Red Sandle
-
15 మంది స్మగ్లర్లు అరెస్ట్
13 ఎర్రచందనం దుంగలు స్వాదీనం ఖాజీపేట: అక్రమంగా ఎర్రచందనం రవాణా చేస్తున్న 15 మంది స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు మైదుకూరు డీఎస్పీ జింకల శ్రీలక్ష్మి తెలిపారు. ఖాజీపేట పోలీస్ స్టేషన్లో ఆమె విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఖాజీపేట మండలం లోని లంకమల్ల అడవుల్లోకి తమిళ స్మగ్లర్లు, మరికొందరు స్థానిక స్మగ్లర్లు దొంగచాటుగా ప్రవేశించి ఎర్రచందనాన్ని నరికి తీసుకు వచ్చి స్మగ్లింగ్ చేసేవారన్నారు. తమకు అందిన సమాచారం మేరకు నిఘా ఉంచామన్నారు. చెన్నముక్కపల్లె తెలుగుగంగ సమీపంలో ఎర్రచందనం తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో దాడులు నిర్వహించామన్నారు. ఈ దాడుల్లో 15 మంది స్మగ్లర్లతో పాటు 13 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. అరెస్టయిన స్మగ్లర్లు వీరే.. 1.ఆకుల జయరాముడు, 2. ఆకుమల్ల పెద్దరాముడు, 3.మద్దెల కిరణ్ 4. మద్దెల రజనీకాంత్, 5. మద్దెల చెప్పలయ్య, 6. మెల్ల జయరాముడు (చెన్నముక్కపల్లె) 7. తవ్వా స్వామి కొండారెడ్డి (చెన్నముక్కపల్లె) 8. మధుర దొరబాబు (చెన్నముక్కపల్లె) 9. ఆకుమల్ల సుధాకర్ (చెన్నముక్కపల్లె) 10. తవ్వా బాలకొండారెడ్డి (చెన్నముక్కపల్లె) 11. ఆకులమల్ల రామ్‌బాబు (చెన్నముక్కపల్లె) 12. మెల్ల రఘురాం (చెన్నముక్కపల్లె) 13. మల్లె బాబు (చెన్నముక్కపల్లె) 14. అబ్బిరెడ్డి ఓబుళరెడ్డి 15. పొట్టి ప్రతాప్‌రెడ్డి ఉన్నారు. పోలీస్, అటవీ అధికారులుగా బెదిరింపులు ఇక్కడి అడవుల్లో తమిళ కూలీల రాక పోకలు అధికంగా ఉన్నాయని డీఎస్పీ తెలిపారు. దీనిని గుర్తించి స్థానిక స్మగ్లర్లు తాము అటవీ, పోలీసు అధికారులమని తమిళ కూలీలను బెదిరించి వారిపై దాడులు చేసేవారన్నారు. తమిళ కూలీలు వదిలిన 15 దంగలను తీసుకుని దువ్వూరు, చెన్నూరు, పెండ్లిమర్రి కి చెందిన వ్యక్తులకు అమ్మి రూ.2లక్షలు సొమ్ము చేసుకున్నారని తెలిపారు. తమిళ కూలీల కదలిక పై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆమె కోరారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు సహకరించే వారు ఎంతటివారైనా సహించేదిలేదని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
9 మంది ఎర్ర కూలీలు అరెస్ట్
-
9 మంది ఎర్ర కూలీలు అరెస్ట్
ఖాజీపేట: దువ్వూరు మండలం సీతానగరం పైభాగంలో ఉన్న కన్నెల వాగు చెరువు సమీపంలో 9 మంది ఎర్రచందనం కూలీలసు అరెస్టు చేసి వారి వద్ద నుంచి 9 దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు మైదుకూరు రూరల్ సీఐ నాగభూషణం తెలిపారు. ఖాజీపేట పోలీస్ స్టేషలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆదివారం తమకు అందిన సమాచారం మేరకు సీతానగరం పై భాగాన ఉన్న కన్నెలవాగు చెరువు సమీపంలో ఎర్రచందనం తరలిస్తున్నారన్న సమాచారంతో ఖాజీపేట యస్ఐ రంగారావు, దువ్వురు యస్ఐ విద్యాసాగర్, ఖాజీపేట పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారన్నారు. అప్పటికే మొద్దులు తీసుకుని వస్తున్న వారు తమపై రాళ్లతో దాడి చేశారన్నారు. అయినా గట్టిగా ప్రతిఘటించి 9 మంది తమిళ కూలీలను అరెస్టు చేసి 9 దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. 314 కేజీల బరువు గల ఈ దుంగల విలువ సుమారు రూ.3లక్షలు ఉంటుందన్నారు. తాము అరెస్టు చేసిన వారంతా తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలకు చెందిన వారిగా గుర్తించామన్నారు. గత కొంత కాలంగా ముమ్మరంగా అడవుల్లో కూంబింగ్ నిర్వహించడం వల్ల ఇప్పటివరకు మైదుకూరులో ఏడుగురు, ఖాజీపేటలో ఏడుగురు, దువ్వురూ లో స్థానిక స్మగ్లర్లు ఏడుగురు, ఇప్పడు 9 మందిని అరెస్ట్ చేసినట్లు వివరించారు. ఇప్పటికి అడవుల్లో కూంబింగ్ జరుగుతూనే ఉందన్నారు. -
ఏడుగురు ఎర్ర స్మగ్లర్ల అరెస్ట్
- ఏడు దుంగలు స్వాధీనం దువ్వూరు(చాపాడు): మండల పరిధిలోని కృష్ణంపల్లె వద్ద గురువారం ఉదయం ఎర్రచందనం తరలించేందుకు సిద్ధంగా ఉన్న ఏడుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి ఏడు దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు మైదుకూరు రూరల్ సీఐ నాగభూషణం తెలిపారు. నంద్యాల, మైదుకూరు,చెన్నై ప్రాంతాలకు చెందిన స్మగ్లర్లు అడవుల్లో ఎర్రచందనం దుంగలను నరికి కృష్ణంపల్లె వద్ద గల నారాయణస్వామి గుడి వద్ద సిద్ధంగా ఉండగా, ముందస్తు సమాచారంతో పోలీసులు దాడి చేశారన్నారు. పట్టుబడిన వారిలో దువ్వూరు ఇందిరమ్మ కాలనీకి చెందిన వినోద్, చింతకుంటకు చెందిన జిలానీబాషా, రాజుపాళెం మండలం కూలూరు కొట్టాలకు చెందిన ప్రభాకర్, బీమఠం మండలం రేకలకుంటకు చెందిన నారాయణ, సోమయాజులపల్లెకు చెందిన శీర్ల సిద్దయ్య, గోపవరం మండలం లెక్కలవారిపల్లెకు చెందిన కొప్పల శ్రీరాములతో పాటు దువ్వూరు ఎస్సీ కాలనీకి చెందిన మరో వ్యక్తి ఉన్నారన్నారు. వీరిందరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ చెప్పారు. -
ఎర్ర చందనం దుంగల స్వాధీనం
లక్కిరెడ్డిపల్లె: మండలంలోని బి యర్రగుడి గ్రామం చెంచెర్లపల్లె సమీపంలోని సన్నాకుల మర్రి చెట్టు వద్ద అక్రమంగా తరలిస్తున్న 4 ఎర్రచందనం దుంగలను ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాయచోటి రేంజ్ అధికారి జీజే ప్రసాద్‌రావ్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మల్లినాయుడు, భాస్కర్ అనే ఇద్దరు వ్యక్తులు గురువారం రాత్రి ద్విచక్ర వాహనంలో పెద్ద బ్యాగుతో వెళ్తుండగా అధికారులకు అనుమానం వచ్చి.. వారిని వెంబడించి పట్టుకొని తనిఖీ చేశారు. అందులోని 4 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకొని వారిని అరెస్ట్ చేశారు. వారి వద్ద వున్న ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ నేరంతో సంబంధం ఉన్న చెంచెర్లపల్లెకు చెందిన సదాశివనాయుడు అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. దాడుల్లో ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఐదుగురు స్మగ్లర్ల అరెస్టు
