Randstad Work Monitor Survey
-
వేతనం కాదు.. ఉద్యోగుల మనోభావాలివి..
ఉద్యోగుల మొదటి ప్రాధాన్యం వేతనానికే అనుకుంటాం. కానీ, అలా అనుకోవడం పొరపాటే అవుతుంది. వేతనం కంటే పనిచేసే చోట సానుకూల పరిస్థితులు, నేర్చుకునే, ఎదిగే అవకాశాలకు ఎక్కువ మంది ఉద్యోగులు ప్రాధాన్యం ఇస్తున్నట్టు రాండ్‌స్టాడ్ నిర్వహించిన ‘ఇండియా వర్క్ మానిటర్ 2025’(Randstad Workmonitor 2025) సర్వేలో తెలిసింది. సర్వేలోని వివరాలు కింది విధంగా ఉన్నాయి.పనిలో సౌలభ్యం లేకపోతే ఆ ఉద్యోగానికి గుడ్‌బై చెబుతామని 52 శాతం మంది చెప్పారు.సౌకర్యవంతమైన పనివేళలు లేని ఉద్యోగాన్ని తిరస్కరిస్తామని 60 శాతం మంది తెలిపారు.పనిచేసే ప్రదేశం అనుకూలంగా లేకపోతే ఆ ఉద్యోగాన్ని కాదనుకుంటామని 56 శాతం మంది చెప్పారు. తమ మేనేజర్‌తో మంచి సంబంధాలు లేకపోతే ఉద్యోగాన్ని వీడుతామని 60 శాతం మంది తెలిపారు.తాము చేసే ఉద్యోగంలో నేర్చుకోవడానికి, అభివృద్ధి చెందడానికి అవకాశం లేకపోతే దాన్ని వదులుకుంటామని 67 శాతం మంది చెప్పారు. అంతర్జాతీయంగా ఇదే అభిప్రాయం చెప్పిన వారు 41 శాతమే.దేశీయంగా 69 శాతం మంది ఉద్యోగులు సమష్టి పని సంస్కృతిని కోరుకుంటున్నారు. అంతర్జాతీయంగా 55 శాతం మందిలో ఇదే భావన నెలకొంది.తమ విలువలకు సరిపడని సంస్థలో పనిచేయబోమని 70% మంది తేల్చిచెప్పారు.పనిలో ప్రయోజనాలుంటే (పనివేళల్లో, పని ప్రదేశాల్లో వెసులుబాట్లు) యాజమాన్యాలను విశ్వసిస్తామని 73 శాతం మంది సర్వేలో తమ అభిప్రాయాన్ని తెలిపారు. ఇదీ చదవండి: రిలయన్స్‌కు రూ.24,500 కోట్ల డిమాండ్ నోటీసులుయాజమాన్యాలు మారాల్సిందే..పని ప్రదేశాల్లో వస్తున్న మార్పులకు ఈ సర్వే ఫలితాలు అద్దం పడుతున్నట్టు రాండ్‌స్టాడ్ సర్వే నివేదిక తెలిపింది. ‘జెన్ జెడ్ లేదా మిలీనియల్స్ అయినా వ్యక్తిగత కట్టుబాట్లు, కెరీర్ వృద్ధిని సమతుల్యం చేసుకోవాలని అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ తమదైన రీతిలో (స్వేచ్ఛగా) పనిచేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. పనిలో నేర్చుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారంటే, వారు కేవలం ఉద్యోగాలనే కోరుకోవడం లేదు. కెరీర్ పురోగతిని కోరుకుంటున్నారని అర్థమవుతోంది. యాజమాన్యాలు ఈ మార్పును తప్పకుండా గుర్తించి, నిపుణులైన మానవ వనరుల అంచనాలను అందుకునే వ్యూహాలను రూపొందించుకోవాలి. లేదంటే నిపుణులను కోల్పోవాల్సి వస్తుంది’ అని రాండ్‌స్టాడ్ ఇండియా ఎండీ, సీఈవో విశ్వనాథ్ పీఎస్ తెలిపారు. -
ఉద్యోగులకు ఏఐ చేదోడు
