real estate bussiness
-
ఛాఛా!! ఆ పిచ్చిపని చేయకపోతే మరో వెయ్యికోట్లు సంపాదించే వాడిని: రాకేష్ ఝున్‌ఝున్‌వాలా
ముంబై: బ్లూచిప్ స్టాక్స్‌తో పోలిస్తే రియల్టీ డెవలపర్లు తక్కువ రిటర్నులతోనే నెట్టుకొస్తున్నట్లు సుప్రసిద్ధ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా పేర్కొన్నారు. అందుబాటు ధరల హౌసింగ్ ప్రాజెక్టులు చేపట్టే సంస్థలు మాత్రమే స్టాక్ ఎక్ఛేంజీలలో లిస్టింగ్‌కు వెళ్లగలవని అభిప్రాయపడ్డారు. ఆశించిన స్థాయిలో అమ్మకాల పరిమాణాన్ని సాధించగలగడం దీనికి కారణమని తెలియజేశారు. డీఎల్ఎఫ్, మాక్రో డెవలపర్స్ తదితర కొద్ది సంస్థలు మాత్రమే లిస్టింగ్‌ను చేపట్టినట్లు పేర్కొన్నారు. డీఎల్ఎఫ్ షేరును తీసుకుంటే ఒకప్పుడు రూ.1,300 ధర నుంచి రూ.80కు పడిపోవడాన్ని ప్రస్తావించారు. ఇది రియల్టీ విభాగంలోని రిస్కులను వెల్లడిస్తున్నట్లు తెలియజేశారు. ఆకాశ పేరుతో ఇటీవల విమానయాన కంపెనీ ఏర్పాటుకు తెరతీసిన ఝున్‌ఝున్‌వాలా.. రేర్ ఎంటర్ప్రైజెస్ ద్వారా స్టాక్ మార్కెట్, తదితర బిజినెస్‌లలో ఇన్వెస్ట్ చేసే సంగతి తెలిసిందే. ఆధారపడలేం తాను రియల్టీ డెవలపర్‌ను అయి ఉంటే కంపెనీని లిస్టింగ్ చేయబోనంటూ రాకేష్ వ్యాఖ్యానించారు. అనిశ్చితులతో కూడిన బిజినెస్ కావడమే దీనికి కారణమని తెలియజేశారు. రియల్ఎస్టేట్ రంగంపై సీఐఐ నిర్వహించిన ఒక సదస్సులో రాకేష్ ప్రసంగించారు. బ్లూచిప్ స్టాక్స్ 18–25 శాతం లాభాలను అందిస్తున్న సమయంలో 6–7 శాతం రిటర్నులకు పరిమితమయ్యే రియల్టీని లిస్టింగ్ చేయడంలోని ఔచిత్యాన్ని ఈ సందర్భంగా ప్రశ్నించారు. రియల్టీ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(ఆర్ఈఐటీ)లు, కమర్షియల్ రియల్టీ పట్ల ఇన్వెస్టర్లు ఆశావహం(బుల్లిష్)గా ఉన్నట్లు పేర్కొన్నారు. ఐటీ సర్వీసులు, ఫార్మా తదితర రంగాలు వీటికి దన్నునివ్వవచ్చని అభిప్రాయపడ్డారు. గతంలో పెట్టుబడులు గతంలో ఐదు రియల్టీ ప్రాజెక్టులలో ఇన్వెస్ట్ చేసినట్లు రాకేష్ వెల్లడించారు. తద్వారా లాభాలు ఆర్జించినట్లు తెలియజేశారు. ఇల్లు కొనుగోలుకి ఆసక్తి పెరుగుతున్నదని, ఇకపై రియల్టీ రంగానికి ఆశావహ పరిస్థితులు ఏర్పడనున్నట్లు అంచనా వేశారు. తాను కూడా 2006లో ఇంటి కొనుగోలు కోసం క్రిసిల్ షేర్ల విక్రయం ద్వారా రూ.20 కోట్లు సమకూర్చుకున్నట్లు తెలియజేశారు. అయితే ఈ వాటాను విక్రయించకుంటే ఈరోజు మరో రూ.1,000 కోట్ల సంపదను ఆర్జించేవాడినని తెలియజేశారు. కాగా.. ఆకాశ పేరుతో కొత్త విమానయాన సంస్థ ఏర్పాటుపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. కంపెనీలో రూ. 275 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలియజేశారు. పలు యూరోపియన్ ఎయిర్‌లైన్స్ సంస్థలు దెబ్బతిన్న సమయంలో ప్రారంభమైన ర్యాన్ ఎయిర్ తొలి రోజునుంచే లాభాలు ఆర్జించిన విషయాన్ని ఈ సందర్భంగా రాకేష్ ప్రస్తావించారు. స్టాక్ మార్కెట్లో లాభాలు ఆర్జించినట్లే ఆకాశ సంస్థను విజయవంతం చేయగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. -
