resigned to TDP
-
శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి షాక్..
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలోని ఆముదాల వలసలో టీడీపీకి షాక్ తగిలింది. టీడీపీ నేత కూన రవికుమార్ ప్రధాన అనుచరుడు కిల్లి రామ్మోహన్రావు టీడీపీకి రాజీనామా చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అనుచరులతో చర్చించాక ఏ పార్టీలో చేరేది వెల్లడిస్తానని తెలిపారు. చంద్రబాబు వల్లే టీడీపీకి మనుగడ లేకుండా పోయిందని ఆయన విమర్శించారు. చంద్రబాబును చూసి టీడీపీకి ఓట్లు వేసే పరిస్థితి లేదన్నారు. రిగ్గింగ్‌తోనే ఎమ్మెల్యేగా అచ్చెన్నాయుడు, ఎంపీగా రామ్మోహన్ నాయుడు గెలిచారని ఆయన ఆరోపించారు. చదవండి: ‘రాజకీయ బతుకుదెరువు కోసమే టీడీపీ కుట్రలు’ నేను ఆరోగ్యంగా ఉన్నా: విజయసాయిరెడ్డి -
టీడీపీకి గుర్నాథ్రెడ్డి రాజీనామా
అనంతపురం టౌన్: రాష్ట్ర ప్రయోజనాలపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి లేకపోగా.. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకోవడం నచ్చకనే టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి ప్రకటించారు. ఆదివారం ఆయన నివాసరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రం అభివృద్ధితోపాటు జిల్లా అభివృద్ధి చెందుతుందన్న ఆశతోనే ఆనాడు టీడీపీలో చేరాను తప్ప...తన స్వప్రయోజనాలు, పదవులను ఆశించి పోలేదన్నారు. అయితే చంద్రబాబు ఈ ఐదేళ్లలో చేసిందేమీ లేదన్నారు. కేవలం సొంత అభివృద్ధే అజెండాగా పని చేస్తున్నాడని విమర్శించారు. హంద్రీ నీవా కాలువ ద్వారా కృష్ణా నీటితో కరువు జిల్లాకు సాగునీరు అందిస్తారనుకుంటే అరకొరగా చెరువులు నింపడం తప్పితే ఒక్క ఎకరాకు సాగునీరు ఇవ్వలేదన్నారు. రూ.వందల కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు కాస్తా...ఒట్టిసీమగా మారిందన్నారు. సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సాకుగా చూపుతూ.. బీజేపీపై బురదజల్లే విధంగా వ్యవహరిస్తున్నాడు తప్పితే.. అభివృద్ధి చేయాలనే ఆలోచన ఏమాత్రం లేదన్నారు. 60 ఏళ్లు ఏకదాటిగా పాలించిన కాంగ్రెస్ పార్టీ ఒక రాష్ట్ర విభజనతో ఏపీలో ఏమైందో అందరికి తెలుసన్నారు. అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకొని చంద్రబాబు రాష్ట్రానికి మేలు చేస్తానంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. అనైతిక పొత్తులను ప్రజలు స్వాగతించరన్నారు. ఇందుకు తెలంగాణ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. చిత్తశుద్ధిలేని టీడీపీతో కలిసి ప్రయాణం చేస్తే భవిష్యత్ తరాలకు అన్యాయం చేసిన వారమవుతామన్నారు. చిన్న పొరపాటుతో అనాడు రాజకీయ భిక్ష పెట్టిన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుటుంబాన్ని వదులుకోవాల్సి వచ్చింది తప్పితే... మరొకటి కాదన్నారు. ఆ పొరపాటును సరిదిద్దుకుంటామన్నారు. ఆ రోజు మా వెంట నడిచిన ప్రతి ఒక్కరూ నేడు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు తెలిపారు. మేమంతా రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం పోరాటం చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్తామన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు షుకూర్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, మాజీ కార్పోటర్లు వెంకటేశ్‌చౌదరి, మల్లికార్జున, వెంకటసుబ్బయ్య, డివిజన్ కన్వీనర్ చేపల హరి తదితరులు పాల్గొన్నారు. -
