విద్యాసాగర్ తాత్కాలికంగా ఏపీలోనే: క్యాట్
సాక్షి, హైదరాబాద్: సీనియర్ ఐఏఎస్ అధికారి విద్యాసాగర్‌ను తదుపరి ఉత్తర్వులు జారీచేసే వరకూ ఆంధ్రప్రదేశ్ క్యాడర్లోనే కొనసాగించాలని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్(క్యాట్) ఆదేశించింది. ఈ మేరకు కేంద్రానికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేసింది.
కేంద్ర ప్రభుత్వం గత నెల 10న తనను తెలంగాణకు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ ఏపీ గిరిజన శాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న విద్యాసాగర్ దాఖలు చేసిన పిటిషన్‌ను క్యాట్ సభ్యులు బీవీ రావు, రంజనా చౌదరిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారిం చింది. ప్రత్యూష్‌సిన్హా కమిటీ మార్గదర్శకాల ప్రకారం ఏపీ క్యాడర్లోనే కొనసాగిం చాలని పిటిషనర్ తరఫు న్యాయవాది వై.శ్రీనివాసమూర్తి వాదనలు వినిపించారు.