reaserchers
-
వైఫైలా ‘వైర్లెస్ పవర్’.. కేబుల్స్ లేకుండానే మొబైల్ ఛార్జింగ్!
సియోల్: ఫోన్, ల్యాప్‌టాప్, ట్యాబ్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఛార్జింగ్ అయిపోతే చికాకు పడతారు. ఛార్జింగ్ పెట్టేందుకు కేబుల్ కోసం వెతుకుతారు. ఇంట్లో ఉంటే పర్వాలేదు.. కానీ వేర ప్రదేశానికి వెళ్లినప్పుడు కేబుల్స్‌ను తీసుకెళ్లటం కొంత భారంగానే ఉంటుంది. అయితే.. ఇకపై ఆ ఇబ్బందులు తప్పబోతున్నాయి. ఎలాంటి కేబుల్స్ లేకుండానే విద్యుత్తు సరఫరా చేసే ప్రయోగంలో తొలి విజయం సాధించారు శాస్త్రవేత్తలు. దక్షిణ కొరియాలోని సెజోంగ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు కొత్త ‘వైర్లెస్ పవర్ ట్రాన్స్మిషన్ సిస్టమ్’ను అభివృద్ధి చేశారు. ఇన్‌ఫ్రారెండ్ లైట్స్ ద్వారా సురక్షితంగా పవర్‌ను ట్రాన్స్ఫర్ చేసి చూపించారు. 30 మీటర్ల దూరంలోని సెన్సార్లకు ఛార్జింజ్ చేసేందుకు 400 మిల్లీవాట్ల పవర్‌ను ఈ వ్యవస్థ విజయవంతంగా సరఫరా చేసింది. దీనిని మొబైల్ పరికరాలను ఛార్జ్ చేసే విధంగా విద్యుత్తు సామర్థ్యాన్ని పెంచే పనిలోపడ్డారు శాస్త్రవేత్తలు. ‘పవర్ డివైజ్‌లను వైర్‌లెస్‌గా మార్చటం ద్వారా ఫోన్స్, టాబ్లెట్స్ వంటి వాటికి కేబుల్స్‌ను వెంట తీసుకెళ్లాల్సిన అవసరం రాదు. అలాగే.. ఐఓటీ పరికరాలు, తయారీ ప్లాంట్లలోని సెన్సెర్లను ఛార్జ్ చేయవచ్చు.’ అని పరిశోధన బృంద నాయకుడు జిన్యోంగ్ హా తెలిపారు. మరోవైపు.. వైర్లెస్ పవర్ ట్రాన్స్మిషన్ కోసం పలు టెక్నిక్‌లపై పరిశోధన చేస్తున్నట్లు చెప్పారు. అయితే.. మీటర్ల వ్యవధిలో తగినంత విద్యుత్తును పంపడం సవాలుగా మారిందన్నారు. ఈ క్రమంలో.. పరిశోధకులు 'డిస్ట్రిబ్యూటెడ్ లేజర్ ఛార్జింగ్' అనే పద్ధతి అన్ని టెక్నిక్‌ల కంటే మేలైనదిగా తేల్చారు. ఏదైనా వస్తువు, వ్యక్తి ఈ సిస్టమ్‌లోని లైట్‌ను అడ్డుకోనంత వరకు తక్కువ స్థాయి పవర్‌ను సురక్షితంగా పంపించవచ్చని చెప్పారు. ఎలా పనిచేస్తుంది? డిస్ట్రిబ్యూటెడ్ లేజర్ ఛార్జింగ్ అనేది కొంత వరకు సంప్రదాయ లేజర్ లాగానే పని చేస్తుంది. ఒకే వస్తువులో లేజర్ పరికరాలను అమర్చకుండా.. ట్రాన్స్మిటర్, రిసీవర్ రెండు వేరువేరుగా ఉంటాయి. ఈ రెండు ఒకే లైన్లో ఉండి లేజర్ లైట్ అనుసంధానమవుతే.. ఈ వ్యవస్థ లైట్ ఆధారిత పవర్‌ను లోడ్‌కు సరఫరా చేస్తుంది. ఒకవేళ ట్రాన్స్మిటర్, రిసీవర్ల మధ్య ఏదైనా అడ్డుపడితే ఈ వ్యవస్థ ఆటోమేటిక్‌గా పవర్ సేఫ్ మోడ్‌లోకి వెళ్లిపోతుంది. పరిశోధకులు రిసీవర్, ట్రాన్స్మిటర్లను 30 మీటర్ల దూరం వేరు చేశారు. ట్రాన్స్మిటర్ ఎర్బియం-డోప్డ్ ఫైబర్ యాంప్లిఫైయర్ ఆప్టికల్ సోర్స్‌తో తయారు చేశారు. రిసీవర్ యూనిట్లో రెట్రో రిఫ్లెక్టర్, ఆప్టికల్ సిగ్నల్‌ను ఎలక్ట్రికల్ పవర్‌గా మార్చే ఫోటోవోల్టాయిక్ సెల్, పవర్ డెలివరీ అవుతున్నప్పుడు ప్రకాశించే ఎల్ఈడీ ఉన్నాయి. ఈ వ్యవస్థ విజయవంతంగా విద్యుత్తును ట్రాన్స్ఫర్ చేసి చూపించింది. ఇదీ చదవండి: వైద్య చరిత్రలో మరో అద్భుతం... మూలకణాలతో కృత్రిమ గర్భస్థ పిండం -
ఆహా.. భూమ్మీదకు నీరు అలా వచ్చి చేరిందా!!
