Rami Reddy
-
పవన్ కళ్యాణ్ కు వంగా గీతకు తేడా ఇదే
-
చిత్తూరు నుంచి బాలీవుడ్‌నే ఏలిన అంకుశం రామిరెడ్డి ఎలా మరణించారో తెలుసా?
అంకుశం రామిరెడ్డి 1990 కాలం నాటి సినిమాలతో పరిచయం ఉన్న వారికి ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతని పూర్తి పేరు గంగసాని రామిరెడ్డి, చిత్తూరు జిల్లాకు చెందిన వాయల్పాడు నుంచి సినీ పరిశ్రమపై ఎలాంటి అవగాహన లేకుండానే ఆయన ప్రస్థానం మొదలైంది. తెలుగులో అంకుశం చిత్రం ద్వారా నట జీవితాన్ని ప్రారంభించిన ఆయన తన పేరును అంకుశం రామిరెడ్డిగా మార్చుకున్నారు. అతని విలనిజం ఏ రేంజ్లో ఉంటుందంటే ‘అంకుశం’ సినిమా చూస్తే చాలు చెబుతుంది. ఆ సినిమాలో స్పాట్ పెడుతా అనే ఒకే ఒక డైలాగ్‌తో ప్రేక్షకుల మదిలో భయాన్ని నింపాడు. అంత భయానకమైన ఆన్ స్క్రీన్ వ్యక్తి రామి రెడ్డి. భారత దేశంలోని అన్ని భాషల్లో ఆయన నటించారు. బాలీవుడ్లో అమ్రిష్ పూరి, అమ్జాద్ ఖాన్, డానీ డెంజోంగ్పా, గుల్షన్ గ్రోవర్, ప్రేమ్ చోప్రా లాంటి విలన్లకు ఏ మాత్రం తీసిపోడు. అలాంటి అరుదైన నటుడి జీవితం సగంలోనే ముగిసిపోయింది. ఆయన చివరి రోజుల్లో అనుభవించిన అనారోగ్య సమస్యలు మరింత బాధాకరం. రామి రెడ్డి తొలిరోజులు జనవరి 1, 1959న జన్మించిన రామిరెడ్డి. తన కెరియర్ ప్రారంభంలో సినిమా వైపు మొగ్గు చూపలేదు. అతను జర్నలిస్ట్ కావాలనుకున్నాడు. అందుకే హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో మాస్ మీడియా (జర్నలిజం)లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన వెంటనే ఆయన ఒక వార్తాపత్రికలో జర్నలిస్ట్‌గా పనిచేయడం ప్రారంభించారు. అందులో ఆయన సినీ ప్రముఖుల ఇంటర్వ్యూలను తీసుకునేవారు. అలా అతని జీవితం కొనసాగింది. సినిమాల్లో రామిరెడ్డికి బిగ్ బ్రేక్ ఒకరోజు ప్రముఖ తెలుగు దర్శకుడు కోడి రామకృష్ణ ఇంటర్వ్యూ తీసుకోవడానికి రామిరెడ్డి వెళ్లారు. ఆ సమయంలో రామి రెడ్డి టాలెంట్‌ను చూసిన ఆయన ముగ్ధుడయ్యాడు. తనలో సినిమాకు కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయిని గుర్తించి తన రాబోయే చిత్రంలో రామి రెడ్డికి విలన్ పాత్ర అందించాడు. అందుకు రామి రెడ్డి కూడా అంగీకరించారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమానే 1990లో వచ్చిన అంకుశం. ఆ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అదే ఆయన కెరీర్‌ని మలుపు తిప్పింది. ఇదే అంకుశం సినిమాను హిందీలో ప్రతిబంధ్ పేరుతో మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేశారు. ఇందులో కూడా అతను తన పాత్రను తిరిగి పోషించాడు. అక్కడ కూడా ప్రతిబంద్ సూపర్ హిట్ అయింది. ఈ సినిమాతో చిరు కంటే రామి రెడ్డి నటనకు బాలీవుడ్ ఫిదా అయింది. దీంతో అక్కడ ఆయనకు భారీగానే అవకాశాలు వచ్చాయి. రామి రెడ్డి- 90లలో బాలీవుడ్‌కి ఇష్టమైన విలన్ ప్రతిబంధ్ తర్వాత, రామి రెడ్డి వివిధ భాషలలో పనిచేశాడు. కానీ అతను బాలీవుడ్లో కూడా తన పాపులారిటీని కొనసాగించాడు. గుండా (1998), ఖుద్దార్ (1994), శపత్ (1997), వక్త్ హుమారా హై (1994) వంటి చిత్రాలలో అతని నటనకు హీంది ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి-నటించిన వక్త్ హుమారా హైలోని కల్నల్ చికారా పాత్ర కల్ట్ హోదాను పొందింది. రామి రెడ్డి తన కెరీర్లో పలు భాషల్లో 250కి పైగా సినిమాలు చేశారు. 90వ దశకంలో, రామి రెడ్డి బాలీవుడ్లో పాపులర్ ఫేస్‌గా మారారు. అతని ఆకట్టుకునే ఫిల్మోగ్రఫీలో ఆందోళన్ (1995), దిల్వాలే (1994), అంగ్రాక్షక్ (1995), ఎలాన్ (1994) వంటి ప్రముఖ చలనచిత్రాలు ఉన్నాయి. రామి రెడ్డి ఎలా చనిపోయారంటే తన చివరి శ్వాస వరకు ప్రేక్షకులను అలరించాలని రామిరెడ్డి ఆకాంక్షించారు. కానీ దురదృష్టవశాత్తు, 2010లో రామి రెడ్డి ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించింది. అతను కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడని డాక్టర్లు గుర్తించి అతనికి తెలిపారు. క్యాన్సర్ ప్రభావం మూత్రపిండాలపై చూపడంతో మరింత ఇబ్బందులకు గురయ్యాడు. రోజురోజుకు అతని ఆరోగ్యం మరింత దిగజారింది. అతని చివరి రోజుల్లో అతను గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ధైర్యంగా తన సంకల్ప శక్తితో క్యాన్సర్‌తో పోరాడారు. కానీ ఫలితం లేకుండా పోయింది. ఏప్రిల్ 14, 2011 న హైదరాబాద్‌లో రామి రెడ్డి (52) మరణించారు. మరోక భాదకరమైన విషయం ఏమిటంటే కొద్దిరోజుల్లో చనిపోతున్నావని డాక్టర్ల నుంచి ముందే ఆయనకు సమాచారం అందింది. దాంతో అయన మరింత కుంగిపోయాడు. ఒకవైపు భార్య,పిల్లలు ఏమవుతారనే ఆలోచనతో నిత్యం నరకం అనుభవించారని ఆయన సన్నిహితులు ఇప్పటికి కూడా చెబుతుంటారు. అతనికి భార్యతో పాటు, ఒక కుమారుడు,ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం ఆయన కుమారుడు రామిరెడ్డి అనే పేరుతో ఒక స్వీట్ షాప్ నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్నారని సమచారం. -
మరో మిథాలీగా ఎదగాలని ఆ తండ్రి ఆశ.. ‘దంగల్’లో అమీర్‌ఖాన్‌లా రామిరెడ్డి!
U19 Women T20 World Cup- Gongadi Trisha- సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: స్పోర్ట్స్ నేపథ్యంలో వెండితెర మీద విజయఢంకా మోగించిన సినిమాలు ఎన్నో. అందులో ప్రథమ స్థానం రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన దంగల్‌కు దక్కుతుంది. జాతీయ స్థాయిలో ఆడలేకపోయిన మల్లయోధుడు మహవీర్ తన ఇద్దరు కూతళ్లను మల్లయోధులుగా తీర్చిదిద్ది దేశానికి అనేక పతకాలు సాధించేలా ఎంతో శ్రమించాడు. ఆ కష్టాన్ని అమీర్‌ఖాన్, ఫాతిమా సనా, మల్హోత్రాలు వెండితెర మీద కళ్లకు కట్టారు. అచ్చంగా అలాంటి స్ఫూర్తిదాయక జీవితాలు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తారసపడతాయి. గోదావరి తీరాన శ్రీరాముడి పాదల చెంతన త్రిష – రామిరెడ్డిలు మన దంగల్ కథకు ప్రతిరూపాలుగా నిలిచారు. 