The report
-
ఆత్మహత్యలపై నివేదిక కోరిన రాహుల్
బెంగళూరు: కర్ణాటకలో జరుగుతున్న రైతుల వరుస ఆత్మహత్యలకు సంబంధించి నివేదికలు ఇవ్వాలని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతోపాటు కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(కేపీసీసీ) అధ్యక్షుడు పరమేశ్వర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఇద్దరి నుంచి రెండు వేర్వేరు నివేదికలు ఇవ్వాలని ఆయన సూచించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రాష్ట్రంలో రెండు నెలల్లోనే 58 మంది రైతులు వివిధ కారణాల తో బలవన్మరణాలకు పాల్పడిన విషయం తెలిసిందే. ముఖ్యంగా బెళగావిలోని సువర్ణ విధాన సౌధలో ఈ ఏడాది వర్షాకాల సమావేశాలు జరుగుతాయని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన తర్వాత ఈ వరుస ఆత్మహత్యలు ఎక్కువయ్యాయి. ఈ విషయమై కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. కాంగ్రెస్ నాయకులు యజమానులుగాగల చక్కెర కర్మాగారాల నుంచి బకాయిలు రైతులకు అందకపోవడమే ఈ సమస్యకు కారణమని విపక్షాలతోపాటు ప్రజలు కూడా భావిస్తున్నారు. ఈ విషయమై ఇక్కడి పత్రికలే కాకుండా జాతీయస్థాయి మీడియా కూడా వరుస కథనాలు ప్రచురిస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి దక్షిణాదిలో ప్రస్తుతం కాస్త పట్టు ఉన్న పెద్ద రాష్ట్రం కర్ణాటకనే. అయితే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టంలోనే వరుసగా రైతుల ఆత్మహత్యలు జరుగుతుండడం అందులోనూ ఆ పార్టీ నాయకుల పరోక్ష ప్రమేయంగల కారణాలతో ఈ సంఘటనలు చోటుచేసుకోవడం కాంగ్రెస్ హైకమాండ్‌ను కలవరపెడుతోంది. మరోవైపు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రాహుల్‌గాంధీ పర్యటిస్తూ మోదీవి రైతు సంక్షేమానికి విఘాతం కలిగించే నిర్ణయాలని విమర్శిస్తున్న తరుణంలో అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో రైతులు బలవన్మరణాలకు పాల్పడుతుండడం ఆ పార్టీ హై కమాండ్‌ను ఇరుకున పెడుతోంది. ఈ నేపథ్యంలో రైతుల ఆత్మహత్యలకు కారణాలు, నివారణకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అందించిన పరిహారంతోపాటు ఇక పై ఇలాంటి పరిస్థితి రాకుండా చేపట్టబోయే చర్యలు తదితర వివరాలతో కూడిన పూర్తి స్థాయి నివేదికను త్వరగా హై కమాండ్‌కు అందించాలని ‘యువరాజు’, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతోపాటు కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్‌కు ఆదేశాలు జారీచేశారు. -
పత్రికల్లో వచ్చే కథనాలపై 24 గంటల్లో నివేదిక
కలెక్టర్ నిర్మల ఆదేశం సిటీబ్యూరో: ఇకపై పత్రికల్లో వచ్చే ప్రతికూల కథనాలపై రెగ్యులర్‌గా సమీక్షిస్తామని, సంబంధిత అధికారులు వాటిపై క్షేత్రస్థాయి పరిశీలన చేసి 24 గంటల్లో తనకు నివేదిక అందించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కె.నిర్మల ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం జిల్లా అధికారులతో ఆమె మాట్లాడుతూ త్వరలో ఈ అంశంపై ఒక సమావేశాన్ని నిర్వహిస్తానని, జిల్లా అధికారులు తప్పక హాజరు కావాలని ఆదేశించారు. కేవలం పత్రికల్లో వచ్చిన ప్రతికూల కథనాలే కాకుండా శాఖలు తమ ప్రస్తుత పనితీరును మెరుగు పర్చుకోవటానికి తీసుకోవాల్సిన చర్యలు చర్చిస్తామన్నారు. -
