RBI counter
-
వెలవెలబోతున్న బ్యాంక్‌లు
సాక్షి, చైన్నె : రూ. 2 వేల నోట్ల మార్పిడి కోసం బ్యాంక్‌లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయితే, బ్యాంక్‌లన్నీ వెలవెల బోయాయి. రిజర్వు బ్యాంక్ వద్ద మాత్రం జనం బారులు తీరి కనిపించారు. వివరాలు.. రూ. 2 వేల నోటును రద్దు చేస్తూ రిజర్వు బ్యాంక్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ నోట్లను తీసుకునేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. దీంతో తమ వద్ద ఉన్న నోట్లను బ్యాంక్‌ల ద్వారా మార్చుకోవచ్చని రిజర్వు బ్యాంక్ ప్రజలకు ఊరట కలిగింది. ఇందు కోసం బ్యాంక్‌లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. మంగళవారం నుంచి అన్ని బ్యాంక్‌లలో రూ. 2 వేల నోట్ల మార్పిడి కోసం చర్యలు తీసుకున్నారు. అయితే, బ్యాంక్‌లన్నీ వెల వెలబోయాయి. పెద్ద సంఖ్యలో జనం బారులు తీరుతారని భావించి ఏర్పాట్లు చేసినా, ఆ మేరకు ఖాతాదారులు రాకపోవడం గమనార్హం. ఇక, రాష్ట్రంలో అనేక ప్రైవేటు బ్యాంక్‌లు నోట్ల మార్పిడి కోసం వచ్చిన వారికి దరఖాస్తుల ఫాంలు ఇచ్చి పూర్తి చేయాలని సూచరించడం గమనార్హం. అయితే, ఎలాంటి వివరాలను తెలియజేయాల్సిన అవసరం లేదని రిజర్వు బ్యాంక్ పేర్కొన్నా, ప్రైవేటు బ్యాంక్‌లు వివరాలను సేకరించడం వివాదానికి దారి తీసింది. ఇక, చైన్నెలోని రిజర్వు బ్యాంక్ వద్ద ఉదయాన్నే జనం బారులు తీరి, తమ వద్ద ఉన్న నోట్లను మార్చుకున్నారు. ఒకొక్కరు రూ. 20 వేల వరకు తమ వద్ద ఉన్న రూ 2 వేల నోట్లను అందజేసి రూ. 500 నోట్లను తీసుకెళ్లారు. -
యస్ బ్యాంక్ మాజీ బాస్ బోనస్ వెనక్కి
న్యూఢిల్లీ: కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలు, మొండిబాకీల సమస్యలతో సతమతమవుతున్న ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ తాజాగా అసాధారణ నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ ఆదేశాల మేరకు మాజీ ఎండీ రాణా కపూర్‌కు చెల్లించిన రూ. 1.44 కోట్ల బోనస్‌లను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. బోనస్ కింద 2014–15లో రూ. 62.17 లక్షలు, 2015–16లో చెల్లించిన రూ. 82.45 లక్షల మొత్తాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల మేరకు వెనక్కి తీసుకోవాలని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయించినట్లు సంస్థ వెల్లడించింది. 2016–17, 2017–18 ఆర్థిక సంవత్సరాలకు గాను కపూర్‌కు బోనస్‌లేమీ చెల్లించలేదని పేర్కొంది. 2004లో ప్రారంభమైన యస్ బ్యాంక్ వ్యవస్థాపకుల్లో కపూర్ కూడా ఒకరు. ఆయనకు ఇప్పటికీ బ్యాంకులో 4.32 శాతం వాటా కూడా ఉంది. నిబంధనల అమలుపరమైన వివాదాల కారణంగా కపూర్ పదవీకాలాన్ని పొడిగించేందుకు ఆర్బీఐ నిరాకరించడంతో ఆయన వైదొలగాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో రూ. 6 కోట్ల వార్షిక ప్యాకేజీతో రవ్నీత్ గిల్ నియమితులయ్యారు. ముందు జాగ్రత్త చర్య.. మరోవైపు, బ్యాంకు బోర్డులో రిజర్వ్ బ్యాంక్ మాజీ డిప్యుటీ గవర్నర్ ఆర్ గాంధీని అదనపు డైరెక్టరుగా ఆర్బీఐ నియమించడం ముందుజాగ్రత్త చర్యగా అనలిస్టులు అభిప్రాయపడ్డారు. గతంలో ధన్లక్ష్మి బ్యాŠంక్, లక్ష్మీ విలాస్ బ్యాంక్ (ఎల్వీబీ)ల్లో కూడా ఆర్బీఐ అదనపు డైరెక్టర్లను నియమించిన సంగతి గుర్తు చేశారు. ఈ రెండింటి పరిస్థితి దారుణంగా ఉండేదని, వీటితో పోలిస్తే చాలా పెద్ద సంస్థ అయిన యస్ బ్యాంక్ విఫలమైన పక్షంలో మరిన్ని ప్రతికూల ప్రభావాలు ఉండొచ్చనే ఉద్దేశంతోనే ముందు జాగ్రత్తగానే ఆర్బీఐ వ్యవహరించి ఉంటుందని మెక్వారీ రీసెర్చ్ సంస్థ అభిప్రాయపడింది. అటు గాంధీ నియామకం సానుకూల, నిర్మాణాత్మక చర్య గా యస్ బ్యాంక్ అభివర్ణించింది. పటిష్టమైన యస్ బ్యాంక్‌కు ఆర్బీఐ పూర్తి స్థాయిలో తోడ్పాడు అందిస్తోందని పేర్కొంది. గాంధీ నియామకం వల్ల కార్యకలాపాలకేమీ ఆటంకాలు ఉండబోవని తెలిపింది. -