కృత్రిమ మేధ(AI) అంతటా వ్యాపిస్తోంది. పని ప్రదేశాల్లో కీలకపాత్ర పోషిస్తోంది. కార్పొరేట్ కార్యాలయాలతోపాటు దాదాపు ప్రతి విభాగంలోని ఆఫీసుల్లో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో దీని సేవలు వినియోగిస్తున్నారు. ఇటీవల రాండ్‌స్టడ్(Randstad Report) వెల్లడించిన నివేదిక ప్రకారం 2024లో 10 మంది భారతీయ ఉద్యోగుల్లో ఏడుగురు కృత్రిమ మేధ సాధనాలను ఉపయోగిస్తున్నారు. ఉత్పాదకతను పెంచడానికి, వ్యాపార ప్రక్రియలను క్రమబద్ధీకరించడానికి ఏఐపై ఆధారపడడం అధికమవుతుందని ఈ నివేదిక హైలైట్ చేస్తుంది.ఐటీ సేవలు, ఆర్థిక సేవలు, విద్య, తయారీ సహా వివిధ రంగాలకు చెందిన దాదాపు 1,000 మంది ఉద్యోగులతో రాండ్‌స్టడ్ ఏఐ అండ్ ఈక్విటీ రిపోర్ట్ 2024 నివేదిక రూపొందించింది. ఈ సర్వేలో పాల్గొన్న 56% మంది తాము ప్రతిరోజూ కృత్రిమ మేధ సాధనాలను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. ఏఐ సాధనాలు వ్యాపార ప్రక్రియలను వేగవంతం చేయడానికి, వాటిని సులభతరం చేయడానికి గణనీయంగా తోడ్పడుతున్నట్లు రాండ్‌స్టడ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ పీఎస్ విశ్వనాథ్ పేర్కొన్నారు. ఉద్యోగ పునరుద్ధరణ, డేటా భద్రతపై ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళనలను కూడా ఈ నివేదిక ఎత్తిచూపింది.మిలీనియల్స్(1995 తర్వాత పుట్టినవారు), బూమర్లు(1970లో జన్మించినవారు) ఏఐ నైపుణ్యాలపై అత్యంత విశ్వాసంతో ఉన్నట్లు నివేదిక తెలిపింది. 37 శాతం మంది తమ ఉద్యోగాలపై ఏఐ ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. డేటా భద్రత, గోప్యత కారణంగా పనిలో చాట్ జీపీటీ వంటి ఏఐ టెక్నాలజీలను ఉపయోగించడాన్ని నిషేధించే విధానాలను తమ యాజమాన్యం అవలంబిస్తున్నట్లు ప్రతి ముగ్గురిలో ఒకరు తెలిపారు.ఇదీ చదవండి: రోల్స్‌రాయిస్‌కు రూ.90,200 కోట్ల కాంట్రాక్ట్ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నప్పటికీ చాలా మంది ఉద్యోగులు తమ కెరీర్‌ను మెరుగుపరుచుకోవడానికి మరింత శిక్షణ అవసరమని చెబుతున్నారు. కృత్రిమ మేధ, టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న క్రమంలో అందుకు తగ్గట్టు శ్రామిక శక్తి కూడా పెరిగేలా విధానాలు రావాలని నివేదిక ద్వారా తెలుస్తుంది. భవిష్యత్తులో కొత్తగా ఏ టెక్నాలజీ వస్తున్నా అది శ్రామిక శక్తిని తగ్గించేలా కాకుండా, ఉత్పాదకతను పెంచుతూ మరిన్ని ఉద్యోగాలు సృష్టించేలా ఉండాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
బెంగళూరులో ఎక్కువ వేతనాలు
