ration rise
-
20 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
దుర్గి : రేషన్ మాఫియా ఆగడాలకు అవధులు లేకుండా పోయాయి. విజిలెన్స్, పోలీసు అధికారులు పలుమార్లు అక్రమంగా రవాణా చేస్తున్న బియ్యం వాహనాలను పట్టుకున్నా అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. తాజాగా శుక్రవారం తెల్లవారుజామున విజిలెన్స్ అధికారులు, పోలీసుల జాయింట్ ఆపరేషన్‌లో భారీగా బియ్యాన్ని పట్టుకున్నారు. మండలంలోని అడిగొప్పల, దుర్గి, మాచర్ల పరిసర ప్రాంతాల నుంచి మహిళల ద్వారా రేషన్ మాఫియా ఇంటింటికి తిరిగి సేకరించిన రేషన్ బియ్యాన్ని మినీట్రక్కులతో తరలించి టర్బో లారీలలో నింపి వినుకొండకు తరలించి అమ్మి బియ్యాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. రేషన్ అక్రమ బియ్యాన్ని అరికట్టాలని ప్రజాప్రతినిధులు మీటింగ్‌లలో చెప్పటం తప్పా చేసిందేమీ లేదు. శుక్రవారం లారీలను అదుపులోకి తీసుకున్న విజిలెన్స్ డిఎస్పీ వీవీబీ రమణకుమార్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ పల్నాడు ప్రాంతంలోని గ్రామాలలో సేకరించిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు ముందస్తు సమాచారం అందిందన్నారు. దుర్గి పోలీసుల సహకారంతో అడిగొప్పల కుడికాలువ వద్ద టర్బో లారీ, మినిట్రక్కులలో ఉన్న 300 బస్తాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. విజిలెన్స్ అధికారులు టి.వెంకటేశ్వర్లు, ఎస్సై ఎన్.శ్రీనివాసరావు, హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు, కానిస్టేబుల్స్ నాంచారయ్య, భూపతి, శివకృష్ణ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. తహశీల్దార్ ఏసుబాబు, అడిగొప్పల వీఆర్వో యలమంద, ఎస్సై సుబ్బానాయుడులతో పంచనామా నిర్వహించి మాచర్లకు తరలిస్తామని తెలిపారు. లారీ డ్రైవర్లు వడితె రాజు, దువ్వూరి విశ్వరూపాచారీలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి దుర్గి పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. ఎవరికైనా రేషన్ అక్రమ తరలింపు గురించి సమాచారం తెలిస్తే 8008203289, 8008203288లకు సమాచారం అందించాలన్నారు. -
20 టన్నుల, రేషన్, పట్టివేత

నత్తనడకన రేషన్ బియ్యం అక్రమ తరలింపు కేసు
డ్రైవరు, కూలీలు సరే అసలు సూత్రధారులేరీ.. అధికార పార్టీలో కీలక నేత తీరుపై సీఎంకు ఫిర్యాదు మాచర్ల (గుంటూరు జిల్లా): రాత్రంతా వేచిఉండి రేషన్ షాపుల నుంచి వినుకొండకు అక్రమంగా తరలిస్తున్న బియ్యం లారీని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకష్ణారెడ్డి పోలీసులకు అప్పగించిన సంగతి తెలిసిందే. కాగా ఈ కేసులో అసలు సూత్రధారుల విషయంలో పోలీసులు ఇంకా నాన్చుతున్నారు. డిపోల నుంచి రేషన్ బియ్యం తీసుకొచ్చి రాత్రికి రాత్రి లారీకి లోడ్ చేసే శక్తి