Rayalaseema background
-
రాయలసీమ రమ్మంటోంది
రాయలసీమ నేపథ్యం సినిమాలంటే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన ఎన్నో సినిమాలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. ఇటీవలి కాలంలో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్ ‘పుష్ప: ది రూల్’ కూడా రాయలసీమ నేపథ్యంలో రూపొందిన సినిమాయే. కాగా ప్రస్తుతం ‘రాయలసీమ రమ్మంటోంది’ అంటూ కొందరు తెలుగు హీరోలు రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమాల వివరాల్లోకి వెళితే...అఖండ తాండవంబాలకృష్ణ కెరీర్లో రాయలసీమ నేపథ్యంలో రూపొందిన ‘సమరసింహారెడ్డి, నరసింహారెడ్డి, ఇటీవలి కాలంలో ‘అఖండ, డాకు మహారాజ్’ వంటి సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. హీరో బాలకృష్ణ–దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన ‘అఖండ’ (2021) మూవీ అనంతపురం నేపథ్యంలో ఉన్న సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ మూవీకి సీక్వెల్‌గా బాలకృష్ణ– బోయపాటి శ్రీను కాంబినేషన్లోనే ‘అఖండ 2: తాండవం’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ సంయుక్త ఓ కీ రోల్ చేస్తున్నారు. ఎం. తేజస్విని నందమూరి సమర్పణలో రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. కాగా ‘అఖండ 2: తాండవం’ కూడా ‘అఖండ’ సినిమా మాదిరి అనంతపురం నేపథ్యంలోనే ఉంటుందని ఊహించవచ్చు. ఈ సినిమాను సెప్టెంబరు 25న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. నవ్వించేకి వస్తుండా! ‘కదిరి నరసింహ సామి సాచ్చిగా ఈ తూరి నవ్వించేకి వస్తుండా!’ అని ఇటీవల తన కొత్త సినిమా గురించి వరుణ్ తేజ్ ‘ఎక్స్’లో షేర్ చేశారు. దీంతో వరుణ్ తేజ్ నెక్ట్స్ మూవీ రాయలసీమ నేపథ్యంలో ఉంటుందని స్పష్టమైపోయింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ వియత్నాంలో జరుగుతున్నాయి. పనిలో పనిగా ఈ మూవీ చిత్రీకరణ కోసం లొకేషన్లను కూడా వెతుకుతున్నారు మేకర్స్. ఈ పనుల కోసం హీరో వరుణ్ తేజ్, దర్శకుడు మేర్లపాక గాంధీ ప్రస్తుతం వియత్నాంలోనే ఉన్నారు. హారర్–కామెడీ జానర్లో రూపొందనున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మార్చి మొదటి వారంలో ప్రారంభం కానుంది. ఈ సినిమా ప్రధానంగా అనంతపురం నేపథ్యంలో ఉంటుందని, ‘కొరియన్ కనక రాజు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని తెలిసింది. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మించనున్నాయి.19వ శతాబ్దంలో...‘టాక్సీవాలా’ (2018) వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్లో మరో చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించనున్న ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీ రాయలసీమ నేపథ్యంలో సాగుతుంది. 19వ శతాబ్దంలో 1854–1878 మధ్య కాలంలో జరిగిన కొన్ని చారిత్రక వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందనున్నట్లుగా తెలుస్తోంది. భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన కాలంలో జరిగిన కొన్ని చారిత్రక అంశాలను ఈ మూవీలో ప్రస్తావించనున్నట్లు తెలిసింది. వచ్చే నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూట్ ప్రారంభం కానుందట. ఈ మూవీలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటించనున్నట్లు ప్రచారం సాగుతోంది. గతంలో ‘గీత గోవిందం, డియర్ కామ్రేడ్’ చిత్రాల్లో విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా జంటగా నటించిన విషయం తెలిసిందే. అలాగే ఈ చిత్రంలోని ప్రధాన పాత్రలకు అమితాబ్ బచ్చన్, హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూలను మేకర్స్ సంప్రదించారనే వార్త ప్రచారంలో ఉంది. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. యాక్షన్ లవ్‌స్టోరీ ‘ఏజెంట్’ మూవీ తర్వాత అక్కినేని అఖిల్ తర్వాతిప్రాజెక్ట్పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ అఖిల్ తర్వాతి చిత్రం చిత్రీకరణ ఆల్రెడీ మొదలైందని, రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ లవ్‌స్టోరీ ఫిల్మ్‌కి ‘లెనిన్’ అనే టైటిల్ అనుకుంటున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఈ చిత్రంలో అఖిల్ సరసన శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారని తెలిసింది. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్ దర్శకుడు మురళీ కిశోర్ ‘లెనిన్’ని తెరకెక్కిస్తున్నట్లుగా తెలిసింది. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఈ మూవీని నిర్మిస్తున్నాయని సమాచారం. మాస్ సంబరాలు ‘ఏటి గట్టు సాచ్చిగా చెబ్తాండ ఈ తూరి నరికినానంటే అరుపు గొంతులో నుంచి కాదు... తెగిన నరాలొన్నించొచ్చాది!... ‘సంబరాల ఏటిగట్టు’ చిత్రం కోసం సాయిదుర్గా తేజ్ చెప్పిన డైలాగ్ ఇది. దాదాపు రూ. 100 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ ఇంటెన్స్ యాక్షన్ ΄్యాక్డ్ మూవీని కొత్త దర్శకుడు రోహిత్ కేపీ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం రాయలసీమ నేపథ్యంలో ఉంటుందని తెలిసింది. ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్నారు. కాగా రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ చిత్రం తొలి భాగం సెప్టెంబరు 25న రిలీజ్ కానుంది.రాజకీయం... ప్రతీకారం అప్సరా రాణి, విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘రాచరికం’. సురేశ్ లంకలపల్లి దర్శకత్వంలో ఈశ్వర్ నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 1న విడుదల కానుంది. పూర్తిగా రాయలసీమ నేపథ్యంలో సాగే ఫిల్మ్ ఇది. లవ్, యాక్షన్, రాజకీయాలు, ప్రతీకారం వంటి అంశాలతో ఈ చిత్రం రూపొందింది. రాయలసీమ నేపథ్యంలో మరికొందరు కుర్ర హీరోలు సినిమాలు చేస్తున్నారు. ఇంకొందరు రాయలసీమ కథలు వింటున్నారు. – ముసిమి శివాంజనేయులు -
కేరాఫ్ రాయలసీమ!
‘కేరాఫ్ కంచరపాలెం’తో కంచరపాలెం గ్రామంలో జరిగే కథను కళ్లకు కట్టారు దర్శకుడు వెంకటేశ్ మహా. ఆ తర్వాత ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ తెరకెక్కించారు. తాజాగా రానా హీరోగా ఓ సినిమా తెరకెక్కించడానికి వెంకటేశ్ మహా సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. రాయలసీమ బ్యాక్ డ్రాప్లో జరిగే పీరియాడికల్ చిత్రం ఇది అని తెలిసింది. ఈ స్క్రిప్ట్‌కి సంబంధించిన చర్చలు పూర్తయ్యాయట. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ–ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని టాక్. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. వెంకటేశ్ మహా తొలి చిత్రం ‘కేరాఫ్ కంచరపాలెం’ను సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రానా సమర్పించిన సంగతి గుర్తుండే ఉంటుంది. -
నేనూ రాయలసీమ బిడ్డనే: అనంత కలెక్టర్
‘‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అవినీతి ఏ స్థాయిలో జరిగినా సహించేది లేదని తేల్చిచెప్పారు. జిల్లాలో ఎవరైనా అవినీతికి పాల్పడితే సహించేది లేదు. ఎంతటివారైనా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజలకు సేవకులుగా వారికి సేవ చేయాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉంది. నాకు జిల్లా ఉద్యోగులపై నమ్మకం ఉంది. అయితే, ఎవరైనా అవినీతికి పాల్పడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు. ఉక్కుపాదంతో అణచివేస్తాం.’’ అని కలెక్టర్ గంధం చంద్రుడు తేల్చిచెప్పారు. సామాజిక అభివృద్ధి విజన్ ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో జిల్లా అభివృద్ధికి బాటలు వేస్తానని ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. – సాక్షి ప్రతినిధి, అనంతపురం సాక్షి, అనంతపురం: నేనూ రాయలసీమ బిడ్డనే. రాయలసీమను రతనాల సీమగా పిలిచేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. మళ్లీ పూర్వవైభవం కోసం ప్రజలు, ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, మీడియా, ప్రజా సంఘాల సహకారంతో ముందుకు వెళతాను. జిల్లాకు 100వ కలెక్టరుగా రావడం...అది నాకు కలెక్టరుగా మొదటి పోస్టింగు కావడం గర్వంగా ఉంది. జిల్లా అభివృద్ధికి ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అందరి సహకారంతో ముందుకు సాగుతాను. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో సామాజిక– ఆర్థిక అభివృద్ధి అనే కోణం ఉంది. తప్పకుండా అది నేరవేర్చేందుకు కృషి చేస్తాను. ‘వైఎస్సార్ నవశకం’ కార్యక్రమం ద్వారా అన్ని సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువచేస్తాం. జిల్లాలో ఉన్న అపార అవకాశాలను ఉపయోగించి అగ్రభాగాన నిలబెట్టేందుకు అహర్నిశలు కృషిచేస్తాను. నాలుగు అంశాలతో ముందుకు...! పాలనలో నాలుగు అంశాలను ప్రాధాన్యతగా తీసుకుని పనిచేస్తాను. మొదటగా నేరుగా ప్రజల అవసరాలు ఏమిటి? వారి సమస్యలు ఏమిటి? పరిష్కారం ఎలా అన్న అంశాలపై దృష్టిసారిస్తాను. ఆ తర్వాత ప్రజా ప్రతినిధులు... వారి ద్వారా వచ్చే ప్రజాసమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఫోకస్ పెడతాను. ఆ తర్వాత ఉద్యోగులు... పాలనకు వీరి సహకారం ఎంతో అవసరం. అందువల్ల ప్రజాసమస్యల పరిష్కారంలో వారి సలహాలతో పరిష్కారంపై దృష్టి సారిస్తాను. ఆ తర్వాత మీడియా, ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు... వీరి ద్వారా నా దృష్టికి వచ్చే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. ఇలా సమన్వయం చేసుకుంటూ అందరినీ ఒక మార్గంలోకి తీసుకు వచ్చి పని చేసే బాధ్యత టీం లీడర్‌గా జిల్లా కలెక్టర్ పైన ఉంటుంది. ప్రజల నుంచి, ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చే అంశాలపై యంత్రాంగం వెంటనే స్పందించేలా చూస్తా. సామాజిక–ఆర్థిక అభివృద్ధి దిశగా...! సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం సామాజిక–ఆర్థిక అభివృద్ధి కోణంలో పాలన సాగిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కేవలం ఆర్థికాభివృద్ధి కోణంలో కాకుండా సామాజిక అభివృద్ధి కోణంలో కూడా ఉన్నాయి. నామినేటెడ్ పోస్టులు, పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం వాటా ఇవ్వడం ఇలా సామాజిక అభివృద్ధి కోణం ఉంది. పరిశ్రమలల్లో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కూడా ఇక్కడి ప్రాంత అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది. అదే విధంగా ‘మనబడి–నాడు నేడు’ అద్భుతమైన కార్యక్రమం. ప్రజలు అభివృద్ధి చెందాలంటే ముఖ్యమైనది విద్య. విద్య మీద దృష్టి సారిస్తే అన్ని విషయాల్లో అభివృద్ధి సాధ్యమవుతుంది. పాఠశాలల్లో అన్నిరకాల మౌలిక సదుపాయాలు...