దేశ ప్రయోజనాల కోసమే ‘నోట్ల రద్దు’
రాజ్యాంగవిరుద్ధం కాదు ►హైకోర్టులో ఆర్బీఐ కౌంటర్ ►నకిలీ నోట్లు, నల్లధనాన్ని రూపుమాపేందుకే నిర్ణయం ► ఆర్బీఐ విధానాల్లో జోక్యం తగదని విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసులు చేసినట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గురువారం ఉమ్మడి హైకోర్టుకు నివేదిం చింది. పెద్ద నోట్ల రద్దు వల్ల దేశంలో ఆర్థిక సుస్థిరత నెలకొం టుందని వివరించింది. ‘‘వ్యక్తిగత ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలనే పరిగణనలోకి తీసుకోవాలి. సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకునే, నగదును ఎక్కువమంది డిపాజిట్‌దారులకు అందుబాటులో ఉంచేందుకే ఉపసంహ రణ విషయంలో పరిమితులు విధించాం. లెక్కల్లో చూపని డబ్బున్న వారికి మాత్రమే పెద్ద నోట్ల రద్దు ఇబ్బందిగా పరిణ మించింది. నిజాయితీపరులకు ఇది ఏమాత్రం ఇబ్బందిగా మారలేదు. పాత నోట్లను డిపాజిట్‌కు, మార్పిడికి తగిన ఏర్పాట్లు చేశాం. ఇక నోట్ల రద్దు నిర్ణయం ఎంత మాత్రం రాజ్యాంగ విరుద్ధం కాదు. చట్ట నిబంధనలకు లోబడి తీసుకున్నదే’’ అని పేర్కొంది. రూ.1000, రూ.500 నోట్ల రద్దుకు సంబంధించి కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌ను చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరు తూ హైదరాబాద్‌కు చెందిన సుక్కా వెంకటేశ్వరరావు, న్యాయవాది కె.శ్రీనివాస్, నగదు ఉపసంహరణ పరిమితు లను సవాలు చేస్తూ మాజీ మంత్రి ఎం.వి.మైసూరారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాలపై విచారణ జరుపుతున్న హైకోర్టు, ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆర్బీఐని, కేంద్రాన్ని ఆదేశించడం తెలిసిందే. ఈ మేరకు ఆర్బీఐ ఇష్యూ డిపార్ట్మెంట్ ఏజీఎం మనభంజన్ మిశ్రా కౌంటర్ దాఖలు చేశారు. ఆర్బీఐ చట్ట నిబంధనలను అనుసరించి, ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ సిఫారసుల మేరకే పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిం దని అందులో పేర్కొన్నారు. ‘‘ఇటీవలి కాలంలో నకిలీ నోట్ల చలామణి అధికమైంది. ఆర్థిక వ్యవస్థకు, దేశ భద్రతకు పెను ముప్పుగా పరిణమించిన ఈ బెడదను అడ్డుకునే చర్యలో భాగంగానే పెద్ద నోట్ల రద్దు సిఫార్సు జరిగింది. మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు, ఉగ్రవాదానికి దేశ ఆర్థిక భద్రతను దెబ్బ తీసేందుకు నకిలీ నోట్లను అత్యధికంగా వినియోగిస్తున్నారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే నోట్ల రద్దుపై ఆర్బీఐ సెంట్రల్ బోర్డు సిఫారసులను అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల దేశ ద్రవ్యవ్యవస్థ గాడిన పడుతుంది. ఆర్థిక విధానాలకు సంబంధించి ఆర్బీఐ తీసుకునే నిర్ణయాలను సుప్రీంకోర్టు సమర్థించింది. నోట్ల రద్దుపై ముందస్తు సమాచారమిస్తే అసలు లక్ష్యం నెరవేరకుండా పోతుంది. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా బ్యాంకులు, పోస్టాఫీసులు తదితర చోట్ల నోట్ల మార్పిడికి, డిపాజిట్‌కు అవకాశం కల్పించాం. విస్తృత ప్రజా ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకున్నప్పుడు, వ్యక్తుల హక్కులకు, ప్రయోజనాలకు కలిగే ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోరాదు. ఇలాంటి వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకుంటే తద్వారా ఎదురయ్యే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి’’ అని కౌంటర్లో వివరించారు. ఈ దృష్ట్యా వ్యాజ్యాలన్నింటినీ భారీ జరిమానాలతో కొట్టేయాలని కోర్టును కోరారు. శుక్రవారం తదుపరి విచారణ జరుపుతామని ధర్మాసనం పేర్కొంది.