వెబ్‌డెస్క్: ఈ భూమ్మీద నీటి శాతం 71గా ఉందని చదువుకునే ఉంటారు. ఈ నీటిలో సింహభాగం.. మహా సముద్రాలు, సముద్రాల రూపంలోనే ఉంది. మిగతా భాగం.. ఖండాలు, ద్వీపాలు వగైరా వగైరా ఉన్నాయి. మరి అంత శాతం నీరు ఎలా వచ్చి చేరి ఉంటుందని అనుకుంటున్నారు?.. ఈ విషయంపై ఏళ్ల తరబడి పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే.. ఇది తేల్చేందుకే జపాన్ ఓ స్పేస్ మిషన్‌ను చేపట్టింది. సుమారు ఆరేళ్ల తర్వాత దాని ఫలితం ఆధారంగా.. ఇప్పుడొక ఆసక్తికర ప్రకటన చేసింది. సౌర వ్యవస్థ యొక్క బయటి అంచుల నుండి గ్రహశకలాలు(ఆస్టరాయిడ్స్).. నీటిని భూమ్మీదకు మోసుకొచ్చాయనేది జపాన్ స్పేస్ మిషన్ తేల్చిన విషయం. ఆశ్చర్యంగా అనిపించిన.. వాటి ద్వారానే బిలియన్ల సంవత్సరాల కిందట భూమ్మీద నీరు, సముద్రాలు ఏర్పడ్డాయన్నది ఈ మిషన్ చెబుతోంది. ఈ వాదనకు సంబంధించి శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయన్నది జపాన్ పరిశోధకులు చెప్తున్నమాట. ఈ భూమ్మీద జీవితం మూలాలు, విశ్వం నిర్మాణంపై వెలుగునిచ్చే అంశాల అన్వేషణలో భాగంగా.. 2020లో రైయుగు Ryugu అనే గ్రహశకలం భూమ్మీదకు తీసుకొచ్చిన పదార్థాన్ని పరిశీలించారు. హయబుసా-2 అని పిలిచే జపనీస్ స్పేస్ ప్రోబ్ ద్వారా 5.4 గ్రాముల (0.2 ఔన్సుల) రాళ్ళు, ధూళిని సేకరించారు. భూ జీవనానికి సంబంధించిన కొన్ని బ్లాకులలో అమైనో ఆమ్లాల ఉనికిని గుర్తించామని, అంతరిక్షంలోనే అవి ఏర్పడి ఉండొచ్చని శాస్త్రవేత్తల బృందం ఈ జూన్‌లో ఓ ఆర్టికల్ తమ పరిశోధన వివరాలను వెల్లడించింది. అంతేకాదు.. రైయుగు శాంపిల్స్‌లో కనిపించిన ఆర్గానిక్ మెటీరియల్ వల్లే భూమ్మీద నీటి జాడ ఏర్పడి ఉంటాయన్న వాదనకు బలం చేకూరుతోందని అంటున్నారు. అస్థిర, ఆర్గానిక్మూలాలు అధికంగా ఉన్న సీ-టైప్ గ్రహశకలాలు.. భూమి యొక్క నీటి యొక్క ప్రధాన వనరులలో ఒకటిగా ఉండవచ్చంటూ జపాన్, ఇతర దేశాల సైంటిస్టులు.. జర్నల్ నేచర్ ఆఫ్ ఆస్ట్రోనమీలో అభిప్రాయం వెల్లడించడం.. ఆ జర్నల్ సోమవారం పబ్లిష్ కావడం విశేషం. ఇదీ చదవండి: అంతరిక్ష కేంద్రం నుంచి భారత్‌కు సర్ప్రైజ్ -
నిప్పులకొలిమిలా భగభగలు.. అయినా జీవరాశి ఉనికి!