22 గజాల క్రికెట్ పిచ్‌లో రాణించేందుకు త్రిష సాగించిన, సాగిస్తోన్న గురించి ప్రయాణం ఆమె తండ్రి రామిరెడ్డి మాటల్లో.... నేను హాకీ ప్లేయర్‌ని స్వతహాగా నేను హాకీ ప్లేయర్‌ని. ఆటల్లో నా వారసులు నన్ను మించేలా ఎదగాలని కోరుకున్నాను. ఒక క్రీడాకారుడిగా నా జీవితంలో ఎదురైన అనుభవాల ఆధారంగా నా పిల్లలకు క్రీడల్లో ఎదురయ్యే ఆటంకాలు రాకుండా చూసుకోవాలని వాళ్లు పుట్టకముందే డిసైడ్ అయ్యాను. క్రికెటర్‌ను చేయాలని అప్పటి వరకు ఉన్న ఆటలను పరిశీలిస్తే షటిల్, టెన్నిస్ తదితర గేమ్స్ హైట్ అడ్వాంటేజ్ గేమ్స్. ప్లేయర్లో ఎంత ప్రతిభ ఉన్నా హైట్ సరిగా లేకపోతే ఈ ఆటల్లో రాణించడం కష్టం. అయితే ఎత్తుతో సంబంధం లేని గేమ్స్ ఏంటా అని పరిశీలిస్తే ఫుట్‌బాల్, క్రికెట్లు కనిపించాయి. భద్రాచలంలో ఫుట్‌బాల్ ఆడేందుకు, కోచింగ్ ఇచ్చేందుకు అనుకూలమైన పరిస్థితి లేదు. అదే క్రికెట్ అయితే గల్లీ క్రికెట్ మొదలు భద్రాద్రి కప్ వరకు పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉన్నట్టు అనిపించింది. మిథాలీలా ఎదగాలని.. రెండేళ్ల వయసు నుంచే దీంతో నాకు అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా భవిష్యత్తులో క్రికెట్లో గొప్ప స్థాయికి వెళ్లేలా అండగా నిలవాలని నిర్ణయించుకున్నాను. సాధారణంగా పిల్లలకు ఏడేళ్ల నుంచి ఏదైనా ఆటలో ప్రొఫెషనల్ కోచింగ్ ఇప్పించడం మొదలవుతుంది. కానీ నేను త్రిషాకు నేరు రెండేళ్ల వయస్సు నుంచే ప్రారంభించాను, త్రిష పుట్టిన సమయానికి విమెన్ క్రికెట్లో మిథాలిరాజ్ డబుల్ సెంచరీలతో సంచలనాలు నమోదు చేస్తోంది. వరల్డ్‌కప్ ఆడుతుందని నమ్మాను లేడీ సచిన్‌గా పేరు తెచ్చుకుంటోంది. దీంతో మిథాలీ స్ఫూర్తితో కేవలం రెండేళ్ల వయస్సులో తనకు ఏమీ తెలియనప్పటి నుంచే క్రికెటింగ్ షాట్లు ఆడటం నేర్పిస్తూ వచ్చాను. తనకు తెలియకుండానే అది మజిల్ మెమోరీలో ఇమిడి పోయింది. ఆ మజిల్ మెమొరీ తనకు ఎంతగానో ఉపయోగపడింది. తను ఎదుగుతున్న కొద్దీ ఆటలో ఆ తేడాను బయటి వాళ్లు కనిపెట్టలేకపోయినా నేను పసిపగడుతూ వచ్చాను. దీంతో తనకు ఏదో ఒక రోజు ఇండియా తరఫున విమెన్ క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహించడమే కాదు, కచ్చితంగా వరల్డ్ కప్ కూడా ఆగుతుందనే విశ్వాసం ఉండేది. ఏడేళ్ల వయస్సులో హైదరాబాద్‌కు అడ్వాన్స్, సైంటిఫిక్ కోచింగ్ కోసం త్రిషకు ఏడేళ్ల వయస్సు ఉన్నప్పుడు హైదరాబాద్‌కు షిప్ట్ అయ్యాం. అక్కడ సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీకి వచ్చాం. వాళ్లిద్దరి ప్రత్యేక శిక్షణలో ఇక్కడ, జాన్ మనోజ్ సార్ త్రిష వీడియోను పరిశీలించారు. అప్పుడే వారు తను ఏదో ఒకరోజు ఇండియాకు ఆడుతుందని చెప్పారు. ఆర్ శ్రీధర్, ఇక్బాల్‌లు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. రోజకు ఎనిమిది గంటల పాటు సాధన చేసేది. వారి అంచనాలను నిజం చేస్తూ 16లో దేశానికి ఎంపికైంది. 12 ఇయర్స్‌కి ఛాలెంజర్స్ సిరీస్‌కు సెలక్ట్ అయ్యింది. దీంతో మా నమ్మకం వమ్ము కాదనే నమ్మకం కలిగింది. హ్యపీగా ఉంది నా అంచనాలకు మించి ఏకంగా వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్‌లో మెంబర్‌గా ఉండటమే కాదు ఫైనల్లో విలువైన పరుగులు చేసింది త్రిష. మా కుటుంబం, బంధువులు, కోచ్‌లు, భద్రాచలం పట్టణం అంతా సంతోషంగా ఉన్నాం. త్రిష విజయాన్ని భద్రాచలం పట్టణం అంతా కేక్‌లు కట్ చేసుకుని తమ ఇంటి పండగలా చేసుకోవడం చూస్తే పట్టరాని సంతోషం కలుగుతోంది. తదుపరి లక్ష్యం అదే ప్రస్తుతం అండర్ 19 వరల్డ్ కప్ విన్నింగ్ జట్టులో ఉన్న త్రిష ప్రస్తుతం భావనాస్ కాలేజీలో ఇంటర్మీడియ్ సెకండియర్ (సీఈసీ) చదువుతోంది. రాబోయే రోజుల్లో ఇండియన్ సీనియర్స్ జట్టుకు ఎంపిక కావాలనేది తదుపరి లక్ష్యం. అంతేకాదు విమెన్ వరల్డ్ కప్ జట్టులో తాను ఉండాలి, కప్ కొట్టాలనేది మా కుటుంబం లక్ష్యం. చదవండి: Ind Vs Aus: సెలక్షన్ కమిటీ డోర్లు బాదడం మాత్రమే కాదు.. ఏకంగా! అయినా పాపం IND vs NZ: న్యూజిలాండ్‌తో మూడో టీ20.. టీమిండియాకు గ్రాండ్ వెలకమ్! వీడియో వైరల్ -
మరపురాని కవిసమ్మేళనం.. అయిదారు సార్లు ‘వహ్వా వహ్వాలు’
జనవరి 9, 10 తేదీల్లో ఢిల్లీలో జరిగిన సర్వభాషా కవిసమ్మేళనానికి హాజరు కావటం జీవితంలో మరచిపోలేని జ్ఞాపకం. ఏటా ఆలిండియా రేడియో – భారత ప్రభుత్వం గుర్తింపు పొందిన 22 భాషల నుంచి 23 మందిని (ఒక్క హిందీ భాష నుంచి మాత్రం ఇద్దరు) సెలెక్ట్ చేసి, ఏదో ఒక నగరంలో ఈ సమ్మేళనం ఏర్పాటు చేస్తుంది. ఈ సంవత్సరం ఢిల్లీలో నిర్వహించిన సర్వభాషా కవిసమ్మేళనానికి తెలుగు భాష నుంచి నా కవిత ‘అమృతోపనిషత్’ ఎన్నికైంది. మొదటిరోజు (9వ తేదీ) ఢిల్లీ ఆకాశవాణి సమావేశ మందిరంలో రిహార్సల్స్ చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రసారభారతి ఉన్నతాధికారులు హాజరై ప్రతి కవినీ జ్ఞాపిక, శాలువాలతో సగౌరవంగా సత్కరించారు. రెండోరోజు (10వ తేదీ) తొలుత మూలభాషలో కవిత చదివించి, వెంటనే హిందీ అనువాదం వినిపించారు. ప్రతి కవినీ ఆహ్వానించే ముందు ఆ కవి గురించి హిందీలో పరిచయం చేశారు. నేను సాహిత్యంలో చేసిన కృషి, ప్రచురించిన పుస్తకాలు, చేస్తున్న ఉద్యోగంతో పాటు... మా నాన్న స్మృత్యర్థం స్థాపించిన ‘మువ్వా చినబాపిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్’ తరఫున నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల గురించి కూడా యాంకర్ స్వచ్ఛమైన హిందీలో చెప్పి నప్పుడు నా భావోద్వేగం తారస్థాయికి చేరుకుంది. ఆ పెద్ద హాలులో తెలుగు తెలిసిన ఒక్కరూ లేకపోయినా, నా మట్టుకు నేను సీరియస్‌గా కవితను (ఆలిండియా రేడియో రికార్డింగ్ కోసం) చదివాను. ఆ తర్వాత డాక్టర్ పుష్పాసింగ్ నా కవితకు హిందీ అనువాదం చదివినప్పుడు, మంచి స్పందన వచ్చింది. అయిదారు సార్లు ‘వహ్వా వహ్వాలు’ సభలో సందడి చేశాయి. ఆమె మంచి ఫ్రెండ్ అయ్యారు. ఈ అరుదైన సందర్భంలో అన్ని రాష్ట్రాల కవులతో పాటు ప్రత్యేకించి గోవా, ఈశాన్య రాష్ట్రాల ప్రతినిధులను కలవటం ప్రత్యేక అనుభూతి. వారి అనుభవాల్ని గ్రహించటం సాహిత్యంలో సరికొత్త పాఠాలు నేర్చుకోవటమే. పంజాబీ కవి గురుతేజ్తో ఎక్కువ సమయం వెచ్చించే అవకాశం దొరికింది. ఇండో–పాక్ బోర్డర్లో ఓ కాలేజీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న సింగ్ అనేక విషయాలు నాతో పంచుకున్నారు. కశ్మీరీ కవి డాక్టర్ గులామ్ నబీ హలీమ్ చలాకీగా తిరుగుతూ అందరినీ అల్లుకుపోయాడు. ఈ ఇద్దరూ నా ఇతర కవితల ఆంగ్లానువాదాలు తమకు పంపమని, వాటిని తమ భాషల్లోకి తర్జుమా చేస్తామని అడిగారు. నేను వేదిక దిగగానే ఢిల్లీకి చెందిన మరో ముగ్గురు మహిళలు కూడా ఇదే అభ్యర్థన చేశారు. ఇవి నాకు సరికొత్త ద్వారాలు. నా రూమ్మేట్ అయిన మరాఠీ కవి అనిల్ సబాలే, పక్క గదిలో దిగిన సంథాలీ కవి గౌరు ముర్ము, పోలీస్ డిపార్ట్మెంటులో పనిచేసే మణిపురి కవి క్షేత్రి రాజన్ తదితరులతో ఎక్కువగా చర్చించే అవకాశం దొరికింది. నా సాహిత్యపు డైరీలో కొత్త మిత్రులు చేరారు. నా కవిత 21 భాషల్లోకి తర్జుమా అవుతుందన్న సంతోషం మరింత కిక్కిచ్చే అంశం. ఈ సర్వ భాషా కవిసమ్మేళనం జనవరి 25వ తేదీ రాత్రి 10 గంటలకు అన్ని రేడియో స్టేషన్ల నుంచి ప్రసారమవుతుంది. (క్లిక్ చేయండి: ప్రెస్ – పిక్చర్ – ప్లాట్‌ఫాం!) – ఎమ్వీ రామిరెడ్డి, రచయిత -
అమిత్ షా బర్త్‌డే రోజు ట్రెండ్ అయిన అంకుశం రామిరెడ్డి.. వైరల్ ట్వీట్
