Reuters survey
-
ప్రతి 15 సెకన్లకు ఓ ప్రాణం పోతుంది
వాషింగ్టన్: కరోనా వైరస్ ఏ ముహుర్తాన బయటపడిందో కానీ.. లక్షల మందిని బలి తీసుకుంటుంది. బుధవారం నాటికి వైరస్‌తో మరణించిన వారి సంఖ్య 7 లక్షలకు చేరింది. ఈ విషయాన్ని రాయిటర్స్ వెల్లడించింది. అమెరికా, బ్రెజిల్, భారత్, మెక్సికోలో ఎక్కువ సంఖ్యలో కరోనా మరణాలు సంభవిస్తున్నాయని తెలిపింది. రాయిటర్స్ విడుదల చేసిన ఓ నివేదిక భయాందోళనలు కల్గిస్తోంది. గత రెండు వారాల డాటాను ఆధారంగా చేసుకుని ఈ నివేదిక వెల్లడించింది. బుధవారం నాటికి కరోనా మరణాల సంఖ్య ఏడు లక్షలకు చేరింది. అంటే 24 గంటల వ్యవధిలో 5,900 మంది మరణించినట్లు అంచనా వేసింది. దీని ప్రకారం గంటకు 247 మంది చనిపోతున్నారు. అంటే ప్రతి 15 సెకన్లకు ఒకరు మరణిస్తున్నట్లు నివేదిక తెలిపింది. అమెరికాలో ఇప్పటి వరకు అత్యధికంగా 1,55,000 మంది కరోనాతో మరణించారు. ప్రజా ఆరోగ్యం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొటుందని.. మహమ్మారి కట్టడిలో ప్రభుత్వం విఫలమయ్యిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీటిపై స్పందించారు. ‘కరోనా మరణాలు సంభవిస్తున్న మాట వాస్తవం. అంటే దానర్థం మేం వైరస్‌ను నియంత్రించడం లేదని కాదు. మాకు చేతనైనంత వరకు కరోనా కట్టడి కోసం కృషి చేస్తున్నాం’ అని తెలిపారు. ఇక బ్రెజిల్ అధ్యక్షుడు అయితే కరోనాను చాలా తేలికగా తీసుకున్నారు. చివరకు ఆయనే వైరస్ బారిన పడ్డారు. ఈ మహమ్మారి ప్రారంభంలో లాటిన్ అమెరికా ప్రాంతంలో చాలా నెమ్మదిగా వ్యాపించింది. ఈ ప్రాంతం 640 మిలియన్ల మందికి నివాసంగా ఉంది. ఇక్కడి పేదరికం, కిక్కిరిసిన నగరాల కారణంగా అధికారులు దాని వ్యాప్తిని నియంత్రించడానికి చాలా కష్టపడుతున్నారు. యూనైటెడ్నేషన్స్ హ్యూమన్ సెటిల్మెంట్ సొల్యూషన్స్ ప్రకారం లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాలలో 100 మిలియన్లకు పైగా ప్రజలు మురికివాడల్లో నివసిస్తున్నారు. వీరంతా ఇన్ఫార్మల్ రంగంలో చాలా తక్కువ జీతానికి పని చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో వైరస్ కట్టడి కష్టంగా మారినట్లు వెల్లడించింది. వైరస్ వ్యాప్తిని అరికట్టినట్లు కనిపించిన కొన్ని దేశాల్లో ఇటీవలే కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఒకే రోజు రికార్డు స్థాయిలో కేసులు బయటపడుతున్నాయి. ఆస్ట్రేలియా, జపాన్, హాంకాంగ్, బొలీవియా, సుడాన్, ఇథియోపియా, బల్గేరియా, బెల్జియం, ఉజ్బెకిస్తాన్, ఇజ్రాయెల్ దేశాల్లో కేసులు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఆస్ట్రేలియా కూడా బుధవారం రికార్డు స్థాయిలో కొత్త మరణాలను నమోదు చేసింది. -
మోదీ అంటే లవ్వే లేదా?
