మళ్లీ వివాదంలో ఇండిగో, చరిత్రకారుడు ఫైర్‌ | Now, noted historian Ramachandra Guha slams IndiGo staff for 'unprovoked rudeness' | Sakshi
Sakshi News home page

మళ్లీ వివాదంలో ఇండిగో, చరిత్రకారుడు ఫైర్‌

Published Mon, Nov 27 2017 11:39 AM | Last Updated on Mon, Nov 27 2017 4:20 PM

Now, noted historian Ramachandra Guha slams IndiGo staff for 'unprovoked rudeness' - Sakshi - Sakshi - Sakshi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : వివాదాలకు ఇండిగో ఎయిర్‌లైన్స్‌ కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. వరసబెట్టి వివాదాల వలయంలో ఆ సంస్థ చిక్కుకుంటోంది. గౌరవించాల్సిన ప్రయాణికులపై ఆ సంస్థ సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా చరిత్రకారుడు రామచంద్ర గుహ, ఇండిగో ఎయిర్‌లైన్‌ స్టాఫ్‌ ప్రవర్తనపై ట్విట్టర్‌లో మండిపడ్డారు. గత వారం రోజులుగా తనకు ఎదురైన పరిస్థితులపై వివరించారు. ఇండిగో ఉద్యోగులు తనతో దురుసుగా ప్రవర్తించారని తెలిపారు. మూడు ఎయిర్‌పోర్టులో ఒకే విమానయాన సంస్థకు చెందిన ముగ్గురు సిబ్బంది తనతో దురుసుగా ప్రవర్తించారని పేర్కొన్నారు.

ఇది నిజంగా చాలా షాకింగ్‌ పరిస్థితి అని ట్వీట్‌ చేశారు. వినియోగదారుల సమస్యలు పరిష్కరించడానికి తాను ట్విట్టర్‌ను వాడనని, కానీ ఈసారి మినహాయింపు ఇచ్చానని, ఏడు రోజుల్లో రెండు సార్లు ఒకే ఎయిర్‌లైన్‌కు చెందిన సిబ్బంది తనతో అమర్యాదగా ప్రవర్తించినట్టు పేర్కొన్నారు. గుహ ట్వీట్లపై ఇండిగో ఇంకా స్పందించలేదు. ఈ ఘటనపై విచారణ జరుపాలని రెగ్యులేటరీ బాడీ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ఈ నెల మొదట్లో కూడా ఇండిగో, ఓ మహిళా ప్రయాణికురాలికి క్షమాపణ చెప్పింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement