rethink
-
ముంబైలో ఐపీఎల్: డైలమాలో బీసీసీఐ
న్యూఢిల్లీ: ఐపీఎల్–2021 అన్ని లీగ్ మ్యాచ్‌లను ముంబైలోనే నిర్వహించాలనే విషయంపై బీసీసీఐ పునరాలోచనలో పడింది. ఇక్కడే అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన నాలుగు పెద్ద మైదానాలు (వాంఖడే, బ్రబోర్న్, డీవై పాటిల్, రిలయన్స్) అందుబాటులో ఉండటం వల్ల ఏర్పాట్లు సులభతరం కావడంతో పాటు ఒకే నగరంలో ‘బయో సెక్యూర్ బబుల్’ను సమస్యలు లేకుండా సిద్ధం చేయవచ్చని బీసీసీఐ భావించింది. అయితే ముంబైతో పాటు మహారాష్ట్రలో కూడా కోవిడ్–19 కేసులు ఒక్కసారిగా పెరగడంతో పరిస్థితి మారిపోయింది. ‘ఐపీఎల్ నిర్వహణ కోసం వేర్వేరు నగరాల పేర్లను పరిశీలిస్తున్నాం. హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతా నగరాలను పరిగణనలోకి తీసుకుంటున్నాం. ప్లే ఆఫ్, ఫైనల్ మ్యాచ్‌లు ఎలాగూ అహ్మదాబాద్ లోనే జరుగుతాయి’ అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఇక్కడ చదవండి: అటు యూసుఫ్... ఇటు వినయ్... 'అందుకే మోరిస్‌కు అంత ఖర్చు చేశాం' -
ఎఫ్బీతో పనిచేయడంపై ఈసీ పునరాలోచన
సాక్షి, న్యూఢిల్లీ : ఫేస్బుక్లో ఓటరు అవగాహనా కార్యక్రమాలు చేపట్టడంపై ఎన్నికల కమిషన్ (ఈసీ) పునరాలోచించనుంది. శుక్రవారం సాయంత్రం జరిగే ఈసీ ఉన్నతాధికారుల భేటీలో ఈ అంశం ప్రధానంగా చర్చకు రానుంది. ఫేస్బుక్లో డేటా ఉల్లంఘనలు చోటుచేసుకోవడం, ఈ సమాచారాన్ని ఇతర దేశాల్లో ఎన్నికలను ప్రభావితం చేసేందుకు కేంబ్రిడ్జి ఎనలిటికా వంటి సంస్థలు ఉపయోగించడం వంటి అంశాలతో ఈసీ ఆందోళన చెందుతున్నట్టు సీఈసీ పేర్కొంది. ఎన్నికలపై ప్రతికూల ప్రభావం చూపేలా ప్రజాభిప్రాయాన్ని మలిచే ప్రయత్నాలు ఆందోళనకరమని..దీన్ని తాము తీవ్రంగా పరిగణిస్తామని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ స్పష్టం చేశారు. ఈసీ భేటీలో దీనిపై విస్తృతంగా చర్చిస్తామని ఆయన పేర్కొన్నారు. ఓటరు అవగాహనా కార్యక్రమాలకు సంబంధించి ఈసీ ఇప్పటివరకూ సోషల్ మీడియాలో చురుకుగా ప్రచారం చేపడుతోంది. యువ ఓటర్ల నమోదు, వారు ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రోత్సహించేందుకు ఈ వేదిక శక్తివంతమైందిగా ఈసీ భావిస్తోంది. రాష్ట్రాల్లో కూడా ఈసీ అధికారులు ఫేస్‌బుక్‌ను ఓటరు అవగాహనా ప్రచారానికి ఉపయోగిస్తున్నారు. -
24 గంటలా? 9 గంటలా?
