reservation chart
-
ఇక బోగీలపై రిజర్వేషన్ చార్టులుండవ్..!
సాక్షి, హైదరాబాద్: ప్లాట్‌ఫాంపైకి ఎక్స్‌ప్రెస్ రైలొచ్చి ఆగింది.. ప్రయాణికులు హడావుడిగా తలుపు వద్ద అతికించిన రిజర్వేషన్ చార్టులో సీటు నంబర్ చూసుకుని తీరిగ్గా కోచ్‌లోకి చేరుకున్నారు.. మరికొద్ది రోజుల్లో ఈ దృశ్యం కనిపించకపోవచ్చు. బోగీలపై రిజర్వేషన్ చార్టు అతికించే విధానాన్ని ఎత్తేయాలని కేంద్రం నిర్ణయించింది. ‘క్లీన్ రైల్వే’లో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని దేశంలోని 7 స్టేషన్లలో 4 రోజుల క్రితం ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ప్రయాణికుల స్పందన ఆధారంగా అమలుపై నిర్ణయం తీసుకోనుంది. ఖర్చు భారీగానే.. పైకి చిన్న విషయంగానే కనిపిస్తున్నా.. చార్టులకు భారీగానే ఖర్చవుతోంది. రూ.లక్షల్లో ఖర్చుతోపాటు వేల సంఖ్యలో పేపర్ రోల్స్ వాడాల్సి వస్తోంది. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్ల నుంచి బయలుదేరే రైళ్లపై చార్టులు అతికించేందుకు సాలీనా రూ.35 లక్షలకుపైగా ఖర్చవుతోంది. ఇందుకు దాదాపు 6,000 పేపర్ రోల్స్ వినియోగిస్తున్నారు. ఇప్పుడు క్షణాల్లో సెల్‌ఫోన్‌కు.. సాధారణంగా రైలు టికెట్ బుక్ చేసుకున్నపుడు కన్ఫర్మ్ ఐతే సీటు/బెర్తు నంబరు తెలిసేది. వెయిటింగ్ లిస్టులో ఉండి అనంతరం కన్ఫర్మ్ ఐతే సీటు/బెర్తు తర్వాత తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి వారి కోసం బోగీలపై రిజర్వేషన్ చార్టులు అతిచించడాన్ని రైల్వే ప్రారంభించింది. కొద్ది కాలం తర్వాత దీన్ని ప్రైవేటీకరించి కాంట్రాక్టర్లకు అప్పగించింది. అయితే ఇప్పుడు బెర్తుల వివరాలు క్షణాల్లో సెల్‌ఫోన్‌కు మెసేజ్ రూపంలో అందుతున్నందున చార్డుల ఖర్చు, కాగితం వృథా సరికాదని.. కాబట్టి చార్టుల విధానం ఎత్తేయాలని కేంద్రం తీర్మానించింది. బెంగళూరులో గతేడాదే.. ఢిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్, సెంట్రల్ ముంబై, ఛత్రపతి శివాజీ టెర్మినస్, హౌరా, వాల్దా, చెన్నై సెంట్రల్, ఎగ్మోర్ స్టేషన్లలో 4 రోజుల క్రితం ప్రయోగాత్మకంగా చార్టుల ఎత్తివేతను రైల్వే ప్రారంభించింది. బెంగళూరు డివిజన్ అధికారులు గతేడాది నుంచే దీన్ని అమలు చేస్తున్నారు. ఈ ఏడు స్టేషన్ల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిశీలించి పూర్తిస్థాయిలో అమలు చేయాలని రైల్వే బోర్డు నిర్ణయించి అన్ని జోన్లకు సమాచారం అందించింది. స్వచ్ఛ భారత్‌కు వ్యతిరేకం.. రోజూ పాత చార్టు తొలగించి కొత్త చార్టు అతికించే క్రమంలో ఆ ప్రాంతం అసహ్యంగా మారడంతో కడగాల్సి వస్తోంది. అందుకు సిబ్బంది వినియోగం కూడా పెరుగుతోంది. పైగా ‘చార్టు’ విధానం స్వచ్ఛ భారత్‌కు విరుద్ధమని రైల్వే బోర్డు అభిప్రాయపడుతోంది. చార్టు లేకున్నా సెల్‌ఫోన్‌కు వచ్చే సమాచారం, స్టేషన్లలో డిస్ప్లే బోర్డుల్లో ఉంచటం, 139 నంబరుకు ఫోన్ చేసి తెలుసుకునే వెసులుబాటు ఉన్నందున ఆ విధానం ఎత్తేయటం వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదని బోర్డు భావిస్తోంది. అయితే సెల్‌ఫోన్ వినియోగించని వారికి చార్టు లేకుంటే ఇబ్బంది ఉంటుందన్న వాదనా ఉంది. -
ఖరారైన రిజర్వేషన్లు
ఇందూరు, న్యూస్‌లైన్: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్థా నిక సంస్థల రిజర్వేషన్లు ఎట్టకేలకు ఖరారయ్యాయి. జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న గురువారం జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్ల జాబితా ను (గెజిట్ నోటిఫికేషన్) వి డుదల చేశారు. అయితే మ హిళలకు జడ్పీటీసీ స్థానాల్లో 50 శాతం రిజర్వు కాగా ఎం పీటీసీ స్థానాల్లో 50 శాతం కంటే ఎక్కువగా స్థానాలు కేటాయించారు. జిల్లాలో జ డ్పీటీసీ స్థానాలు 36 ఉండగా ఇందులో 18 స్థా నాలు, ఎంపీటీసీ స్థానాలు 583 ఉండగా ఇం దులో 297 స్థానాలు మహిళలకు రిజర్వు అ య్యాయి. మహిళలకు స్థానాలు ఎక్కువగా ఉ న్నందున ఈసారి జడ్పీ చైర్మన్ పీఠం కూడా మహిళలకే రిజర్వు కావచ్చని సంబంధిత అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. -
పర్యాటక శాఖ సహకరిస్తే మెరుగైన సేవలు
సాక్షి, బెంగళూరు : రాష్ట్ర పర్యాటక శాఖ తమకు తగిన సహకారం అందిస్తే కర్ణాటకలోని పర్యాటక ప్రాంతాలను చూడటానికి వచ్చే వారికి మెరుగైన సేవలు అందించడానికి వీలువుతుందని బెంగళూరు డివిజినల్ రైల్వే మేనేజర్ (డీజీఎం) పేర్కొన్నారు. 2013-14 ఏడాదికి బెంగళూరు రైల్వే స్టేషన్ ‘ఉత్తమ పర్యాటక స్నేహ రైల్వే స్టేషన్‌గా పురస్కారాన్ని అందుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను డీజీఎం తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో మీడియాకు వివరించారు. తమ ప్రాంతానికి పర్యాటకులను ఆకర్షించడంలో భాగంగా తమిళనాడు పర్యాటక శాఖ బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్లో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేసిందన్నారు. అయితే కర్ణాటక ప్రభుత్వం అటువంటి చర్యలేవీ చేపట్టడం లేదన్నారు. ఆ శాఖ తమకు సహకారం అందిస్తే కర్ణాటకకు మరింత మంది పర్యాటకులు వచ్చే అవకాశం కల్పిస్తామని అనిల్‌కుమార్ అగర్వాల్ పేర్కొన్నారు. బెంగళూరు సిటీ, యశ్వంత్‌పుర రైల్వే స్టేషన్లలో వివిధ రైళ్లలో 60 రోజుల పాటు అందుబాటులో ఉన్న సీట్ల వివరాలను (కరెంట్, అడ్వాన్స్ రిజర్వేషన్ డిస్ల్పే) ఎల్సీడీ డీటీవీల్లో ప్రదర్శించే ఏర్పాటును నూతనంగా తీసుకువచ్చామన్నారు. అంతేకాకుండా రిజర్వేషన్ ఛార్ట్ తయారైన తర్వాత దానిని డిజిటల్ రూపంలో కూడా ప్రదర్శించే ఏర్పాట్లను చేశామన్నారు. దీని వల్ల దళారుల వ్యవస్థ తగ్గడమే కాకుండా పారదర్శకత కూడా పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్లలో రూ.3 కోట్ల నిధులతో నూతనంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మించనున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల బిన్నీమిల్ ప్రాంతంలో రైల్వేశాఖకు అప్పగించిన 3.1 ఎకరాల స్థలంలో షంటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నామన్నారు. దీని వల్ల చెన్నై వైపుగా వెళ్లే రైళ్ల రాకపోకల ఆలస్యం చాలా వ రకూ తగ్గిపోతుందన్నారు. కే.ఆర్‌పురం, యశ్వంత్‌పుర తదితర రైల్వే స్టేషన్లలో మౌలికసదుపాయాల పెంపునకు ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్లో ఉన్న పర్యాటక అనుకూల వ్యవస్థలను పరిశీలించిన కేంద్ర పర్యాటక శాఖ ఈ స్టేషన్‌ను ఉత్తమ ‘ఉత్తమ పర్యాటక స్నేహ రైల్వే స్టేషన్’ ఎంపిక చేయడం ఆనందం కలిగించిందన్నారు. కాగా, ఈ నెల 18న ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్రమంత్రి శశిథరూర్ చేతుల మీదుగా డీజీఎం అనిల్‌కుమార్ అవార్డును అందుకున్నారు.