Religious Clashes
-
బీజేపీ అంటేనే చిల్లర: మంత్రి కేటీఆర్
-
కావాలనుకుంటే లోకేష్ మీద కేసు పెట్టలేమా?
సాక్షి, తాడేపల్లి : దేవాలయాలపై, విగ్రహాలపై జరుగుతున్న దాడులపై డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టంగా వివరణ ఇచ్చారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఇందులో టీడీపీ హస్తం ఉందనే నిజం ఎక్కడ బయటపడుతుందో అనే భయం వారిలో కనిపించిందన్నారు. ఒక్కసారిగా అందరూ బెంబేలెత్తారని, గుంపులు, గుంపులుగా ఏదేదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మంత్రి అనిల్ శనివారం మాట్లాడుతూ.. విగ్రహాలు పగులగొట్టినా పర్లేదు కానీ నిజాలు బయటకు రాకూడదని టీడీపీ నేతలు ఆలోచిస్తున్నారని దుయ్యబట్టారు. ఇలా చేస్తే ఎవరికి లాభం అన్నది అందరికీ అర్థం అవుతుందన్నారు. ఇవన్నీ దురుద్దేశాలతో రాజకీయాల కోసం చేసినవిగా కనిపిస్తున్నాయని విమర్శించారు. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టడం చంద్రబాబు ఒక్కడికే తెలుసని ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: టీడీపీకి బిగ్‌షాక్.. బీజేపీలోకి కీలక నేత! ‘అన్ని కేసుల్లో మీ పాత్ర ఉందని చెప్పలేదు కదా. కొన్నింటిలో మీ పాత్ర ఉంది. మేము కావాలనుకుంటే లోకేష్ మీద కేసు పెట్టలేమా..? దురుద్దేశం మీకుందా..? మాకుందా..? అఖిలప్రియ కేసులో స్పందనే లేదు..కానీ ఈ 9 కేసులపై మాట్లాడుతున్నారు. 9 కేసుల్లో ఉన్న వారు మీవారు కాదా...? గుండెలపై చెయ్యి వేసుకుని చెప్పగలరా..? పలు సంఘటనల్లో తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం టీడీపీ వారిది కాదా..? రాజమండ్రి వినాయక విగ్రహానికి అపవిత్రం చేశారన్న కేసులో బుచ్చియ్య చౌదరి అనుచరులు కాదా..? తిత్లీ తుఫానులో విగ్రహం దెబ్బ తినడాన్ని ఓ బీజేపీ నేత దుష్ప్రచారం చేశారు. దుర్గ గుడిలో క్షుద్ర పూజలు చేసిన నీచ చరిత్ర నీకుంది. విగ్రహాలు పగలగొట్టొచ్చు కానీ వాస్తవాలు బయటకు వస్తుంటే నారా వారి నరాల్లో వణుకు పుడుతోంది. చదవండి: రాష్ట్రంలో అరాచకం సృష్టించేందుకు చంద్రబాబు పన్నాగం ఎక్కడ తమ బండారం బయటపడుతుందో అని చెప్పి మా పై దాడి చేసే పరిస్థితి. భగవంతుడితో ఆడుకున్న వారు ఎవరూ బాగుపడ్డట్లు చరిత్రలో లేదు. కనీసం ఈ రోజుకైనా ఆ టీడీపీ వారిని సస్పెండ్ చేశారా..? కరోనాలో ఎన్నో సంఘటనలు జరిగినా బయటకు రాలేదు. కానీ రాముని విగ్రహము అనగానే పరిగెత్తుకొచ్చాడు. కచ్చితంగా దీని వెనుక ఎదో కుట్ర దాగుంది. చంద్రబాబుకి ముందే తెలుసు. ఆయనికి ఆయన సొంత వర్గం తప్ప ఎవరి మీదా ప్రేమ లేదు’ అని మంత్రి అనిల్ కుమార్ విమర్శనాస్త్రాలు సంధించారు. చదవండి: ఆలయ ఘటనల్లో తెలుగుదేశం కుట్ర -
మత రాజకీయాలు సహించం: అంబటి
సాక్షి, తాడేపల్లి: ప్రతిపక్ష నేత చంద్రబాబు మతి భ్రమించి మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ, మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు కొన్ని దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయని, తిరిగి అధికారంలోకి రాలేననే భయంతో విషప్రచారం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. (చదవండి: దశలవారీగా అందరికి వ్యాక్సినేషన్: సుచరిత) ‘‘ఏపీ మత సామరస్యానికి ప్రతీక.. మతాల మధ్య ఘర్షణ లేనే లేదు. టీడీపీ, బీజేపీ కలిసి చేసిన ఉదంతాలు బయటకొస్తున్నాయి. మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తే సహించం.బూట్లు వేసుకుని పూజలు చేసే నీకు హిందూత్వంపై ప్రేమ ఉందా?. అఖిలప్రియ విషయంలో చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదు. కులాలు, మతాల మధ్య వైషమ్యాలు సృష్టిస్తే ఉక్కుపాదంతో అణచివేస్తామని’’ అంబటి రాంబాబు హెచ్చరించారు. (చదవండి: టీడీపీకి బిగ్‌షాక్.. బీజేపీలోకి కీలక నేత!) -
కుదుటపడుతున్న ఢిల్లీ
న్యూఢిల్లీ: మత ఘర్షణలు చోటుచేసుకున్న ఈశాన్య ఢిల్లీలో ప్రశాంతత నెలకొంటోంది. పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ గడిచిన మూడు రోజులుగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని పోలీసులు తెలిపారు. వదంతులను పట్టించు కోవద్దని, అటువంటి వాటిపై తమకు సమాచారం ఇవ్వాలని స్థానికులను కోరారు. ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ ఆదివారం అల్లర్ల ప్రభావిత బ్రహ్మపురిలో పర్యటించి బాధితులతో మాట్లాడారు. ఘర్షణలకు సంబంధించి 903 మందిని అదుపులోకి తీసుకోవడంతోపాటు 254 ఎఫ్ఐఆర్లను పోలీసులు నమోదు చేశారు. ఢిల్లీ అల్లర్లకు సంబంధించి అదుపులోకి తీసుకున్న వారి వివరాలను వెల్లడించాలని హక్కుల కార్యకర్తలు పోలీసులను కోరారు. కాగా, పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వ్యతిరేక నిరసనలకు కేంద్ర బిందువు షహీన్‌బాగ్‌లో అధికారులు నిషేధాజ్ఞలు విధించారు. ఆదివారం ఆ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. కాగా, ఖ్యాలా–రఘుబిర్ నగర్–తిలక్ నగర్ ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగనున్నాయంటూ ఆదివారం సాయంత్రం సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంది. అయితే అవి కేవలం వదంతులేనని ఢిల్లీ పశ్చిమ డీసీపీ దీపక్ పురోహిత్ చెప్పారు. -
మాతో పెట్టుకుంటే మసే
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీపై విరుచుకుపడ్డారు. తమతో ఎవరైనా పెట్టుకుంటే నాశనమైపోతారని హెచ్చరించారు. రంజాన్(ఈద్–ఉల్–ఫితర్) సందర్భంగా కోల్‌కతాలోని రెడ్ రోడ్డులో ప్రార్థనలకు హాజరైన 25,000 మందికిపైగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ..‘మాతో ఎవరైనా పెట్టుకుంటే నాశనమైపోతారు.. ఇకపై ఇదే మా నినాదం. బీజేపీ మతాన్ని రాజకీయం చేస్తోంది. హిందువులు త్యాగానికి ప్రతీకలు. ముస్లింలు ఇమాన్(సత్యప్రియత)కు, క్రైస్తవులు ప్రేమకు, సిక్కులు బలిదానానికి ప్రతీకలు. మనమంతా ప్రేమించే భారతదేశం ఇదే. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రక్షించుకుంటాం’ అని మమత తెలిపారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై స్పందిస్తూ.. ‘ఎవ్వరూ భయపడాల్సిన పనిలేదు. కొన్నిసార్లు సూర్యుడు ఉదయించినప్పుడు ఆ కిరణాల తీవ్రత అధికంగా ఉంటుంది. కానీ కొంతసేపటికే అది తగ్గిపోతుంది. ఈవీఎంల సాయంతో వాళ్లు(బీజేపీ) ఎంతత్వరగా అధికారంలోకి వచ్చారో, అంతేత్వరగా తెరమరుగైపోతారు’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ముస్లింలకు బెంగాల్ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి, సీఎం మమత రంజాన్ శుభాకాంక్షలు చెప్పారు. -