‘సార్.. కొత్తగూడెం సబ్ స్టేషన్ నుంచి లక్ష్మీపురం ఫీడర్‌కు విద్యుత్ సరఫరా చేసే లైన్లను గుర్తు తెలియని వ్యక్తులు మూడు రోజులుగా బ్రేక్‌డౌన్ అయ్యేలా చేస్తున్నారు. రోజూ సాయంత్రం బ్రేక్‌డౌన్ అవుతున్నట్లు లైన్‌మన్ తెలిపారు. వెళ్లి చూడగా 24 గంటల కరెంట్ వల్ల మూడు రోజులుగా బోర్లలో నీరు ఊరడం లేదని.. పాత కండక్టర్ ముక్కను పోల్‌కు తగిలేట్టుగా లైన్ మీద వేసి బ్రేక్‌డౌన్ అయ్యేలా చేస్తున్నారు’ – విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు వాట్సాప్‌లో మిర్యాలగూడ రూరల్ ఏఈ ఇటీవల పంపిన సందేశమిది. సాక్షి, హైదరాబాద్: వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరాపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచనలో పడింది. క్షేత్రస్థాయిలో రైతాంగం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో 24 గంటల సరఫరా కొనసాగింపుపై పునఃసమీక్షించేందుకు సిద్ధమైంది. రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఆ తర్వాత ఓ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరాపై రైతుల నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు సర్వే నిర్వహించనున్నాయి. 24 గంటల విద్యుత్ కొనసాగించాలా, లేక గతంలో మాదిరి పగటి పూటే 9 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేస్తే సరిపోతుందా అనే అంశంపై రైతుల అభిప్రాయాన్ని తీసుకోనున్నాయి. 24 గంటల సరఫరాతో సమస్యలు ఎదురవుతున్నాయా అనే అంశంపైనా రైతుల నుంచి ఆరా తీయనున్నాయి. ప్రత్యేక నమూనాలో సర్వే.. అభిప్రాయ సేకరణను పకడ్బందీగా నిర్వహించేందుకు డిస్కంలు ఓ ప్రత్యేక నమూనాలో సర్వే ఫారాన్ని సిద్ధం చేశాయి. సర్వేలో భాగం గా 24 గంటల విద్యుత్‌పై అభిప్రాయం తెలిపే రైతు పేరు, ఫోన్ నంబర్, పొలం సర్వే నం బర్, విస్తీర్ణం, ఏ రకం పంట తదితర వివరాలను సేకరించనున్నారు. ఈ సర్వేలో అత్యధిక శాతం మంది రైతులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ప్రభు త్వం ఓ నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నా యి. అసెంబ్లీ సమావేశా ల్లో కూడా 24 గంటల విద్యుత్ సరఫరాపై ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని కోరాలని భావిస్తోంది. ‘రబీ’ఎండిపోయే ప్రమాదం ఇటీవలి కాలంలో రైతులు గరిష్టంగా 600 అడుగుల లోతు వరకు బోరు బావులను తవ్వుతున్నారు. ఏళ్ల కిందటి బోర్లు 100–200 అడుగుల లోతులోనే ఉండటంతో కొత్త బోర్ల దెబ్బకి అవి ఎండిపోతున్నాయి. అధిక సామర్థ్యం ఉన్న మోటార్లతో పెద్ద రైతులు భూగర్భ జలాలను తోడుతుండటంతో చుట్టు పక్కల ప్రాంతాల్లోని చిన్న రైతుల బోర్లకు నీళ్లు అందక అడుగంటిపోతున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో వచ్చే మార్చి వరకు 24 గంటల విద్యుత్‌ను కొనసాగిస్తే భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయి రబీ పంటలు ఎండిపోతాయని రైతులు భయాం దోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల భూగర్భ జలాల సమస్య ఏర్పడిందని రైతుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. 24 గంటల విద్యుత్ వద్దని కొన్ని చోట్ల రైతులు స్థానిక విద్యుత్ అధికారులు, సిబ్బందిపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. వరుసగా మూడు, నాలుగు రోజులపాటు కొన్నిచోట్ల బోర్లలో నీళ్లు ఊరడం లేదు. దీంతో రైతులు విద్యుత్ సరఫరా వైర్లపై కండక్టర్ వైరు ముక్కలు విసిరేసి విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగిస్తున్నారని క్షేత్రస్థాయి అధికారులు ఉన్నతాధికారులకు నివేదించారు. ప్రతిష్టాత్మకంగా ప్రారంభం.. వ్యతిరేకత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని జనవరి 1 నుంచి సాగుకు 24 గంటల విద్యుత్ సరఫరాను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఎన్నో నెలల ముందు నుంచి ప్రభుత్వం దీనికి ఏర్పాట్లు చేసింది. రూ.24 వేల కోట్లను వెచ్చించి రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరాకు వీలుగా రాష్ట్రంలో విద్యు త్ ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థల సామర్థ్యాన్ని పెంచింది. కేసీఆర్ సైతం ముందస్తు ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించి పలుసార్లు సమీక్షలు జరిపారు. దీంతో ఒక్కసారిగా యావత్ దేశం దృష్టి రాష్ట్రంపై పడింది. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ కేసీఆర్‌కు లేఖ రాశారు. గుజరాత్, యూపీ, పంజాబ్ తదితర రాష్ట్రాల అధికారులు రాష్ట్ర అధికారులకు ఫోన్ చేసి ఆరా తీశారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రతిష్ట పెరిగిందని భావిస్తున్న తరుణంలో క్షేత్రస్థాయిలో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో ప్రభుత్వం పునరాలోచన జరపాల్సిన పరిస్థితి నెలకొంది. -
రుణమాఫీపై టీ సర్కారు కొత్త ఆలోచన
-
ముందు కట్టండి.. తర్వాత ఇస్తాం!
