసివేశారు. మరోవైపు బెంగళూరు టౌన్ హాల్ సమీపంలో సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్న ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఏఏపై ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉండగానే పోలీసులు లాక్కుని వెళ్లారు. సీఏఏకు వ్యతిరేకంగా తెలంగాణలోని చార్మినార్ వద్ద ఆందోళన చేపట్టిన పలువురు నిరసనకారులను పోలీసులు అక్కడి నుంచి తరలించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా నిరసన చేపట్టిన పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
‘ఎద్దు మాంసం తిని మతానికి తీరని కళంకం తెచ్చావ్’
న్యూఢిల్లీ : ప్రముఖ చరిత్రకారుడు.. బీజేపీ పార్టీ విమర్శకుడు రామచంద్ర గుహను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు ట్విట్టర్ యూజర్లు. వివరాలు.. శనివారం రామచంద్ర గుహ గోవాలో దిగిన ఓ ఫోటోను తన ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ ‘పనాజీలో ఎద్దు మాంసం తింటూ ఎంజాయ్ చేస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. దాంతో ఆగ్రహించిన నెటిజన్లు గుహను విపరీతంగా ట్రోల్ చేయడమే కాక.. ఫోన్ చేసి మరి బెదిరించినట్లు తెలిపారు గుహ. విమర్శలు ఎక్కవ అవడంతో ఆ ఫోటోను డిలీట్ చేశానని తెలిపారు. ఈ విషయం గురించి గుహ మాట్లాడుతూ.. ఆర్కే యాదవ్ అనే మాజీ రా(రిసెర్చ్ అనాలసిస్ వింగ్) ఉద్యోగి ‘ఒక హిందువు ఎద్దు మాసం తినడమే కాక.. ఆ విషయం గురించి ప్రచారం చేసుకుంటూ మతానికి తీరని కళంకం తెచ్చావు. ఈ దారుణ చర్య ద్వారా నువ్వు హిందువులను బాధించావు. ఇందుకు తగిన సమాధానం చెప్తాం’ అంటూ ట్వీట్ చేశాడని వెల్లడించారు. This threatening tweet below is from a former official of the Research and Analysis Wing. I would like to place it on record, and will do with every subsequent threat received. https://t.co/MrG7AVL15U — Ramachandra Guha (@Ram_Guha) December 9, 2018 అంతేకాక ఢిల్లీకి చెందిన మరో వ్యక్తి ఫోన్ చేసి తనను, తన భార్యను బెదిరించారని పేర్కొన్నారు గుహ. తనకు వచ్చిన ఈ బెదిరింపు సందేశాలను, ఫోన్ కాల్స్‌ని రికార్డ్ చేసినట్లు ఆయన తెలిపారు. మరికొన్ని విమర్శలు కూడా రావడంతో ఆ ఫోటోను తొలగించారు. అనంతరం బీజేపీని విమర్శిస్తూ ట్వీట్ చేశారు గుహ. ‘నేను గోవాలో లంచ్ చేస్తున్నప్పటి ఫోటోను డిలీట్ చేశాను. ఈ సందర్భంగా ఎద్దు మాంసం పట్ల బీజేపీ సృష్టించిన హిపోకస్రీని మెచ్చుకుంటున్నాను. ఆహారం, దుస్తులు, ప్రేమ విషయంలో మనషులు తమ మనసుకు నచ్చినట్లు చేసే హక్కు ఉందని’ తెలిపారు. I have deleted the photo of my lunch in Goa as it was in poor taste. I do wish however to again highlight the absolute hypocrisy of the BJP in the matter of beef, and to reiterate my own belief that humans must have the right to eat, dress, and fall in love as they choose. — Ramachandra Guha (@Ram_Guha) December 9, 2018 ప్రస్తుతం దేశంలో రాజస్తాన్, హిమాచల్ ప్రదేశ్, వంటి రాష్ట్రాల్లో గొడ్డు మాంసాన్ని పూర్తిగా నిషేధించారు. కానీ కేరళ, పశ్చిమ బెంగాల్, గోవా వంటి రాష్ట్రాల్లో దీని మీద ఎటువంటి నిషేధం లేదు. -