సర్కారుస్థలంపై కలెక్టర్‌కు నివేదిక
రామగుండం : రామగుండంలో విద్యుత్కేంద్రాల స్థాపనకు ప్రభుత్వ భూముల సర్వే ప్రక్రియ ముమ్మరమైంది. కలెక్టర్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచడంతో సెంటుభూమి వదలకుండా నివేదికలు తయారుచేశారు. ఈ నెల 4వ తేదీన రామగుండంతో పాటు గ్రామాల్లో ప్రభుత్వ భూములను ఎన్టీపీసీ, బీపీఎల్, జెన్కో, రెవెన్యూ అధికారులు పరిశీలించారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో త్వరలోనే 600 యూనిట్ల సామర ్థ్యంతో రెండు(1200 మెగావాట్ల) విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. యాష్‌పాండ్ స్థలం కోసం ప్రభుత్వంపై ఒత్తిడితీసుకురాగా పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల వసతి గృహం పక్కన సర్వే నం.366,364లో 500 ఎకరాలకు పైబడి ప్రభుత్వ భూమిని గుర్తించారు. దీన్ని తమకు అప్పగించాలని ఎన్టీపీసీ అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. మరోసారి సర్వే చేపట్టగా 1916కు ముందు ప్రభుత్వ భూమిగా పేర్కొన్నా.. 1936లో నిజాం సర్వే నివేదికల్లో 100 ఎకరాలకు మించి ప్రభుత్వ భూమి లేదని స్పష్టమైంది. ఫారెస్టు విభాగం వద్ద ఉన్న భూ నక్షాలు పరిశీలిస్తే వంద ఎకరాలే సర్కారు భూమి అని, మిగతా ప్రాంతం రిజర్వు ఫారెస్టులోనే ఉందని తేలింది. దీంతో ఎన్టీపీసీ యాష్‌పాండ్‌కు సరిపోదని నిర్ణయించుకుని వెనక్కి తగ్గారు. 508.32 ఎకరాల గుర్తింపు సర్కారుకు అందించిన నివేదికలో కొంత మొత్తం ప్రైవేటు వ్యక్తుల పట్టా భూములు, అసైన్డ్ భూములూ ఉన్నట్లు రెవెన్యూ అధికారులు స్పష్టంచేశారు. కలెక్టర్‌కు స్థానిక రెవెన్యూ అధికారులు అందించిన భూ నివేదికల్లో రాయదండి శివారు పరిధిలో ప్రభుత్వ భూమి 225.37 ఎకరాలు, ప్రైవేటు పట్టా భూములు 50.21 ఎకరాలు, గోలివాడ శివారులో ప్రభుత్వ భూమి 131.24, అసైన్డ్ భూములు 16.13, పట్టాభూములు 20.23 ఎకరాలు, అంతర్గాం శివారులో ప్రభుత్వ భూములు 33.33, అసైన్డ్ 24.36, పట్టా భూములు 5.05 ఎకరాలు ఉన్నాయి. మూడు గ్రామాల్లో ప్రభుత్వ భూములు 391.14, అసైన్డ్ భూములు 41.09 ఎకరాలు, పట్టా భూములు 76.09 ఎకరాల విస్తీర్ణం గుర్తించి నివేదికను కలెక్టర్‌కు అందించారని తెలిసింది. ఈ స్థలాన్ని మరోసారి ఎన్టీపీసీ ఉన్నతాధికారుల బృందం పర్యటించే అవకాశం ఉంది. పరిశోధనకేంద్రం స్థలాలు వెనక్కి అంతర్గాం, రాయదండి, గోలివాడ శివారు పరిధిలోకి వచ్చే ముర్రా జాతి గేదెల అభివృద్ధి పరిశోధన కేంద్రం స్థలాలను రెవెన్యూ అధికారులు అవసరాల మేరకు దశల వారీగా వెనక్కి తీసుకోనున్నట్లు స్పష్టం చేస్తున్నారు. నిర్దేశిత గడువులోగా ప్రభుత్వం పరిశోధన కేంద్రానికి అప్పగించిన ప్రభుత్వ భూమిలో అభివృద్ధి పనులు చేపట్టలేదు. కలెక్టర్‌కు అందించిన నివేదికలో 150 ఎకరాల పరిశోధన కేంద్రానికి చెందిన స్థలం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. -