ఆరని ‘మతం మంటలు’
‘వర్తమాన స్థితిగతులను చూస్తుంటే ఈ దేశం ఏమైపోతుందోనన్న ఆవేదన కలు గుతోంది. నా కళ్ల వెంట రక్తాశ్రువులు స్రవిస్తున్నాయి’ అన్నాడు విప్లవవీరుడు భగత్‌సింగ్. జైల్లో ఉరికంబం నీడన ఉండి, వెలుపల జరుగుతున్న మత ఘర్షణల గురించి విని చలించి ఒక పత్రికకు రాసిన వ్యాసంలో అన్న మాటలివి. దాదాపు తొమ్మిది దశాబ్దాలనాడు ఆయన ఇలా రాసేనాటికి దేశం బ్రిటిష్ వలసపాలనలో మగ్గుతోంది. మనకు స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటుతున్నా ఈనాటికీ ఆ పరిస్థితులే ఉన్నాయని బిహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో గతవారంలో శ్రీరామ నవమి పండగనాడు, ఆ తర్వాత చోటు చేసుకున్న ఉదంతాలు రుజువు చేశాయి. పశ్చిమబెంగాల్లో చిత్రమైన పరిస్థితి. అక్కడ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), బీజేపీలు తమ రాజకీయ ఆధిక్యతను ప్రదర్శించుకోవడానికి శ్రీరామనవమి పర్వ దినాన్ని ఎంచుకున్నాయి. ఫలితంగా పలు జిల్లాలు భయాందోళనల్లో మునిగాయి. టీఎంసీ రాష్ట్రంలోనూ, బీజేపీ కేంద్రంలోనూ ప్రభుత్వాలకు నాయకత్వంవహిస్తున్నా బాధ్యతమరిచాయి. రెండు పార్టీలూ పోటాపోటీగా ఊరేగింపులు జరిపాయి. ఎవ రెన్ని ప్రదర్శనలు నిర్వహించారు... ఎవరికి జనం అధికంగా వచ్చారన్నది ప్రధానం అయిపోయింది. ఇందులో మత విశ్వాసాలకూ, భక్తికీ ఏమాత్రం చోటులేదు. బీజేపీ శ్రేణులు కత్తులతో ఊరేగాయి. ఊరేగింపులు ఎదురుపడినచోట పోటాపోటీ నినా దాలు హోరెత్తాయి. మత ఘర్షణలు అధికంగా జరిగిన అసన్సోల్ నియోజక వర్గానికి కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో ప్రాతినిధ్యంవహిస్తున్నారు. నల్లమద్ది వృక్షాన్ని హిందీలో అసన్ అంటారు. మంటల ధాటిని మద్ది బాగా తట్టుకో గలదంటారు. ఆ వృక్షాలు ఎక్కువున్న ప్రాంతం గనుక అది అసన్సోల్ అయింది. కానీ రాజకీయ పార్టీలు ఎగదోసిన మతం మంటలు ఆ ప్రాంతాన్ని వారం రోజులుగా అట్టుడికిస్తున్నాయి. ఒక గుంపు అకారణంగా స్థానిక ఇమామ్ కుమా రుణ్ణి అపహరించి తీసుకుపోతే కొన్ని గంటల తర్వాత పదిహేడేళ్ల ఆ పిల్లవాడు ఒళ్లంతా నుజ్జునుజ్జయి విగతజీవిగా కనబడ్డాడు. అతణ్ణి బలవంతంగా తీసుకు పోతుంటే దగ్గర్లోనే ఉన్న అతని సోదరుడు గమనించి పోలీసుల్ని హెచ్చరించినా వారు రంగంలోకి దిగేసరికి ఆలస్యమైపోయింది. తన కుమారుడికి జరిగినట్టు మరెవరికీ జరగొద్దని, అందరూ ప్రశాంతంగా ఇళ్లకు వెళ్లిపోవాలని ఇమామ్ ప్రాధే యపడి ఉండకపోతే అసన్సోల్ మరింత నెత్తురు కళ్లజూసేది. 24 పరగణాల జిల్లాలో విద్యావేత్త, స్వతంత్ర భారత తొలి విద్యామంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ విగ్రహానికి ఒక గుంపు నిప్పుపెట్టింది. అసన్సోల్, 24 పరగణాల జిల్లా మాత్రమే కాదు... మరో అయిదారు జిల్లాలు ఇలా అట్టుడికాయి. తనను ‘హిందూ వ్యతిరేకి’గా చిత్రించే బీజేపీ ప్రచారాన్ని తిప్పికొట్టడానికి పశ్చిమబెంగాల్ ముఖ్య మంత్రి, తృణమూల్ అధినేత మమతా బెనర్జీ ఆ పార్టీకి దీటుగా ప్రదర్శనలు చేయించడంపై దృష్టిపెట్టారు. ఆ క్రమంలో