మిగతా గ్రహాల్లాగే అక్కడా సముద్రాలు, జీవరాశి ఉనికి ఉండేది ఒకప్పుడు. కానీ, సూర్యుడికి దగ్గరగా ఉండడంతో ఆ అధిక వేడిమికి సముద్రాలు ఆవిరైపోవడం, జీవరాశి కనుమరుగైపోవడం.. భూమికి సిస్టర్ గ్రహాంగా అభివర్ణించే శుక్ర గ్రహం విషయంలో జరిగి ఉంటుందనేది ఖగోళ శాస్త్రవేత్తల అంచనా. కానీ, ఇప్పుడు ఆ అంచనాలను తలకిందులు చేసే విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. వీనస్‌పై జీవరాశికి ఆస్కారమే లేదని వాదిస్తున్న సైంటిస్టులు.. ఇప్పుడక్కడ జీవరాశికి ఆస్కారం ఉందనే వాదనను తెరపైకి తెచ్చారు. పలు అధ్యయనాల తర్వాత ఫొటోసింథటిక్ మైక్రోఆర్గానిజమ్స్(కిరణజన్య సంయోగ సూక్ష్మజీవులు) ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. సౌర వ్యవస్థలో ముందు వరుసలో ఉండడం, పైగా గ్రీన్ హౌజ్ ప్రభావం వల్ల హాట్ గ్యాస్ బెలూన్లా కార్బన్ డై యాక్సైడ్‌తో నిండిపోయింది శుక్ర గ్రహం. దరిమిలా 462 డిగ్రీ సెల్సియస్ సెంటిగ్రేడ్(863 డిగ్రీల ఫారన్‌హీట్) గరిష్ట ఉష్ణోగ్రత నమోదు అయ్యి నిప్పుల కొలిమిని తలపిస్తుంది. అలాంటిది ఈ గ్రహంపైనా జీవరాశి ఉనికిని పసిగట్టారు సైంటిస్టులు. శుక్ర గ్రహం వాతావరణంలో జీవరాశి ఉనికి ఉన్నట్లు గుర్తించారు. శుక్ర గ్రహం మేఘాల నుంచి సూర్యకాంతి చొచ్చుకెళ్లినప్పుడు.. ఫొటోసింథటిక్ మైక్రోఆర్గానిజమ్స్ పెరిగే అవకాశం ఉందని తేల్చారు. 1. A new study has revealed that the sunlight passing through Venus' clouds could support the growth of photosynthetic microorganisms. Moreover, photosynthesis could even occur during the night time thanks to the planet's thermal energy! pic.twitter.com/j5NfFYmPF5 — The Weather Channel India (@weatherindia) October 11, 2021 సోలార్ ఎనర్జీతో పాటు గ్రహం ఉపరితలం నుంచి థర్మల్ ఎనర్జీ పుట్టడం, కాంతి తరంగదైర్ఘ్యం కారణంగా ఫొటోసింథటిక్ పిగ్మెంట్స్‌ను గుర్తించారు. ఇది అచ్చం భూమి మీద సూర్యకిరణాల వల్ల ఏర్పడే ప్రక్రియలాగే ఉంటుందని చెబుతున్నారు. అధ్యయనానికి సంబంధించిన వివరాలను కాలిఫోర్నియా స్టేట్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాకేష్ మొఘల్ వెల్లడించారు. ఆమ్ల, ద్రావణ(వాటర్) చర్యల వల్ల మైక్రోబయాల్ పెరిగే అవకావం ఉందని చెప్తున్నారు వాళ్లు. Astrobiology జర్నల్‌లో శుక్ర గ్రహంపై జీవరాశి ఉనికికి సంబంధించిన కథనం తాజాగా పబ్లిష్ అయ్యింది. చదవండి: శుక్రుడు మా వాడు.. రష్యా సంచలన ప్రకటన -
గుడ్‌న్యూస్: మీ పిల్లలు తట్టు వ్యాక్సిన్ వేసుకున్నారా? అయితే, సేఫ్!
