అనుమానాస్పద స్థితిలో వైఎస్సార్సీపీ నేత మృతి
అనుమానాస్పద స్థితిలో వైఎస్సార్సీపీ నేత ఒకరు మరణించారు. ఈ ఘటన అనంతపురం రూరల్ మండలం పామురాయిలో ఆదివారం జరిగింది. వివరాలు.. పామురాయికి చెందిన లక్ష్మన్న(60) శనివారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయాడు. ఆదివారం ఉదయం గుత్తి రోడ్డులోని సోములదొడ్డి టాటాషోరూం వెనుక భాగంలో శవమై కనిపించాడు.
కాగా, అతని భార్య ఆదెమ్మ పామురాయిలో వార్డుమెంబర్‌గా పనిచేస్తుంది. గ్రామంలో వైఎస్సార్సీపీ తరఫున చురుకైన పాత్ర పోషించే లక్ష్మన్న నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్నాడు. కాగా, అతని మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విషయం తెలిసి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులుమృతదేహన్ని పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.