డ్రై వర్, క్లీనర్, కూలీలకు ఉండదు. ముందుగా అడ్వాన్సులు ఇచ్చి ఆయా డిపోల నుంచి టాటాఏస్ వాహనాల్లో బియ్యం బ్యాగులు తీసుకువచ్చి లోడ్ చేస్తారు. ఇదే సమయంలో బియ్యం బ్యాగ్‌లు తీసుకొచ్చిందెవరు... కూలీలకు నగదు చెల్లించేదెవరు... ఈ అక్రమ రవాణాకు సంబంధించి ముందుగా మాట్లాడిందెవరూ అనే విషయాలు డ్రై వర్ నుంచి కూలీల వరకు అందరికీ తెలుసు. ఈ విషయంలో పోలీసులు నిర్లిప్తత ప్రదర్శిస్తూ అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతూ మాట్లాడడంపై పలు విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రస్తుతానికి పోలీసులు కేసు నమోదు చేసి ఎమ్మెల్యే పట్టించిన డ్రై వర్, క్లీనర్, మరో ముగ్గురు కూలీలు కాకుండా వారి స్టేట్మెంట్ ఆధారంగా శ్యామరాజపురం గ్రామానికి చెందిన రామారావు, శివాజీ (శివయ్య)లపై కేసు నమోదు చేశారు. ఐదుగురిని అరెస్టు చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు ఎ.ఎస్.ఐ. ఇస్మాయిల్ సాక్షికి తెలిపారు. రేషన్ బియ్యం అక్రమ తరలింపులో కీలక పాత్ర పోషిస్తూ, ప్రతి నెల లక్షలాది రూపాయలు సంపాదిస్తున్న ఆ నాయకుడు నామినేటెడ్ పదవిలో ఉండడం వల్లే పోలీసులు సైతం మిన్నకుండిపోతున్నారని అధికార పార్టీలో ఉన్న ఓ మాజీ పోలీసు అధికారి ముఖ్యమంత్రికి ఫిర్యాదుచేశారు. ఈ విషయాన్ని అధికార పార్టీ నాయకులే చెప్పడం గమనార్హం. -
ఆరు క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం
మాచర్ల (గుంటూరు): పట్టణంలోని ఎస్కేబీఆర్ ప్రభుత్వ కళాశాల వెనుక భాగంలోని కోళ్ల ఫారం వద్ద నుంచి అక్రమంగా ఆటోలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టణ ఆర్ఐ శ్రీధర్ స్వాధీన పర్చుకున్నారు. పట్టణం నుంచి హాలియాకు తరలించేందుకు ఇద్దరు వ్యక్తులు బియ్యాన్ని ఆటోలో ఎక్కించి సిద్ధంగా ఉంచారు. సమాచారం అందుకున్న ఆర్ఐ రంగంలోకి దిగి 15 బస్తాల (ఆరు క్వింటాళ్ల) రేషన్ బియ్యాన్ని స్వాధీన పర్చుకుని ఆటో డ్రై వర్తో సహా మరో ఇద్దరిని పోలీసుల సాయంతో అదుపులోకి తీసుకున్నారు. -
జమ్మికుంటలో రేషన్ బియ్యం పట్టివేత
జమ్మికుంట : జమ్మికుంట రైల్వే స్టేషన్ నుంచి రాత్రి సమయంలో రైళ్లలో మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని జమ్మికుంట పోలీసులు పట్టుకున్నారు. శనివారం రాత్రి నాగ్‌పూర్ ప్యాసింజర్‌లో రేషన్ బియ్యాన్ని తరలించేందుకు గుర్తు తెలియని వ్యక్తులు మొదటి ప్లాట్‌ఫాం 32 సంచుల్లో 20 క్వింటాళ్లు ఉంచారు. ఇదే సమయంలో జమ్మికుంట ఎస్సై సంజయ్‌కుమార్ తన సిబ్బందితో రైల్వే స్టేషన్లో తనిఖీలు చేపట్టగా ప్లాట్‌ఫాంపై 32 సంచులు కనిపించాయి. వెంటనే పోలీసులు సంచులను తెరిచి చూడగా అందులో రేషన్ బియ్యం కనిపించాయి. పోలీసులను గమనించి రవాణాదారులు అక్కడి నుంచి జారుకున్నారు. పట్టుబడిన బియ్యాన్ని ఠాణాకు తరలించారు.