న్యూఢిల్లీ: దేశంలో అత్యంత వేతన చెల్లింపులకు రాజధానిగా బెంగళూరు తన స్థానాన్ని కాపాడుకుంది. అలాగే, అత్యధిక పారితోషికాలు ఐటీ రంగంలో ఉన్నట్టు రాండ్‌స్టాడ్ ‘ఇన్సైట్స్ శాలరీ ట్రెండ్స్ 2019’ నివేదిక వెల్లడించింది. బెంగళూరులో జూనియర్ స్థాయి ఉద్యోగిపై కంపెనీ వార్షికంగా చేస్తున్న సగటు వ్యయం (సీటూసీ) రూ.5.27 లక్షలుగా ఉంటే, మధ్య స్థాయి ఉద్యోగిపై ఇది రూ.16.45 లక్షలు, సీనియర్ లెవల్ ఉద్యోగిపై రూ.35.45 లక్షలుగా ఉంది. ఈ సంస్థ రూపొందించిన 2018, 2017 నివేదికల్లోనూ అత్యధిక వేతనాలున్న నగరంగా బెంగళూరు మొదటి స్థానంలో నిలవడం గమనార్హం. జూనియర్ లెవల్ ఉద్యోగులకు అధికంగా చెల్లింపులున్న రెండో నగరంగా హైదరాబాద్ చోటు సంపాదించింది. ఇక్కడ సగటు సీటూసీ రూ.5లక్షలు. రూ.4.59 లక్షలతో మూడో స్థానంలో ముంబై నగరం ఉంది. మధ్య స్థాయి ఉద్యోగులకు అధికంగా చెల్లిస్తున్న నగరాల్లో ముంబై రూ.15.07 లక్షలతో రెండో స్థానంలో, దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్) రూ.14.5 లక్షలతో మూడో స్థానంలో ఉన్నాయి. -
సొంత వ్యాపారానికే యువతరం సై...
న్యూఢిల్లీ: ఆరంకెల వేతనం అందుకుంటూ హాయిగా బతికేస్తే పోలా... అనుకునే ఆలోచనను యువతరం వదిలించుకుంటున్నది. తమతో పాటు మరికొందరికి ఉపాధి చూపుతూ పైపైకి ఎదగాలని యువత ఉవ్విళ్లూరుతున్నట్టు ఓ సర్వే తేల్చింది. భారత ఉద్యోగుల్లో వాణిజ్యవేత్త కావాలనే తాపత్రయం ఎక్కువగా ఉన్నట్టు రాండ్‌స్టాడ్ వర్క్ మానిటర్ సర్వేలో వెల్లడైంది. ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగుల్లో ఎంటర్ప్రెన్యూర్ కావాలనుకోనే అభిలాష సగటున 53 శాతంగా ఉండగా, భారత ఉద్యోగుల్లో 83 శాతం మంది ఈ ఆలోచనతో ఉన్నారు. సొంత బిజినెస్ ప్రారంభించేందుకే ఉద్యోగాలను విడిచిపెడుతున్నామని 56 శాతం మంది చెప్పారు. వ్యాపారానికి సానుకూల వాతావరణం నెలకొనడం, ఎఫ్‌డీఐ పరిమితులు పెంచడం, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాలతో యువత వ్యాపారాలను ఎంచుకుంటున్నారని రాండ్‌స్టాడ్ ఇండియా ఎండీ, సీఈఓ పౌల్ డుపిస్ తెలిపారు. యువతతో పోలిస్తే 45-54 మధ్య వయసు కలిగిన ఉద్యోగులు సొంత వ్యాపారం చేపట్టేందుకు వెనుకాడుతున్నారు. వీరిలో కేవలం 37 శాతం మంది మాత్రమే వ్యాపారాలకు ఓటేశారు. 35 నుంచి 44 సంవత్సరాల లోపు ఉద్యోగులు 61 శాతం మేర సొంత వ్యాపారాలే మేలని చెప్పారు. ఇక 25 నుంచి 34 ఏళ్ల యువ ఉద్యోగుల్లో ఏకంగా 72 శాతం మంది సొంత వ్యాపారాలు చేపట్టడానికి ఆసక్తి కనబరిచారని సర్వే తేల్చింది. భారత్‌లో స్టార్టప్‌ను ప్రారంభించేందుకు ప్రస్తుత వాతావరణం ప్రోత్సాహకరంగా ఉందని సర్వేలో పాల్గొన్న వారిలో 86 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు.