Reliance Comunications
-
ఆర్‌కామ్‌కు ఆఖరి అవకాశం
సాక్షి, న్యూఢిల్లీ: ఇప్పటికే అప్పుల కుప్పలో కొట్టుమిట్టాడుతున్న రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధినేత అనిల్ అంబానీకి మరోషాక్ తగిలింది. ఆర్‌కాం ఎరిక్సన్ వివాదంలో సుప్రీంకోర్టు మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. టెలికాం పరికరాల తయారీదారు ఎరిక్సన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలపై మంగళవారం సుప్రీంకోర్టు ఆర్‌కామ్‌కు గట్టి ఆదేశాలిచ్చింది. చెల్లింపుల ఆలస్యంపై జస్టిస్ రోహిన్టన్ ఎఫ్. నారిమన్ నేతృత్వంలోని ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఆర్‌కాంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గడువును మరోసారి పెంచిన ధర్మాసనం ఇదే చివరిసారి పొడిగింపు అని స్పష్టంగా చెప్పింది. అంతేకాదు ఆలస్యమైతే సంవత్సరానికి 12శాతం వడ్డీ చెల్లించాలని కూడా తేల్చి చెప్పింది. సెప్టెంబర్ 30లోపు రూ.550 కోట్లను చెల్లించాలని గతంలో కోర్టు ఆదేశాలు అమలు కాకపోవడంతో ఎరిక్సన్ సుప్రీంను ఆశ్రయించింది. దీనిపై సుప్రీంకోర్టు తాజా ఆదేశాలిచ్చింది. డిసెంబర్ 15లోపు స్వీడన్ కంపెనీ ఎరిక్సన్కు రూ.550 కోట్లు చెల్లించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇప్పటికే ఒకసారి గడువును పొడిగించిన సుప్రీం..ఇకపై గడువు పెంచే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. -
ఆర్‌కాం-ఎయిర్‌సెల్ విలీనానికి సెబీ గ్రీన్ సిగ్నల్
ముంబై: అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్‌కామ్) , ఎయిర్ సెల్‌విలీనానికి సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైర్లెస్ బిజినెస్‌ను విడదీసేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతి లభించినట్లు ఆర్‌కాం తెలిపింది. ఈ మేరకు పథకం యొక్క ఆమోదం కోసం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ముంబై బెంచ్ లో ఒక అప్లికేషన్ దాఖలు చేసినట్టు చెప్పింది. ప్రతిపాదిత బదలాయింపు ఇతర అవసరమైన ఆమోదం పొందాల్సి ఉందని ఆర్‌కాం పేర్కొంది. వైర్లెస్ బిజినెస్‌ను విడదీసి తద్వారా ఎయిర్‌సెల్ లిమిటెడ్, డిష్‌నెట్ వైర్లెస్ లిమిటెడ్‌లో విలీనం చేసేందుకు ప్రణాళికలు వేసింది. ఈ విలీనం ప్రకారం ఏర్పడే కొత్త సంస్థలో ఆర్‌కాం, ఎయిర్ సెల్ సమ భాగస్వామ్యాన్ని కలిగి ఉంటాయి. అలాగే దాదాపు 28,000 కోట్ల రుణాన్ని కూడా ఆర్ కామ్, ఎయిర్‌సెల్ చెరి సగం భరించాలి. ఇండియాలో వినియోగదారుల పరంగా టాప్-3 టెలికం సంస్థగా ఆవిర్భవించాలన్న యోచనలో ఆర్‌కాం ఈ విలీనానికి శ్రీకారం చుట్టింది.