మరుగుదొడ్లు, విద్యుత్, నీటి సౌకర్యంతో పాటు ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడటం అన్నీ ప్రభుత్వం చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సామాజిక విజన్‌ను అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లాడానికి నా శక్తిమేరకు కృషి చేస్తాను. ఇంకా ఇక్కడ మూఢనమ్మకాల నిర్మూలనతో పాటు, కులాల దొంతరలను తొలగించేందుకు కృషి చేస్తాను. అనంత..అవకాశాల గని! అనంతపురం జిల్లాలో అపార అవకాశాలున్నాయి. ఒకవైపు సుదీర్ఘ రహదారులు, దగ్గరలోనే విమానాశ్రయం, అపారమైన మానవ వనరులు, విశాలమైన భూములతో పాటు అనేక మౌలిక సదుపాయాలు ఉన్నాయి. చెన్నై–బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో జిల్లా అంతర్భాగంగా ఉంది. తద్వారా పరిశ్రమల ఏర్పాటుకు మంచి అవకాశాలు ఉన్నాయి. ఇక లైమ్‌స్టోన్, బ్లాక్ స్టోన్ వంటి ముడిసరుకు ఉంది. ఇది పరిశ్రమల ఏర్పాటుకు ఎంతో ఉపయోగం. వీటీని ఉపయోగించుకుంటూ ప్రణాళిక ప్రకారం అందరిని సమన్వయం చేసుకుంటూ వెళ్తే అద్భుతాలు సృష్టించవచ్చు. ఒక్కప్పుడు రాయలసీమ రత్నాల సీమ. ఇప్పటి కూడా ఆ విధంగా చేయవచ్చు. నేను రాయలసీమ బిడ్డనే. రాయలసీమలోనే పుట్టి పెరిగినవాడినే. ఇక్కడి వాతావరణం తెలుసు. ఇక్కడ భూమి, గాలి, నీరు అన్ని తెలుసు. రాయలసీమ బిడ్డగా జిల్లాను అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తాను. -
సీఎం రమేష్ ఈ నాలుగేళ్లు ఎక్కడికెళ్లావ్
సాక్షి, కడప కోటిరెడ్డి సర్కిల్ : స్వార్థ రాజకీయాల పేరుతో దొంగ దీక్షలు చేపట్టి రాయలసీమ ప్రజలను మోసగించొద్దు. ఈ నాలుగేళ్లలో మీ పుణ్యమా? అని రాయలసీమ నాశనం అయిందని, ఈ ప్రాంత అభివృద్ధి అంశాలపై ఏ చర్చకైనా సిద్ధమా? అని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ విష్ణువర్ధన్‌రెడ్డి టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. శనివారం కడపలోని వైఎస్సార్ మొమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన టీడీపీ తీరుపై నిప్పులు చెరిగారు. రాయలసీమ ప్రాంతాన్ని నాశనం చేయడానికి కడపను వేదికగా చేసుకుని రాజకీయాలు చేయడానికి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.దీనిని తిప్పి కొట్టడానికి రెండు కోట్ల జనాభా సిద్ధంగా ఉందని హెచ్చరించారు. నాలుగేళ్లుగా సీఎం మొదలుకుని టీడీపీ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కడపలో ఉక్కుఫ్యాక్టరీ సాధ్యం కాదని పలు వేదికలపై చెప్పి ఇప్పుడు ఏర్పాటుకు కేంద్రం వ్యతిరేకిస్తోందని నెపం వేస్తే సహించేది లేదన్నారు. కడప ఉక్కు పరిశ్రమను మేం బాధ్యతగా తీసుకుంటాం. వైఎస్సార్ జిల్లాలో ఎన్నో పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి, ఉదాహరణకు దాదాపు రూ.250 కోట్లు ఖర్చు చేసిన ఏపీ కార్ల్, చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీ, ప్రొద్దుటూరు, మైదుకూరుల్లోని పాలకర్మాగారాలు, దాణా ఫ్యాక్టరీ, తెలుగు గంగ, హాంద్రీ నీవా ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రాయలసీమ అభివృధ్ధిపై చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేసి బయటకు రావాలని సీఎం రమేష్‌కు విష్ణువర్ధన్‌రెడ్డి సవాల్ విసిరారు. నాలుగేళ్లుగా ఉక్కుఫ్యాక్టరీ గురించి ఏ మాత్రం పట్టించుకోని మీరు ఇప్పుడు తగుదునమ్మా అంటూ దీక్షలు చేస్తామనడం సిగ్గు అనిపించలేదా? అని ప్రశ్నిస్తున్నామన్నారు. రాయలసీమను రెండో రాజధానిగా ప్రకటించే ధైర్యం టీడీపీకి ఉందా? పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, జమ్ముకాశ్మీర్‌లు రెండో రాజధానిలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారని, అదే తరహాలో రాయలసీమలో రెండో రాజధానిని 30 రోజుల్లో ప్రభుత్వంతో ఒప్పించి ఏర్పాటు చేయించగలరా? అని సవాల్ చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకులు కందుల రాజమోహన్‌రెడ్డి, సింగారెడ్డి రామచంద్రారెడ్డి, పార్థసారధి,గోసుల శ్రీనివాసరెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగాధర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు పుప్పాల శ్రీనాధరెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు భవానీరెడ్డి, తదితరులు పాల్గొని మాట్లాడారు. -
అసామాన్యుడు
కష్టమైన డైలాగ్స్ కూడా ఎన్టీఆర్ నోటి నుంచి సులభంగా వచ్చేస్తాయి. ఆయనలో ఆ సత్తా ఉంది. అందుకు ఓ నిదర్శనం ‘అదుర్స్’ సినిమాలో చేసిన బ్రాహ్మణ కుర్రాడి పాత్ర. రీసెంట్గా ‘జై లవకుశ’ సినిమాలో నత్తిగా మాట్లాడే జై క్యారెక్టర్‌ను అద్భుతంగా చేశారు. ఇప్పుడు చిత్తూరు యాసలో డైలాగ్స్‌ను అదరగొట్టనున్నారట ఎన్టీఆర్. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఎస్. రాధకృష్ణ ఓ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో సాగనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ ఆల్మోస్ట్ చిత్తూరు యాసలోనే డైలాగ్స్ పలుకుతారని సమాచారం. అందుకోసం నానీ హీరోగా నటించిన ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాలో చిత్తూరు యాసలో ‘దారి చూడు మామా’ అనే మాసీ సాంగ్ రాసి, పాడిన పెంచల్ దాస్‌ను బోర్డ్లోకి తీసుకున్నారట. ఆయన ఎన్టీఆర్‌కు చిత్తూరు యాసలో ట్రైనింగ్ ఇస్తారని టాక్. అంతేకాదు ఈ సినిమాకు ‘సింహనంద, అసామాన్యుడు’ అనే టైటిల్స్‌ను అనుకుంటున్నారని ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. జగపతిబాబు, నాగబాబు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో పూజాహెగ్డే కథానాయిక. -
ఊరికి పెద్ద... నలుగురు తమ్ముళ్లకు అన్నయ్య
పంచెకట్టు.. కోరమీసం... ఇప్పటికే విడుదలైన ‘కాటమరాయుడు’ సినిమాలో స్టిల్స్ చూస్తే పవన్ కల్యాణ్ కొత్తగా కనిపించనున్నారని ఊహించవచ్చు. గత సినిమాల్లో పవన్ కల్యాణ్ ఎప్పుడూ ఈ వేషధారణలో కనిపించలేదు. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ‘కాటమరాయుడు’లో ఆయన ఫ్యాక్షనిస్ట్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఫ్యాక్షనిస్ట్‌గా పవన్ ఆహార్యంతో పాటు మాట తీరు కూడా కొత్తగా ఉంటుందట! ‘‘నలుగురు తమ్ముళ్లకు అన్నగా, ఊరి పెద్ద ‘కాటమరాయుడు’గా పవన్ నటిస్తున్నారు. రాయలసీమ నేటివిటీకి తగ్గట్టు సీమ యాసలో పవన్‌కల్యాణ్ డైలాగులు చెప్పనున్నారు’’ అని యూనిట్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడీ సినిమా చిత్రీకరణ చివరికి వచ్చిందట. కిశోర్ పార్ధసాని (డాలీ) దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రుతీహాసన్ హీరోయిన్. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఉగాదికి... అంటే మార్చి నెలాఖరున ఈ చిత్రాన్ని విడుదల చేయాలను కుంటున్నారు.