Religiosity
-
లౌకిక విలువలకు భంగం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: అభివృద్ధి ముసుగు తగిలించుకున్న ప్రధాని నరేంద్రమోదీ దేశాన్ని మతతత్వం వైపు నడిపిస్తూ లౌకిక విలువలకు భంగం కలిగిస్తున్నారని ఢిల్లీ జేఎన్‌యూ బీఏఎస్‌వో నేత ఉమర్ ఖలీద్ అన్నారు. ప్రగతిశీల యువజన సంఘం(పీవైఎల్) రాష్ట్ర 7వ మహాసభల సందర్భంగా వేలాది మంది యువకుల తో బుధవారం నగరంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల నుంచి పెవిలియన్ గ్రౌండ్ వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షుడు హన్మేష్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. మహిళలపై, చిన్నారులపై జరుగుతు న్న దాడులను సమర్థిస్తూ బీజేపీ నేతలు ర్యాలీ లు తీయడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. యూపీలో యోగి ప్రభుత్వ పాలనలో 11ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిందని, దేశ వ్యాప్తంగా నేరస్తులను శిక్షించాలని ఆందోళన చేసిన తర్వాత అక్కడి ప్రభుత్వం నేరస్తులను అరెస్ట్ చేసినట్లు చేసి వదిలేసిందని అన్నారు. అమిత్‌షాకు వ్యతిరేకంగా తీర్పు చెప్పినందుకే న్యాయమూర్తి లోయాను హత్య చేశారని ఆరోపించారు. బంగారు తెలంగాణ అని జపం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ నిరంకుశంగా పాలిస్తున్న కేసీఆర్, మోదీ ప్రభుత్వాలను గద్దె దించే వరకు పోరాటాలు సాగుతాయని పేర్కొన్నారు. -
‘రాష్ట్ర ధర్మ్’ మహోన్నతం: మోదీ
అన్ని మతాలకంటే అదే గొప్పది ♦ భారత్ ప్రపంచానికి మతతత్వం గురించి చెప్పలేదు.. ♦ ఆధ్యాత్మికత గురించే బోధించింది ♦ మతంతో సమస్యలు..ఆధ్యాత్మికతతో పరిష్కారాలు.. ముంబై: భారత్ ప్రపంచానికి ఆధ్యాత్మికతను బోధించిందే తప్ప మతతత్వం గురించి చెప్పలేదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అన్ని మతాల కంటే ‘రాష్ట్ర ధర్మ’(దేశానికి సేవ చేయటం) మహోన్నతమైనదని స్పష్టం చేశారు. ఆధ్యాత్మికత అనేది భారతీయ వారసత్వ ఆస్తి అని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విశ్వసించేవారని, మానవాళి ఎదుర్కొంటున్న పెను సమస్యలకు అది పరిష్కారం చూపుతుందని అన్నారు. ఫలానా మతానికే బద్ధులుగా ఉండాలని భారత్ ఎన్నడూ ప్రపంచానికి చెప్పాలని ప్రయత్నించలేదని, ఈ విషయమై మనం అర్థం చేసుకున్నట్లు ప్రపంచం మనల్ని సరిగా అర్థం చేసుకోలేదని విచారం వ్యక్తంచేశారు. దేశవ్యాప్తంగా అసహనం, మతతత్వం పెరుగుతోందన్న ఆరోపణలపై చర్చ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ జైన సన్యాసి ఆచార్య రత్నసుందర్‌సురీశ్వర్జీ మహరాజ్ రచించిన 300వ పుస్తకాన్ని మోదీ ఆదివారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించి మాట్లాడారు. మతం కొన్నిసార్లు సమస్యలను సృష్టిస్తుందని, అయితే ఆధ్యాత్మికత ఎల్లప్పుడూ సమస్యలకు పరిష్కారాలు చూపుతుందని చెప్పారు. సుందర్ గొప్ప సామాజిక సంస్కర్త, ఆధ్యాత్మిక నాయకుడని అభివర్ణించారు. విశ్వంలోని అన్ని రకాల అంశాలపై ఆయన తన పుస్తకాలతో భావాలను వ్యక్తపరిచారన్నారు. 10 రోజులుగా నిర్వహిస్తున్న ఆధ్యాత్మికత సమాలోచన కార్యక్రమం ముగింపు సందర్భంగా ఆదివారం ముంబైలోని సోమయ్య గ్రౌండ్స్‌లో ఆయన తాజా పుస్తకం ‘మై ఇండియా నోబెల్ ఇండియా’ఇంగ్లిష్, హిందీ, గుజరాతీ, మరాఠీ భాషల్లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన 30వేల మందిని ఉద్దేశించి మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ‘భౌతికంగా నేను మీకు దూరంగా ఉండొచ్చు. అయితే మీ మనసుకు చాలా సన్నిహితంగా ఉన్నాను. శిరసు వంచి ఆచార్య పవిత్ర పాదాలకు వందనం చేస్తున్నా’నన్నారు. వివిధ రకాల సామాజిక దురాచారాలపై ఆయన తన పుస్తకాల్లో రాశారన్నారు. అన్ని మతాల కంటే జాతీయత గొప్పమతమన్నారు. సుందర్ మహరాజ్ అనేక సామాజిక రుగ్మతలను వెలుగులోకి తెచ్చి వాటిని ఖండించారని మోదీ అన్నారు. ఆయన రచనలు భారత సాంస్కృతిక జాతీయతను ప్రతిబింబిస్తాయన్నారు. రాష్ట్రధర్మం గురించి రత్నసుందర్ సురీశ్వర్జీ బోధనలు అనుసరణీయాలని ఆయన అన్నారు. -
మోడీకి ఓటేసే వారు సముద్రంలో మునగాలి
మోడీకి ఓటేసేవాళ్లంతా సముద్రంలో మునగాలని కేంద్ర మంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా మండిపడ్డారు. మోడీకి ఓటేయని వారంతా పాకిస్థాన్‌కు వెళ్లిపోవాలన్న బీజేపీ నేత గిరిరాజ్‌సింగ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆయనిలా వ్యాఖ్యానించారు. మతతత్వం కాశ్మీర్ ప్రజలకు ఆమోదయోగ్యం కాదని ఫరూఖ్ అబ్దుల్లా పేర్కొన్నారు. భారత్ మతతత్వ రాజ్యంగా మారితే కాశ్మీర్ దేశంలో అంతర్భాగంగా ఉండబోదని హెచ్చరించారు. మతతత్వ శక్తుల నుంచి కాపాడాలని దేవుడిని ప్రార్థించాలని సూచించారు. ‘భారత్ మతతత్వ దేశం కాలేదు. ఒకవేళ మతతత్వాన్ని పాటిస్తే కాశ్మీర్ దేశంలో అంతర్భాగంగా ఉండదు. మతవాదం కాశ్మీర్ ప్రజలకు ఆమోదయోగ్యం కాదు’ అని ఆదివారం శ్రీనగర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఫరూఖ్ పేర్కొన్నారు. రెండు చోట్ల బాంబు పేలుళ్లు ఆదివారం ఫరూక్ ఎన్నికల సభల్లో రెండు చోట్ల బాంబులు పేలాయి. తొలుత శ్రీనగర్‌లో ఫరూక్ ప్రసంగించే వేదిక సమీపంలో గ్రెనేడ్లు పేలటంతో కలకలం రేగింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. మరో సంఘటనలో సెంట్రల్ బడ్గాం జిల్లా మగమ్‌లో ఫరూక్ ప్రసంగించాల్సిన వేదిక వద్ద జరిగిన బాంబు పేలుళ్లలో 14 మంది గాయపడ్డారు.