రుణమాఫీపైటీ సర్కారు కొత్త ఆలోచన సాక్షి, హైదరాబాద్: ‘ముందు మీరు రుణాలు చెల్లించండి.. మీకు మేం బాండ్లు ఇస్తాం.. రెండు, మూడేళ్లలో వడ్డీతో కలిపి చెల్లిస్తాం..’.. రైతుల రుణమాఫీపై తెలంగాణ ప్రభుత్వం తాజాగా చేస్తున్న ఆలోచన ఇది. ఇప్పటిదాకా రైతుల రుణాలను తామే చెల్లిస్తామని చెబుతూ వచ్చిన సర్కారు.. రీషెడ్యూల్కు రిజర్వు బ్యాంకు అనుమతించే అవకాశం కనిపించకపోవడంతో పాటు నిధుల సమీకరణ కష్టంగా మారడంతో రైతులకు ఇలా బాండ్లు జారీ చేయాలని యోచిస్తోంది. సీఎం కేసీఆర్ సైతం ఈ అంశాన్ని అంతర్గత సంభాషణల్లో మంత్రులు, అధికారుల వద్ద వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే.. ఇప్పటికే కరువు పరిస్థితులతో అల్లాడుతున్న రైతులు బ్యాంకులకు తమ రుణాలను చెల్లించగలరా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. రుణమాఫీపై ఆశలు పెట్టుకున్న రైతులు దీనితో ఆందోళనలో మునిగిపోకతప్పదనే అభిప్రాయాలు వస్తున్నాయి. తెలంగాణలో రైతుల రుణాలు దాదాపు రూ. 17,337 కోట్ల వరకు ఉన్నట్లు అధికారుల అంచనా. ఈ రుణ మాఫీకి సంబంధించి ప్రభుత్వం ఇటీవల మార్గదర్శకాలను కూడా జారీ చేసింది కూడా. రైతు రుణమాఫీ అంశంపై రిజర్వుబ్యాంకు వద్దకు ఆర్థిక శాఖ అధికారులు వెళ్లాలని ఇటీవల జరిగిన మంత్రివర్గ అత్యవసర సమావేశంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆర్థిక శాఖ అధికారులు రిజర్వుబ్యాంకు గవర్నర్ అపాయింట్మెంట్ కోసం విజ్ఞప్తి చేసి పక్షం రోజులు కావస్తున్నా.. ఎలాంటి స్పందనా రాలేదు. ఈ నేపథ్యంలో రైతులు బ్యాంకులకు రుణాలను చెల్లిస్తే.. బాండ్లు జారీ చేయాలన్న యోచనకు వచ్చినట్లు తెలిసింది. అయితే.. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఇలా వచ్చి అలా పోతోందని... రుణమాఫీకి సంబంధించి రిజర్వుబ్యాంకు మాత్రం ఒకేసారి మొత్తం సొమ్ము బ్యాంకులకు చెల్లించాలని చెబుతోందని ప్రభుత్వ ముఖ్యుడు ఒకరు వ్యాఖ్యానించారు. అలా చేయడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు. సాధారణంగా రుణాల రీషెడ్యూల్ నాలుగైదేళ్లు ఉంటుందని, దీనికి రిజర్వుబ్యాంకు అంగీకరిస్తే... మాఫీ చేయాల్సిన రూ. 17,337 కోట్లలో మొదట ఐదువేల కోట్లు నేరుగా బ్యాంకులకు చెల్లించవచ్చన్నారు. మిగతా రూ. 12 వేలకోట్ల పైచీలుకు రుణాలకు సంబంధించి ఏటా వడ్డీతో పాటు కొంత అసలును చెల్లించుకుంటూ వెళ్లడం ఒక పద్ధతి అని ఆ ముఖ్యుడు పేర్కొన్నారు. ఇలా వడ్డీ చెల్లించడం భారమైనప్పటికీ.. అది తప్పదన్నారు. అయితే రిజర్వుబ్యాంకు దీనికి కూడా అంగీకరించే అవకాశం లేనందున... రైతులకు బాండ్లు ఇవ్వడంపై దృష్టి పెట్టినట్లు ఆయన చెప్పారు. రుణమాఫీ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసిన తరువాత బాండ్ల జారీ అంటే రైతుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూద్దామని కూడా మంత్రులు, అధికారుల వద్ద జరిగే అంతర్గత సంభాషణల్లో ఆయన వ్యాఖ్యానించినట్లు తెలిసింది. అయితే రెండు మూడేళ్ల తరువాత కూడా రుణాలు చెల్లించడానికి ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోతే ఏమిటన్న దానిపై కూడా చర్చలు సాగుతున్నాయి. -
పొత్తుపై పునరాలోచన !
-
పొత్తుపై పునరాలోచన !