న్యూఢిల్లీ: కరోనా థర్డ్‌వేవ్ చిన్నపిల్లలపై అధిక ప్రభావం చూపనుందని ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో పుణెలోని బీజే మెడికల్ కాలేజీ పరిశోధకులు ఒక గుడ్‌న్యూస్ చెప్పారు. తట్టు (మీజిల్స్) రాకుండా ఉండటం కోసం పిల్లలకు వేసే వ్యాక్సిన్ వల్ల కొవిడ్ నుంచి కూడా రక్షణ లభిస్తున్నట్లు వీరి పరిశోధనలో తేలింది. ఒకవేళ ఈ వ్యాక్సిన్ వేసుకున్న పిల్లలకు కొవిడ్ సోకినా.. దాని ప్రభావం చాలా తక్కువగా ఉంటున్నట్లు కూడా స్పష్టమైంది. కరోనా వైరస్‌పై మీజిల్స్ వ్యాక్సిన్ 87.5 శాతం సమర్థంగా పని చేస్తున్నట్లు వీరి అధ్యయనంలో తేలింది. హ్యూమన్ వ్యాక్సిన్స్ అండ్ ఇమ్యునోథెరప్యూటిక్స్ జర్నల్‌లో ఈ కథనాన్ని ప్రచురించారు. పిల్లల్లో మీజిల్స్ వ్యాక్సిన్ కొవిడ్ నుంచి దీర్ఘకాల రక్షణ కూడా అందిస్తున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. మీజిల్స్ వ్యాక్సిన్ కారణంగా పిల్లలకు కరోనా నుంచి రక్షణ లభిస్తుండడం నిజమే అయినా దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని పరిశోధకులు తెలిపారు. ఇలాంటి అధ్యయనం చేయడం ప్రపంచంలో ఇదే తొలిసారని పరిశోధకుల్లో ఒకరైన డాక్టర్ నీలేశ్ గుజార్ తెలిపారు. మీజిల్స్ డోసు తీసుకోని వారు వెంటనే తీసుకోవాలని, తొలి డోసు తీసుకున్న వారు తప్పనిసరిగా రెండో డోసు వేయించుకోవాలని డాక్టర్ నీలేశ్ సూచించారు. కాగా, ఈ అధ్యయనంలో భాగంగా 17 ఏళ్ల వయసున్న 548 మందిని రెండు గ్రూపులుగా విభజించి ఏడాదిపాటు పరిశోధనలు నిర్వహించారు. మీజిల్స్, బీసీజీ వ్యాక్సిన్లు కరోనా నుంచి పిల్లలకు రక్షణ కల్పిస్తున్నట్టు శాస్త్రవేత్తలు భావిస్తున్న వేళ తాజా అధ్యయనం ప్రాధాన్యం సంతరించుకుంది. చదవండి: కరోనా: ‘టీకా వేసుకుంటేనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతం’ -
ఆ మాత్రలతో క్యాన్సర్ ముప్పు
లండన్ : గ్యాస్, అజీర్తి సమస్యలతో నిత్యం యాంటాసిడ్ ట్యాబ్లెట్స్ వాడితే పెనుముప్పు తప్పదని తాజా అథ్యయనం హెచ్చరించింది. ఏడాది పాటు రోజూ ఈ మాత్రలను వాడితే పొత్తికడుపు క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఐదు రెట్లు పెరుగుతాయని, మూడేళ్లు వాడితే క్యాన్సర్ ముప్పు ఎనిమిది రెట్లు పెరుగుతుందని తేలింది. క్యాన్సర్ కణాలను పెంచే గ్యాస్ర్టిన్ హార్మోన్ కారణంగా ఈ రిస్క్ పొంచిఉందని యూనివర్సిటీ కాలేజ్ లండన్, యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. గతంలోనూ యాంటాసిడ్స్ తరచూ తీసుకుంటే గుండెజబ్బులు, కిడ్నీ సమస్యలు, డిమెన్షియా వంటి తీవ్ర అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందని కొన్ని అథ్యయనాలు వెల్లడించాయి. హాంకాంగ్‌లో 63,000 మందిపై తాజా