RJD MLA Surendra Prasad Yadav Wishes On Amit Shah Birthday: అంకుశం సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. తెలుగు ఇండస్ట్రీలో విలక్షణ నటనతో తనకట్టు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రామిరెడ్డి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. 2011లోనే ఆయన మరణించగా ఇప్పుడు హాట్ టాపిక్ అవ్వడం ఏంటి అనుకుంటున్నారా అయితే ఇది చదవాల్సిందే. వివరాల్లోకెళ్తే.. అక్టోబర్ 22న కేంద్రహోం మంత్రి అమిత్ షా 57వ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు అనేక మంది శుభాకాంక్షలు తెలిపారు. ఆ క్రమంలోనే బీహార్‌కు చెందిన ఆర్జేడీ ఎమ్మెల్యే సురేంద్ర ప్రసాద్ యాదవ్ కూడా 'మన హోం మంత్రి అమిత్‌షాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు' అంటూ ఓ ట్వీట్ చేశారు. అయితే అందులో అమిత్ షా ఫొటోకు బదులు రామిరెడ్డి ఫొటో వాడారు. దీంతో ప్రస్తుతం ఆర్జేడీ ఎమ్మెల్యే ట్వీట్ వైరల్‌గా మారింది. ఫొటోను గుర్తించిన నెటిజన్లు దీనిపై పలు రకాలుగా స్పందిస్తున్నారు. Happy Birthday to our Home Minister @AmitShah Ji. 🙏🏻😌 pic.twitter.com/fPDoBo62x7 — Surendra Prasad Yadav (@iSurendraYadav) October 22, 2021 అయితే ఇది పొరపాటున జరిగినట్లు అందరూ భావిస్తున్న తరుణంలో ఆర్జేడీ ఎమ్మెల్యే మరో ట్వీట్ చేశారు. 'క్షమించండి.. ఉపఎన్నికల ప్రచారంలో ఉండి ఈ విషయాన్ని సరిగా చూసుకోలేదు.. మన అద్భుతమైన మోటా బాయ్‌కి జన్మదిన శుభాకాంక్షలు' అంటూ తమిళ విలన్ సంతాన భారతి ఫొటో పెట్టి మరోసారి అమిత్ షాకి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ఇదంతా సురేంద్ర ప్రసాద్ యాదవ్ కావాలనే చేసినట్లు నెటిజన్లకు అర్థమైపోయింది. I beg your pardon! Made a blunder in the midst of the hectic campaign of By-election. Happy Birthday to our amazing Mota Bhai! 🎂💐 :) https://t.co/dtevrJIqEL pic.twitter.com/wWz0WGmgPE — Surendra Prasad Yadav (@iSurendraYadav) October 22, 2021 -
ఇటలీ కంపెనీతో టెక్నో పెయింట్స్ జోడీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెయింట్స్ తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ టెక్నో పెయింట్స్ తాజాగా ఇటలీ సంస్థతో చేతులు కలిపింది. ఇటలీ సంస్థ సాంకేతిక సహకారంతో సూపర్ ప్రీమియం పెయింట్ల తయారీలోకి అడుగుపెట్టనుంది. ఇందుకోసం కొత్త ప్లాంటుకు రూ.75 కోట్లు వెచ్చించనున్నట్టు టెక్నో పెయింట్స్‌ను ప్రమోట్ చేస్తున్న ఫార్చూన్ గ్రూప్ ఫౌండర్ ఆకూరి శ్రీనివాస్ రెడ్డి మంగళవారం తెలిపారు. ప్రస్తుతం కొన్ని కంపెనీలు మాత్రమే సూపర్ ప్రీమియం పెయింట్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకుని దేశంలో విక్రయిస్తున్నాయి. తాము మాత్రమే ఈ విభాగంలోకి ఎంట్రీ ఇస్తున్నట్టు ఆయన వెల్లడించారు. నూతన తయారీ కేంద్రంలో.. కంపెనీ 6వ ప్లాంటును హైదరాబాద్ పటాన్చెరు సమీపంలోని చేర్యాల్ వద్ద స్థాపిస్తోంది. దీని వార్షిక సామర్థ్యం 2 లక్షల మెట్రిక్ టన్నులు. 200 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఇక్కడ సూపర్ ప్రీమియం కోటింగ్స్, హై ఎండ్ లగ్జరీ ఎమల్షన్స్, డెకోరేటివ్ పెయింట్స్, స్పెషల్ టెక్స్చర్ ఫినిషెస్, లగ్జరీ, అల్ట్రా లగ్జరీ ఎమల్షన్స్, డిజైనర్ ఫినిషెస్ తయారు చేస్తారు. ఇరవయ్యేళ్ల ప్రయాణంలో.. టెక్నో పెయింట్స్ ఆగస్ట్ 25న రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంటోంది. 650 ప్రాజెక్టులను పూర్తి చేసింది. చేతిలో 120 ప్రాజెక్టులు ఉన్నాయి. ఆర్డర్ బుక్ రూ.600 కోట్లుంది. హైదరాబాద్‌లో పెయింటింగ్ సేవల్లో అగ్ర స్థాయిలో ఉన్న టెక్నో పెయింట్స్ 2021–22లో టర్నోవర్‌లో 50 శాతం వృద్ధి ఆశిస్తోంది. ఇక నుంచి చిన్న ప్రాజెక్టులను సైతం చేపట్టనుంది. కస్టమర్ల నమ్మకంతోనే విజయవంతంగా రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్నామని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. -
మాజీ ఎమ్మెల్యే అవుతు రామిరెడ్డి కన్నుమూత
కొల్లిపర (తెనాలి): గుంటూరు జిల్లా దుగ్గిరాల మాజీ శాసనసభ్యుడు అవుతు రామిరెడ్డి (86) సోమవారం సాయంత్రం కన్నుమూశారు. కరోనా సోకిన ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు ఆయన అల్లుడు గుదిబండి చిన్న వెంకటరెడ్డి తెలిపారు. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కొల్లిపరలోని రామిరెడ్డి కుటుంబసభ్యులను కలసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. దుగ్గిరాల, ఈమనిలో ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. అవుతు రామిరెడ్డి 1967–72లో ఎమ్మెల్యేగా, 1981–86 కాలంలో ఈమని సమితి అధ్యక్షుడిగా సేవలందించారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన మృతికి దుగ్గిరాల మాజీ ఎమ్మెల్యే మర్రెడ్డి శివరామకృష్ణారెడ్డి, అవుతు కృష్ణారెడ్డి, భీమవరపు సంజీవరెడ్డి, జొన్నల శివారెడ్డి, కళ్లం వీరారెడ్డి, భీమవరపు శివకోటిరెడ్డి, ఆరిగ చంద్రారెడ్డి, ఈమని హరికోటిరెడ్డి తదితరులు సంతాపం తెలిపారు. చదవండి: రిటైర్డ్ హెడ్మాస్టర్ కోటయ్య మృతి -
అక్షర యోధుడు రాంరెడ్డి ఇక లేరు..
సాక్షి, విద్యారణ్యపురి : అచ్చంగా తెలంగాణ రాష్ట్రం కోసమే అక్షర సేద్యం చేసిన ప్రముఖ కవి, హన్మకొండలోని ప్రభుత్వ పింగిళి డిగ్రీ కళాశాల ఇంగ్లిష్ విభాగం రిటైర్డ్ అధ్యాపకులు వెలపాటి రాంరెడ్డి(89) కన్నుమూశారు. బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న ఆయన బుధవారం హన్మకొండ కనకదుర్గకాలనీలోని తన స్వగృహంలో మృతి చెందారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రేగుల గ్రామంలో 1932 నవంబర్ 4న కేశవరెడ్డి, చిలకమ్మ దంపతులకు జన్మించిన ఆయన ఇంగ్లిష్ అధ్యాపకుడిగా కొనసాగుతూనే ప్రవృత్తిగా తెలుగు సాహిత్యంలో ఎన్నో రచనలు చేశారు. పుస్తకాలు రాయడమే కాకుండా తెలుగు కవుల సమ్మేళనాల్లో భాగస్వాములయ్యేవారు. కాగా, రాంరెడ్డి రాసిన తెలంగాణ సాయుధ పోరాటం గ్రంథం ఎంతో ప్రాచుర్యం పొందింది. తెలంగాణ కావ్యం, వీరతెలంగాణ, వెలుగు నీడలు, తెలంగాణ పద్యమంజరి, కోటిగాయాల మౌనం తెలంగాణ, తెలంగాణ నడుస్తున్న చరిత్ర, నవశకం వంటి అనేక పుస్తకాలను తెలంగాణ నేపథ్యంలోనే ఆయన రచించి ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. కాగా, ఏడో తరగతి తెలుగు వాచకంలో మన శిల్పారామం రామప్ప, ఇంటర్ తెలుగు వాచకంలో ఓ కావ్యంగా ఆయన రచనలు పాఠ్యాంశాలుగా ప్రచురించారు. తెలంగాణ ఏర్పడ్డాక ప్రభుత్వం నుంచి అవార్డు అందుకున్న రాంరెడ్డి మృతిపై హన్మకొండలోని సాహిత్య సాంస్కృతిక సంస్థ బాధ్యులు గిరిజ మనోహరబాబు, డాక్టర్ ఎన్వీఎన్.చారి, వనం లక్ష్మీకాంతారావు, కృష్ణమూర్తి తదితరులు సంతాపం ప్రకటించారు. చదవండి: జర్నలిస్టులకు వ్యాక్సినేషన్: సీఎంకు ప్రెస్‌క్లబ్ కృతజ్ఞతలు -
చలికాలంలో చుక్కలే..!