టీడీపీతో దోస్తీపై బీజేపీలో అంతర్మథనం ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు బెట్టుతో బీజేపీ అధినాయకత్వంలో చిరాకు సాక్షి, న్యూఢిల్లీ: నిన్నటిదాకా బీజేపీతో జతకట్టేందుకు తహతహలాడిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.. సీట్ల సర్దుబాబు విషయంలో అనుసరిస్తున్న వైఖరి బీజేపీ అధినాయకత్వానికి చిరాకు తెప్పిస్తోందని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అసలు బాబుతో పొత్తు ఎందుకని ఇప్పటికే అటు తెలంగాణ బీజేపీ నాయకులు తేల్చి చెప్పగా.. ఇప్పుడు సీమాంధ్ర బీజేపీ నేతల్లోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో బీజేపీ అధినాయకత్వం అంతర్మథనంలో పడింది. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీకి దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణ చూసి ఆయనతో జతకట్టేందుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పడిగాపులు కాశారు. అయితే ఇటీవల టీడీపీలోకి వలసలు పెరగడంతో బాబు తన వ్యూహం మార్చారు. పొత్తుకు సరే అన్నా.. బీజేపీ అధినాయకత్వం అడిగినన్ని సీట్లు ఇచ్చేందుకు ససేమిరా అన్నట్టు సమాచారం. ఇప్పటికే పొత్తు రాయబారం నడిపేందుకు వచ్చిన బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్‌జవదేకర్ ఇదే విషయాన్ని తన పార్టీ అధిష్టానానికి నివేదించారు. రాష్ట్ర స్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉండడంతో బీజేపీ అధినాయకత్వం తెలంగాణ, సీమాంధ్రలో టీడీపీతో పొత్తు అవసరమా అన్న మీమాంసలో పడింది. చంద్రబాబు కొత్త కండిషన్లు: బీజేపీ అధిష్టానం నుంచి తెలంగాణ, సీమాంధ్రకు సంబంధించి సీట్ల సర్దుబాబు విషయంలో టీడీపీకి రెండు ప్రతిపాదనలు వచ్చాయి. సీమాంధ్రలో 6 ఎంపీ సీట్లు, 25 ఎమ్మెల్యే స్థానాలను తమకు ఇవ్వాలని బీజేపీ ప్రతిపాదించింది. అలాగే తెలంగాణలో టీడీపీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటంతో అక్కడ 60 ఎమ్మెల్యే, 11 ఎంపీ సీట్లు తమకు ఇవ్వాలని బీజేపీ నాయకులు కోరారు. చివరికి సీమాంధ్రలో 18 ఎమ్మెల్యే, 5 ఎంపీ స్థానాలకు, తెలంగాణలో 9 ఎంపీ, 55 నుంచి 53 వరకు ఎమ్మెల్యే సీట్లు తమకు కేటాయించినా సర్దుకుపోయేందుకు బీజేపీ సిద్ధమైంది. ఇరు ప్రాంతాల్లో అన్ని సీట్లు సర్దుబాబు చేయలేమని బాబు కొత్త కండిషన్లు తెరపైకి తెస్తూ పొత్తులకు సుముఖంగా లేనట్టుగా వ్యవహరించారని.. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చిందని చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో పొత్తులపై ఏం చేయాలో మీరే తేల్చుకోవాలంటూ సీమాంధ్ర, తెలంగాణ కమిటీలకు బీజేపీ అధినాయకత్వం తేల్చి చెప్పింది. ముందునుంచే టీడీపీతో పొత్తుకు వ్యతిరేకత వ్యక్తం చేసిన రాష్ట్ర బీజేపీ నాయకులంతా ఇప్పుడు ముక్తం కంఠంతో పొత్తు వద్దేవద్దని సూచిస్తున్నారు. అసెంబ్లీ స్థానాలపై కాస్త తగ్గుదాం!: అయితే.. టీడీపీతో పొత్తు పెట్టుకొనే ఎన్నికలకు వెళ్లాలని బలంగా కోరుకుంటున్న బీజేపీ తెలంగాణ సీనియర్ నేతలు పలువురు.. ఈ అంశంపై పార్టీ అధిష్టానంతో మాట్లాడాలని భావిస్తున్నట్టు సమాచారం. అసెంబ్లీ స్థానాల విషయంలో కాస్త వెనక్కు తగ్గటం మంచిదేనని అధిష్టానంతో చెప్పాలన్నది వారి ఉద్దేశంగా తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జిగా జవదేకర్ తెలంగాణ, సీమాంధ్ర బీజేపీ ఎన్నికల ఇన్చార్జ్గా పార్టీ అధికార ప్రతినిధి ప్రకాశ్‌జవదేకర్‌ను పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ నియమించారు. మరోనేత రాజ్‌పురోహిత్‌ను కో-ఇన్చార్జ్గా నియమించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.