రేవంత్ రాజీనామా
-
రేవంత్ రాజీనామా
సాక్షి, హైదరాబాద్/అమరావతి: తెలుగుదేశం పార్టీ ముఖ్యనేత అనుముల రేవంత్‌రెడ్డి ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతోపాటు పార్టీ పదవులకు, శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో శనివారం భేటీ అయిన ఆయన.. అనంతరం రాజీనామా లేఖలను అందించారు. తన పోరాటాలకు ఎన్టీఆర్ స్ఫూర్తి అని, టీడీపీతో బంధం తెంచుకోవడం గుండెకోతతో సమానమని అందులో పేర్కొన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ అరాచక పాలన సాగుతోందని, రాష్ట్రం కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయిందని వ్యాఖ్యానించారు. వారి నియంతృత్వ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలిగించేందుకు.. కేసీఆర్‌కు వ్యతిరేకంగా రాజకీయ పునరేకీకరణలో భాగంగా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇక ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మాట్లో ఏకవాక్య రాజీనామా లేఖను రాసిన రేవంత్.. దానిని తెలంగాణ శాసనసభ స్పీకర్‌కు అందజేయాలని కోరారు. సీఎం కార్యదర్శికి రాజీనామా లేఖ ఇచ్చి.. ఏపీ సీఎం చంద్రబాబు శనివారం విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. పార్టీలోని పరిస్థితులు, రాజీనామాకు దారితీసిన అంశాలను చంద్రబాబుకు వివరించారు. స్వల్పకాలంలోనే టీడీపీలో అత్యున్నత స్థాయి అవకాశాలు కల్పించినందుకు కృతజ్ఞతలు కూడా తెలిపారు. కొంతసేపు వ్యక్తిగతంగా మాట్లాడే అవకాశమివ్వాలని చంద్రబాబును కోరారు. కానీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఢిల్లీలో సమావేశం, కాంగ్రెస్ వాళ్లతో భేటీల వంటివాటన్నింటికీ ఆధారాలున్నాయని, ఇంకా మాట్లాడేదేముందని చంద్రబాబు వ్యాఖ్యానించినట్టు తెలిసింది. అయినా విడిగా మాట్లాడడానికి రేవంత్ ప్రయత్నించినా.. చంద్రబాబు వినలేదని సమాచారం. చివరికి వెళ్లిపోయేందుకు రేవంత్ లేచి నిలబడ్డారు. దీంతో ‘వెళుతున్నావా?’అని రేవంత్‌ను చంద్రబాబు అడిగారని, తాను ప్రెస్మీట్లో మాట్లాడివచ్చే దాకా ఉండాలని చెప్పి బయటకు వచ్చినట్లు తెలిసింది. ఈ సమయంలో చంద్రబాబుకు నమస్కరించిన రేవంత్.. బాబు బయటకు వెళ్లగానే సీఎం కార్యదర్శి రాజమౌళికి తన రాజీనామా లేఖలను ఇచ్చి బయటికి వచ్చేశారు. మీడియాతో కూడా మాట్లాడకుండా వెళ్లిపోయారు. రేవంత్ వ్యక్తిగత కారణాలతోనే..: పెద్దిరెడ్డి రేవంత్ వెళ్లిపోయిన గంటన్నర తర్వాత చంద్రబాబు టీటీడీపీ నేతలతో సమావేశమై చర్చించారు. అనంతరం ఈ భేటీ వివరాలను టీటీడీపీ నేత పెద్దిరెడ్డి విలేకరులకు వివరించారు. భేటీలో రేవంత్ విషయం చర్చకు వచ్చిందని, ఆయన మామూలుగానే సమావేశానికి వచ్చి అందరితో గౌరవంగా మాట్లాడాడని చెప్పారు. పార్టీకి రాజీనామా చేయడానికి రేవంత్‌కు వ్యక్తిగత అంశాలు కారణం కావొచ్చన్నారు. ఇక తెలంగాణ పార్టీకి మరింత ఎక్కువ సమయం కేటాయించాలని చంద్రబాబును కోరామని.. ఇక ముందు ప్రతి నెలా సమీక్ష నిర్వహిస్తానని చెప్పారని వెల్లడించారు. నవంబర్ రెండో తేదీన హైదరాబాద్‌లో టీటీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. చంద్రబాబుతో