సిద్దవటం : సిద్దవటం మండలం కనుమలోపల్లె వద్ద గతంలో జరిగిన ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో బుధవారం పీటీ వారెంటుపై ఐదుగురిని అరెస్టు చేశామని ఎస్ఐ లింగప్ప తెలిపారు. జూన్‌లో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ కనుమలోపల్లె వద్ద ఇద్దరు తమిళ కూలీలు పట్టుబడిన విషయం తెలిసిందేనన్నారు. ఈ మేరకు వారిని విచారించగా చిత్తూరు జిల్లాకు చెందిన శ్రీనివాసులురెడ్డి, నెల్లూరుకు చెందిన సుదర్శన్, కడప జిల్లా బద్వేలుకు చెందిన సుబ్బారెడ్డి, రాయచోటికి చెందిన దర్బార్‌బాషా, కడపకు చెందిన చంద్రశేఖర్ హస్తమున్నట్లు విచారణలో తేలిందన్నారు. గతంలో ఎర్రచందనం కేసుల్లో కడప కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న వీరిని పీటీ వారెంటుపై బుధవారం అరెస్టు చేసి సిద్దవటం కోర్టులో హాజరుపరిచామని ఎస్ఐ తెలిపారు. -
తమిళ కూలీల అరెస్టు
ఖాజీపేట : ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు తమిళ కూలీలను పోలీసులు పట్టుకున్నారు. నాగసానిపల్లెకు వెళ్లే రహదారిలో ఉన్న చిలకకనం వద్ద ఎర్రచందనం తరలిస్తున్నట్లు ఖాజీపేట ఎస్ఐ రాజగోపాల్‌కు సమాచారం రావడంతో.. ఆయన తన సిబ్బందితో వెళ్లి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 3 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే తమిళనాడులోని సెంతిల్ తిరచునూరుకు చెందిన సెంతిల్, పోలూరుకు చెందిన దేవేంద్రన్‌ను అదుపులోకి తీసుకున్నారు. సెంతిల్ బీఈడీ చదువుకున్నాడు. నిరుపేద. దండిగా డబ్బు వస్తుందని అతనికి ఆశ చూపి తీసుకువచ్చినట్లు తెలిసింది. చివరకు ఇలా పోలీసులకు బుక్కయాడు. -
అంతర్జాతీయ ఎర్ర స్మగ్లర్ మస్తాన్ వలీ అరెస్ట్
మైదుకూరు : కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం ముత్యాలపాడుకు చెందిన మస్తాన్‌వలి అనే అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్‌తో పాటు చిత్తూరు జిల్లాకు చెందిన ప్రధాన స్మగ్లర్ భాస్కర్‌ను వైఎస్సార్ జిల్లా మైదుకూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈమేరకు మైదుకూరు డీఎస్పీ రామకృష్ణయ్య బుధవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. మస్తాన్‌వలి, భాస్కర్‌తో పాటు మరికొందరు నల్లమల అడవుల నుంచి మైదుకూరు మండలం వనిపెంట మీదుగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు, రూరల్ సీఐ నాగభూషణం నేతృత్వంలో పోలీసులు దాడి నిర్వహించారన్నారు. ఇందులోభాగంగా మైదుకూరు మండలం అన్నలూరు గ్రామం వద్ద వేగంగా వస్తున్న కారును ఆపేందుకు ప్రయత్నించగా అందులో ఉన్నవారు కారుతో పోలీసులను తొక్కించి తప్పించుకు వెళ్లేందుకు ప్రయత్నించారన్నారు. కానీ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి కారును వెంబడించి అందులో ఉన్న మస్తాన్ వలి, భాస్కర్‌ను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 26 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. మస్తాన్ వలి ఈ ఏడాది మార్చినెలలో అరెస్టయి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సబ్ జైలులో ఉన్నప్పుడు కూడా జైలు నుంచే ఫోన్ ద్వారా స్మగ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడేవాడన్నారు. గత నెలలో బెయిల్‌పై విడుదలై తిరిగి యథావిధిగా స్మగ్లింగ్‌కు పాల్పడుతుండటంతో పక్కా సమాచారంతో దాడి చేసి అరెస్టు చేశామన్నారు. పేరు మోసిన స్మగ్లర్లతో సంబంధాలు మస్తాన్‌వలీ మహరాష్ట్ర, తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రధాన స్మగర్లతో సత్సంబంధాలు పెట్టుకుని కర్నూలు, వైఎస్సార్ జిల్లాలోని నల్లమల అడవుల నుంచి దుంగలను దేశ సరిహద్దులు దాటించేవాడని డీఎస్పీ వెల్లడించారు. మస్తాన్ వలీకి దేశంలోని 90మందికి పైగా ప్రధాన స్మగ్లర్లతో అనుబంధం ఉందని..గతంలో పలు కేసులు కూడా వారిపై ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. జైలులో ఉండి కూడా స్మగ్లింగ్ రాకెట్ నడిపే వాడన్నారు. మస్తాన్ వలీతో కలిసి స్మగ్లింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రధాన స్మగ్లర్లను పట్టుకునేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించామన్నారు.. ప్రధాన స్మగ్లర్ మస్తాన్‌వలీని పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన అర్బన్, రూరల్ సీఐలతోపాటు ఎస్ఐ చలపతి, పీఎస్ఐ కృష్టమూర్తి, పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.. మస్తాన్‌వలీతో పాటు, భాస్కర్ అనే స్మగ్లర్‌ను కోర్టులో హాజరు పరిచామన్నారు. జైలు నుంచే కార్యకలాపాలు మస్తాన్‌వలీ ఈ ఏడాది మార్చిలో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సబ్‌జైలులో ఖైదీగా ఉన్నప్పుడు అక్కడ ఉన్న జైలు సిబ్బంది సహకారంతో సెల్ఫోన్లు తెప్పించుకొని జైలు నుంచే ఎర్రచందనం స్మగ్లింగ్ కార్యకలాపాలు నిర్వహించేవాడని డీఎస్పీ తెలిపారు. గతంలో చిత్తూరు జైలులో పరిచయమైన భాస్కర్ అలియాస్ ప్రసాద్‌తో కలసి విచ్చలవిడిగా స్మగ్లింగ్ చేసేవాడన్నారు. మస్తాన్ వలీ చాగలమర్రి మండలం ముత్యాలపాడు నుంచి ఎంపీటీసీగా గెలుపొంది ప్రస్తుతం ఎంపీపీగా ఉన్నాడని, అతని మొదటిభార్య కొండపల్లి స్వప్న ప్రస్తుతం సర్పంచ్‌గా ఉన్నారని తెలిపారు. ఇతను సినీ నటి నీతూ అగర్వాల్‌ను కూడా వివాహం చేసుకున్నాడని వివరించారు. -
భారీ ఎర్రచందనం డంప్ స్వాధీనం
కడప అర్బన్: వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు మండల పరిధిలోని వాగేటికోనలో స్పెషల్ పార్టీ పోలీసులు ఎర్రచందనం డంప్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఓఎస్డీ(ఆపరేషన్స్) సత్య ఏసుబాబు తెలిపారు. స్పెషల్ పార్టీ పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తుండగా ఈ డంప్ బయటపడిందన్నారు. ఈ డంప్‌లో దాదాపు రూ. 2 కోట్ల రూపాయల విలువైన, మూడు టన్నుల బరువున్న 87 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. వాగేటికోన, కంజిమడుగు ప్రాంతాల్లో కూంబింగ్ కొనసాగుతోందని ఆయన స్పష్టం చేశారు. -
త్వరలో ఎర్రబంగారం విక్రయం?
జిల్లాలో నిల్వ ఉన్న 995 మెట్రిక్ టన్నుల దుంగలు అంతర్జాతీయ మార్కెట్లో విలువ సుమారు రూ.250 కోట్లు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న అటవీశాఖాధికారులు రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రభుత్వం నిధుల సమీకరించేందుకు ఎర్రచందనం నిల్వలను వేలం వేయాలని రెండేళ్ల క్రితం నిర్ణయించింది. దీంతో నెల్లూరు జిల్లా అటవీశాఖ పరిధిలో స్వాధీనం చేసుకున్న దుంగలను ఆశాఖ అధికారులు భద్రపర్చారు. వాటిలో కొన్నింటిని అప్పట్లో ప్రభుత్వ నిబంధనల మేరకు ఆన్లైన్ టెండర్లు ద్వారా విక్రయించారు. నెల్లూరు(బారకాసు) : జిల్లాలో నిల్వ ఉన్న ఎర్రచందనం నిల్వలను విక్రయించేందుకు అటవీశాఖాధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆ శాఖ అధికారులు నిల్వ వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదికలు పంపే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లాలో వెంకటగిరి, ఆదురుపల్లి, ఆత్మకూరు, ఉదయగిరి ప్రాంతాల్లో ఎర్రచందనం వక్షాలున్నాయి. ఆయా ప్రాంతాల నుంచి అక్రమంగా తరలిస్తున్న దుంగలను జిల్లా అటవీశాఖాధికారులు స్వాధీనం చేసుకుని సంబంధిత కార్యాలయాల్లో భద్రపరిచారు. ఈవిధంగా స్వాధీనం చేసుకున్న దుంగలు 995 మెట్రిక్ Sటన్నులున్నాయి. అంతార్జతీయ మార్కెట్లో వాటి విలువ సుమారు రూ.250 కోట్లు పలుకుతోంది. కాగా దుంగలతోనే కాకుండా వాహనాల ద్వారా కూడా అదనపు ఆదాయం వచ్చే అవకాశముంది. రెండేళ్ల క్రితం పట్టుబడ్డవాటిలో వంద వాహనాలు విక్రయించగా ఆశాఖ ఆధీనంలో ఇంకా 300 వాహనాలు ఇంకా ఉన్నాయి. వీటిని వేలం వేస్తే ప్రభుత్వానికి అదనపు ఆదాయం లభిస్తుంది. ప్రస్తుతం అధికారులు కోర్టు కేసులు, ఉన్నతాధికారుల ఆదేశాలు తదితర అంశాలను పరిశీలిస్తున్నారు. ఆగని అక్రమ రవాణా.. పోలీసులు, అటవీశాఖ అధికారులు స్మగర్లను అరెస్టు చేసి దుంగలను స్వాధీనం చేసుకుంటున్నా అక్రమరవాణా మాత్రం కొనుసాగుతూనే ఉంది. ఎర్రచందనం అక్రమ రవాణా కొనసాగుతోంది. జిల్లాలో ఆత్మకూరు, ఉదయగిరి, రాపూరు, వెంకటగిరి, కావలి, నెల్లూరు ప్రాంతాల్లో ఫారెస్ట్ రేంజ్‌లున్నాయి. ఈ ప్రాంతాల్లో కొన్నిచోట్ల కొందరు స్మగ్లర్లు వక్షాలను నరికి దుంగలుగా మార్చి గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. అధికారులు దీనిని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం ఆదేశిస్తే విక్రయిస్తాం : డాక్టర్ పీఎస్ రాఘవయ్య, డీఎఫ్ఓ నెల్లూరు. జిల్లాలో మొత్తం 995 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం నిల్వ ఉంది. వాటిని విక్రయించేందుకు అనుమతి కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. అనుమతి రాగానే ఆన్లైన్ టెండర్ల ద్వారా విక్రయిస్తాం. -
తిరుమలలో నాశి రకం కంచె నిర్మాణం
-
నేనేం పారిపోలేదు.. బిజినెస్‌కోసం వెళ్లా...
