rapid diagnostic test
-
జూన్ చివరికల్లా రోజుకు 45 లక్షల టెస్టులు చేస్తాం
న్యూఢిల్లీ: రోజూవారీ కరోనా నిర్ధారణ పరీక్షల సామర్థ్యాన్ని పెంచుకోవడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది. ప్రస్తుతం రోజుకు 16–20 లక్షల కరోనా టెస్ట్‌లు నిర్వహిస్తుండగా జూన్ నెల చివరినాటికల్లా రోజుకు 45 లక్షల టెస్టులు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ చెప్పారు. మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్‌కు చెందిన ‘ఇంట్లోనే చేసుకోగల ర్యాపిడ్ యాంటిజెన్ కరోనా టెస్టింగ్ కిట్’కు ఐసీఎంఆర్ తాజాగా అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో భార్గవ మాట్లాడారు. ‘మరో మూడు కిట్ల తయారీ సంస్థలు అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాయి. వాటికి వారంలోపు అనుమతులు రావచ్చు. 105 ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కంపెనీలు అర్హత సాధించగా వాటిలో 41 సంస్థలకు అమనుతులు ఇచ్చాం. వీటిలో 31 స్వదేశీ సంస్థలున్నాయి. జూన్ చివరికల్లా 18 లక్షల ఆర్టీ–పీసీఆర్, 27 లక్షల ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు కలిపి మొత్తంగా రోజుకు 45 లక్షల టెస్ట్‌ల సామర్థ్యం సాధిస్తాం’ అని భార్గవ తెలిపారు. ‘మెడికల్ షాప్‌లో టెస్ట్ కిట్ కొనండి. మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసి రిజిస్టర్ చేసుకోండి. యూజర్ మ్యాన్యువల్ ప్రకారం కరోనా టెస్ట్ చేసుకోండి. తర్వాత కిట్ ఫొటోను యాప్‌లోకి అప్లోడ్ చేసి టెస్ట్ రిజల్ట్ పొందండి’ అని భార్గవ అన్నారు. మే 3న 17.13 శాతంగా ఉన్న యాక్టివ్ కేసులు ఇప్పుడు 12.1 శాతానికి పడిపోయాయని ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ చెప్పారు. -
Covid-19 Self-Testing: ఇంట్లోనే కరోనా టెస్టు
న్యూఢిల్లీ: ఇంట్లోనే కరోనా టెస్టు చేసుకోవడానికి వీలుగా కొత్త ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టింగ్ (ర్యాట్) కిట్‌కు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) బుధవారం అనుమతి ఇచ్చింది. లక్షణాలు ఉన్నవారు, ల్యాబ్ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలినవారితో సన్నిహితంగా మెలిగివారు మాత్రమే దీన్ని ఉపయోగించి కరోనా నిర్ధారణ చేసుకోవాలని సూచించింది. పుణేకు చెందిన మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్ లిమిటెడ్ సంస్థ రూపొందిన ఈ కిట్‌ను పరీక్షించి అనుమతించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. ముక్కులో నుంచి తీసిన స్వాబ్‌తో పరీక్ష ఉంటుందని, ఉత్పత్తిదారు యూజర్ మాన్యూవల్‌లో సూచించిన ప్రకారం పరీక్ష చేసుకోవచ్చని తెలిపింది. విచ్చలవిడిగా దీనితో ఇంట్లో పరీక్షలు నిర్వహించకూడదని హెచ్చరించింది. ఈ కొత్త యాంజిజెన్ కిట్‌తో ఇంట్లో చేసిన పరీక్షలో పాజిటివ్‌గా తేలితే.. వ్యాధి నిర్ధారణ అయినట్లుగానే పరిగణించాలని పేర్కొంది. వారికి మళ్లీ టెస్టులు అవసరం లేదని పేర్కొంది. లక్షణాలు ఉండీ ఒకవేళ నెగిటివ్‌గా వస్తే మాత్రం... అలాంటి వారు ఆలస్యం చేయకుండా వెంటనే ఆర్టీ–పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని కోరింది. వైరల్ లోడ్ తక్కువగా ఉంటే.. కొన్నిసార్లు యాంటిజెన్ పరీక్షల్లో దొరక్కపోవచ్చని వివరించింది. యాంటిజెన్ టెస్టులో నెగిటివ్ వచ్చినా... లక్షణాలుంటే వారిని కోవిడ్ బాధితులుగా పరిగణించి చికిత్స అందించాలని... ఆర్టీపీసీఆర్ ఫలితం వచ్చేదాకా వీరి విషయంలో ఆరోగ్యశాఖ ఇచ్చిన హోం ఐసోలేషన్ ప్రొటోకాల్‌ను పాటించాలని స్పష్టం చేసింది. హోం టెస్టింగ్ మొబైల్ యాప్ గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ స్టోర్లలో అందుబాటులో ఉందని, దీన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. -
ఇక నిమిషాల్లో ఎబోలా నిర్థారణ..
న్యూయార్క్: ప్రాణాంతక వ్యాధి ఎబోలా మహమ్మారిపై శాస్త్రవేత్తలు ఓ ముందడుగు వేశారు. ఎబోలా వ్యాధి సోకిందా లేదా అనే విషయం ఇక నిమిషాల్లో తేలనుంది. ఇందుకోసం వారు చేసిన ప్రయోగాలు విజయవంతమయ్యాయి. సాధారణంగా ఎబోలా వైరస్ డిసీజ్(ఈవీడీ) సోకిన వ్యక్తులకు అంతకుముందు దానిని నిర్థారించేందుకు ర్యాపిడ్ డయాగ్నస్టిక్ టెస్ట్(ఆర్డీటీ) చేసేశారు. ఇది ఎంతో ప్రయాసతో కూడుకున్న పనే కాక.. గంటల తరబడి సమయం వృధా అయ్యేది. కానీ అమెరికాలోని బోస్టన్ చిల్డ్రన్ హాస్పిటల్ కు చెందిన నిరా పొల్లాక్ మాత్రం తాము చేసిన సర్వేలు, పరీక్షల్లో ఎబోలా వైరస్‌ను నిమిషాల్లో గుర్తించే వీలుకలిగిందని చెప్ఆరు. ఇందుకోసం ఆర్ఈఈబీఓవీ యాంటిజెన్ ర్యాపిడ్ టెస్ట, కార్జెనిక్స్ అనే పరీక్ష నిర్వహించామని, దీనిద్వారా గతంలో కన్నా వేగంగా ఎబోలాను గుర్తించడం జరిగిందని తెలిపారు.