జరిగిన భేటీలో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, నామా నాగేశ్వరరావు, మోత్కుపల్లి నర్సింహులు, రావుల చంద్రశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రేపు వెల్లడిస్తా..: రేవంత్ కొడంగల్: తన నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో చర్చించాక సోమవారం హైదరాబాద్‌లో తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానని రేవంత్‌రెడ్డి అన్నారు. ఏపీ రాజధాని అమరావతిలో చంద్రబాబును కలసి టీడీపీ సభ్యత్వం, పదవులకు రాజీనామా చేసిన ఆయన.. అనంతరం నేరుగా వికారాబాద్ జిల్లా కొడంగల్‌కు చేరుకున్నారు. అక్కడ నాయకులు, కార్యకర్తలు రేవంత్‌కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రేవంత్ ఆదివారం నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో సమావేశమై చర్చిస్తానని చెప్పారు. భవిష్యత్తు కార్యాచరణను సోమవారం వెల్లడిస్తానన్నారు. రేవంత్ రాజీనామా లేఖ సారాంశమిదీ.. ‘‘నా పోరాటాలకు ఎన్టీఆర్ కూడా స్ఫూర్తి. ‘సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్లు’ అన్న నందమూరి ఆలోచనకు మించిన సిద్ధాంతం లేదు. ఎన్టీఆర్‌తో నేరుగా అనుబంధం లేకపోయినా పేదల బాగు కోసం ఆయన పరితపించిన విధానం నాలో స్ఫూర్తిని నింపింది. తెలుగుదేశంతో బంధం తెంచుకోవడం గుండెకోతతో సమానం. తెలంగాణ సీఎం కేసీఆర్ అరాచకాలను టీడీపీ ద్వారానే అంతమొందించాలని కోరుకున్నా.. కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ పాలన ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసింది. అమరవీరులు, ఉద్యమకారులు, నిరుద్యోగులు, విద్యార్థులు, రైతులు, దళిత, గిరిజన, మైనారిటీలు, బీసీలు, మహిళలు ఇలా ఏ వర్గాన్ని చూసినా కన్నీళ్లు కష్టాలే కనిపిస్తున్నాయి. వేల మంది రైతులు పిట్టల్లా రాలిపోతున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. ఖమ్మంలో అమాయక గిరిజన రైతులకు బేడీలు వేసి నడిరోడ్డుపై నడిపించి, ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. భూసేకరణ పేరుతో మల్లన్నసాగర్ ప్రాంతాన్ని రావణకాష్టంగా మార్చారు. నేరెళ్లలో దళిత, బీసీ బిడ్డలపై పోలీసులు అన్యాయంగా «థర్ట్ డిగ్రీ ప్రయోగించారు. భూపాలపల్లి జిల్లాలో ఎన్నో ఏళ్లుగా అటవీ భూముల్లో పోడు చేసుకుంటున్న గిరిజనులపై ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. గుత్తి కోయ ఆడబిడ్డలను బట్టలూడదీసి, చెట్లకు కట్టేసి కొట్టిన పరిస్థితులు హృదయవిదారకం. చదువుకుంటున్న విద్యార్థులను నక్సలైట్ల ముద్రతో ఎన్కౌంటర్ చేసిన ఘటనలు ఆవేదన కలిగించాయి. గొంతు నొక్కేస్తున్నారు.. ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారు. ప్రతిపక్షాల ఉనికిని కేసీఆర్ సహించలేక, ప్రజాస్వామిక హక్కులకూ చోటులేకుండా చేస్తున్నారు. అత్యున్నత వ్యవస్థలను తన అధికార దర్పానికి కాపలాకాసే సంస్థలుగా మార్చుకున్నారు. తెలంగాణలో ప్రజాస్వామిక వ్యవస్థల విధ్వంసం నిరాఘాటంగా సాగుతోంది. ఈ దుర్మార్గాలపై మూడేళ్లుగా అసెంబ్లీలోనూ, వెలుపలా టీడీపీ పోరాటం చేస్తోంది. సభలో ప్రజల గొంతుక వినిపించే ప్రతి సందర్భంలో సస్పెన్షన్ వేటు వేశారు. ఈ నేపథ్యంలోనే రైతు పోరు, విద్యార్థి పోరు, ప్రజా పోరు, కార్మిక పోరు వంటి ఉద్యమాలతో