Ranji trophy semifinal
-
క్రీడా మంత్రి పోరాటం వృధా.. భారీ ఆధిక్యం దిశగా మధ్యప్రదేశ్
Bengal Vs Madhya Pradesh 1st Semi Final: రంజీ ట్రోఫీ 2022 సీజన్లో బెంగాల్ పోరాటం ముగిసేలా కనిపిస్తుంది. మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 273 పరుగులకే ఆలౌట్ కావడంతో ప్రత్యర్ధికి 68 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. 5 వికెట్ల నష్టానికి 197 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన బెంగాల్‌ను సీనియర్ ఆటగాడు, ఆ రాష్ట్ర క్రీడా మంత్రి మనోజ్ తివారి (211 బంతుల్లో 12 ఫోర్లతో 102), బౌలింగ్ ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్ (209 బంతుల్లో 12 ఫోర్లతో 116) శతకాలతో ఆదుకున్నారు. వీరిద్దరూ అద్భుతమైన పోరాటపటిమను కనబర్చి బెంగాల్‌ను తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దిశగా తీసుకెళ్లారు. అయితే స్వల్ప వ్యవధిలో ఈ ఇద్దరూ ఔటవ్వడంతో బెంగాల్ లీడ్ సాధించే అవకాశాన్ని కోల్పోయింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన మధ్యప్రదేశ్‌ను.. రజత్ పాటిదార్ (63 నాటౌట్), కెప్టెన్ ఆధిత్య శ్రీవత్సవ (34 నాటౌట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో భారీ ఆధిక్యం దిశగా తీసుకెళ్లారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 2 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసి 231 పరుగుల ఓవరాల్ ఆధిక్యాన్ని సాధించింది. నాలుగో రోజు ఆటలో మధ్యప్రదేశ్ మరో 150, 200 పరుగులు చేసినా, తొలి ఇన్నింగ్స్ ఆధారంగా ఫైనల్‌కు చేరుకుంటుంది. స్కోర్ వివరాలు: మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్ 341 ఆలౌట్ బెంగాల్ తొలి ఇన్నింగ్స్ 273 ఆలౌట్ మధ్యప్రదేశ్ రెండో ఇన్నింగ్స్ 163/2 చదవండి: న్యూజిలాండ్ జట్టులో కల్లోలం.. మరో స్టార్ క్రికెటర్‌కు కరోనా -
మరో శతకం దిశగా దూసుకెళ్తున్న క్రీడా మంత్రి
రంజీ ట్రోఫీ 2022లో భాగంగా మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో బెంగాల్ జట్టు ఎదురీదుతుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. 54 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన బెంగాల్‌ను సీనియర్ ఆటగాడు, రాష్ట్ర క్రీడా మంత్రి మనోజ్ తివారి (84 నాటౌట్), బౌలింగ్ ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్ (72 నాటౌట్) ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌ను అబేధ్యమైన 143 పరుగులు జోడించి జట్టును గట్టెక్కించేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. అంతకుముందు మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 341 పరుగులు చేసి ఆలౌటైంది. వికెట్‌కీపర్, బ్యాటర్ హిమాన్షు మంత్రి (165) మధ్యప్రదేశ్ భారీ స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి బెంగాల్ ఇంకా 144 పరుగులు వెనుక పడి ఉంది. మధ్యప్రదేశ్ బౌలర్లు కుమార్ కార్తీకేయ (2/43), పూనీత్ దాటే (2/34) బెంగాల్‌ను దారుణంగా దెబ్బ తీశారు. మరో శతకం దిశగా దూసుకెళ్తున్న బెంగాల్ క్రీడా మంత్రి ఓ పక్క రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మైదానంలోనూ సత్తా చాటుతున్నాడు బెంగాల్ క్రీడా మంత్రి మనోజ్ తివారి. జార్ఖండ్‌తో జరిగిన తొలి క్వారర్ ఫైనల్లో తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ (73), రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ (136) బాదిన తివారి.. తాజాగా మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న సెమీస్‌లోనూ జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేస్తూ మరో శతకం దిశగా దూసుకెళ్తున్నాడు. అతనికి మరో ఎండ్‌లో షాబాజ్ అహ్మద్ సహకరిస్తున్నాడు. వీరిద్దరు మూడో రోజు కూడా ఇదే ఫామ్‌ను కొనసాగించి మధ్యప్రదేశ్‌పై ఆధిక్యం సాధించగలిగితే, తొలి ఇన్నింగ్స్ లీడ్ ఆధారంగా బెంగాల్ ఫైనల్‌కు చేరుకుంటుంది. మరోవైపు రెండో సెమీఫైనల్లో ముంబై-ఉత్తర్ ప్రదేశ్ జట్లు తలపడుతున్నాయి. చదవండి: భారత టీ20 జట్టు కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా -
ముంబై లక్ష్యం 445 కర్ణాటకతో రంజీ సెమీస్
బెంగళూరు: తొలి రోజు బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించిన పిచ్‌పై రెండో రోజు కర్ణాటక బ్యాటింగ్ బృందం మెరుగైన ప్రదర్శన కనబర్చింది. ముంబైతో ఇక్కడ జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్‌లో గురువారం కర్ణాటక తమ రెండో ఇన్నింగ్స్‌లో 286 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 10/2తో రెండో రోజు ఆట ప్రారంభించిన కర్ణాటక 72.5 ఓవర్లు ఎదుర్కొని మరో 276 పరుగులు జత చేసింది. నైట్‌వాచ్‌మన్ అభిమన్యు మిథున్ (113 బంతుల్లో 89; 14 ఫోర్లు) సెంచరీ అవకాశం కోల్పోయాడు. మిథున్, సమర్థ్ (58) కలిసి మూడో వికెట్‌కు 149 పరుగులు జోడించగా... మనీశ్ పాండే (42) రాణించాడు. ముంబై బౌలర్లలో షార్దుల్ ఠాకూర్ 4, సంధు 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం 445 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై వికెట్ కోల్పోకుండా 61 పరుగులు చేసింది. ఆదిత్య తారే (40 బ్యాటింగ్), హేర్వాడ్కర్ (21 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. తమిళనాడు 426/5 కోల్‌కతా: దినేశ్ కార్తీక్ (304 బంతుల్లో 113; 16 ఫోర్లు) సెంచరీ సాధించడంతో మహారాష్ట్రతో జరుగుతున్న మరో సెమీస్‌లో రెండో రోజు ఆట ముగిసే సరికి తమిళనాడు తమ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 426 పరుగులు చేసింది. విజయ్ శంకర్ (91) శతకం చేజార్చుకోగా... ఇంద్రజిత్ (68 బ్యా టింగ్), ప్రసన్న (64 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు.