రైల్వేకోడూరు (వైఎస్సార్ జిల్లా): వైఎస్సార్ కడప జిల్లా రైల్వేకోడూరు మండలం సమతానగర్‌లో ఆదివారం సాయంత్రం పోలీసులు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. రూ.11.86 లక్షల విలువైన 24 దుంగలను స్వాధీనం చేసుకుని, ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. సమతానగర్ సమీపంలోని వంతెన కింద నిందితులు వీటిని దాచి ఉంచారని ఎస్సై రామచంద్ర తెలిపారు.