సాక్షి, హైదరాబాద్: కరోనా రోగుల్లో లక్షణాలు, మరణాల సంఖ్యను చూస్తే వైరస్ తీవ్రత పెరగడంలేదని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగని తీవ్రత తగ్గిందని నిర్ధారణ జరగలేదంటున్నారు. ఇప్పటివరకు వైరస్ 15 రకాలుగా రూపాంతరం చెందింది. కానీ వాటి మధ్య 99.9 శాతం సారూప్యత ఉండటం వల్లే (అత్యంత తక్కువ తేడా) ఈ గందరగోళమని అమెరికాలోని టెక్సాస్ హెల్త్ రిసోర్సెస్‌లో కీలక బాధ్యతల్లో ఉన్న ప్రముఖ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ బూచిపూడి రామిరెడ్డి అంటున్నారు. అలాగే చలికాలంలో కరోనా మహమ్మారి మరింతగా విజృంభించడం ఖాయమని, అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. కరోనాకు సంబంధించి పలు తాజా అంశాలపై ఆయన సాక్షికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. సాక్షి: కరోనా రెండో దశ మొదలైందని అనుకోవచ్చా? డాక్టర్ రామిరెడ్డి: మనం ఇంకా మొదటి దశలోనే ఉన్నాం. రెండో దశ అంటే.. మొదటి దశలో వైరస్ గణనీయంగా తగ్గిపోయి, తిరిగి మళ్లీ రెండోసారి పుంజుకోవడం. స్వైన్ ఫ్లూ ఎలాగో ఇది కూడా శాశ్వతంగా ఉంటుందనేది శాస్త్రవేత్తల అంచనా. వైరస్ చలికాలంలో విజృంభిస్తుందా? తప్పకుండా విజృంభిస్తుంది. ఇప్పుడు అందరూ భయపడేది అదే. అమెరికాకు చెందిన వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం (సీడీసీ) ఇప్పటికే ఈ విషయాన్ని స్పష్టంగా ప్రకటించింది. అమెరికాలో ఈ నెల రెండో వారం నుంచే శీతాకాలం ప్రారంభమైంది. దీంతో ఈ ఐదారు రోజుల్లోనే అక్కడ కరోనా కేసుల్లో పెరుగుదల 13 శాతం ఉంది. ఇండియాలో కేసులు పెరుగుతున్నాయి. కానీ జనం వదిలేశారు. వచ్చే శీతాకాలంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. కొందరిలో నెలల తరబడి వీక్నెస్ ఉండటానికి కారణమేంటి? మూడు నెలల తర్వాత కూడా నీరసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే దాన్ని ‘పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్’అని పేరు పెట్టారు. అయితే ఇవి సహజంగా చాలామందిలో ఉంటున్నాయి. ఇటువంటి వారు మంచి ఆహారం తీసుకోవాలి. వ్యాయామం చేయాలి. పొగతాగడాన్ని నిలిపివేయాలి. జంతువులకు కరోనా సోకుతుందా? కుక్క నుంచి మనుషులకు కరోనా వ్యాపించిన కేసు న్యూయార్క్‌లో నమోదైంది. కుక్కలు, పిల్లుల నుంచి మనుషులకు కరోనా వ్యాపించే అవకాశం ఉంది. అలా వైరస్ రూపాంతరం చెందుతుందని అనుకోవచ్చు. కోళ్లు, పందులకు మాత్రం కరోనా వ్యాపించదని తేలింది. ఇక ఆహారం, నీరు, ఇతర జంతువుల ద్వారా కరోనా రాదు. కరోనా వచ్చినవారు ఇంట్లో కుటుంబ సభ్యులతో పాటు పెంపుడు కుక్కలు, పిల్లులకు దూరంగా ఐసోలేషన్‌లో ఉండాలి. కరోనా వచ్చినవారికి స్టెరాయిడ్స్ ఏ పరిస్థితుల్లో వాడాలి? ప్రస్తుతం రెమిడిసివీర్, స్టెరాయిడ్స్ మాత్రమే ప్రభావవంతంగా పనిచేస్తున్నాయి. లక్షణాలు వచ్చి ఆక్సిజన్ తగ్గుతున్న సమయంలో రెమిడిసివీర్ పనిచేస్తుంది. స్టెరాయిడ్స్ వాడటం వల్ల మరణాల రేటు తగ్గుతుంది. ఇక హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలతో ఎలాంటి ప్రయోజనం లేదని తేల్చారు. కరోనా రీ–ఇన్ఫెక్షన్ ను ఎలా నిర్ధారించాలి? హాంకాంగ్‌లో ఒక కేసు... ఇండియాలో ఇటీవల ఆరు కేసుల్లో రీ–ఇన్ఫెక్షన్ను గుర్తించారు. మొదటిసారి వచ్చిన వైరస్ ఆర్ఎన్ఏ (జన్యుపదార్థం), రెండోసారి వచ్చిన వైరస్ ఆర్ఎన్ఏకు భేదం ఉన్నట్లు వైరాలజీ పరీక్షలో గుర్తిస్తేనే రీ–ఇన్ఫెక్ట్ అయినట్లు లెక్క. కొందరిలో డెడ్ వైరస్ ఉండటం లేదా వచ్చిపోయాక అత్యంత తక్కువగా వారిలో వైరస్ ఉంటుంది. అప్పుడు కూడా కరోనా పాజిటివ్ చూపిస్తుంది. ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్‌లో లోపం ఎక్కడ జరిగింది? ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్స్ సమయంలో సంబంధిత వ్యక్తులకు న్యూరాలజీ ప్రాబ్లమ్స్ వచ్చాయి. రెండు కాళ్లు చచ్చుపడిపోయే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ట్రయల్స్‌ను మళ్లీ ప్రారంభించారు. వ్యాక్సిన్ రావడానికి ఎన్నాళ్లు పడుతుంది? గవదబిళ్లల వ్యాక్సిన్‌కే నాలుగేళ్లు పట్టింది. ఇదే వైద్య చరిత్రలో వేగంగా అభివృద్ధి అయిన వ్యాక్సిన్ . మిగిలినవన్నీ ఎక్కువ సమయం పట్టాయి. కరోనా వ్యాక్సిన్ రావడానికి ట్రయల్స్ మొదలైనప్పటి నుంచి ఏడాది నుంచి ఏడాదిన్నర సమయం పడుతుంది. రష్యా తీసుకొచ్చిన స్పుత్నిక్ వ్యాక్సిన్ ప్రభావంపై అనుమానాలు ఉన్నాయి. అభివృద్ధి చెందుతున్న, చెందని దేశాలు మాత్రమే దీన్ని తీసుకుంటున్నాయి. హెర్డ్ ఇమ్యూనిటీని నమ్ముకోవచ్చా? హెర్డ్ ఇమ్యూనిటీ అంటే 60–70 శాతం జనానికి వైరస్ వస్తేనే సాధ్యం. అమెరికాలో 3–4 శాతం మందికే వైరస్ వచ్చింది. ఇతర దేశాల్లోనూ ఇలాగే. ఈ పరిస్థితుల్లో హెర్డ్ ఇమ్యూనిటీ ఎలా సాధ్యం? హెర్డ్ ఇమ్యూనిటీ రావాలంటే వ్యాక్సినేషన్ తోనే జరగాలి. అందరినీ వదిలేస్తే హెర్డ్ ఇమ్యూనిటీ వస్తుందని అనుకోవడం సరికాదు. ఇక స్కూళ్లు, కాలేజీలు తెరవకపోవడమే మంచిది. గర్భిణులకు వైరస్ సోకితే ఎటువంటి సమస్యలు వస్తాయి? సాధారణంగా 38–40 వారాల్లో డెలివరీ కావాల్సింది, వైరస్ వచ్చినవారికి 35–36 వారాల్లోనే డెలివరీ అవ్వొచ్చు. ఇక తల్లికి కరోనా వస్తే బిడ్డకు వస్తుందా.. లేదా.. అనే దానిపై స్పష్టత లేదు. -
దైవీయత కంటే మానవీయతకే ప్రాధాన్యం
ప్రతిధ్వనించే పుస్తకం ‘సాహిత్యశాస్త్రం ఇతర శాస్త్రాలతో సంబంధం లేని స్వయం సమగ్ర శాస్త్రంగా ఆలంకారికుల నుంచి ఆధునిక విమర్శకుల దాకా చాలామంది భావించారు. దీనివల్ల సాహిత్య శాస్త్ర పరిధి సంకుచితమై, అభివృద్ధి మందగించింది’. కానీ డాక్టర్ పాపినేని శివశంకర్ మాత్రం ఇతర సామాజిక శాస్త్రాల వెలుగులో సాహిత్యాన్ని పరిశీలించారు. తత్వశాస్త్రం, చరిత్ర, సామాజిక శాస్త్రం, మొదలైన శాస్త్ర సాధనాల్నీ, పరిభాషనీ గ్రహించి విలువైన ప్రతిపాదనలు చేశారు. నాగార్జున విశ్వవిద్యాలయానికి సమర్పించిన సిద్ధాంత వ్యాసానికి పుస్తక రూపమే ఈ ‘సాహిత్యం– మౌలిక భావనలు’. ద్వితీయ వాస్తకవికత అంటే ఏమిటి? పరాయితనం ఎలా మొదలైంది? ఉత్పత్తి శక్తుల, ఉత్పత్తి సంబంధాల మధ్య ఘర్షణ ఎలాంటిది? కళా వాస్తవికత, భావనా వాస్తవికతల మధ్య తేడాలేమిటి? ఈ క్రమంలో మనిషికి అసలు కళ ఎందుకు అవసరమైంది? అందులోంచి సాహిత్యం ఎలా పుట్టుకొచ్చింది? ఎలా విస్తరించింది? ఏయే పాయలుగా ప్రవహించింది? ఇలా అనేక ప్రశ్నలకు సమాధానాలను ఆసక్తికరంగా ఆవిష్కరిస్తారు. జీవిత సాహిత్య దృక్పథం, స్థలకాల బద్ధత, చారిత్రక నియతి, సాహిత్య చలనం, వర్తమానత, గతాగత సంబంధం, అధిచారిత్రక లక్షణం, సాంతత, పాక్షికత్వం తదితర అంశాల ద్వారా ‘సాహిత్య పరిధి’ని నిర్వచిస్తారు. ‘సాహిత్యానికి కేంద్ర బిందువు’ను కనిపెట్టడంలో భాగంగా దైవ–మానవ శక్తుల, నమ్మకాల గురించి కూలంకషంగా చర్చించారు. సాహిత్యంలోగానీ, జీవితంలోగానీ తారసిల్లే దైవాంశని తిరస్కరించే వీలు లేదు. అయితే సాహిత్యంలో దైవీయత కంటే మానవీయతకే ప్రాధాన్యం ఉండాలని ప్రతిపాదిస్తారు. ‘జీవితంలోని సాఫల్య వైఫల్యాలు, వినోద విషాదాలు, చీకటి వెలుగులు సాహిత్యంలో ఆవిష్కరించబడా’లంటారు. రెండు దశాబ్దాల క్రితం ప్రచురితమైన ఈ అయిదు అధ్యాయాల పుస్తకంలో చాలాచోట్ల మార్క్స్ దృక్కోణం నుంచి చేసిన పరిశీలన సాహిత్యపు మూలాల్ని పట్టిస్తుంది. - ఎమ్వీ రామిరెడ్డి -
రౌడీయిజం చేస్తున్న టీడీపీ నాయకులు