ప్రజలను చైతన్యపరిచాం. నాపై పాలకులు వ్యక్తిగతంగా కక్ష గట్టి, అక్రమ కేసులతో వేధించిన విషయం మీకు తెలిసిందే. అరెస్టు చేసి జైల్లో పెట్టిన సందర్భంలోనూ నేను వెనకడుగు వేయలేదు. నా బిడ్డ నిశ్చితార్థానికి కోర్టు కొన్ని గంటలు మాత్రమే అనుమతించిన సందర్భంలోనూ గుండె నిబ్బరం కోల్పోలేదు. ఆ సందర్భంలో నాకు, నా కుటుంబానికి మీరిచ్చిన మద్దతును ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం. ప్రమాదంలో తెలంగాణ సమాజం ప్రస్తుతం తెలంగాణ సమాజం ప్రమాదపుటంచుల్లో ఉంది. కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయింది. బంగారు తెలంగాణ ముసుగులో ప్రజాసంపద అడ్డగోలుగా దోపిడీ అవుతోంది. ప్రజలు ఏ ఆకాంక్షలతో స్వరాష్ట్రం కోరుకున్నారో వారి ఆశలు కలలుగానే కరిగిపోతున్నాయి. అమరవీరుల ఆత్మ బలిదానాలకు గుర్తింపు లేదు. తెలంగాణ సమాజం ఏకతాటిపై నిలబడి కేసీఆర్ కుటుంబ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అనివార్యత కనిపిస్తోంది. ఈ సందర్భంలో ప్రజలు ఎన్నుకున్న నాయకుడిగా వారి పక్షాన నిలవడమే ప్రాధాన్యమని నమ్ముతున్నాను. తెలంగాణ సమాజ హితం కోసం నేను మరింత ఉధృతంగా పోరాటం చేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణ సమాజానికి విముక్తి కల్పించడం బాధ్యతగా భావిస్తున్నా.. తెలంగాణ సమాజం కేసీఆర్‌కు వ్యతిరేకంగా బలమైన రాజకీయ పునరేకీకరణ కోరుకుంటోంది. నా నిర్ణయాన్ని మీరు ఆ కోణంలోనే చూడండి. ఈ నేప«థ్యంలో పార్టీ తెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా సమర్పిస్తున్నా. పార్టీ అధ్యక్షుడిగా, మార్గదర్శిగా మీరు ఇచ్చిన పోరాట పటిమ, స్ఫూర్తి గుండెల నిండా నింపుకొని తెలంగాణ సమాజ హితం కోసం విస్తృత పోరాటానికి సిద్ధమవుతున్నాను. అన్యధా భావించక.. నా నిర్ణయాన్ని సహృదయంతో అర్థం చేసుకుంటారని..– అనుముల రేవంత్‌రెడ్డి -
టీడీపీకి రేవంత్ రెడ్డి గుడ్‌బై....
సాక్షి, అమరావతి : అనుకున్నట్లే జరిగింది...తెలుగుదేశం పార్టీకి కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గుడ్‌బై చెప్పారు. శనివారం విజయవాడలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో భేటీ అనంతరం ఆయన పదవులతో పాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రేవంత్ రెడ్డి తన రాజీనామా లేఖను చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శికి అందచేశారు. చంద్రబాబుతో భేటీ అనంతరం రేవంత్ రెడ్డి మౌనంగా బయటకు వెళ్లిపోయారు. మీడియాతో మాట్లాడేందుకు కూడా ఆయన ఇష్టపడలేదు. రేవంత్ రెడ్డితో పాటు వేం నరేందర్ రెడ్డి కూడా టీడీపీకి రాజీనామా చేసినట్లు సమాచారం. కాగా కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు తనను తీవ్రంగా భాదించాయని, పార్టీపై, పార్టీ అధ్యక్షుడిపై తనకు ఎంతో గౌరవం నుందని తెలిపారు. తనను తక్కువ సమయంలో పార్టీ ఉన్నత పదవులను నిర్వహించేలా చేసిందని, తన ఎదుగుదలకు చంద్రబాబు ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. చంద్రబాబు తనకు తండ్రితో సమానమని, తాను ఎల్లప్పుడూ పార్టీ, కార్యకర్తల శ్రేయస్సు కోరుకునే వ్యక్తినని అన్నారు. ఏపీ, టీ-టీడీపీ సీనియర్లు తమ స్వార్థం కోసం ఇతర పార్టీల నేతలతో చేతులు కలిపి టీటీడీపీని నాశనం చేస్తున్నారని ఆ లేఖలో ఆరోపించారు. తాను