శాంతిభద్రతలు ఏమవుతాయన్న సంగతిని మరిచారు. జేడీ(యూ)–బీజేపీ కూటమి సర్కారు ఏలుబడిలో ఉన్న బిహార్‌లో సైతం పలు జిల్లాలు మతఘర్షణలు చవిచూశాయి. పండగలొచ్చాయంటే ఉద్రిక్తతలు అలుము కోవడం ఆ రాష్ట్రంలో రివాజుగా మారింది. ఈసారి శ్రీరామనవమి ఊరేగింపులకు కొన్ని నిబంధనలతో అనుమతినిచ్చామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. మత ఉద్రి క్తతలు ఏర్పడకుండా చూడటం కోసం అన్య మతస్తులు అధికంగా ఉన్న ప్రాంతాలు, గ్రామాల మీదుగా అవి వెళ్లకుండా చర్యలు తీసుకున్నామన్నది. కానీ వాస్తవంలో అందుకు విరుద్ధంగా జరిగింది. ఫలితంగా భాగల్పూర్, ముంగేర్, ఔరంగాబాద్, సమస్తిపూర్, నలందా, ముజఫర్‌పూర్, సీతామడి వగైరాల్లో అల్లర్లు చెలరేగాయి. చాలాచోట్ల రెచ్చగొట్టే నినాదాలు, హెచ్చరికలు మిన్నంటాయి. ఇందుకు లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్జేడీ కారణమని బీజేపీ ఆరోపిస్తుంటే, బిహార్ ప్రభుత్వం మాత్రం కేంద్రమంత్రి అశ్వినీకుమార్ చౌబే కుమారుణ్ణి భాగల్పూర్ మతఘర్షణల కేసులో అరెస్టు చేసింది. అసలు చాలాచోట్ల ప్రభుత్వం నిర్దేశించిన మార్గాల్లో కాకుండా వేరే మార్గాల ద్వారా ఊరేగింపులు ఎలా వెళ్లాయో, స్థానిక పోలీసులు ఎలా అనుమతించారో బిహార్ ప్రభుత్వం చెప్పలేకపోతోంది. చిత్రమేమంటే నితీష్ సొంత జిల్లా నలందాలో తొలిసారి మత ఘర్షణలు చెలరేగాయి. మొన్న ఫిబ్రవరిలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మత ఘర్షణలపై విడుదల చేసిన నివేదిక వర్తమాన స్థితిగతుల్ని కళ్లకు కట్టింది. నిరుడు దేశవ్యాప్తంగా 822 మతఘర్షణలు చోటుచేసుకోగా వాటిలో 111మంది మరణించారని, 2, 384మంది గాయపడ్డారని ఆ నివేదిక గణాంకాలిచ్చింది. మిగిలిన రాష్ట్రాలతోపోలిస్తే ఉత్తర ప్రదేశ్‌లో అత్యధికంగా 195 ఘర్షణలు జరిగాయి. ఆ తర్వాత స్థానం కర్ణాటక రాష్ట్రా నిది. అక్కడ వంద ఘర్షణలు జరగ్గా 9మంది మరణించారు. 229మంది గాయ పడ్డారు. మూడో స్థానంలో ఉన్న బిహార్ 85 ఘర్షణలు చవిచూసింది. పరిస్థితులు సవ్యంగా లేవని తెలిసినా, ప్రతి ఏటా అల్లర్లు జరుగుతున్నాయని అర్ధమైనా ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలేదు. రెచ్చగొడుతున్న శక్తుల్ని గుర్తించి వారిని ముందస్తుగా నిర్బంధంలోకి తీసుకునే ప్రయత్నాలు చేయడంలేదు. సరిగదా అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాయి. దేశంలోనే అత్యధిక మత ఘర్షణలు నమోదైన యూపీలో అక్కడి సర్కారు మతపరమైన కేసుల్లో నిందితులుగా ఉన్నవారిపై ఈమధ్యే కేసులు ఎత్తేసే పనిలో పడింది. 60మందికిపైగా మరణానికి దారితీసిన ముజఫర్‌నగర్–షామ్లీ ఘర్షణల్లో 131 కేసుల్ని ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. 2013 నాటి ఆ ఘర్షణల్లోని బాధితులు ఈనాటికీ స్వస్థలాలకు వెళ్లలేక సహాయ శిబిరాల్లో దుర్భరమైన జీవనం గడుపుతున్నారు. రాజకీయ లబ్ధికోసం పర్వదినాలను బలప్రదర్శనకు సందర్భాలుగా మార్చుకుని సాధారణ పౌరుల ప్రాణాలతో, వారి విశ్వాసాలతో చెలగాటమాడే ధోరణులకు రాజకీయ పక్షాలు స్వస్తిపలకాలి. ఈ దేశానికొక రాజ్యాంగం ఉన్నదని, తాము సైతం దానికి లోబడి ఉండాలని గుర్తించాలి. -
శ్రీలంకలో ఎమర్జెన్సీ ; అసలు కారణమేంటి?
భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్‌ల మధ్య టీ20 సిరీస్ క్రికెట్ పోటీలు ప్రారంభమైన తరుణంలోనే.. శ్రీలంక ప్రభుత్వం దేశంలో పది రోజులపాటు అత్యవసర పరిస్థితిని(ఎమర్జెన్సీ) ప్రకటించింది. దేశంలో పలుచోట్ల బౌద్ధులకు, ముస్లింలకు మధ్య అల్లర్లు చెలరేగడంతో ఈ నిర్ణయం తీసుకుంది. శ్రీలంకలో ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణలకు నూరేళ్లకు పైగా నేపథ్యం ఉంది. మత కల్లోలాలకు కేంద్రస్థానంగా నిలిచిన మధ్య శ్రీలంక నగరం కాండీ సింహళ బౌద్ధులకు పుణ్యస్థలం. 1915లో మొదటిసారి దేశంలో ముస్లింలకూ, మెజారిటీ బౌద్ధులకు మధ్య భారీ స్థాయిలో ఘర్షణలు జరిగాయి. రెండు కోట్ల పది లక్షల జనాభా ఉన్న ఈ ద్వీపంలో 70 శాతానికి పైగా సింహళ బౌద్ధులుండగా, ముస్లింల సంఖ్య పది శాతం. బౌద్ధ జాతీయవాదం శ్రీలంకలో బౌద్ధమత ఆధిపత్యం సాధించడానికి జరిగిన ప్రయత్నాల్లో మొదటి నుంచీ ప్రధాన పాత్ర పోషించింది బౌద్ధ సన్యాసులే. ఐరోపా వలస పాలకులు, క్రైస్తవ మత ప్రచారకులు శ్రీలంక ఉనికిని, రూపురేఖలను మార్చేస్తారనే భయాందోళనలు 19వ శతాబ్దంలో వ్యాపించాయి. బౌద్ధ భిక్షువులు థేరవాద బౌద్ధధర్మం పునరుద్ధరణకు నడుంబిగించారు. తర్వాత దేశంలో ఇంగ్లిష్‌కు బదులు సింహళాన్నే ప్రధాన భాషగా చేయాలనే ఉద్యమం మొదలైంది. ఫలితంగా బౌద్ధ జాతీయవాదం బలపడింది. దేశానికి 1948లో స్వాతంత్య్రం వచ్చాక రాజ్యాంగంలో బౌద్ధ ధర్మానికి ప్రత్యేక స్థానం కల్పించారు. గత పదేళ్లలో రాజకీయ పంథాను ఎంచుకున్న బౌద్ధ సన్యాసులు ముస్లింలను లక్ష్యంగా చేసుకుని విద్వేష ప్రచారం సాగిస్తున్నారు. కొన్ని నెలలుగా దేశంలో ముస్లింలతో ఘర్షణ పడుతున్న బౌద్ధ తీవ్రవాద సంస్థ బోడు బాల సేన (బీబీఎస్) కాండీ నగరంలో ముస్లిం వ్యతిరేక ప్రచారంతో మత ఉద్రిక్తలకు కారణమైంది. బాల సేన చేసిన ముస్లిం వ్యతిరేక ప్రచారం ఫలితంగా 2014లో దేశ నైరుతి ప్రాంతంలోని కాలుతారా జిల్లాలోని నాలుగు పట్టణాల్లో బౌద్ధులకూ, ముస్లింలకు మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ దాడుల్లో నలుగురు మరణించగా, 80 మంది గాయపడ్డారు. ముస్లింల దుకాణాలు, ఇళ్లు, వ్యాపార సంస్థలపై దాడులు జరిగాయి. కిందటి జూన్‌లో, తర్వాత నవంబర్‌లో దక్షిణ కోస్తా పట్టణం గింతోటాలో సామాజిక మాధ్యమాల ద్వారా విస్తరించిన పుకార్ల ఫలితంగా రెండు వర్గాల మధ్య కొట్లాటలు జరిగాయి. మయన్మార్నుంచి సైనికులు, బౌద్ధ మత తీవ్రవాదుల వేధింపులు తట్టకోలేక శ్రీలంకకు శరణార్థులుగా వచ్చిన రొహింగ్యా ముస్లింలకు ఈ ప్రాంతంలో ఆశ్రయం కల్పించడాన్ని బీబీఎస్వ్యతిరేకిస్తోంది. కొంతకాలం క్రితం