-
పోలీసుల అదుపులో తమిళ మాజీ మంత్రి?
చిత్తూరు: ఎర్రచందనం స్మగ్లర్లపై చిత్తూరు జిల్లా పోలీసుల వేట కొనసాగుతోంది. ఇప్పటికే చెన్నైకి చెందిన బడా స్మగ్లర్ శరవణన్‌ను అరెస్టుచేసి పలు డంప్‌లలో నిల్వ ఉంచిన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న విషయం విదితమే. తాజాగా తమిళనాడులో డీఎంకే పార్టీకి చెందిన ఓ మాజీ మంత్రి, మరో మాజీ ఎమ్మెల్యేని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. -
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
రైల్వేకోడూరు (వైఎస్సార్ జిల్లా): వైఎస్సార్ కడప జిల్లా రైల్వేకోడూరు మండలం సమతానగర్‌లో ఆదివారం సాయంత్రం పోలీసులు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. రూ.11.86 లక్షల విలువైన 24 దుంగలను స్వాధీనం చేసుకుని, ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. సమతానగర్ సమీపంలోని వంతెన కింద నిందితులు వీటిని దాచి ఉంచారని ఎస్సై రామచంద్ర తెలిపారు. -
ఎర్రదొంగలకు కంచుకోట
పలమనేరు: చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల నుంచి అక్రమంగా తరలుతున్న ఎర్రచందనం కర్ణాటక రాష్ట్రం లోని హొస్కోట తాలూకా కటికనహళ్లి గ్రామానికి వెళుతోంది. ఈ గ్రామంలో ఆరు ముఠాలు తమ అనుచరులతో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నాయి. వీరిలో అంతర్జాతీయ డాన్లు ఉన్నారు. ఈ గ్రామానికి కొత్త వ్యక్తులు వెళ్లి తిరిగి రావడం అంత సులభం కాదు. ఒక్కో గ్యాంగ్‌లో వందమంది దాకా ప్రైవేటు సైన్యాన్ని నిర్వహిస్తున్నారు. గ్రామంలో అన్ని కుటుంబాల వారు ఇదే వృత్తిగా మార్చుకున్నారు. గ్రామ పొలిమేరల్లోని కోళ్ల ఫారాలు, వ్యవసాయ పొలాల వద్ద ఉన్న ఇళ్లనే ఎర్రచందనం గోడౌన్లుగా మార్చేసుకున్నారు. మొత్తం మీద ఈ గ్రామం ఎర్రచందనం స్మగ్లర్లకు శత్రుదుర్బేధ్యంగా ఉన్నట్టు చిత్తూరు జిల్లా నుంచి వెళ్లిన టాస్క్‌ఫోర్స్ అధికారులు, పలమనేరు, గంగవరం పోలీసులు చెబుతున్నారు. కటికనహళ్లిలో అందరిదీ ఇదే వృత్తి.. కటికనహళ్లిలో సుమారు 375 కుటుంబాలున్నాయి. వీటిలో 300 కుటుంబాలు ఎర్రచందనం స్మగ్లింగ్‌నే జీవనోపాధిగా మార్చుకున్నాయి. గ్రామంలో 200 మందికి పైగా డ్రైవర్లున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మిగిలిన వారు లోడింగ్, అన్లోడింగ్ చేయడం, మహిళలు గ్రేడింగ్ వర్క్, మరికొందరు గోడౌన్ వర్క్ ఇలా ఊరందరికీ ఇవే పనులు. గ్రామంలో