కేసీఆర్‌పై పోరాటం చేస్తుంటే ఏపీ, టీ-టీడీపీకీ చెందిన నేతలు ఆయనతో కలిసి సమావేశం నిర్వహించారని, మరికొందరు టీఆర్ఎస్ ప్రభుత్వంతో లాలూచీపడి కాంట్రాక్టులు తెచ్చుకున్నారని తెలిపారు. అలాంటప్పుడు తన పోరాటానికి విలువ ఎక్కడ ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఇబ్బందులకు గురిచేసేందుకు, తనను దెబ్బతీసేందుకు కేసీఆర్ టీడీపీ నేతలకు తాయిలాలు ఇస్తున్నారన్నారు. తాను పార్టీ సంక్షేమం కోరుకునే వ్యక్తినని, తన స్వార్థం కోసం ఎప్పుడూ పార్టీని అడ్డుపెట్టుకోలేదని అన్నారు. టీడీఎల్పీ నేతగా ఉన్నా తనకన్నా సీనియర్ అయిన సండ్రకు అన్ని బాధ్యతలు అప్పగిస్తూ స్పీకర్‌కు గతంలో లేఖ రాశానని, అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడేందుకు కూడా ఎక్కువ సమయం తమ ఎమ్మెల్యేలకు ఇచ్చానని ఆయన వివరించారు. కేసీఆర్ నియంత పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించాలంటూ, తన పోరాటం ఎప్పుడూ కేసీఆర్, టీఆర్‌ఎస్‌పైనేనని స్పష్టం చేశారు. టీడీపీ కేడర్ తనకు ప్రాణ సమానమని, అలాంటి కేడర్‌ను చూస్తే చాలా బాధగా ఉందని అన్నారు. తెలంగాణలో టీడీపీ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానన్నారు. కొడంగల్‌లో కార్యకర్తలతో చర్చించాకే ఏదైనా నిర్ణయం తీసుకుంటానని రేవంత్ చెప్పారు. -
టీడీపీకి తుమ్మల రాజీనామా
ఖమ్మంలో పార్టీకి కోలుకోలేని దెబ్బ చంద్రబాబుకు ఏకవాక్య రాజీనామా లేఖ ఫ్యాక్స్ సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా వ్యవహరించిన ఖమ్మం జిల్లా సీనియర్ నేత , మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. 31 ఏళ్లుగా టీడీపీతో ఏర్పరచుకున్న బంధాన్ని ఏకవాక్య లేఖతో ఆయన తెంచేసుకున్నారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆయన శనివారం ప్రకటించారు. అనారోగ్యంతో కొన్నిరోజులుగా హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న ఆయన ఖమ్మం వచ్చిన రోజే రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు ఫ్యాక్స్ ద్వారా పంపారు. ఆయనతో పాటు ఇటీవలే జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయిన గడిపల్లి కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, డీసీఎంఎస్ చైర్మన్ అంజయ్య, పార్టీ జిల్లా అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరరావు, తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు నల్లమల్ల వెంకటేశ్వరరావు కూడా పార్టీకి రాజీనామా చేశారు. వీరితో పాటు ఇంకా జిల్లా పార్టీ అనుబంధ సంఘాల నేతలు, పలువురు జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, జిల్లా పరిషత్ వైస్‌చైర్మన్ కూడా తుమ్మల బాటలోనే పయనించనున్నారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన ఆయన వచ్చే నెల ఐదవ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఈ విషయాన్ని ఆయన అధికారికంగా ప్రకటించలేదు. తనను 30 ఏళ్లుగా నమ్ముకున్న నేతలు, కార్యకర్తల అభీష్టం మేరకు తన నిర్ణయాన్ని రెండు రోజుల్లో ప్రకటిస్తానని ఆయన చెప్పారు. ఆయన టీఆర్ఎస్లో చేరడం ఖాయమని, త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో ఆయనకు బెర్త్ తథ్యమని జిల్లాలో ప్రచారం జరుగుతోంది. నేను రాజీనామా చేస్తున్నా...! 