మత రాజకీయాలు సహించం: అంబటి | YSRCP MLA Ambati Rambabu Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

ఏపీ మత సామరస్యానికి ప్రతీక

Published Sat, Jan 16 2021 12:42 PM | Last Updated on Sat, Jan 16 2021 4:58 PM

YSRCP MLA Ambati Rambabu Comments On Chandrababu - Sakshi

సాక్షి, తాడేపల్లి: ప్రతిపక్ష నేత చంద్రబాబు మతి భ్రమించి మాట్లాడుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ, మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు కొన్ని దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయని, తిరిగి అధికారంలోకి రాలేననే భయంతో విషప్రచారం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. (చదవండి: దశలవారీగా అందరికి వ్యాక్సినేషన్‌: సుచరిత)

‘‘ఏపీ మత సామరస్యానికి ప్రతీక.. మతాల మధ్య ఘర్షణ లేనే లేదు. టీడీపీ, బీజేపీ కలిసి చేసిన ఉదంతాలు బయటకొస్తున్నాయి. మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తే సహించం.బూట్లు వేసుకుని పూజలు చేసే నీకు హిందూత్వంపై ప్రేమ ఉందా?. అఖిలప్రియ విషయంలో చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదు. కులాలు, మతాల మధ్య వైషమ్యాలు సృష్టిస్తే ఉక్కుపాదంతో అణచివేస్తామని’’ అంబటి రాంబాబు హెచ్చరించారు. (చదవండి: టీడీపీకి బిగ్‌షాక్‌.. బీజేపీలోకి కీలక నేత!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement