retairment age
-
ఒకే సంస్థ.. ఒకే హోదా.. రిటైర్మెంట్ వయసులో తేడా!
టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ సంయుక్త యాజమాన్యంలోని విస్తారా నవంబర్ 11 నుంచి ఎయిరిండియా ఎయిర్‌లైన్స్‌లో విలీనం అవుతుంది. ఈ విలీనం వల్ల ఇప్పటివరకు ఎయిరిండియా సర్వీసులో ఉన్న పైలట్లు మాత్రం కొంత అసంతృప్తిగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. విస్తారా, ఎయిరిండియాలో పనిచేస్తున్న పైలట్ల రిటైర్మెంట్ వయసే అందుకు కారణమని తెలియజేశారు.నవంబర్ 11 నుంచి విస్తారా ఎయిర్‌లైన్స్ ఎయిరిండియాలో విలీనం అవుతుంది. ఈమేరకు గతంలోనే ఇరు సంస్థల మధ్య ఒప్పందం జరిగింది. అయితే ఎయిరిండియా పైలట్లు మాత్రం కొంత అసంతృప్తిగా ఉన్నట్లు కొందరు అధికారులు తెలిపారు. ఎయిరిండియా పైలట్ల రిటైర్మెంట్ వయసు 58 ఏళ్లుగా ఉంది. ఇప్పటివరకు విస్తారాలో పని చేసిన పైలట్లు రిటైర్మెంట్ వయసు మాత్రం 60 ఏళ్లుగా ఉంది. ఒకే సంస్థలో, ఒకే స్థానంలో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసులో తేడా ఉండడంపై ఎయిరిండియా పైలట్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఎయిరిండియా యాజమాన్యం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. డీజీసీఏ నిబంధనల ప్రకారం పైలట్లు తమకు 65 ఏళ్లు వచ్చేవరకు సేవ చేయవచ్చు. ఈ ఏడాది ఆగస్టులో ఎయిరిండియా ఎంపిక చేసిన పైలట్లను కాంట్రాక్ట్ ప్రాతిపదికన పదవీ విరమణ తర్వాత 65 ఏళ్ల వరకు సర్వీసు పొడిగించే పాలసీని ప్రకటించింది.ఇదీ చదవండి: పెళ్లిరోజున భార్యను బాధపెట్టిన నారాయణమూర్తి!రూ.2,058.50 కోట్ల డీల్పదేళ్లుగా కార్యకలాపాలు సాగిస్తున్న విమానయాన సంస్థ విస్తారా ఈరోజు నుంచి కనుమరుగు కానుంది. నవంబర్ 11 నుంచి విస్తారా సేవలు నిలిపేయనుంది. నవంబర్ 12 నుంచి సంస్థ విమానాలు, సిబ్బంది ఎయిరిండియాకు బదిలీ అవుతారని గతంలో కంపెనీ సీఈవో, ఎండీ క్యాంప్‌బెల్ విల్సన్ తెలిపారు. విలీన డీల్‌లో భాగంగా ఎయిరిండియాలో రూ.2,058.50 కోట్ల మేర సింగపూర్ ఎయిర్‌లైన్స్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పెట్టే ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం గతంలో ఆమోదముద్ర వేసింది. దీనితో విలీనానికి మార్గం సుగమమైంది. విలీనానంతరం ఎయిరిండియాలో సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కి 25.1 శాతం వాటా లభిస్తుంది. -
సింగరేణి బోర్డు కీలకనిర్ణయాలు : ఉద్యోగులకు గుడ్ న్యూస్
-
ఎన్నికల వేళ మమత కీలక నిర్ణయం
కోల్కత్తా: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని కళాశాలల్లో, విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న అధ్యాపకుల పదవీ విరమణ వయస్సును పెంచుతున్నట్లు ప్రకటించారు. 62 ఏళ్లుగా ఉన్న అధ్యాపక ఉద్యోగ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచారు. అదే విధంగా యూనివర్సిటీ వైఎస్ ఛాన్సలర్ (వీ.సీ) విరమణ వయస్సును కూడా 70 ఏళ్లకు పెంచారు. ఈ మేరకు సోమవారం కోల్కత్తా వర్సిటీలో జరిగిన స్నాతకోత్సవంలో మమత ప్రకటించారు. కార్యక్రమంలో బెనర్జీ మాట్లాడుతూ... ‘‘ 60 ఏళ్లు దాటిన తరువాత ఓ ఉద్యోగి పనిచేయలేడని నేను అనుకోను. వారి అనుభవాలు, సేవలు మన విద్యార్థులకు చాలా అవసరం. అందుకే అధ్యాపకుల పదవీ విరమణ వయస్సును పెంచుతున్నాం. బలహీన వర్గాల ఉన్నత విద్య కోసం రూ.200 కోట్లు విడుదల చేస్తున్నాం. మౌలిక సదుపాయాల కోసం రూ. 28000 కోట్లను ఈ ఏడాదికి ఖర్చు చేయదలచాం’ అని తెలిపారు. కాగా ఉన్నత విద్యపై మమతా బెనర్జీ ప్రత్యేక శ్రద్ద చూపుతున్న విషయం తెలిసిందే. దానిలో భాగంగానే నదియా జిల్లాలో కన్యశ్రీ విశ్వవిద్యాలయంకు జనవరి 10న శంకస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. -
తిరుమలలో తప్పులు రాష్ట్రానికే అరిష్టం: కోన
సాక్షి, తిరుపతి : దేవాలయాలు, అర్చకులకు జరుగుతున్న అన్యాయాలపై గళమెత్తిన రమణ దీక్షితులుకు మద్దతుగా బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. రమణ దీక్షితులు అడుగుతున్న ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పట్లేదని ప్రశ్నించారు. తిరుమలలో జరుగుతున్న తప్పుల వల్ల రాష్ట్రానికే అరిష్టమని అన్నారు. 65 ఏళ్లుకు రిటైర్మెంట్ నిర్ణయాన్ని పునరాలోచించాల్సిందిగా ఆయన ప్రభుత్వాన్ని కోరారు. రమణదీక్షితులు లేవనెత్తిన అంశాలపై సీబీఐ విచారణ జరిపి, ఆయనను తక్షణమే ప్రధానార్చకులుగా నియమించాలని డిమాండ్ చేశారు. 65 ఏళ్లు నిండాయని ఆయనను పక్కన పెట్టడం దురదృష్టకరమని తెలిపారు. ఆయన బాధను చెప్పుకోవడానికి ఇక్కడ అవకాశం లేక పక్క రాష్ట్రానకి వెళ్లి చెప్పుకునే పరిస్థితి కల్పించారని మండిపడ్డారు. చంద్రబాబు దేవాలయాలను నాశనం చేసిన వ్యక్తి, విజయవాడలో కూల్చిన దేవాలయాలను ఎక్కడ తిరిగి నిర్మించలేదని ఆరోపించారు. దేవతా సేవల వేళల్లో ఇష్టానుసారం మార్పులు చేయడం దారుణమని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని శాస్త్ర వ్యతిరేక పనులే చేస్తున్నారని విమర్శించారు. మిరాశీ కుటుంబీకుడు ప్రశ్నించడం తప్పా, ఆస్తుల లెక్కలు భక్తులకు చెప్పమని కోరడం తప్పా అని ప్రశ్నించారు. 2017 డిసెంబర్లో వంటశాలను మూసివేసి తవ్వకాలు జరపడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. కోర్టు తీర్పును కూడా బేఖాతరు చేస్తూ మిరాశీలను 65 ఏళ్లకే తొలగిస్తామనడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బ్రహ్మణులతో పెట్టుకుంటున్నారు జాగ్రత్త అని హెచ్చరించారు. గతంలో ఐవైఆర్ కృష్ణారావును అలానే అవమానించారు. ఇప్పుడు రమణదీక్షితులను అవమానిస్తున్నారని మండిపడ్డారు. సన్నిధి గొల్లలకు కూడా చంద్రబాబు తీవ్ర అన్యాయం చేశారని అన్నారు. దేవాలయాలన్నింటికి ధూప దీప నైవేద్యాలుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిధులిచ్చి సంస్కృతి, సాంప్రదాయాలను బ్రతికించారని తెలిపారు. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా అలానే హామీ ఇచ్చారని అన్నారు. -
ఏపీ సర్కార్ డబుల్ గేమ్!