ఐక్యరాజ్యసమితి కొలంబోలో రొహింగ్యాల కోసం నడుపుతున్న సహాయ కేంద్రంపై బౌద్ధ సన్యాసులు దాడిచేశారు. కొలంబోలో బాల సేన స్థాపన రాజధాని కొలంబోలోని సంబుద్ధ జయంతి మందిర అనే బౌద్ధ సాంస్కృతిక కేంద్రం నుంచి పనిచేస్తున్న బోడు బాల సేనను 2012లో కిరమా విమలజోతి, గలగోద అత్తే జ్ఞానసార అనే ఇద్దరు బౌద్ధ భిక్షువులు స్థాపించారు. దేశంలో సింహళ జాతిని, బౌద్ధ ధర్మాన్ని కాపాడడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు సేన ప్రచారం చేస్తోంది.బురఖాలు ధరించడం లంక ముస్లిం మహిళల్లో కొత్త సంప్రదాయంగా మారింది. దాదాపు 20 లక్షల మంది ముస్లింలు పశ్చిమాసియా దేశాల్లో పనిచేస్తున్న కారణంగా వారి ఆదాయాలు చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగాయి. గతంలో లేని ముస్లిం వేషధారణ కనిపించడంతో బీబీఎస్వంటి బౌద్ధ తీవ్రవాద సంస్థలు బురఖాలు నిషేధించాలంటూ ఉద్యమిస్తున్నాయి. - సాక్షి నాలెడ్జ్సెంటర్ -
ఆధార్ డేటా సురక్షితం
న్యూఢిల్లీ: యూపీ కాస్గంజ్లో మతఘర్షణలు, ఢిల్లీలో సీలింగ్ డ్రైవ్ అంశాలపై ప్రతిపక్షాల నిరసనలతో శుక్రవారం ఉదయం కొంతసేపు రాజ్యసభ వాయిదా పడింది. ఉదయం సమావేశం ప్రారంభం కాగానే ఎస్పీ, ఆప్ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేయటంతో డిప్యూటీ స్పీకర్ కురియన్ సభను ఉదయం కొద్దిసేపు వాయిదా వేశారు. అనంతరం ఆధార్ డేటా లీకేజీ వార్త అవాస్తవమని ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ రాజ్యసభలో స్పష్టంచేశారు. ఏ వ్యక్తికి సంబంధించిన ఆధార్ సమాచారమైనా ఎవరైనా రూ.500కే కొనుక్కోవచ్చంటూ మీడియాలో వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. రాజ్యసభలో ప్రవేశపెట్టిన వివాదాస్పద గో సంరక్షణ బిల్లును బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ఉపసంహరించుకున్నారు. సుప్రీంకోర్టు సీజేఐ, నలుగురు సీనియర్ న్యాయమూర్తుల మధ్య వివాదాన్ని పరిష్కరించుకునే సామర్ధ్యం న్యాయవ్యవస్థకు ఉందని న్యాయశాఖ సహాయ మంత్రి చౌదరి తెలిపారు. రైలు ప్రయాణికుల సంఖ్యతోపాటు ఆదాయాన్ని పెంచే ఫ్లెక్సి–చార్జీల విధానం అమలు చేయాలని యోచిస్తున్నట్లు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. -
‘మతఘర్షణలు రెచ్చగొట్టే మెసేజ్‌లు ఇవ్వొద్దు’