31 ఏళ్లుగా పార్టీలో ఉండి అనేక ఉత్థానపతనాలను చవిచూసిన తుమ్మల నాగేశ్వరరావు ‘నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను. దయచేసి ఆమోదించగలరు.’ అనే ఒకేఒక్క వాక్యంతో ఉన్న లేఖను టీడీపీ అధినేతకు ఫ్యాక్స్ చేయడం చర్చనీ యాంశమయింది. పార్టీలో తనకు జరిగిన అవమానాలు, అన్యాయాన్ని లేఖలో చెప్పకుండా పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు మాత్రమే రాయడం గమనార్హం. తుమ్మల రాజీనామాతో జిల్లా టీడీపీకి ఇప్పుడు మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు నాయకత్వం వహించనున్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మరికొందరు నేతలు పార్టీలోనే కొనసాగనున్నారు. అయితే, తుమ్మల రాజీనామాతో జిల్లాలో తెలుగుదేశం పార్టీ కేడర్ కూడా అదే బాటలో పయనించనుం దని, దాదాపు 80 శాతం నేతలు, కార్యకర్తలు ఆయనతో వెళ్లిపోతారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. -
'తుమ్మల స్వార్ధం కోసమే పార్టీని వీడారు'
హైదరాబాద్: టీడీపీ నేత తుమ్మల నాగేశ్వర రావు పార్టీని వీడటంపై ఆ పార్టీ సీనియర్ నేతలు మండిపడుతున్నారు. ఆయన తన స్వార్థం కోసమే పార్టీని వీడారని తెలంగాణ టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర రావు, నర్సారెడ్డిలు విమర్శించారు. ప్రస్తుతం తుమ్మల పార్టీని విడిచి పెట్టి బయటకు వెళ్లడం బాధాకరమన్నారు. తుమ్మలకు టీడీపీ ఎన్నో పదవులు ఇచ్చి గౌరవించిందని స్పష్టం చేశారు. ఆయన చెప్పిన వారికే జిల్లాలో జడ్పీ చైర్మన్, డీసీసీబీ చైర్మన్, జిల్లా అధ్యక్ష పదవులు ఇచ్చారని వారు తెలిపారు. తుమ్మల పార్టీని వీడినా.. కార్యకర్తలు టీడీపీతోనే ఉంటారన్నారు. తుమ్మలతోపాటు ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షుడు కొండబాల, ఎమ్మెల్సీ బాలసాని, డిసిసిబి చైర్మన్ మువ్వ విజయ్ బాబు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కవిత, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు నాగచంద్రా రెడ్డి, జిల్లాలోని మరి కొందరు ముఖ్య నేతలు కూడా టిడిపికి రాజీనామా చేశారు. దీంతో ఖమ్మం జిల్లాలో టిడిపికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సెప్టెంబరు 5న తుమ్మల, ఆయన అనుచరులు టిఆర్ఎస్లో చేరే అవకాశం ఉంది. -
టిడిపికి తుమ్మల నాగేశ్వర రావు రాజీనామా
హైదరాబాద్: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఒకే ఒక వాక్యంతో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ఆయన లేఖ రాశారు.ఆ లేఖను ఫాక్స్ ద్వారా చంద్రబాబుకు పంపారు. టిడికి రాజీనామా చేస్తున్నట్లు చెబుతూ తుమ్మల భావోద్వేగానికి గురయ్యారు. కంటతడిపెట్టుకున్నారు తుమ్మలతోపాటు ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షుడు కొండబాల, ఎమ్మెల్సీ బాలసాని, డిసిసిబి చైర్మన్ మువ్వ విజయ్ బాబు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కవిత, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు నాగచంద్రా రెడ్డి, జిల్లాలోని మరి కొందరు ముఖ్య నేతలు కూడా టిడిపికి రాజీనామా చేశారు. దీంతో ఖమ్మం జిల్లాలో టిడిపి దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. సెప్టెంబరు 5న తుమ్మల, ఆయన అనుచరులు టిఆర్ఎస్లో చేరే అవకాశం ఉంది.