నర్సరావుపేటలో రియాల్టర్ దారుణ హత్య
గుంటూరు : నర్సరావుపేటలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి శనివారం దారుణ హత్యకు గురయ్యాడు. రావిపాడు రోడ్డులోని ఓ వెంచర్ సమీపంలో వ్యాపారి తడికమల్ల రమేష్ మృతదేహం లభ్యమైంది. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా రెండు కోట్ల రూపాయల లావాదేవీలే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
చీటీల పేరుతో టోపీ
కొడవలూరు, న్యూస్‌లైన్: ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. నమ్మకమే పెట్టుబడిగా వ్యాపారం ప్రారంభించాడు. ఐదేళ్ల వ్యవధిలోనే అందరికీ నమ్మకస్తుడిగా మారాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటూ బిల్డప్ ఇచ్చాడు. నగదు లావాదేవీలు సక్రమంగా నిర్వర్తించడంతో ఆహా..ఓహో..అంటూ అందరూ నమ్మారు. వెనుకా..ముందూ చూసుకోకుండా లక్షల రూపాయల చీటీలు కట్టారు. అంతా అనుకున్నట్టే జరగడంతో అందరినీ ముంచి రూ.2 కోట్లతో గుట్టుచప్పుడు కాకుండా ఉడాయించాడు. మోసపోయామని గ్రహిం చిన సుమారు 250 మంది ఇప్పుడు లబోదిబోమంటూ గుండెలు బాదుకుంటున్నారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం సోమవారం వెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం మేరకు..కొడవలూరు మండలం చింతచెలికకు ఐదేళ్ల క్రితం కృష్ణారావు అనే వ్యక్తి ఓ మహిళతో కలసివచ్చి ఓ ఇంట్లో కాపురముంటున్నాడు. మొదట్లో ఇళ్ల స్థలాల కొనుగోళ్లు, అమ్మకాలు జరిపాడు. ఈ వ్యాపారంతో అందరితో పరిచయాలు పెంచుకున్నాడు. ఆర్భాటంగా, అందరితో కలివిడిగా ఉండేవాడు. అందరి వద్ద నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకున్న తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారానికి స్వస్తి చెప్పి చీటీల వ్యాపారం ప్రారంభించాడు. మొదట్లో రూ.20 వేల చీటీతో వ్యాపారం ప్రారంభించాడు. ఖాతాదారులకు చెల్లింపులు సక్రమంగా చేస్తూ నమ్మకాన్ని పెంచుకున్నాడు. వ్యాపారాన్ని కూడా రూ.50 వేలు, లక్ష రూపాయల చీటీలకు విస్తరించాడు. ఇలా సుమారు రూ.2 కోట్లకు పైగా లావాదేవీలు నడుపుతున్నాడు. పక్కా ప్లాన్‌తోనే.. ప్రస్తుతం కృష్ణారావు రూ.లక్ష చీటీలు 8, రూ.50 వేల చీటీలు రెండు, రూ.30 వేల చీటీలు ఒకటి నడుపుతున్నాడు. వీటిలో దాదాపు 250 మంది సభ్యులుగా ఉన్నారు. ఎక్కువ లబ్ధిదారులు మహిళలే. పక్కాప్లాన్‌తో ముందుకు సాగుతున్న కృష్ణారావు కొన్ని నెలలుగా చీటీలు పాడుకున్న వారికి నగదు చెల్లింపులు నిలిపేశాడు. గట్టిగా అడిగిన వారికి స్థలాలు కొన్నందున నగదు బ్లాక్ అయిందని, త్వరలోనే చెల్లిస్తానంటూ నమ్మిస్తూ వచ్చాడు. నెలలు గడుస్తున్నా ఫలితం లేకపోవడంతో అనుమానంతో ఖాతాదారులు ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో నాలుగు రోజుల నుంచి కనిపించకుండా పోయాడు. అతనితో కలిసి ఉంటున్న మహిళను బాధితులు నిలదీయగా తనకే మీ తెలియదంటూ ఆమె సమాధానమిచ్చారు. దీంతో పోలీసులను ఆశ్రయించారు. ఈ లావాదేవీలకు ఎలాంటి అనుమతులు లేకపోవడంతో పోలీసులు ఆధారాల కోసం ఆరా తీస్తున్నారు. కృష్ణారావు ఎక్కడా స్థలాలు కొనలేదని నిర్ధారణకు వచ్చారు. రూ.2 కోట్లకు పైగా మోసపోయామని బాధితులు వాపోతున్నారు. కృష్ణారావు ఇంట్లోని పుస్తకంలో అన్ని వివరాలు ఉన్నాయని, వాటి ఆధారంగా తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నాం గ్రామంలోకి వెళ్లి విచారించాను. కృష్ణారావును నమ్మి చాలా మంది చీటీలు కట్టినట్లు తెలుస్తోంది. అయితే ఎవరి వద్దా రశీదులు లేవు. ఆయనేమి ప్రభుత్వ అనుమతి పొందిన వ్యాపారి కాదు. దీన్ని సివిల్ విషయంగా పరిగణించాల్సి వస్తోంది. కాని చాలా మంది ఆర్థికంగా నష్టపోవడంతో వాటికి సంబంధించిన ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నాం. నిందితుడి కోసం గాలిస్తాం. నరేష్, ఎస్సై, కొడవలూరు -
మద్దూరు ఎమ్మెల్యే కుమారుడిపై చీటింగ్ కేసు
బెంగళూరు, న్యూస్‌లైన్: భూ లావాదేవీల వ్యవహారంలో మోసగించి రూ. 9 కోట్లు స్వాహా చేశారని ఆరోపిస్తూ ఇక్కడి సంజయ్‌నగర పోలీసులు ఓ ఎమ్మెల్యే కుమారుడిపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వ ుండ్య జిల్లా మద్దూరు ఎమ్మెల్యే డీసీ. తమ్మణ్ణ కుమారుడు సంతోష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు ... సంతోష్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. అత్తిబెలె దగ్గర భూమి తీసిస్తాన ని న మ్మించి తన దగ్గర రూ. 9 కోట్లు తీసుకుని మోసం చేశాడని లక్ష్మణ్ అనే వ్యక్తి సెషన్స్ కోర్టులో కేసు దాఖలు చేశాడు. విచారణ చేసిన న్యాయస్థానం సంతోష్‌పై కేసు నమోదు చేసి నివేదిక ఇవ్వాలని సంజయ్‌నగర పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు పో లీసులు సంతోష్‌పై కేసు నమోదు చేసి అతని కు టుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. దర్యాప్తు జరుగుతోందని మంగళవారం పోలీసులు తెలిపారు. -
రియల్’ మోసాలు
జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పదేళ్లుగా ఓ కొత్త తరహాలో కొనసాగుతోంది. అన్ రిజిస్టర్ అగ్రిమెంట్లతో కోట్లాది రూపాయల లావాదేవీలు సాగిపోతున్నాయి. ఇదే స్థాయిలో మోసాలు పెచ్చుమీరుతున్నాయి. ఈ వ్యవహారంలో ‘స్లీపింగ్ పార్టనర్లు’గా ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఉండడం గమనార్హం. పలమనేరు, న్యూస్‌లైన్: ఓ వ్యక్తికి చెందిన కోటి రూపాయల భూమిని ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒప్పందం కుదుర్చుకుని ఐదు లేదా పది లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చి అన్ రిజిస్టర్ చేసుకుంటాడు. అందులో మూడు నుంచి ఐదు నెలల గడువులోపు పూర్తి పైకం చెల్లించి రిజిస్టర్ చేసుకుంటామని రాసుకుంటారు. ఆ కోటి రూపాయల స్థలాన్ని అగ్రిమెంట్ చేసుకున్న వ్యక్తి ప్లాట్లు వేసి అమ్మకానికి శ్రీకారం చుడతాడు. వందలాది మంది నుంచి అడ్వాన్స్ రూపం లో డబ్బు తీసుకుని అన్ రిజిస్టర్ అగ్రిమెంట్లను చేయిస్తాడు. రెండు నెలలలోపే రిజిస్టర్ చేయించుకోవాలని ఆ అగ్రిమెంట్లో షరతు పెడతాడు. ఆ గడువులోపు ఆ స్థలాన్ని ప్లాట్ల రూపంలో పూర్తిగా విక్రయించి అందరికీ ఒకే రోజు రిజిస్ట్రేషన్ చేస్తామని నమ్మబలుకుతాడు. ఇలా వసూలైన మొత్తాన్ని భూమి యజమానికి చెల్లించి రియల్టర్ తన పేరిట రిజిస్టర్ చేసుకుంటాడు. ఆపై తాను విక్రయించిన వారికి రిజిస్టర్ చేయిస్తాడు. ఇదీ ప్రస్తుతం జరుగుతున్న కొత్త తరహా రియల్ వ్యాపారం. ఇదంతా అనుకున్నట్లు సాగితే సరేసరి. లేకుంటే నిర్ణీత గడువులోపు భూమి యజమానికి రియల్టర్ పూర్తి పైకం చెల్లించకుంటే అతను మరొకరికి విక్రయ అగ్రిమెంట్ చేయిస్తాడు. దీంతో మొదట అగ్రిమెంట్ చేసుకున్న రియల్టర్ అడ్వాన్స్‌ను పోగొట్టుకోవడంతో పాటు తను పలువురుకి జరిపిన విక్రయాలు చెల్లకుండా వారి నుంచి వసూలు చేసిన డబ్బు వెనక్కి ఇవ్వడం లేదా మోసం చేయడం లాంటివి జరుగుతున్నాయి. ఇలా ఒకే స్థలాన్ని పలువురుకి అగ్రిమెంట్లు చేయడంతో వివాదాలు రేగుతున్నాయి. అన్ రిజిస్టర్ అగ్రిమెంట్ల ద్వారానే జిల్లాలో రోజూ కోట్లాది రూపాయల లావాదేవీలు సాగిపోతున్నాయి. బయట అగ్రిమెంట్లే ఎక్కువ చిత్తూరు రిజిస్ట్రేషన్ జిల్లాకు సంబంధించి 13, బాలాజీ జిల్లాకు సంబంధించి 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. ఒక్కో రిజిస్ట్రార్ కార్యాలయంలో నెలకు అధికారికంగా రూ.70 లక్షల దాకా వ్యాపార లావాదేవీలు సాగుతున్నాయి. అనధికారికంగా జరిగే వ్యాపారం నెలకు రూ.