ఆరు గ్యాంగులు.. ఈ గ్రామంలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే ప్రధానమైన గ్యాంగులు ఆరు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో రియాజ్‌ఖాన్, అతని తమ్ముడు నాజర్ ఖాన్ ప్రధానమైన అంతర్జాతీయ స్మగ్లర్లు. వీరితో పాటు ముక్తియార్, అల్లాబక్షు, ఆసీఫ్ అలీ, అర్షద్‌ఖాన్ బ్యాచ్‌లు అత్యంత ముఖ్యమైనవి. వీరిలో ఆంధ్ర పోలీసులకు పట్టుబడింది అల్లాబక్షు, అర్షద్‌ఖాన్ మాత్రమే. ప్రైవేటు సైన్యం దాడులతో వారిని అరెస్ట్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. కొత్త వాహనాలు వెళితే స్మగ్లర్ల తనిఖీ.. కటికనహళ్లి సమీపంలో హరేహళ్లి, మఠంమాల్సం ద్ర గ్రామాలు సైతం స్మగ్లింగ్‌కు పెట్టింది పేరు. ఈ గ్రామాలన్నీ హొస్కోటకు సమీపంలో ఉన్నవే. ప్ర ధాన రహదారి నుంచి ఈ గ్రామాలు రెండు, మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇక్కడికి ఏ వాహనాలు వెళ్లినా ఈ గ్యాంగ్‌లకు చెందిన వ్యక్తులు ముం దుగానే తనిఖీలు చేస్తారు. చిత్తూరు జిల్లా నుంచి దుంగలు తీసుకెళ్లే డ్రైవర్లు సైతం ఈ గ్రామాలకు 40 కి.మీ దూరంలోనే వాహనాలను ఆపేస్తారు. అక్కడి నుంచి కటికనహళ్లికి చెందిన డ్రైవర్లే తీసుకెళ్తారు. కటికనహళ్లి టూ కేరళ సముద్రతీరం.. కటికనహళ్లిలో గ్రేడింగ్ చేసిన దుంగలను చెన్నై, కేరళ సముద్ర తీరాలకు తీసుకెళ్లి అక్కడి నుంచి స్టీమర్ల ద్వా రా దుబాయ్‌కు తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారముంది. మంగళూరు జిల్లా నుంచి కేరళ రాష్ట్ర సరిహద్దు వరకు ఉన్న సముద్ర తీరాల్లో ఈ స్మగ్లింగ్ కోసం ప్రత్యేక ప్రదేశాలున్నట్లు తెలుస్తోంది. అప్పటికే బుక్ చేసిన స్టీమర్లలో దుబాయ్‌కు తరలిస్తారని గతంలో పలమనేరు పోలీసులకు పట్టుబడిన నాజర్‌ఖాన్ తెలిపాడు. ఈ స్మగ్లింగ్‌లో పోర్ట్ సిబ్బందితో పాటు సెంట్రల్, ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ సిబ్బంది కూడా భాగస్వాములేనని విచారణలో తేలింది. కర్ణాటక పోలీసుల కుమ్మక్కు.. కటికనహళ్లితో పాటు మరో రెండు గ్రామాల్లో రాత్రి, పగలు తేడా లేకుండా స్మగ్లింగ్ జరుగుతున్నా పోలీసులు మాత్రం పట్టించుకోరు. బెంగళూరు రూరల్ జిల్లా హొస్కోట్, సర్జాపూర్ పోలీస్స్టేషన్లకు చెందిన పలువురు పోలీసులు స్మగ్లర్లకు అండగా ఉన్నారని తెలుస్తోంది. మొత్తం మీద ఆంధ్ర పోలీసులు కటికనహళ్లికి వెళ్లి స్మగ్లర్లను పట్టుకోవడం కత్తిమీద సాములా మారింది.