సాక్షి, అమరావతి : ‘‘ఆర్టీసీలో ఉద్యోగులు అడగకుండానే పదవీ విరమణ వయస్సు పెంచాం. 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు వయో పరిమితి పెంచాం. అందరికీ సర్వీసు పెంపు అమలుచేసి ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేశాం.(ఈ ఏడాది సెప్టెంబరులో జరిగిన నేషనల్ మజ్దూర్ యూనియన్ స్వర్ణోత్సవ సభలో సీఎం చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలివి.) ఆర్టీసీలో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు హామీని ఓ చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కున్నట్లుంది. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకి యాజమాన్యం మోకాలడ్డుతుండడంతో ప్రభుత్వ చిత్తశుద్ధిని ఉద్యోగ సంఘాలు అనుమానిస్తున్నాయి. సంస్థ ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేదని.. పైగా ఆర్టీసీకి బోర్డు కూడా ఏర్పాటు కానందున వయో పరిమితి పెంపు సాధ్యంకాదని యాజమాన్యం సాకుగా చెబుతోంది. 9, 10 షెడ్యూళ్లలో ఉన్న కార్పొరేషన్లు, సంస్థల్లో 60 ఏళ్ల వయో పరిమితి నిబంధన అమలుచేయాలని ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 8న జీవో–138ను జారీచేసిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ షెడ్యూల్ 9లో ఉంది. ప్రభుత్వం జారీచేసిన జీవో ప్రకారం.. ఆర్టీసీలో 2014 జూన్ 2 నుంచి పదవీ విరమణ చేసిన వారికి 60 ఏళ్ల నిబంధన వర్తిస్తుంది. కానీ, గతేడాది నుంచి ఇప్పటివరకు పదవీ విరమణ చేసిన వారు సుమారు అన్ని కేడర్లలో 3,600 మంది వరకు ఉన్నారు. వీరంతా రెండేళ్ల సర్వీసు పెరుగుతుందని ఆశతో ఎదురుచూస్తున్నారు. నిబంధనల సాకు.. కాగా, బోర్డు లేకపోవడంతో వయో పరిమితి పెంపు కుదరదంటున్న యాజమాన్యం.. ఆర్టీసీలో 60 ఏళ్ల పెంపు నిర్ణయం తీసుకోవాలంటే సంస్థ విభజన జరగాలని, కొత్తగా బోర్డు ఏర్పాటుచేసుకోవాలని నిబంధనలున్నాయి. ఈ నిబంధనను ఆర్టీసీ యాజమాన్యం సాకుగా చూపుతోంది. అయితే, గత మూడేళ్లుగా ఆర్టీసీ బోర్డు లేకుండానే యాజమాన్యం అన్ని నిర్ణయాలు తీసుకుందని, ఇప్పటివరకు 3 వేలకు పైగా బస్సులు కొనుగోలు చేసిందని, ఆర్టీసీ హౌజ్ నిర్మాణం కూడా చేసినట్లు ఉద్యోగ సంఘాలు గుర్తుచేస్తున్నాయి. బోర్డు అనుమతి లేకుండా ఒక్క బస్సు కూడా కొనుగోలు చేసే అవకాశంలేదని, మానవతా దృష్టితో ఉద్యోగుల వినతిని పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నా అందుకు యాజమాన్యం ససేమిరా అంటోంది. మూడేళ్లుగా నియామకాల్లేవు ఇదిలా ఉంటే.. గత మూడేళ్ల నుంచి ఆర్టీసీలో పదవీ విరమణ చేసిన ఉద్యోగుల సంఖ్య 7,130గా ఉంది. అయితే, 2014 నుంచి 2016 వరకు పదవీ విరమణ చేసిన వారికి న్యాయం జరిగే అవకాశాల్లేవు. అంతేకాకుండా, గత మూడేళ్లగా సంస్థలో ఏ కేడర్‌లోనూ ఒక్క నియామకం కూడా చేపట్టలేదు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయలేదు. ఇవన్నీ ప్రభుత్వానికి తెలిసినా ఉద్యోగులపట్ల కఠినంగా వ్యవహరించడం సబబు కాదని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో యాజమాన్య తీరుపై రిటైరైన ఉద్యోగులు కొందరు ఇటీవలే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. త్వరలో కార్యాచరణ ప్రకటిస్తాం.. 9, 10 షెడ్యూల్లో ఉన్న విద్యుత్ సంస్థ, గృహ నిర్మాణం, సివిల్ సప్లైస్, సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తదితరాల్లో 60 ఏళ్లకు పదవీ విరమణ జీవోను అమలుచేశారు. ఒక్క ఆర్టీసీలోనే అడ్డంకులు సృష్టిస్తున్నారు. సర్వోన్నత న్యాయస్థానంలో పోరాటం చేస్తున్నాం. ∙పదవీ విరమణ చేసిన ఉద్యోగులందరితో కలిసి త్వరలో సమావేశమై కార్యాచరణ ప్రకటిస్తాం. – తాడంకి ప్రతాప్ కుమార్, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నేత -
రైతులెవ్వరూ రుణాలు చెల్లించొద్దు: యనమల
హైదరాబాద్ : రైతులెవ్వరూ బ్యాంకులకు రుణాలు చెల్లించవద్దని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు సూచించారు. రుణాలు రీ షెడ్యూల్ చేసిన వాయిదాలన్నిటికీ ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని ఆయన సోమవారమిక్కడ తెలిపారు. ఏ సంవత్సరం వరకూ రుణమాఫీ చేస్తామన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదని యనమల అన్నారు. ఉద్యోగుల వయో పరిమితి పెంపు తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు కూడా వర్తిస్తుందని ఆయన తెలిపారు. అయితే ఈ వయో పరిమితి పెంపు ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణ ఉద్యోగులకు వర్తించదని అన్నారు.