నెల్లూరు, కావలి: దగదర్తి మండలంలో పేదల భూములను, ఇళ్ల స్థలాలను అక్రమంగా స్వాధీన పరచుకోవడానికి టీడీపీ నాయకులు పేదల ప్రజలపై రౌడీయిజం చేస్తున్నారని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. దగదర్తి తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం పెద్ద ఎత్తున తరలివచ్చిన అర్జీదారుల నుంచి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి వివిధ సమస్యలపై వినతి పత్రాలను స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే రామిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ గ్రీవెన్స్‌డే రోజున తహసీల్దార్ ఉండరన్నారు. జిల్లాలో ఎక్కడా లేనివిధంగా దగదర్తి మండలంలో టీడీపీ నాయకులు ప్రజల భూములపై రాబందుల్లా పడుతున్నారన్నారు. ప్రజల ఆస్తులైన భూములు, ఇంటి స్థలాలను టీడీపీ నాయకులు అక్రమంగా స్వాధీనం చేసుకుంటున్నప్పటికీ తహసీల్దార్, సిబ్బంది టీడీపీ గూండాలకే సహకరిస్తుండటం సిగ్గుచేటన్నారు. బాధిత ప్రజలు అధికారులకు వద్దకు వస్తే, పని కావాలంటే టీడీపీ నాయకులను కలవాలని చెబుతున్నారని ఇంతకన్నా అధికార వ్యవస్థకు సిగ్గుమాలిన పని ఉందా అని ప్రశ్నించారు. హైకోర్టు ఉత్తర్వులు ఉన్నా ఖాతరు చేయకుండా టీడీపీ నాయకులు కొందరు కార్యకర్తలతో వెళ్లి నిర్మాణంలో ఉన్న ఇంటిని కూడా కూల్చేశారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దగదర్తి మండలంలో భూకబ్జాలు చేసిన టీడీపీ నాయకుల బాగోతాన్ని పూర్తి స్థాయిలో వెలికి తీస్తామన్నారు. బీద, మాలేపాటి సోదరులు మండలంలో భూకబ్జాలకు పాల్పడుతున్నారన్నారు. గ్రావెల్ దోపిడీ, భూకబ్జాలపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పి మూడు వారాలు గడిచిపోయినప్పటికీ చర్యలు తీసుకోలేదన్నారు. మాలేపాటి సోదరులు ఒక్క భూకబ్జాలే కాకుండా ఇరిగేషన్ శాఖ ద్వారా నిధులను కూడా స్వాహా చేస్తూనే తాము ఉచితంగా చేస్తున్నట్లుగా బుద్ధిలేని మాటలు చెబుతున్నారన్నారు. దగదర్తి మండలంలో మాలేపాటి సోదరులు తమకు చంద్రబాబు రూ.80 లక్షలు ప్రత్యేకంగా ఇచ్చి పనులు చేసుకోమన్నారని చెబుతున్నారని తెలిపారను. మాలేపాటి సోదరుల దోపిడీని ప్రశ్నిస్తున్న వారిపై రౌడీయిజం చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యేతో పాటు వెఎస్సార్సీపీ నాయకులు తాళ్లూరు ప్రసాద్ నాయుడు, పార్టీ మండల యువజన విభాగం అధ్యక్షుడు వెలినేని మహేష్‌నాయుడు, శాఖ మూరి వెంకటకృష్ణమనాయుడు, కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, గంథం ప్రసన్నాంజనేయులు, కుందుర్తి కామయ్య ఉన్నారు. -
కుట్ర రాజకీయం
కుట్ర రాజకీయాలకు అధికార పార్టీ తెరతీసింది. ప్రశాంతంగా ఉన్న జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా అధికార దర్పంతో పల్లెల్లో విషసంస్కృతికి బీజం వేస్తోంది. ముఖ్యంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకొని పోలీసు బలప్రయోగంతో అణిచివేసే కార్యక్రమాలకు పూనుకుంది. ప్రజాప్రతినిధుల హక్కులను కాలరాస్తోంది. మంగళవారం ఆత్మకూరు నియోజకవర్గంలోని చేజర్ల మండలంలోనూ, ఇటీవల కావలి నియోజకవర్గం అల్లూరు మండలంలో కూడా ఇదే తరహా తతంగం నడిపారు. దీనికి స్పందించి కనీసం మాట్లాడాల్సిన ఉన్నతాధికారులు కూడా మంత్రుల ఒత్తిడితో ముఖం చాటేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఆత్మకూరు నియోజకవర్గం చేజర్ల మండలంలోని మాముడూరు, నడిగడ్డ అగ్రహారంలో స్థానిక ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి మంగళవారం పర్యటన షెడ్యూల్‌ను సిద్ధం చేసుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా సర్పంచ్ల పదవీ కాలం చివరిరోజు కావడంతో పూర్తయిన పనులు అన్ని ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేతో ప్రారంభింపజేసేందుకు అంతా సిద్ధం చేశారు. పంచాయతీరాజ్ అధికారులు కూడా ఎమ్మెల్యేను ఆహ్వానించడంతోపాటు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేశారు.అయితే ఎమ్మెల్యే గౌతమ్‌రెడ్డి పాల్గొనే కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ఆదివారం సాయంత్రం అధికారపార్టీ నేతలు వ్యూహం రచించినట్టు తెలిసింది. పంచాయతీరాజ్ ఏఈ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ఉన్నతాధికారుల అనుమతిలేదని, ఎమ్మెల్యే కార్యక్రమాలను అడ్డుకోవాలని పోలీసులకు లేఖ ఇచ్చి అదృశ్యమయ్యాడు. ఇదేమని అడిగేందుకు యత్నించినా ఫోనుకు సైతం అందుబాటులోకి లేకుండా పోయాడు. పోలీస్ బలగాలతో అడ్డగింత ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఎమ్మెల్యే గౌతమ్‌రెడ్డి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు గ్రామాలకు వెళ్లే క్రమంలో డీఎస్పీ రామాంజనేయులురెడ్డి భారీగా పోలీసు బలగాలతో వచ్చి అడ్డుకోవడానికి యత్నించారు. ప్రారంభోత్సవాలు చేయడానికి ఉన్నతాధికారుల నుంచి అనుమతి లేదని చెప్పి వెళ్లిపోవాలని ఎమ్మెల్యేను కోరారు. అయితే తాను పర్యటించటానికి కూడా ఆంక్షలు విధించడం సరికాదంటూ ఎమ్మెల్యే గట్టిగా చెప్పి గ్రామంలో పర్యటించారు. కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గ్రామం కావడం, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే కావడంతోనే అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో అడ్డుకునే యత్నం చేశారు. వాస్తవానికి 14వ ఆర్థిక సంఘం నిధులు, ఎంపీ నిధులు, గ్రామ పంచాయతీ నిధులు, ఇతర ప్రభుత్వ నిధులతో జరిగే ప్రారంభోత్సవాలకు ప్రజాప్రతినిధిని పోట్రోకాల్ ప్రకారం ఆహ్వానించాల్సిఉంది. అయితే అంతా చేసి అనుమతి లేదని అడ్డుకోవడంపై తీవ్ర విమర్శలు రేగుతున్నాయి. నిబంధనల ప్రకారం 14వ ఆర్థిక సంఘం నిధులతో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు స్థానిక సర్పంచ్‌లే చేయాలనే నిబంధన ఉంది. అలాగే తాజా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి నిధులు రూ.14 లక్షలతో నిర్మించిన 11 కేవీ సబ్‌స్టేషన్‌ను, రూ.5 లక్షల పంచాయతీ నిధులతో నిర్మించిన వాటర్ ప్లాంట్‌ను కూడా ఎమ్మెల్యే ప్రారంభించకుండా ముందే అడ్డుకోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రతిపక్ష ఎమ్మెల్యే అనే రాజకీయ కుట్ర గడిచిన నాలుగేళ్లలో ఆత్మకూరు నియోజకవర్గంలో ఎలాంటి ఇబ్బందికర పరిణామాలు చోటుచేసుకోలేదు. అయితే తాజాగా అధికార పార్టీ ఆత్మకూరులో గందరగోళంగా ఉండటంతో మంత్రి నారాయణ, మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్య, కన్నబాబు ఇలా అందరూ నియోజకవర్గంలో హడావుడి చేస్తున్న క్రమంలో ఎమ్మెల్యే గౌతమ్‌రెడ్డికి పేరు రాకుండా అడ్డుకునే కుట్రకు తెరతీశారు. మంత్రి నారాయణ నుంచి ఉన్నతాధికారులకు ఫోన్లు రావడం, కార్యక్రమం సిద్ధం చేసిన అధికారులతోనే ఫిర్యాదు ఇప్పించి హక్కుల్ని కాలరాశారు. సర్పంచ్ల పదవీ కాలం మంగళవారంతో ముగిసిన క్రమంలో తమ హయాంలో చేసిన పనులు కూడా తాము చేశామని చెప్పుకోవటానికి వీలు లేకుండా ఇన్చార్జ్ మంత్రులు, మంత్రి నారాయణ ప్రారంభించాలనే నెపంతో ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్య సొంత గ్రామం కావడంతోనే ఈ తతంగం అంతా నడిచిందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదే తరహాలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిని కూడా అల్లూరు మండలంలోని ఇస్కపల్లి గ్రామంలో పర్యటించకుండా గత నెల రోజులుగా పోలీసుల బలప్రయోగంతో వేధిస్తున్నారు. అధికార పార్టీ నేతలు బీద సోదరుల స్వగ్రామం కావడంతో అక్కడ పర్యటించకుండా పోలీసులతో అడ్డుకుంటున్నారు. వీటిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాపోరాటానికి సన్నద్ధమవుతోంది. -
మూడుసార్లు ఓడిపోయాం.. టీడీపీలో కలకలం
సాక్షి, గుంటూరు: అధికార తెలుగుదేశం పార్టీలో విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ టీడీపీలో కలకలం రేగింది. టీడీపీ అధిష్టానంపై నరసరావుపేట మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పులిమి రామిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. మూడేళ్లుగా నియోజకవర్గ ఇన్‌ఛార్జిని ప్రకటించకపోవడంపై ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ నిర్లక్ష వైఖరికి నిరసనగా రేపటి (శనివారం) నుంచి ఆమరణ నిరాహారదీక్షకు కూర్చుంటానని ప్రకటించారు. ఎంపీ నిధులతో జరిగే అభివృద్ధిని కొందరు అడ్డుకుంటున్నారని, నిజమైన టీడీపీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని రామిరెడ్డి వాపోయారు. నియోజకవర్గానికి ఇన్‌ఛార్జిను నియమించాలని అధిష్టానానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. నరసరావుపేటలో టీడీపీ వరుసగా మూడుసార్లు ఓటమిని చవి చూసింది.. ఇకనైనా పార్టీ అధిష్టానం స్పందించి పార్టీ బలోపేతానికి చర్యలు చేపట్టాలని పులిమి రామిరెడ్డి కోరారు. -
టీడీపీ నేతపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు
మంత్రాలయం మండలం మాధవరం టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ రామిరెడ్డిపై మంత్రాలయం పోలీస్‌స్టేషన్‌లో స్థానిక తహశీల్దార్ వర్మ ఫిర్యాదు చేశారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్నాడని మంత్రాలయం తహశీల్దార్ వర్మ, కొందరి ట్రాక్టర్లకు జరిమానా విధించాడు. ఈ విషయం తెలిసి సంఘటనాస్థలానికి చేరుకున్న మాజీ ఎంపీపీ రామిరెడ్డి తహశీల్దార్‌పై దురుసుగా ప్రయత్నించి దాడికి యత్నించాడు. దీంతో తహశీల్దార్ వర్మ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. -
బైక్ కొనివ్వలేదని..