రుణమాఫీ రూ.1032.60 కోట్లు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఎట్టకేలకు రుణమాఫీ ప్రక్రియ పూర్తయింది. జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల 10 వేల 252 మందికి రూ.1032.62 కోట్ల మాఫీ కానున్నట్లు యంత్రాంగం నిర్ధారించింది. దాదాపు 20 రోజులపాటు రుణమాఫీ అంశం కుస్తీపట్టి లెక్కలు తేల్చగా, శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా సంప్రదింపుల కమిటీ (డీసీసీ)లో ఆమోదం లభించింది. కలెక్టర్ ఎన్.శ్రీధర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బ్యాంకుల వారీగా వచ్చిన వివరాలను క్రోడీకరించి తయారు చేసిన నివేదికను సమర్పించగా.. వాటిని కమిటీ సభ్యులు ఆమోదించారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన వివరాల ప్రకారం పంట రుణాలకు సంబంధించి 2,04,330 రైతులకు రూ.1130.33 కోట్లు, బంగారు ఆభరణాలపై రుణాలకు సంబంధించి 6,169 రైతులకు గాను రూ.101.39 కోట్లుగా గుర్తించారు. అయితే డీసీసీ మాత్రం 2,10,252 రైతులకుగాను రూ. 1032.60 కోట్లు మాత్రమే మాఫీకి ఆమోదించింది. సమావేశ అనంతరం రుణమాఫీ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. రీషెడ్యూల్‌పై దృష్టి పెట్టండి: కలెక్టర్ శ్రీధర్ ప్రభుత్వ ఆదేశాలమేరకు రుణమాఫీ కసరత్తు పూర్తిచేసిన బ్యాంకర్లు ప్రస్తుతం రుణాల రీషెడ్యూల్‌పై దృష్టి సారించాలని కలెక్టర్ ఎన్.శ్రీధర్ పేర్కొన్నారు. శుక్రవారం డీసీసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రిజర్వ్‌బ్యాంకు ఇచ్చిన పంట రుణాల రీషెడ్యూల్ మార్గదర్శకాలను అన్ని బ్యాంకులకు అందజేయనున్నట్లు తెలిపారు. పదిరోజుల్లో ఈ ప్రక్రియ పూర్తిచేయాలని స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్లో రూ.442 కోట్ల రుణ లక్ష్యానికి గాను కేవలం రూ.112 కోట్లు మాత్రమే మంజూరు చేశామని, రీషెడ్యూల్లో భాగంగా మిగతా రుణాలను రీషెడ్యూల్ చేసి వందశాతం లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. ప్రతి బ్యాంకు శాఖ పరిధిలో ఉన్న గ్రామాలను గుర్తించి.. ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, ఒక్కో గ్రామ రైతులకు నిర్దేశిత సమయాన్ని కేటాయించి ఆరోజు ఆ గ్రామంలోని రైతుల రుణాలు రీషెడ్యూల్ చేయాలన్నారు. రైతులను బ్యాంకుకు తీసుకొచ్చే బాధ్యత సంబంధిత వ్యవసాయ, విస్తరణ అధికారులకు అప్పగించాలని జేడీఏ విజయ్‌కుమార్‌ను ఆదేశించారు. సోమవారం రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ ఉందని, ఈ కార్యక్రమంలో రుణమాఫీ అమలుకు సంబంధించి పూర్తిస్థాయి స్పష్టత వస్తుందన్నారు. ఈ సమావేశానికి బ్యాంకు ప్రతినిధులు హాజరుకావాలన్నారు. రుణమాఫీతో సంబంధం లేకుండా రైతుల రుణాలు రీషెడ్యూల్ చేయాలని కలెక్టర్ ఉద్ఘాటించారు. ఈ సమావేశంలో జేసీ ఎంవీరెడ్డి, డీఆర్వో సూర్యారావు, ఎల్డీఎం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.