సాక్షి, న్యూఢిల్లీ: వివిధ దేశాల అధినేతలతో కారాలు మిరియాలు నూరిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తన వైఖరి మార్చుకోవటం చర్చనీయాంశంగా మారుతోంది. మొన్నీమధ్యే కిమ్ జంగ్ ఉన్‌తో.. ఆ తర్వాత ఇప్పుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో చర్చలు జరుపుతుండటం చూస్తున్నాం. ఈ క్రమంలో వివిధ దేశాల అధినేతల మధ్య సత్సంబంధాలు, వాళ్ల ఫోన్‌కాల్స్ సంభాషణల గురించి ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. రూటర్స్ డేటా ప్రకారం... జనవరి 2017లో ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి జూలై 6 2018 దాకా మొత్తం 40 మంది దేశాధినేతలకు ఫోన్ కాల్స్ చేశారు. వాటి సంఖ్య సుమారు 200 పైమాటే. అదే సమయంలో పుతిన్.. 50 మంది అధినేతలకు 190 దాకా కాల్స్ చేశారు. ట్రంప్ కాల్స్‌లో ఎక్కువగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాక్రోన్(25)కు గరిష్ఠంగా ఉండగా.. బ్రిటన్ ప్రధాని థెరిసా మే తర్వాతి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత జపాన్ ప్రధాని షింజో అబే, సౌత్ కొరియా అధ్యక్షుడు మూన్, సౌదీ రాజు సల్మాన్‌లు ఉన్నారు. మరోవైపు పుతిన్ ఫోన్ కాల్స్‌లో టర్కీ అధ్యక్షుడిగా రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్(27 కాల్స్), నజర్బయెవ్(కజకిస్థాన్), మాక్రోన్(ఫ్రాన్స్), మెర్కల్(జర్మనీ), నెతన్యాహు(ఇజ్రాయెల్) తదితరులు ఉన్నారు. మోదీ సంగతేంటి... ట్రంప్-పుతిన్.. ఇద్దరితోనూ కలుపుగోలుగా ఉండే భారత ప్రధాని నరేంద్ర మోదీ. పలు పర్యటనల్లో ఈ విషయం రుజువు చేసే విధంగా వాళ్లిద్దరూ మోదీతో మెదిలారు కూడా. అలాంటిది ఇద్దరి లిస్ట్‌లో కూడా మోదీ సింగిల్ డిజిట్‌కే పరిమితం కావటం గమనార్హం. పరస్పర సంబంధాల విషయంలో కాకపోయినా.. కనీసం కలుపుగోలుగా కూడా ఎక్కువగా వీళ్ల మధ్య ఎక్కువగా సంభాషణ లేకపోవటం గమనార్హం అంటూ ఓ ప్రముఖ పత్రిక కథనం ప్రచురించింది. దీంతో అగ్రరాజ్యాల అధినేతల ప్రయారిటీ లిస్ట్‌లో మన ప్రధానిపై లేరంటూ సెటైర్ల పర్వం కురుస్తోంది. A #hilarious #trailer to a new #blockbuster #movie coming soon. #emmanuelle #starring @realdonaldtrump and his new found #buddy @emmanuelmacron - likely to dominate the #screens 😂😂😂 its 3 clips. A post shared by Lalit Modi (@lalitkmodi) on Jul 16, 2018 at 10:00pm PDT కొసమెరుపు.. ట్రంప్-పుతిన్‌లు అత్యధిక కాల్స్ చేసిన మాక్రోన్, ఎర్డోగన్లను ఉద్దేశిస్తూ.. సోషల్ మీడియాలో కొందరు ‘లవ్’ పోస్టులను పెడుతూ వైరల్ చేస్తున్నారు. -
ఆ సర్వేను తోసిపుచ్చిన మోదీ సర్కార్..
సాక్షి, న్యూఢిల్లీ : మహిళల భద్రతలో భారత్ అత్యంత ప్రమాదకర దేశాల్లో ఒకటని రాయ్‌టర్స్ సర్వే వెల్లడించడాన్ని ప్రభుత్వం తోసిపుచ్చింది. సర్వేలో వెల్లడించిన అంశాలు కేవలం ఒపీనియన్ పోల్ ఆధారంగా చెప్పినవేనని, ఎలాంటి గణాంకాలు, నివేదిక ఆధారంగా వెల్లడించినవి కాదని మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆక్షేపించింది. కేవలం 548 మందిని ఆరు ప్రశ్నలు అడగటం ద్వారా ర్యాంకింగ్‌లు ఇచ్చారని, మంత్రిత్వ శాఖ నుంచి ఎలాంటి సమాచారం, అభిప్రాయం కోరలేదని పేర్కొంది. జాతీయ మహిళా కమిసన్ (ఎన్సీడబ్ల్యూ) సైతం ఈ సర్వేను తోసిపుచ్చింది. 130 కోట్ల మంది ప్రజలున్న దేశంలో కేవలం కొద్దిమంది అభిప్రాయాలు తీసుకోవడం ద్వారా వాస్తవ పరిస్థితి ప్రతిబింబించదని పేర్కొంది. మహిళా హక్కుల విషయంలో చాలా దేశాల కంటే భారత్ మెరుగైన స్ధానంలో ఉందని స్పష్టం చేసింది. మరోవైపు మహిళల భద్రతపై రాయ్‌టర్స్ నివేదికను కాంగ్రెస్ సహా విపక్షాలు ప్రస్తావిస్తూ మోదీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. మోదీ ఖరీదైన మైదానాల్లో యోగాసనాలు వేస్తుంటే దేశ మహిళల భద్రత ఆందోళనకరంగా మారిందన్న సర్వేలు సిగ్గుచేటని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఆరోపించారు. -
ఈ ఏడూ.. పసిడి వెలవెల!