ఎన్నిసార్లు అడిగినా.. తల్లిదండ్రులు కొత్త బైక్ కొనివ్వకపోవడంతో.. మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం నల్లరాళ్లపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రామిరెడ్డి(21) డిగ్రీ చదువుతున్నాడు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న పాత బైక్ కళాశాలకు తీసుకెళ్లాలంటే నామోషీగా ఉందని.. కొత్త బైక్ కొన్నివ్వాలని గత కొన్ని రోజులుగా తల్లిదండ్రులను అడుగుతున్నాడు. దీనికి వారు అంగీకరించకపోవడంతో.. మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పులిపాడులో మొసలి కలకలం
గుంటూరు జిల్లా గురజాల మండలలోని పులిపాడు గ్రామంలో మొసలి కలకలం రేపిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. పులిపాడు గ్రామ సరిహద్దులో బ్రిడ్జి దగ్గర కొన్నిరోజుల నుంచి ముసలి సంచరిస్తూ కోతులను, లేగదూడలను తింటున్నట్లు గ్రామస్తులు గుర్తించారు. అనంతరం అటవీ శాఖకు సమచారం అందించడంతో ఆ శాఖ అధికారులు స్థానికుడు జమ్మిగుంపుల రాంబాబు సహకారంతో జేసీబీ ద్వారా తవ్వించారు. వాగుకట్టలో 25 అడుగుల సొరంగంలో మొసలి బయట పడింది. మెసలిని చూసేందుకు చుట్టుపక్కల గ్రామస్తులు అధికసంఖ్యలో తరలి వచ్చారు. మొసలిని పట్టుకొని దగ్గరలో ఉన్న కృష్ణానదిలో వదిలిపెడతామని ఫారెస్టు రేంజ్ అధికారి కె.రామిరెడ్డి తెలిపారు. ఫారెస్టు డిఫ్యూటిరేంజ్ అధికారి జి.రాజశేఖర్ గౌడ్, ఫారెస్టు బీట్ అధికారి ఆర్వీఎస్ తిరుపతిరావు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
‘దీక్షా’దక్షుడు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రైతు దేశానికి వెన్నెముక. అటువంటి రైతు సాగునీరందక పంటలు ఎండి దీనస్థితిలో ఉన్నాడు. వారిని ఆదుకోవాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి నడుం బిగించారు. సాగు, తాగునీరు అందించటమే ప్రధాన లక్ష్యంగా ఉద్యమ బాటపట్టారు. మాజీ ఎమ్మెల్యేలు కొండపనాయుడు, యానాదిరెడ్డిని ఆదర్శంగా తీసుకున్నారు. ప్రస్తుతం వేలాది ఎకరాల్లో పంటలు చివరి దశలో ఉన్నాయి. ఒక్క తడి పారితే పంటలు చేతికొచ్చే పరిస్థితి. ఎలాగైనా పంటలను చేతికందించాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి మూడు రోజులపాటు నిరాహారదీక్షకు శ్రీకారం చుట్టారు. చివరి దశలో ఉన్న పంటలకు సాగునీరందించటంతో పాటు వేసవిలో తాగునీటి కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. కావలి ఏరియా ఆసుపత్రి సెంటర్లో ప్రజలు, ప్రజాప్రతినిధుల సమక్షంలో గురువారం దీక్ష చేపట్టారు. కావలి వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి ఎడ్లబండిపై ర్యాలీగా దీక్షా వేదిక వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డికి ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, కిలివేటి సంజీవయ్య, మాజీ ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, సీపీఎం నేతలు, రైతు సంఘం నాయకులు, మహిళలు, ఉద్యోగులు, కార్మికులు, కళాకారులు సంఘీబావం తెలిపారు. ఎమ్మెల్యే నిరాహారదీక్ష చేస్తున్నారని తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కావలికి తరలిరావటం కనిపించింది. వచ్చిన వారంతా ఎమ్మెల్యేకు పూలమాలలు వేసి అభినందనలు తెలియజేస్తున్నారు. ఇదీ ప్రస్తుతం రైతుల పరిస్థితి కావలి నియోజకవర్గ పరిధిలో సుమారు 60 వేల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. అవన్నీ చివరి దశలో ఉన్నాయి. చివరి ఆయకట్టుకు సాగు నీరందించాలని ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్‌రెడ్డి పలుమార్లు మంత్రులు, అధికారులను కలిసి విన్నవించారు. ఆయన ఒత్తిడితో కలెక్టర్ జానకి స్పందించి కావలి ఎస్కేప్ ఛానల్ ద్వారా డైవర్షన్ పెట్టి బోగోలు, కావలి మండలాల పరిధిలోని పంటలకు సాగునీరందేలా చర్యలు తీసుకున్నారు. దీంతో అక్కడ కొంత ఉపశమనం లభించింది. మిగిలిన రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. వారికి చివరి తడి పెద్ద సమస్యగా మారింది. రెండు, మూడు రోజుల్లో నీరందకపోతే వందలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి ఉంది. కావలికి చెందిన సుబ్రమణ్యం, రమణమ్మ, శ్రీనివాసులు ఎదుర్కొంటున్న సంఘటనే ఇందుకు నిదర్శనం. వీరు ఇంట్లో ఉన్న బంగారాన్ని, పాసుపుస్తకాలను తాకట్టుపెట్టి వరి పంట సాగుచేస్తున్నారు. వీరు సాగుచేస్తున్న వరి పంట చేతికి రావాలంటే ఒక్కసారి నీరు పారాలి. అయితే ప్రస్తుతం నీరు వచ్చే పరిస్థితి లేదు. పంటలను గట్టెక్కించమని దేవుళ్లను ప్రార్థిస్తున్నారు. ఇటువంటి వారి బాధలను గమనించిన స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి తన కడుపు మాడ్చుకునైనా ప్రభుత్వం కళ్లు తెలిపించాలని నిర్ణయించుకున్నారు. శాశ్వత పరిష్కారం కోసం... కావలి పరిధిలోని రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న సాగు, తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నారు. సంగం బ్యారేజీ వద్ద చేపడుతున్న ఆధునికీకరణ పనులు త్వరగా పూర్తిచేయాలి. అదేవిధంగా కావలి కాలువ ఆయకట్టుకు అనుగుణంగా ఆధునికీకరణ పనులు చేపట్టాలి. 550 క్యూసెక్కుల సామర్థ్యం నుంచి 1,200 క్యూసెక్కులకు పెంచాలి. సంగం బ్యారేజీ నుంచి కావలి కాలువ ద్వారా నేరుగా చెరువులకు నీటి సరఫరా చేయాలి. చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందించాలి. డీఆర్, డీఎం చనల్ ఆధునికీకరణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్లు పూర్తయ్యేవరకు తన ఉద్యమం ఆగదని ఎమ్మెల్యే ప్రతాప్ర్రెడ్డి స్పష్టం చేస్తున్నారు. ముందుచూపు లేకపోవడం వల్లే.. దీక్ష నుద్దేశించి ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ సోమశిల, కండలేరులో నీరు పుష్కలంగా ఉంటే కావలితో పాటు ఉదయగిరికి నీటి సమస్య తలెత్తేది కాదన్నారు. ప్రభుత్వానికి ముందుచూపు కొరవడిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారని, అయితే రూ.87వేల కోట్లు బకాయిలు ఉంటే రూ.3,900 కోట్లే ఇచ్చారన్నారు. అదేవిధంగా మహిళా రుణాలు మాఫీ చేయాల్సి ఉన్నా పట్టించుకోలేదని విమర్శించారు. రైతు రుణమాఫీ హామీ ఇవ్వమని ఎంతో మంది జగన్మోహన్రెడ్డిపై ఒత్తిడి తెచ్చారన్నారు. అయితే ఆయన ఎంతో ముందుచూపుతో ఆర్థిక నిపుణుల సలహా తీసుకున్నారని, ప్రస్తుత పరిస్థితుల్లో వీలుకాదని చెప్పటం వల్లే ఆ హామీ ఇవ్వలేదని వివరించారు. -
ధరలు తగ్గే అవకాశమే లేదు..
ఇప్పటికే 30-40 శాతం నష్టాల్లో స్థిరాస్తి అమ్మకాలు సాక్షి, హైదరాబాద్ : రాజకీయ పరిణామాలు హైదరాబాద్ స్థిరాస్తి విపణిపై తీవ్ర వ్యతిరేక ప్రభావాన్ని చూపాయని, ఈ ఏడాది నమోదైన రియల్ ఎస్టేట్ అమ్మకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) జనరల్ సెక్రటరీ, ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ సీఎండీ ఎస్. రాంరెడ్డి చెప్పారు. 2010 నుంచి చూస్తే ప్రతి ఏటా హైదరాబాద్ మార్కెట్లో సగటున 4.9 శాతం వృద్ధి నమోదైతే.. ఈ ఏడాది మాత్రం 30-40 శాతం వరకు నష్టాల్లోనే స్థిరాస్తి అమ్మకాలున్నాయని పేర్కొన్నారు. ఐటీ, ఐటీ ఆధారిత సేవల రంగం విస్తరించి ఉన్న నగరాలన్నింటిలో కంటే హైదరాబాద్‌లోనే రియల్ ధరలు తక్కువగా ఉన్నాయని, అందుకే ధరలు ఇంకా తగ్గే అవకాశమే లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన జరిగిపోయింది.. ఇక రెండు రాష్ట్రాల్లోనూ అభివృద్ధే ప్రధాన ధ్యేయం కాబట్టి మళ్లీ స్థిరాస్తి రంగానికి పూర్వ వైభవం సంతరించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2014 హైదరాబాద్ రియల్టీ మార్కెట్ గురించి క్రేడాయ్ జనరల్ సెక్రటరీ ఎస్. రాంరెడ్డి ‘సాక్షి రియల్టీ’తో పంచుకున్నారు. ఇంటి నిర్మాణం కోసం మున్సిపల్ పర్మిషన్ నుంచి మొదలుపెడితే జలమండలి, అగ్నిమాపక, పోలీస్, విద్యుత్, కాలుష్య నియంత్రణ మండలి ఇలా దాదాపు 22 ప్రభుత్వ విభాగాల నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్ఓసీ) తీసుకోవాలి. దీనికి ఎంతలేదన్నా మూడేళ్ల సమయం పట్టడంతో పాటు చేతిచమురూ వదులుతోంది. పెపైచ్చు ఒక్కో ప్రాజెక్ట్‌పై 40 శాతం వడ్డీ భారం పడుతోంది. అదే గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్-గిఫ్ట్‌లో అయితే అన్ని ప్రభుత్వ విభాగాలను ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చి ఒక్క ఎన్ఓసీ తీసుకుంటే సరిపోతుంది. దీంతో నిర్మాణ సంస్థలకు భారం తగ్గడంతో పాటు పరిశ్రమల స్థాపనకు దేశ, విదేశీ సంస్థలూ ముందుకొస్తాయి. అదే మాదిరిగా మన రాష్ట్రంలోనూ ఒకే ఎన్ఓసీ, ఆన్లైన్లోనే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ను కూడా తీసుకునే వెసులుబాటును కల్పించాలి. అప్పుడే స్థిరాస్తి అమ్మకాలు జోరందుకుంటాయి. ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలోనూ స్థిరమైన ప్రభుత్వాలుండటం, నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుండడంతో 2015లో స్థిరాస్తి రంగానికి పూర్వ వైభవం సంతరించుకుంటుంది. మన రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో సగానికి పైగా రెవెన్యూ హైదరాబాద్ నుంచే వస్తుంది. అంటే హైదరాబాద్ ఎంతగా అభివృద్ధి చెందితే రాష్ట్రం అంతగా వృద్ధిపథంలోకి వెళ్తుందన్నమాట. అందుకే హైదరాబాద్‌లో పటిష్టమైన పోలీస్ విభాగం, హైవేలు, స్కైవేలు, మల్టీలేయర్ ఫ్లై ఓవర్లు, హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన, సాగర్ చుట్టూ ఆకాశహర్మ్యాలు, ఓఆర్ఆర్ అవతలి ప్రాంతాలను కలుపుతూ మరో రీజనల్ రింగ్ రోడ్డు, నగరానికి ఉత్తరాన మరో అంతర్జాతీయ విమానాశ్రయం, నగరం చుట్టూ సినిమా, ఫార్మా, హెల్త్, స్పోర్ట్స్ వంటి సిటీల నిర్మాణం, స్లమ్ ఫ్రీ సిటీ, ఐటీఐఆర్ వంటి కీలకమైన ప్రాజెక్ట్‌లను ప్రభుత్వం ప్రారంభించింది. 2015 సంవత్సరంలో ఆయా ప్రాజెక్ట్‌లు 20-30 శాతం నిర్మాణ దశలోకి వచ్చినా సరే.. ఇక స్థిరాస్తి రంగాన్ని ఎవరూ ఆపలేరు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రకటన నేపథ్యంలో ఆరేడు నెలలుగా హైదరాబాద్ నుంచి పెట్టుబడులు ఏపీకి వెళ్లాయి. మరో ఐదు నెలల్లో ఏపీలో రాజధాని కేటాయింపు, భూసేకరణ వంటి కార్యక్రమాలు పూర్తవుతాయి. కాబట్టి ఇక్కడి నుంచి వెళ్లిన పెట్టుబడుల్లో కొంత మళ్లీ నగరానికే వస్తాయి. ఎందుకంటే హైదరాబాద్ ఇప్పటికే అభివృద్ధి చెంది ఉంది. కంపెనీలు, ఉద్యోగాలూ ఉన్నాయి. మరోవైపు నగరంలో కంపెనీల స్థాపనకు, విస్తరణకూ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సాహం కల్పిస్తున్నందున హైదరాబాద్‌లోని ఐటీ, బీపీఓ, ఫార్మా కంపెనీలు తమ కార్యాలయాలను విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. కొత్త ప్రాజెక్ట్‌ల సంఖ్య 25 శాతం పెరగవచ్చని, అదే సమయంలో అమ్మకాలు 15 శాతం మేరకు పెరుగుదల ఉంటుందని అంచనా. ఏపీ ప్రభుత్వం తరహాలోనే ‘మీ సేవ’, ఆన్లైన్ ద్వారా.. కావాల్సిన పరిమాణం నమోదు చేసుకుంటే నేరుగా వినియోగదారుల ఇంటికే ఇసుకను పంపించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా డిపోలు ఏర్పాటు చేయబోతున్నారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. కానీ, ఇసుక కొనుగోళ్లపై ఆయా జిల్లా కలెక్టర్లకు అధికారం ఇవ్వాలి. అలా కాకుండా డ్వాక్రా సంఘాలకు, గ్రామ పంచాయతీలకు అధికారమిస్తే స్థానిక రాజకీయ నాయకులు, పోలీసులు కుమ్మకై విధానం పక్కదారిపట్టే ప్రమాదముంది. ప్రభుత్వ ఆదాయం పెరిగేలా తీసుకొస్తున్న విధానం కనుక అది నిర్మాణ రంగం, పర్యావరణం మధ్య సమతౌల్యం సాధించేలా ఉండాలి. నదుల వద్ద సీసీ కెమెరాలతో నిఘా, జీపీఎస్ సాంకేతికతను వినియోగించాలి. వే బిల్లుల జారీని పక్కాగా అమలు చేయాలి. ఫిబ్రవరిలో మరో రెండు ప్రాజెక్ట్‌లు.. మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేయడమే ధ్యేయంగా ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నామని ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ సీఎండీ ఎస్. రాంరెడ్డి చెప్పారు. ప్రస్తుతం హైదర్‌నగర్‌లో 9 ఎకరాల్లో నిర్మిస్తున్న ‘ఎస్ఎంఆర్ ఫౌంటెన్హెడ్’ దాదాపు పూర్తయ్యింది. మొత్తం 975 ఫ్లాట్లు. 30-40 ఫ్లాట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ధర చ.అ.కు రూ.3,800. బండ్లగూడలో 15 ఎకరాల్లో ఎస్ఎంఆర్ వినయ్ హార్మోనికౌంటీ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నాం. తొలి దశలో 450 ఫ్లాట్లొస్తాయి. మరో 15 నెలల్లో ప్రాజెక్ట్ పూర్తవుతుంది. ధర చ.అ.కు రూ.3,200. ఫిబ్రవరిలో గచ్చిబౌలిలో ఓ భారీ ప్రాజెక్ట్‌ను, బెంగళూరులో మరో రెండు ప్రాజెక్ట్‌లను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. -
కట్టుకున్నోడిని కడతేర్చేందుకు..
బద్వేలు అర్బన్: పెళ్లయిన 25 రోజులకే ఓ యువతి కట్టుకున్నోడిని కడ తేర్చేందుకు యత్నించింది. వేదమంత్రాల సాక్షిగా వివాహమాడిన భర్తను అంతమొందించేందుకు ప్రియుడితో కలిసి పక్కా ప్రణాళికతో పన్నాగం పన్నింది. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడిన ఆ యువకుడు ప్రాణాపాయ స్థితిలో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సోమవారం రాత్రి వెలుగు చూసిన ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. బద్వేలు పట్టణం కుమ్మరికొట్టాల సమీపంలో నివసిస్తున్న రామిరెడ్డి, రాములమ్మల ఏకైక సంతానమైన సిద్ధారెడ్డికి మైదుకూరు మండలం దువ్వూరు సమీపంలోని కొత్తపల్లె గ్రామానికి చెందిన పంగా సుబ్బారెడ్డి , సావిత్రిల కుమార్తె అరుణతో గత నెల 9,10 తేదీలలో వివాహమైంది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం బజారుకు వెళ్లి వస్తామని సిద్ధారెడ్డి, అరుణ బద్వేలులోని ఇంటి నుంచి వెళ్లారు. వెళ్లినవారు సాయంత్రం వరకు ఇంటికి రాకపోగా సిద్ధారెడ్డి ఫోన్ కూడా పనిచేయకపోవడంతో ఇరువురు కలిసి కొత్తపల్లెలోని బంధువుల ఇంటికి వెళ్లి ఉంటారని సిద్ధారెడ్డి తల్లిదండ్రులు భావించారు. అయితే రాత్రి 8 గంటల సమయంలో ఇంటికి అరుణ ఒక్కటే వచ్చింది. తమ కుమారుడు ఎక్కడని తల్లిదండ్రులు ప్రశ్నించగా సిద్దవటం సమీపంలోని కపర్థీశ్వరకోన ఆలయానికి వెళ్లామని అక్కడ ముగ్గురు వ్యక్తులు తమను నిర్బంధించి తమ వద్ద ఉన్న బంగారు ఆభరణాలు లాక్కుని వెళ్లిపోయారని, తన భర్తను అడవిలోకి తీసుకెళ్లి తనను కడప బస్సు ఎక్కించారని నమ్మబలికింది. అనుమానం వచ్చిన సిద్ధారెడ్డి తల్లిదండ్రులు రాత్రి 10 గంటల సమయంలో బద్వేలు పోలీసు స్టేషన్‌కు ఆమెను తీసుకెళ్లగా వారికి చెప్పినట్లే పోలీసులకు తెలిపింది. యువకుడి బంధువులు సమీప అటవీ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజాము 4గంటల వరకు వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. తిరిగి బద్వేలుకు వచ్చిన వారందరూ అరుణను గట్టిగా నిలదీయడంతో అసలు విషయం బయట పడింది. దువ్వూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులను తానే పిలిపించానని, వారి సూచనమేరకు సిద్దవటం సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తన భర్తను తీసుకెళ్లానని వారు తీవ్రంగా గాయపరిచి బంగారు నగలు తీసుకెళ్లారని పోలీసులకు వివరించింది. వెంటనే అరుణను తీసుకుని సిద్దవటం అటవిప్రాంతంలో గాలించగా తీవ్ర గాయాలతో సృ్పహ కోల్పోయి ఉన్న సిద్ధారెడ్డిని గుర్తించారు. వెంటనే ఓ ప్రైవేటు వాహనంలో అతన్ని కడప రిమ్స్‌కు తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సిద్ధారెడ్డి తండ్రి రామిరెడ్డి సిద్దవటం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. -
రోడ్డునపడ్డ విద్యార్థులు