'అప్పుడు వారు.. ఇప్పుడు వీరు'
ముంబై: భారత క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా పనిచేసిన అనిల్ కుంబ్లే దాదాపు ఐదు నెలల క్రితం తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లితో విభేదాలు కారణంగా కుంబ్లే తన పదవి నుంచి తప్పుకున్నాడన్నది కాదనలేని సత్యం. అయితే వీరిద్దరి వివాదాన్ని సుమారు 65 ఏళ్ల నాటి సంఘటనతో పోల్చారు రామచంద్ర గుహ. బీసీసీఐ పాలకుల కమిటీ సభ్యత్వానికి ఆరు నెలల క్రితం రాజీనామా చేసిన గుహ.. తొలిసారి క్రికెట్ గురించి బహిరంగంగా పెదవి విప్పారు. కొన్ని నెలల క్రితం కోహ్లి-కుంబ్లేల మధ్య చోటు చేసుకున్న వివాదాన్ని 1952లో సీకే నాయుడు-వినూ మన్కడ్ వివాదంతో పోల్చారు. బాంబే జింఖానా మైదానంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన గుహ మాట్లాడారు. 'బీసీసీఐ పరిపాలకుల కమిటీకి ఆరు నెలల క్రితం రాజీనామా చేశాను. ఆ తర్వాత క్రికెట్‌పై బహిరంగంగా మాట్లాడటం ఇదే తొలిసారి. 1952లో కల్నల్ సీకే నాయుడు, వినూ మన్కడ్ మధ్య పెద్ద వివాదం నడిచింది. ఆ సమయంలో నాయుడు సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా ఉండగా,. వినూ మన్కడ్ అద్భుతమైన క్రికెటర్. అది భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించిన సమయం. లంకాషైర్ నుంచి మన్కడ్‌కు ఓ ఒప్పందం ప్రతిపాదన వచ్చింది. జట్టులోకి తీసుకుంటారని నాకు హామీ ఇస్తే లంకషైర్తో ఒప్పందం కుదుర్చుకోనని మన్కడ్ బీసీసీఐకి తెలిపారు. ‘మేమెలాంటి హామీ ఇవ్వలేం అని అందుకు నాయుడు బదులిచ్చారు. ఆ క్రమంలోనే లార్డ్స్‌లో జరిగిన తొలి టెస్టులో ఓడింది. మన్కడ్ ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో 72, రెండో ఇన్నింగ్స్‌లో 184 పరుగులు చేశాడు. అప్పుడు సీకే నాయుడు, మన్కడ్‌కు మధ్య వివాదం ఏ విధంగా జరిగిందో.. ఇప్పుడు కోహ్లి-కుంబ్లేల మధ్య జరిగింది. కాకపోతే అప్పుడు క్రికెట్ పరిపాలకులది పైచేయి ఉంటే.. ఇప్పుడు ఆటగాళ్లే క్రికెట్ పరిపాలన విధానాన్ని శాసిస్తున్నారు' అని గుహ అభిప్రాయపడ్డాడు. -
మళ్లీ వివాదంలో ఇండిగో, చరిత్రకారుడు ఫైర్
-
మళ్లీ వివాదంలో ఇండిగో, చరిత్రకారుడు ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ : వివాదాలకు ఇండిగో ఎయిర్‌లైన్స్ కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. వరసబెట్టి వివాదాల వలయంలో ఆ సంస్థ చిక్కుకుంటోంది. గౌరవించాల్సిన ప్రయాణికులపై ఆ సంస్థ సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా చరిత్రకారుడు రామచంద్ర గుహ, ఇండిగో ఎయిర్‌లైన్ స్టాఫ్ ప్రవర్తనపై ట్విట్టర్లో మండిపడ్డారు. గత వారం రోజులుగా తనకు ఎదురైన పరిస్థితులపై వివరించారు. ఇండిగో ఉద్యోగులు తనతో దురుసుగా ప్రవర్తించారని తెలిపారు. మూడు ఎయిర్‌పోర్టులో ఒకే విమానయాన సంస్థకు చెందిన ముగ్గురు సిబ్బంది తనతో దురుసుగా ప్రవర్తించారని పేర్కొన్నారు. ఇది