కోటికి పైనే. జిల్లాలోని మదనపల్లె,పలమనేరు, కుప్పం, పుంగనూరు, చిత్తూరు ప్రాంతాల్లో ఈ కొత్త తరహా వ్యాపారం జోరందుకుంది. పోలీస్ స్టేషన్ చేరుతున్న పంచాయితీలు అన్ రిజిస్టర్ అగ్రిమెంట్ల ద్వారా చాలా వరకు మోసాలు జరుగుతుండడంతో ఈ పంచాయితీలన్నీ పోలీస్ స్టేషన్లకు చేరుతున్నాయి. మూడు నెలల క్రితం మదనపల్లెకు చెందిన ఓ వ్యక్తి తన భూమిని ఓ రియల్టర్ అగ్రిమెంట్ చేసుకొని పలువురుకి విక్రయించేశారని పలమనేరు పోలీసులను ఆశ్రయించాడు. గంగవరం సమీపంలో ఓ రియల్టర్ ఇలాంటి మోసానికి పాల్పడడంతో 60 మంది దాకా బాధితులు ఇప్పటికీ పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు. వారం రోజుల క్రితం మరికొందరు పలమనేరు డీఎస్పీని ఆశ్రయించారు. ఇలా పోలీసుల దాకా రాని ఎన్నో సెటిల్మెంట్లు బయటే జరిగిపోతున్నాయి. రియల్ వ్యాపారంలో స్లీపింగ్ పార్టనర్లుగా టీచర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎక్కువ మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ బినామీల ద్వారా ఈ వ్యాపారాన్ని సాగిస్తున్నారు. ఉపాధ్యాయులతో ఉన్న పరిచయాల కారణంగా సైట్లను సులభంగా విక్రయించుకోవచ్చనే ఉద్దేశంతో వీరు ఈ వ్యాపారంలోకి దిగుతున్నట్లు సమాచారం. వీరితో పాటు ఉద్యోగులూ త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఇందులోకి దిగి చేతులు కాల్చుకుంటున్నారు. మరోవైపు కొందరు బ్రోకర్లు సైతం అత్యాశతో రియల్టర్ల అవతారమెత్తుతున్నారు. ఇలాంటి మోసాలు పెరిగి పోతున్నాయి రియల్ మోసాలు కొంతకాలంగా పెరిగిపోతున్నాయి. దీనికి కారణం కొనుగోలుదారుల అవగాహన రాహిత్యమే. లక్షలాది రూపాయల డబ్బు అడ్వాన్సులుగా ఇస్తున్నప్పుడు ఆ స్థలం ఎవరిదీ ఏంటీ..? అని తెలుసుకోకుండా గుడ్డిగా వ్యవహరిస్తే ఎలా. ప్రజల్లో చైతన్యం రావాలి. - బాలయ్య, సీఐ పలమనేరు అన్ రిజిస్టర్ అగ్రిమెంట్లను రిజిస్టర్ చేయించుకోవాలి అన్ రిజిస్టర్ అగ్రిమెంట్లపై మా అజమాయిషీ ఉండదు. అన్ రిజిస్టర్ డాక్యుమెంట్లను చట్ట ప్రకారం రిజిస్టర్ చేయించుకోవాలి. దీంతో అగ్రిమెంట్‌పై మరో అగ్రిమెంట్ చేసుకోవడం వీలుకాదు. ఫలితంగా తగ్గిపోతాయి. పది రూపాయల స్టాంపు పేపర్‌పై రాసుకొని ఎలా లక్షల్లో వ్యాపారాలు చేస్తున్నారో అర్థం కావడం లేదు. - వెంకటేశ్వర్లు, పలమనేరు, సబ్‌రిజిస్ట్రార్ -
లెక్క తేలింది
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లాకేంద్రంలోని స్థలాలపై కొందరు రాజకీయ నాయకులు, అధికారులు, వారి బంధుగణం ఆక్రమణలకు పాల్పడ్డారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం వెనుక కొందరు రెవెన్యూ, పంచాయతీ అధికారులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆదిలాబాద్ శివారు మావల చెరువు శిఖంను ఆక్రమించి ఫంక్షన్ హాల్‌లను నిర్మించిన వ్యవహారమే తాజా ఉదాహరణ. భూముల ఆక్రమణలపై ‘సాక్షి’ వరుస కథనాలకు స్పందించిన కలెక్టర్ బాబు ఆదేశాల మేరకు రెవెన్యూశాఖ అక్రమార్కుల చిట్టా విప్పుతోంది. గతంలో నిర్మించిన చిల్కూరి లక్ష్మీ గార్డెన్, కొత్తగా నిర్మిస్తున్న ఫంక్షన్ హాల్ల నిర్మాణంలో మావల చెరువు శిఖం ఆక్రమణకు గురైనట్లు తేలింది. మావల శిఖంపై ‘రెవెన్యూ’ పోస్టుమార్టం నిజాం కాలం నాటి మావల చెరువు ఆదిలాబాద్ శివారు ఏడో నంబర్ జాతీయ రహదారిని ఆనుకుని ఉంది. 