కోవెలకుంట్ల: విద్యా శాఖ అధికారులకు ముందుచూపు లేకపోవడం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల సోమవారం 60 మంది విద్యార్థులు రోడ్డునపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా కోవెలకుంట్లలోని గాంధీనగర్ ప్రాంతానికి 2001లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మంజూరైంది. సొంత భవనం లేకపోవడంతో మొదట ఏడేళ్లు కొట్టంలో నిర్వహించారు. అనంతరం రామిరెడ్డి అనే వ్యక్తి తాత్కాలిక ప్రాతిపదికన అద్దె లేకుండా ఉచితంగా భవనాన్ని ఇవ్వడంతో ఆరు సంవత్సరాలుగా అందులో నిర్వహిస్తున్నారు. ఒకటి నుంచి ఐదు తరగతులున్న ఈ పాఠశాలలో 60 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ పాఠశాల కోసం కేటాయించిన 10 సెంట్ల స్థలం ఆక్రమణకు గురికావడంతో సొంత భవనం నిర్మాణాన్ని ప్రారంభించలేదు. చివరికి 2012లో రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకుని, ఆక్ర మణకు గురైన స్థలాన్ని స్వాధీనం చేసుకుని విద్యాశాఖ అధికారులకు అప్పగించారు. దీంతో రెండు గదుల నిర్మాణానికి ప్రభుత్వం రూ. 9 లక్షలు నిధులు మంజూరు చేసింది. ఏడాదిన్నర కిందట గదుల నిర్మాణాన్ని ప్రారంభించారు. ఇప్పటిదాకా ఒక గది నిర్మాణం మాత్రమే పూర్తయింది. తన భవనాన్ని ఖాళీ చేయాలని ఏడాది కిందట భవన యజమాని రామిరెడ్డి విద్యాశాఖ అధికారులను కోరారు. గదుల నిర్మాణం పూర్తి కావపోవడంతో ఈ ఏడాది కూడా అందులోనే తరగతులను నిర్వహిస్తున్నారు. పదేపదే చెప్పినప్పటికీ విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో సోమవారం రామిరెడ్డి వచ్చి, భవనాన్ని ఖాళీ చేయాలని పట్టుబట్టారు. దీంతో చేసేదేమీ లేక విద్యార్థులను బయటికి పంపి, ఖాళీ చేశారు. తరగతులను ఎక్కడ నిర్వహించాలో తెలియక ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయలు సందిగ్ధంలో పడ్డారు. చివరికి పూర్తి అయిన ఒక గదిలోనే ఐదు తరగతులకు చెందిన 60 మంది విద్యార్థులను కూర్చొబెట్టారు. కాగా.. ఇప్పటిదాకా కాంట్రాక్టర్‌కు రూ.6.50 లక్షలు చెల్లించామని, నిర్మాణం పూర్తయిన తర్వాత మిగతా డబ్బు చెల్లిస్తామని సర్వశిక్ష అభయాన్ ఈఈ భాస్కర్ తెలిపారు. త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించామన్నారు. -
పిల్లల సొమ్ము పెద్దలకు
విద్యార్థుల ఫీజులతో ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు రూ.436.49 కోట్లతో ఓయూ బడ్జెట్ వేతనాల చెల్లింపులు, పెన్షన్లకే పెద్దపీట పీజీఆర్సీ, పరీక్షల విభాగానికి మళ్లీ మొండిచేయి హాస్టళ్లు, అనుబంధ కాలేజీలకు దక్కని వాటా సాక్షి,సిటీబ్యూరో: అమ్మ అన్నం పెట్టదు..అడుక్కు తిన్నివ్వదు.. అన్నట్లుంది ఉస్మానియా విశ్వవిద్యాలయం పాలకమండలి పరిస్థితి. ఉన్న వనరులను పెంచుకోలేక.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులను తెచ్చుకోలేక చివరకు విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో వసూలు చేసిన డబ్బును ఉద్యోగుల జీతాలు, వారి పెన్షన్లకు మళ్లించింది. పరీక్షల విభాగం, ప్రొఫెసర్ జి.రామిరెడ్డి దూరవిద్యా కేంద్రానికి చెందిన ఆర్థిక వనరులను వేతనాలు,పెన్షన్ల చెల్లింపు ఖాతాలోకి మళ్లించడమే కాకుండా, తాజా బడ్జెట్లో కూడా ఆ విభాగాలకు మొండిచేయి చూపిం చింది. ఉపకులపతి (వీసీ) ప్రొ.సత్యనారాయణ అధ్యక్షతన శుక్రవారం వర్సిటీ పరిపాలనా భవనంలో బడ్జెట్ సమావేశం జరిగింది. పాలకమండలి సభ్యుడు ప్రొ.మల్లారెడ్డి ఈవిద్యా (2014-15) సంవత్సరానికి రూ.11.97 కోట్ల లోటుతో రూ.436.49 కోట్లతో ప్రవేశపెట్టిన వార్షికబడ్జెట్‌ను సభ్యులు ఏకగ్రీవంగా ఆమో దించారు. గత (2013-14) వార్షిక బడ్జెట్‌తో పోలిస్తే ఇది రూ.51 కోట్లు అదనం. ఇదిలా వుంటే ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టుకోకుండా, ఫీజుల రూపంలో విద్యార్థుల నుంచి వసూలు చేసిన డబ్బును వేతనాలు, పెన్షన్ల చెల్లింపుకు మళ్లించడం అన్యాయమని నిపుణులు ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చిన ఆదాయంలో కనీసం 10శాతం నిధులను కూడా ఆవిభాగాల అభివృద్ధికి కేటాయించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ గ్రాంటు రూ.170.14 కోట్లే బ్లాక్‌గ్రాంట్ రూపంలో ప్రభుత్వం రూ.170.14 కోట్లు కేటాయించింది. మిగిలిన మొత్తాన్ని పరీక్షల విభాగం, దూరవిద్యా కేంద్రం,యూజీసీ, నాన్యూజీసీ స్కీమ్‌ల కింద సమకూర్చుకోనున్నట్లు వర్సిటీ ప్రకటించింది. విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఫీజులతో పాటు సెల్ప్‌ఫైనాన్స్ కోర్సులు, దూరవిద్యాకోర్సు ఫీజులు ఆయా విభాగాల అభివృద్ధికి మాత్రమే ఉపయోగించాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా ఈ నిధులను వేతనాలు, పదవీవిరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్ల చెల్లింపులకు మళ్లిం చారు. గతంతో పోలిస్తే ప్రభుత్వ బడ్జెట్లో వర్సిటీకి కొంత ప్రాధాన్యమిచ్చినప్పటికీ... కేటాయించిన నిధులు వేతనాలకు కూడా సరిపోవడంలేదు. అనివార్యంగానే ఆయా విభాగాల అభివృద్ధికి ఉపయోగపడాల్సిన నిధులు వేతనాలకు మళ్లించాల్సి వస్తోందని అధికారులు చెప్పారు. -
దేవదాసు స్టైల్ మార్చాడు మూవీ ఆడియో లాంచ్
-
ప్రశాంతంగా వీఆర్వో, వీఆర్ఏ పరీక్షలు
నెల్లూరు (కలెక్టరేట్), న్యూస్‌లైన్: జిల్లాలో ఆదివారం గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్ఓ), గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ) పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. జిల్లాలో 94 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. మొత్తం 35,608 మంది వీఆర్ఓ పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా 31,932 మంది హాజరయ్యారు. 3,676 మంది గైర్హాజరయ్యారు. 2,352 మంది వీఆర్ఏ పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా 2,045 హాజరయ్యారు. 307 మంది గైర్హాజరయ్యారు. వీరిలో 59 మంది వికలాంగులు పరీక్షలు రాశారు. గ్రామ రెవెన్యూ అధికారుల పరీక్షలకు 89.67, గ్రామ రెవెన్యూ సహాయకుల పరీక్షలకు 86.95 శాతం హాజరైనట్లు డీఆర్వో రామిరెడ్డి వెల్లడించారు. చివరి నిమిషం వరకు ఉత్కంఠ జిల్లాలో జరిగిన వీఆర్వో, వీఆర్ఏ పరీక్షలు చివరి నిమిషం వరకు ఉత్కంఠత కలిగించాయి. ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించమని ఒక పక్క అధికారులు ప్రకటనలు గుప్పించినా ఫలితం లేకుండా పోయింది. ఇతర జిల్లాలు, ప్రాంతాల నుంచి వచ్చిన అనేక మంది అభ్యర్థులు సమయానికి ఆయా కేంద్రాలకు చేరుకోలేకపోయారు. సమయం దాటిపోవడంతో అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి నిరాకరించడంతో అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు. ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను అనుమతించని పోలీసులు నెల్లూరు సిటీ : జిల్లా వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన వీఆర్వో, వీఆర్ఏ పరీక్షలకు సంబంధించి వివిధ కారణాలతో పలు కేంద్రాల్లో విద్యార్థులు ఆలస్యంగా వచ్చి పరీక్ష రాయకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు నిర్వహించిన వీఆర్వో పరీక్షకు దూర ప్రాంతాల నుంచి హాజరయ్యే పలువురు అభ్యర్థులు ఆఖరి నిమిషానికి చేరుకున్నప్పటికీ గేట్లు మూసి ఉండటంతో అక్కడి సిబ్బంది, పోలీసులను బతిమలాడిన, భంగపడినా ప్రయోజనం లేకపోయింది. నగరంలో డీకే కళాశాల కేంద్రంలో ఈ పరిస్థితిని అధిక సంఖ్యలో అభ్యర్థులు ఎదుర్కొన్నారు. నమ్ముకున్న ట్రైన్లు, బస్సులు సకాలంలో రాకపోవడం, నగరంలో ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కోపోవడం వంటి కారణాలతో అభ్యర్థులు నిర్ణీత సమయానికి హాజరు కాలేకపోయారు. ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు టంచన్‌గా 10 గంటలకు పోలీసులు గేట్లు మూసివేశారు. ఆ తర్వాత నిమిషం ఆలస్యంగా పరుగు పరుగున వచ్చిన పలువురు అభ్యర్థులు తమ ఆలస్యానికి గల కారణాలను ఏకరువు పెట్టినా పోలీసులు వినిపించుకోలేదు. దీంతో పలువురు అభ్యర్థులు నిరాశ, నిస్పృహలతో వెనుదిరిగారు. కొందరు మహిళలు కన్నీళ్ల పర్యంతమై నిస్సహాయంగా ప్రాధేయపడటం కనిపించింది. -
ఆనందం ఆవిరి
వెదురుకుప్పం, న్యూస్‌లైన్: వెదురుకుప్పం మండలంలోని కోణంగిపల్లెకు చెందిన లోకనాథరెడ్డి(40), రామిరెడ్డి(21), ఎర్రగుంటపల్లె వాసి చెంగారెడ్డి(60) తిరుమల రాజపురం సమీపంలో జరిగిన ఓ వివాహానికి శుక్రవారం రాత్రి హాజరయ్యారు. అనంతరం ద్విచక్ర వాహనంలో తిరుగు ప్రయాణమయ్యారు. చెంగారెడ్డిని ఎర్రగుంటపల్లెలోని ఇంటి వద్ద వదిలేందుకు వెళుతుండగా ఏపీ 26డబ్ల్యూ 2040 నంబర్ గల సుమో ఢీకొంది. ఈ ప్రమాదంలో లోకనాథరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ చెంగారెడ్డి, రామిరెడ్డి తిరుపతిలోని ఓ ఆస్పత్రిలో మరణించారు. కార్వేటినగరం మండలం ఎర్రమరాజుపల్లె వాసి సుమో డ్రైవర్ గుణశేఖర్, నాగరాజు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో సుమో కాలువ వైపు దూసుకెళ్లి బోల్తా పడింది. ద్విచక్రవాహనం నుజ్జునుజ్జు అయింది. కోణంగిపల్లెలో విషాదఛాయలు ఒకే గ్రామానికి చెందిన లోకనాథరెడ్డి, రామిరెడ్డి రోడ్డు ప్రమాదం లో మృతి చెందడంతో కోణంగిపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబాలను ఓదార్చడం ఎవరి తరమూ కా లేదు. రామిరెడ్డికి రెండేళ్లక్రితం వివాహమైంది. ఓ కూతురు ఉంది.