అథ్యయనం నిర్వహించారు. ఏడేళ్ల పాటు వీరిని గమనించగా వారానికి ఒకసారి యాంటాసిడ్ మాత్రలను తీసుకున్న వారిలో పొత్తికడుపు క్యాన్సర్ వచ్చే అవకాశాలు రెండు రెట్లు అధికంగా ఉన్నట్టు గుర్తించారు. వీటిని రోజూ వాడేవారిలో క్యాన్సర్ ముప్పు నాలుగు రెట్లు అధికంగా ఉన్నట్టు తేలింది. దీర్ఘకాలం వీటిని వాడటం మంచిది కాదని, వైద్యులు సైతం దీనిపై రోగులను అప్రమత్తం చేయాలని పరిశోధకులు సూచించారు. -
టూత్‌బ్రష్‌తో అంటువ్యాధులు
న్యూయార్క్: మీరు ఉమ్మడి బాత్రూమ్ వాడుతున్నారా? అయితే మీ టూత్‌బ్రష్‌ను బాత్రూమ్లోని స్టాండ్స్‌లో ఉంచే విషయంలో కాస్త ఆలోచించండి. ఎందుకంటే దాని ద్వారా మీకు ప్రమాదకరమైన బ్యాక్టీరియా వ్యాపించే అవకాశముంది. సాధారణంగా ఎక్కువ మంది వాడే బాత్రూముల్లో హానికరమైన కోలిఫామ్ బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. బాత్రూమ్లో ఈ బ్యాక్టీరియా ఉండడం వల్ల కంటే ఇది కలిగిన బాత్రూమ్ల్లో టూత్‌బ్రష్‌లను నిల్వ చేయడం వల్ల అది మనకు వ్యాపించవచ్చు. దీని వల్ల అంతకుముందు మనలో లేని బ్యాక్టీరియా ప్రభావానికి గురవుతామని అమెరికాలోని క్విన్నిపియాక్ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. అందువల్ల హాస్టళ్లలో ఉండే విద్యార్థులు టూత్‌బ్రష్‌ను వినియోగించడంలో, నిల్వ చేయడంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మేలు కలుగుతుంది. -
నిద్ర లేమితో సమస్యలెన్నో..!
ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే కారకాల్లో నిద్ర ముఖ్యమైంది. రాత్రి తగినంత సమయం ప్రశాంతంగా నిద్రపోతేనే మరునాడు కార్యక్రమాలు సక్రమంగా చేసుకోగలం. లండన్ పరిశోధకుల తాజా అధ్యయనంలో దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు వెల్లడయ్యాయి. తగినంత నిద్ర లేకపోతే పిల్లలు, పెద్దలూ కూడా అవసరమైన దాని కంటే ఎక్కువ ఆహారం తీసుకుంటారని పరిశోధకులు తెలిపారు. ఇది ఊబకాయానికి దారితీస్తుందని అన్నారు. సరిగ్గా నిద్ర పోకపోవడం వల్ల కలిగే ఒత్తిడే దీనికి ప్రధాన కారణమని వెల్లడించారు. దీని వల్ల హార్మోన్లలో కూడా సమతుల్యం లోపించి ప్రవర్తనలో విభిన్నమైన మార్పులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే మధుమేహం, గుండెపోటు వచ్చే ప్రమాదం పొంచి ఉందని చెప్పారు. ‘నిద్రలేమి వల్ల వచ్చే సమస్యలపై చాలా మందికి అవగాహన లేకపోవడం వల్ల దీన్ని ఒక సాధారణ సమస్యగా భావిస్తున్నారు. తొలి దశలోనే ఈ సమస్యను గుర్తించి సరైన చికిత్స తీసుకోకపోతే జీవితమే నాశనం అయ్యే ప్రమాదం ఉంది’ అని ఈ అధ్యయనంలో పాల్గొన్న లుండాల్, నెల్సన్లు తెలిపారు. ఈ అధ్యయనానికి సంబంధించిన పూర్తి వివరాలు ‘హెల్త్ సైకాలజీ’ అనే జర్నల్‌లో ప్రచురిత మయ్యాయి.