131, 135 సర్వే నంబర్లలో సుమారు 100 ఎకరాల భూమి ఉన్నట్లు రికార్డులు చెప్తున్నాయి. ఈ చెరువును ఆనుకొని ఫోర్‌లేన్ పడటంతో భూముల ధరలు పెరిగాయి. దీంతో చెరువును ఆనుకొని ఉన్న పట్టా స్థలాలపై అధికార పక్షం, ప్రతిపక్ష నాయకులు, భూమాఫియా కన్ను పడింది. చెరువును ఆనుకుని ఉన్న సర్వే నంబర్లపై ‘బినామీ’ పట్టాదారుల్ని సృష్టించి సుమారు రూ.కోట్ల విలువ చేసే భూములు ఆక్రమించారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’లో వెలువడిన కథనాలపై కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ, నీటిపారుదల శాఖ విచారణ జరిపింది. మావల చెరువు శిఖం 10.36 ఎకరాలు ఆక్రమణలకు గురైనట్లు అంగీకరిస్తున్న నీటిపారుదల శాఖ అధికారులు ఆక్రమణదారుల పేర్లు బయట పెట్టడంలో దోబూచులాడుతుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 1.30 ఎకరాల పట్టాపైనా అనుమానాలే? మావల చెరువును ఆనుకుని కొత్తగా నిర్మిస్తున్న ఫంక్షన్‌హాల్ యజమాని పేరిట 1.30 భూమికే పట్టా ఉండగా, సదరు వ్యక్తి 4 ఎకరాల్లో ఫంక్షన్‌హాల్ నిర్మాణం చేపట్టారు. సుమారు ఎనిమిది నెలల క్రితమే ఈ ఫంక్షన్‌హాల్ నిర్మాణానికి శ్రీకారం జరగ్గా అప్పుడున్న ఉన్నతాధికారులతోపాటు రెవెన్యూ, నీటి పారుదలశాఖ అధికారులు ‘మామూలు’గా తీసుకున్నారు. 1.30 ఎకరాలకు పట్టాపొందిన ఓ ఉన్నతస్థాయి బ్యాంకు అధికారి 4 ఎకరాల్లో మావల చెరువును ఆనుకుని ఫంక్షన్‌హాల్ నిర్మిస్తున్న వ్యవహారంపై స్పందించిన అధికారులు నిర్మాణాన్ని ఆపేశారు. ఫంక్షన్‌హాల్ నిర్మాణం కోసం వేసిన బోరు చెరువు శిఖంలో వేయగా, దానిని అధికారులు తొలగించాలని ఆదేశించారు. కాగా సదరు వ్యక్తి పేరిట ఉన్న 1.30 ఎకరాలు పట్టా భూములని చెప్తున్నా, అందుకు సంబంధించిన లింక్డ్ డాక్యుమెంట్‌పైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా వుంటే పదేళ్ల క్రితం నిర్మించిన చిల్కూరి లక్ష్మీ గార్డెన్స్ చెరువు శిఖం ఆక్రమణలో జరిగిందని అధికారులు చెప్తున్నారు. ఈ ఆక్రమణకు గతంలో మావల పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన ఓ అధికారి కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏదేమైనా ఆక్రమణకు గురైన 10.36 ఎకరాల్లో పాగా వేసిన ఆక్రమణదారుల గుట్టురట్టు చేసి, వారిపై కఠినచర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.