నిజంగా చాలా షాకింగ్ పరిస్థితి అని ట్వీట్ చేశారు. వినియోగదారుల సమస్యలు పరిష్కరించడానికి తాను ట్విట్టర్‌ను వాడనని, కానీ ఈసారి మినహాయింపు ఇచ్చానని, ఏడు రోజుల్లో రెండు సార్లు ఒకే ఎయిర్‌లైన్‌కు చెందిన సిబ్బంది తనతో అమర్యాదగా ప్రవర్తించినట్టు పేర్కొన్నారు. గుహ ట్వీట్లపై ఇండిగో ఇంకా స్పందించలేదు. ఈ ఘటనపై విచారణ జరుపాలని రెగ్యులేటరీ బాడీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ఈ నెల మొదట్లో కూడా ఇండిగో, ఓ మహిళా ప్రయాణికురాలికి క్షమాపణ చెప్పింది. Three times this time, I have been subject to unprovoked rudeness by an @IndiGo6E staffer. Different people, different airports, same airline. Absolutely shocking. — Ramachandra Guha (@Ram_Guha) November 26, 2017 I don’t normally use twitter as a means of consumer redressal, but since the same airline misbehaved thrice in a single week I had to. Friends and family also confirm that rudeness has become a habit with @IndiGo6E — Ramachandra Guha (@Ram_Guha) November 26, 2017 -
భారత క్రికెట్లో సంచలనం
-
భారత క్రికెట్లో సంచలనం
బీసీసీఐ తీరును తప్పుబట్టిన రామచంద్ర గుహ సూపర్‌స్టార్ సంప్రదాయం కొనసాగుతుందని విమర్శ ధోనికి గ్రేడ్ ‘ఏ’ కాంట్రాక్టుపై విస్మయం, కోచ్ కుంబ్లేకు మద్దతు న్యూఢిల్లీ: బీసీసీఐ పరిపాలకుల కమిటీ (సీఓఏ) నుంచి తప్పుకున్న ప్రముఖ చరిత్రకారుడు, రచయిత రామచంద్ర గుహ బాంబు పేల్చారు. సీఓఏ నుంచి తప్పుకున్న మరుసటి రోజే ఏడు కీలక అంశాలతో లేఖాస్త్రాన్ని సంధించారు. భారత్ క్రికెట్, బీసీసీఐలో కొనసాగుతున్న సూపర్‌స్టార్ సంప్రదాయాన్ని తీవ్రంగా విమర్శించారు. టెస్టుల నుంచి రిటైరయిన ఎంఎస్ ధోనికి గ్రేడ్ ‘ఏ’ కాంట్రాక్టు కొనసాగిస్తుండడాన్ని తప్పుబట్టారు. 2014లో టెస్టు క్రికెట్ నుంచి తనంత తానుగా తప్పుకున్న ధోనికి టాప్ గ్రేడ్ కొనసాగించడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. క్రికెట్ ఏజెన్సీలతో సంబంధమున్న గవాస్కర్‌ను వ్యాఖ్యాతగా ఎలా కొనసాగిస్తారని ప్రశ్నించారు. కొంత మంది జాతీయ కోచ్‌లకు బీసీసీఐ అధిక ప్రాధాన్యం ఇచ్చిందని ఆరోపించారు. జాతీయ జట్టు ప్రయోజనాల గురించి ఆలోచించకుండా కోచ్‌లు రెండు నెలల పాటు ఐపీఎల్ మత్తులో మునిగితేలారని ధ్వజమెత్తారు. టీమిండియా ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లేకు ఆయన బాసటగా నిలిచారు. కుంబ్లే సత్తా ఏమిటో అతడి రికార్డులే చెబుతాయని పేర్కొన్నారు. డ్రెస్సింగ్ రూములో కుంబ్లే వైఖరిపై కెప్టెన్ కోహ్లి సహా సీనియర్ ఆటగాళ్లు అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో కొత్త కోచ్ కోసం బీసీసీఐ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే కోహ్లి-కుంబ్లే వివాదం పుకారని బీసీసీఐ కొట్టిపారేసింది. వచ్చే నెలతో కుంబ్లే కాంట్రాక్టు ముగుస్తున్నందున కొత్త కోచ్ కోసం నోటిఫికేషన్ జారీ చేసినట్టు వెల్లడించింది. -
మోదీ.. థర్డ్ మోస్ట్ సక్సెస్ఫుల్!
జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ తర్వాత అత్యంత విజయవంతమైన మూడో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీనే అని ప్రఖ్యాత చరిత్రకారుడు రామచంద్రగుహా అభిప్రాయపడ్డారు. 66 ఏళ్ల మోదీ ఛరిష్మా, అప్పీల్.. ప్రాంతాలు, కులాలు, భాషలకు అతీతంగా దేశమంతా పాకిపోయిందని వ్యాఖ్యానించారు. న్యూఢిల్లీలో జరుగుతున్న లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ భారతీయ సదస్సు-2017లో గుహా ప్రసంగిస్తూ మోదీ ఆధిపత్యం, ఆయన విశాల భారత దృక్పథం ఆయనను నెహ్రూ, ఇందిర సరసన నిలబెట్టాయని పేర్కొన్నారు. 'నరేంద్రమోదీ భారత చరిత్రలో మూడో అత్యంత విజయవంతమైన ప్రధానమంత్రిగా నిలువబోతున్న లేదా నిలిచిన కాలంలో మనం నివసిస్తున్నాం. ఆయన కలిగి ఉన్న అధికారం, సమగ్ర భారతీయ దృక్పథాన్ని పరిగణనలోకి తీసుకుంటే నెహ్రూ, ఇందిరల సరసన ఆయనను నిలబెట్టగలం' అని అన్నారు. 'నెహ్రూ, ఇందిర తర్వాత అంతటి అధికార ఆధిపత్యం, ఛరిష్మా, ప్రాంతాలు, కులాలు, భాషలకతీతంగా అపీల్ కలిగిన ప్రధానమంత్రి మరొకరు లేరు' అని గుహా అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీని, బీజేపీని విమర్శించవద్దంటూ తనకు బెదిరింపు ఈమెయిల్స్ వస్తున్నాయని కొన్నిరోజుల కిందట గుహా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
కొత్త పాలకవర్గం తొలి సమావేశం
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వ్యవహారాల పర్యవేక్షణ కోసం ఎంపికైన కొత్త పాలకవర్గం కమిటీ సభ్యులు రెండో రోజే కార్యరంగంలోకి దిగారు. మంగళవారం తొలిసారిగా వినోద్ రాయ్ నేతృత్వంలో ప్యానెల్‌కు చెందిన ముగ్గురు సభ్యులు సమావేశమయ్యారు. అయితే బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో కాకుండా ఐడీఎఫ్సీ బ్యాంకు ఆఫీస్‌లో జరిగిన ఈ భేటీకి చరిత్రకారుడు రామచంద్ర గుహ హాజరుకాలేదు. ‘ఈ సమావేశంలో విశేషమేమీ లేదు. మా పరిచయ కార్యక్రమంతో పాటు బీసీసీఐ నిర్వహణ గురించి మాట్లాడుకున్నాం. త్వరలోనే కార్యాచరణ రూపొందిస్తాం’ అని మాజీ ‘కాగ్’ వినోద్ రాయ్ తెలిపారు. -
బీసీసీఐకి కొత్త బాస్‌లు వచ్చారు
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రోజువారీ కార్యకలాపాలు చూసేందుకు సుప్రీం కోర్టు నలుగురితో ఓ కమిటీ నియమించింది. బీసీసీఐ పాలక మండలి సభ్యులుగా కాగ్ మాజీ చీఫ్ వినోద్ రాయ్, ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ, ఐడీఎఫ్సీ అధికారి విక్రమ్ లిమాయె, మహిళ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ డయానాను నియమించింది. ఈ కమిటీకి వినోద్ రాయ్ సారథ్యం వహిస్తారు. సోమవారం సుప్రీం కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కొత్త కమిటీలో టీమిండియా మాజీ క్రికెటర్లకు కానీ, బోర్డు మాజీ అధికారులకు కానీ స్థానం దక్కలేదు. మాజీ మహిళ క్రికెటర్ డయానాకు చోటు లభించింది. మిగిలిన ముగ్గురు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు. ఈ కమిటీలో కేంద్ర క్రీడల శాఖ మంత్రిని సభ్యుడిగా నియమించాలన్న కేంద్ర ప్రభుత్వ విన్నపాన్ని సుప్రీం కోర్టు తిరస్కరించింది. లోధా కమిటీ చేసిన సిఫారసులను అమలు చేయనందుకు సుప్రీం కోర్టు బీసీసీఐపై కొరడా ఝుళిపించిన సంగతి తెలిసిందే. బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేలను పదవుల నుంచి తొలగించింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఈ కమిటీని నియమించింది. -
రాజకీయాల నుంచి రాహుల్ వైదొలగాలి: గుహ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాజకీయాల నుంచి పదవీ విరమణ తీసుకోవాలని, పెళ్లి చేసుకుని కుటుంబ జీవితం ప్రారంభించాలని ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ వ్యాఖ్యానించారు. అదే అతనికి, భారత్‌కు కూడా మంచిదన్నారు. గుహ ఒక జాతీయ దినపత్రిక ఇంటర్వ్యూలో. నితీష్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్‌లు ప్రత్యామ్నాయ శక్తులుగా ఎదుగుతారంటూ ప్రజలు భావించారని, కానీ వారు నిరాశపరుస్తున్నారని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీని సవాలు చేసే జాతీయ నాయకుడి లోటు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. మరో రెండు దశాబ్దాల పాటు భారత రాజకీయాల్లో ప్రధాన శక్తిగా బీజేపీ చక్రం తిప్పుతుందన్నారు.