తొలి రోజు బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించిన పిచ్‌పై రెండో రోజు కర్ణాటక బ్యాటింగ్ బృందం మెరుగైన ప్రదర్శన కనబర్చింది.
బెంగళూరు: తొలి రోజు బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించిన పిచ్‌పై రెండో రోజు కర్ణాటక బ్యాటింగ్ బృందం మెరుగైన ప్రదర్శన కనబర్చింది. ముంబైతో ఇక్కడ జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్‌లో గురువారం కర్ణాటక తమ రెండో ఇన్నింగ్స్‌లో 286 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 10/2తో రెండో రోజు ఆట ప్రారంభించిన కర్ణాటక 72.5 ఓవర్లు ఎదుర్కొని మరో 276 పరుగులు జత చేసింది.
నైట్‌వాచ్‌మన్ అభిమన్యు మిథున్ (113 బంతుల్లో 89; 14 ఫోర్లు) సెంచరీ అవకాశం కోల్పోయాడు. మిథున్, సమర్థ్ (58) కలిసి మూడో వికెట్‌కు 149 పరుగులు జోడించగా... మనీశ్ పాండే (42) రాణించాడు. ముంబై బౌలర్లలో షార్దుల్ ఠాకూర్ 4, సంధు 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం 445 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై వికెట్ కోల్పోకుండా 61 పరుగులు చేసింది. ఆదిత్య తారే (40 బ్యాటింగ్), హేర్వాడ్కర్ (21 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు.
తమిళనాడు 426/5
కోల్‌కతా: దినేశ్ కార్తీక్ (304 బంతుల్లో 113; 16 ఫోర్లు) సెంచరీ సాధించడంతో మహారాష్ట్రతో జరుగుతున్న మరో సెమీస్‌లో రెండో రోజు ఆట ముగిసే సరికి తమిళనాడు తమ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 426 పరుగులు చేసింది. విజయ్ శంకర్ (91) శతకం చేజార్చుకోగా... ఇంద్రజిత్ (68 బ్యా టింగ్), ప్రసన్న (64 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు.