ప్రొటోకాల్ సంప్రదాయాన్ని మంటగలిపిన బాబు
పాతముచ్చుమర్రి(పగిడ్యాల): ఆంధ్రప్రదేశ్ గహనిర్మాణ శాఖ మంత్రిగా ప్రజలకు సేవలు అందించిన తన తండ్రి బైరెడ్డి శేషశయనారెడ్డికి ప్రొటోకాల్ ప్రకారం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉన్నప్పటికి సీఎం చంద్రబాబు ఆ సంప్రదాయాన్ని మంటగలిపారని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం పాతముచ్చుమర్రిలోని ఆయన స్వగహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడేళ్లు ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, ఎమ్మెల్సీగా పనిచేసిన తన తండ్రికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించకపోవడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమన్నారు. రాయలసీమ రాష్ట్ర సాధన కోసం పోరాడుతున్న తనపై ఉన్న కక్ష్యతో సీఎం ఫ్రొటోకాల్ సంప్రదాయాన్ని పాటించలేదన్నారు.
రాయలసీమ పుష్కారాల ఏర్పాట్లలో బైరెడ్డి: ఆగష్టు 12వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నిర్వహించే కష్ణా పుష్కరాలకు ధీటుగా రాయలసీమ పుష్కరాలు నిర్వహించేందుకు నిర్ణయించిన బైరెడ్డి అందుకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఆదివారం పుష్కరాల నిర్వహణకు సంబంధించిన స్థలాన్ని ఆయన పరిశీలించారు.