![కొత్త పాలకవర్గం తొలి సమావేశం](/styles/webp/s3/article_images/2017/09/5/51485888378_625x300.jpg.webp?itok=LLgUsW_I)
కొత్త పాలకవర్గం తొలి సమావేశం
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వ్యవహారాల పర్యవేక్షణ కోసం ఎంపికైన కొత్త పాలకవర్గం కమిటీ సభ్యులు రెండో రోజే కార్యరంగంలోకి దిగారు. మంగళవారం తొలిసారిగా వినోద్ రాయ్ నేతృత్వంలో ప్యానెల్‌కు చెందిన ముగ్గురు సభ్యులు సమావేశమయ్యారు.
అయితే బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో కాకుండా ఐడీఎఫ్‌సీ బ్యాంకు ఆఫీస్‌లో జరిగిన ఈ భేటీకి చరిత్రకారుడు రామచంద్ర గుహ హాజరుకాలేదు. ‘ఈ సమావేశంలో విశేషమేమీ లేదు. మా పరిచయ కార్యక్రమంతో పాటు బీసీసీఐ నిర్వహణ గురించి మాట్లాడుకున్నాం. త్వరలోనే కార్యాచరణ రూపొందిస్తాం’ అని మాజీ ‘కాగ్’ వినోద్ రాయ్ తెలిపారు.