సాక్షి, ముంబై: మత ఘర్షణలు, అల్లర్లకు ఊతమిచ్చే మెసేజ్‌లు పంపించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీసు కమిషనర్ రాకేశ్ మారియా హెచ్చరించారు. అలాగే సదరు ఎస్ఎంఎస్లను, ఎమ్మెమ్మెస్లను ఇతరులకు ఫార్వర్డ్ చేసేవారిపై కూడా కేసులు నమోదు చేయనున్నట్లు లాల్బాగ్ ప్రాంతంలో ఈ నెల నాలుగో తేదీ రాత్రి రెండువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో అక్కడ 144 సెక్షన్ అమలుచేసిన విషయం తెలిసిందే. ఆ రోజు జరిగిన ఘటన ముందస్తు పథకం ప్రకారమే జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అల్లర్లు ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే ఈ విషయం ఎస్సెమ్మెస్‌లు, ఎమ్మెమ్మెస్‌ల ద్వారా నగర మంతట వ్యాపించింది. దీన్ని బట్టి ఇదంతా ముందస్తు పథకం ప్రకారం జరిగిందని మారియా అనుమానాలు వ్యక్తం చేశారు. మత ఘర్షణలు సృష్టించి నగరంలో శాంతి, భద్రతలకు విఘాతం కల్గించాలని అసాంఘిక శక్తులు పథకం వేసినట్లు స్పష్టమవుతోందని మారియా అభిప్రాయపడ్డారు. ఆ రోజు స్థానిక ప్రజలు సంమయనం పాటించడం వల్ల పెను ప్రమాదం తప్పిందని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా మతఘర్షణలు జరిగి ఉండేవని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ రోజు ఎస్సెమ్మెస్‌లు, ఎమ్మెమ్మెస్‌లు ఎవరు, ఎవరికి పంపించారు...? వారు బల్క్‌లో ఎవరెవరికి ఫార్వర్డ్ చేశారో ఆరా తీస్తున్నామన్నారు. కాగా, ఏదైనా ఘటన జరిగితే దాని పూర్తి వివరాలు తెలుసుకోకుండా అనవసరంగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే మెసెజ్‌లు ఇతరులకు పంపకూడదని మారియా సూచించారు. సదరు సమాచారాన్ని ముందు సమీప పోలీసు స్టేషన్‌కు చేరవేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
కాశ్మీర్లో మరో మూడు జిల్లాల్లో కర్ఫ్యూ
జమ్మూకాశ్మీర్‌లోని ఉధంపూర్, సాంబ, కతువా జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. ముందుగా జాగ్రత్తగా కర్ఫ్యూ విధించినట్టు పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే మూడు జిల్లాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. కిష్ట్వార్ జిల్లాలో చెలరేగిన మత ఘర్షణల ఫలితంగా, శనివారం కాశ్మీర్ లోయలో జనజీవనం స్తంభించిపోయింది. కిస్ట్‌వార్ జిల్లాలో శనివారం రెండోరోజూ కర్ఫ్యూ కొనసాగగా, హింసాత్మక సంఘటనలు చెలరేగడంతో జమ్మూ, రాజౌరీ జిల్లాల్లోనూ కర్ఫ్యూ విధించారు. బంద్ ఫలితంగా కాశ్మీర్ లోయ ప్రాంతంలో విద్యా, వ్యాపార సంస్థలు మూతపడగా, వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. నిరసనల్లో పదిమంది గాయపడ్డారు. కిష్ట్వార్లో పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు గాయపడ్డారు. జమ్మూ నగరంలో పోలీసులు, నిరసనకారుల పరస్పర దాడుల్లో ఏడుగురు గాయపడ్డారు. జమ్మూతో పాటు పరిసర జిల్లాల్లో బంద్ పాటించడంతో పాటు భారీ స్థాయిలో నిరసనలు జరిగాయి. కిష్ట్వార్ జిల్లా