♦ 2017లో పెరిగే అవకాశం ♦ రాయిటర్స్ సర్వే వెల్లడి ♦ ఫెడ్ ఎఫెక్ట్ ప్రధానమని విశ్లేషణ లండన్: బంగారం ధర ఈ ఏడాదీ దిగువ స్థాయిలోనే ఉంటుందని రాయిటర్స్ నిర్వహించిన ఒక సర్వే తెలిపింది. ఇదే జరిగితే ఇలాంటి పరిమాణం ఇది వరుసగా నాలుగో ఏడాది సంభవించినట్లు అవుతుంది. పసిడి ధర 2015 ఏడాదిలో వార్షికంగా 10% మేర దిగజారింది. గడచిన రెండు వారాల్లో 41 మంది విశ్లేషకులు, ట్రేడర్ల అభిప్రాయాలను సర్వేలో తీసుకున్నారు. ముఖ్యాంశాలను చూస్తే... వార్షికంగా 2016లో పసిడి సగటు ధర ఔన్స్ (31.1 గ్రా) 1,118 డాలర్లుగా ఉంటుంది. 2009 తరువాత ఇంత తక్కువ స్థాయి సగటు ఇదే తొలిసారి. ప్రస్తుతం అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్ నెమైక్స్‌లో చురుగ్గా ట్రేడవుతున్న ఫిబ్రవరి కాంట్రాక్ట్ పసిడి ధర ఔన్స్‌కు 1,095 స్థాయిలో కదలాడుతోంది. గత ఏడాది పసిడి ధర తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచుతుందన్న అంచనాలు దీనికి ప్రధాన కారణం. ఈ అంచనాలకు అనుగుణంగానే డిసెంబర్లో ఫెడ్ ఫండ్ రేటు అరశాతం పెరిగింది. ఈ ఏడాది మరో నాలుగుసార్లు ఫెడ్ రేటు పెరిగే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఈ పరిణామం పసిడికి పెద్ద ప్రతికూలతే. చైనా మందగమనం, స్టాక్ మార్కెట్ల నష్టాలు, ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిలో ఉండే అవకాశాల వంటివి పసిడికి వన్నె తెస్తాయన్న ఆశవున్నా... ఆయా అంచనాలను ఫెడ్ రేటు పెంపు అంచనాలు దెబ్బతీసే అవకాశం ఉంది. 2017పై ఆశ... అయితే వచ్చే ఏడాది తిరిగి పసిడి కళకళలాడే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. 2011 రికార్డు స్థాయిల నుంచి పూర్తిగా కనిష్ట స్థాయిలకు పడిపోయి... తిరిగి వార్షికంగా సగటున 1,209 డాలర్లకు ఎగిసే వీలుందని అభిప్రాయపడింది. గ్లోబల్ వృద్ధి మందగమనం భయాలు, ఫైనాన్షియల్ మార్కెట్లలో ఒడిదుడుకుల వంటి అంశాలు పసిడి పెరుగుదలకు దోహదపడే వీలుంది. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆర్థిక అస్థిరత్వ పరిస్థితులు... పసిడికి తిరిగి భద్రతాపరమైన మెటల్ హోదా కట్టబెడతాయని ఫస్ట్మార్కెట్ అనలిస్ట్ జేమ్స్ మోర్ పేర్కొన్నారు. వెండి విషయానికి వస్తే... ప్రస్తుతం నెమైక్స్‌లో 14 డాలర్ల వద్ద కదలాడుతున్న వెండి, వార్షికంగా సగటున 14.80గా ఉంటుందని సర్వే పేర్కొంది. గత ఏడాది ఈ ఇండస్ట్రియల్ మెటల్ ధర 11 శాతం పడింది.