rice packets
-
ఆకలికి వైద్యం అన్నం పొట్లం
హాస్పిటల్‌లోని పేషెంట్లకు వైద్యులు వైద్యం చేస్తారు. కాని వారి ఆకలికి ఎవరు వైద్యం చేస్తారు? కేరళలో ప్రభుత్వ ఆస్పత్రుల్లోని పేషెంట్ల కోసం, వారిని చూసుకుంటూ ఉండిపోయిన బంధువుల కోసం ఎందరో గృహిణులు వంట చేస్తారు. ‘అన్నం పొట్లం’ కట్టి అందిస్తారు. ఇలా దాదాపు రోజూ 40 వేల అన్నం పొట్లాలు అక్కడి యూత్ ఫెడరేషన్ ద్వారా నిత్యం సరఫరా అవుతూనే ఉంటాయి. ఉదయాన్నే లేచిన సౌమ్య ఆఫీసుకు వెళ్లే భర్త కోసం క్యారేజీ కట్టే హడావిడిలో ఉంది. అలాగే పిల్లలకు కూడా లంచ్ బాక్సులు కట్టాలి. ఒకటిన్నర గ్లాసుల బియ్యం పడేస్తే సరిపోతాయి. కాని ఆమె ఆ రోజు రెండు గ్లాసులకు పైనే వండింది. భర్తకు, పిల్లలకు కట్టగా తను తినాల్సింది గిన్నెలో పెట్టి మిగిలింది పొట్లంగా కట్టింది. అన్నంతో పాటు పప్పు, పచ్చడి, తాలింపు, ఒక ఆమ్లెట్టు... చక్కగా అరిటాకులో వేసి న్యూస్పేపర్లో చుట్టింది. ఆ పొట్లాన్ని కాసేపటికి ఒక కార్యకర్త వచ్చి సేకరించుకుని వెళ్లాడు. అలా ఆ కార్యకర్త ఆ వీధిలో అన్నం పొట్లం కట్టమని చెప్పిన ఇళ్లన్నింటికీ వెళ్లి అన్నం పొట్లాలను సేకరించాడు. ఇలా సేకరించినవి మధ్యాహ్నానికి ఊళ్లోని ప్రభుత్వ ఆస్పత్రికి చేరుతాయి. లోపల ఉన్న పేద పేషెంట్లకూ వారి కోసం బయట కాచుకుని ఉన్న అటెండర్ల కోసం పంచుతారు. ‘ఏ తల్లి కట్టిచ్చిన అన్నమో’ అని తిన్నవారు ఆ గృహిణులను ఆశీర్వదిస్తారు. ఇలా కేరళలో గృహిణుల వల్ల గత నాలుగేళ్లుగా రోగుల ఆకలి తీరుతోంది. వారి ఆరోగ్యం బాగుపడుతోంది. ఇంటి నుంచి ఆస్పత్రికి కేరళలోని డెమొక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డివైఎఫ్ఐ) 2017లో 300 అన్నం పొట్లాలు సేకరించి ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుసంధానంగా ఉండే పెద్దాస్పత్రులకు పంచే కార్యక్రమం మొదలు పెట్టింది. దీనికి వారు పెట్టిన పేరు ‘హృదయపూర్వం పొత్తిచోరు’. అంటే ‘హృదయపూర్వకంగా అన్నం పొట్లం’. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్న రోగులకు అన్నం కొనుక్కునే స్తోమత అన్ని వేళలా ఉండదు. అలాగే వారిని చూసుకోవడానికి వచ్చే బంధువులు కూడా అన్నం కొనుక్కోలేరు. పేదవారు ఇలా బాధపడుతుంటే చూస్తూ ఊరుకోవడమేనా అని డివైఎఫ్ఐ కార్యకర్తలకు అనిపించింది. ‘ప్రతి ఇంట్లోనూ ఓ అమ్మ అన్నం వండుతుంది. ఒక గుప్పెడు అదనంగా వండమని కోరుదాం. ఒకరికి భోజనం పొట్లం కట్టి ఇవ్వమని అడుగుదాం. ఇస్తారు’ అని స్త్రీల కరుణ మీద ఉండే విశ్వాసంతో ధైర్యంగా రంగంలోకి దిగారు. కార్యక్రమ ప్రారంభం రోజున 300 అన్నం పొట్లాలు వచ్చాయి. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 40,000 అన్నం పొట్లాలు పంపిణీ అవుతున్నాయి. పకడ్బందీగా సేకరణ కేరళ అంతా డివైఎఫ్ఐ కార్యకర్తలు ఉన్నారు. వారు తమ తమ ఊళ్లలో ఎన్ని అన్నం పొట్లాలు అవసరమో లెక్కించి తమ ఏరియాలో ఉన్న గృహిణులను ముందు రోజే రిక్వెస్ట్ చేస్తారు. మరుసటి రోజు మధ్యాహ్నం అన్నం పొట్లం ఇవ్వమంటారు. అలా ఒకోరోజు ఒక ఏరియాలో కొన్ని ఇళ్లను ఎంపిక చేసుకుని అడుగుతారు. మళ్లీ ఆ ఇళ్లలోని గృహిణులను అడగడానికి వారం పదిరోజులు పట్టొచ్చు. అందుకని స్త్రీలు సంతోషంగా అన్నం పొట్లం కట్టి ఇస్తారు. కొందరు స్త్రీలు రెండు మూడు పొట్లాలు కట్టిచ్చి సంతోష పడతారు. సారీ అంకుల్! ఈ అన్నం పొట్లాల పంపిణిలో ఎన్నో ప్రేమమయ సంఘటనలు కూడా ఉన్నాయి. ఒకరోజు ఒక రోగికి తన వంతుగా అందిన అన్నం పొట్లంలో చిన్న చీటీ కనిపించింది. అందులో ఇలా ఉంది. ‘అంకుల్.. అమ్మకు వీలు కాలేదు. నేనే స్కూల్‌కు వెళ్లే హడావిడిలో వంట చేశాను. అంత రుచిగా లేవు. క్షమించండి. మీరు తొందరగా కోలుకోండి’ అని ఒక అమ్మాయి రాసింది. దానిని అందుకుని ఆ రోగి ఆ చీటిని ఫేస్బుక్లో పోస్ట్ చేస్తూ ‘బంగారుతల్లీ... నువ్వు పంపిన భోజనం ఎంతో రుచిగా ఉంది. మెతుకు మెతుకులో నీ ప్రేమ ఉంది’ అని రాశాడు. అన్నం పొట్లం కట్టివ్వడానికి అమ్మలాంటి స్త్రీలు ఎందరో ఉంటారు. చేయవలసిందల్లా ప్రయత్నమే. -
30 గోడౌన్లలో బియ్యం ప్యాకింగ్ యంత్రాలు
సాక్షి, అమరావతి: ప్రభుత్వం ఏప్రిల్ నుంచి నాణ్యమైన బియ్యాన్ని వలంటీర్ల ద్వారా రేషన్ కార్డుదారుల ఇళ్లకే పంపిణీ చేయనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మొదటి విడతగా 30 గోడౌన్లలో బియ్యం ప్యాకింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ నిర్ణయించింది. తూకాల్లో మోసాలకు తావు లేకుండా 5, 10, 15, 20 కిలోల బ్యాగుల్లో బియ్యం ఇచ్చేందుకు వీలుగా అవసరమైన ప్యాకింగ్ యంత్రాలను ఏర్పాటు చేయనుంది. ప్యాకింగ్ ఏజెన్సీల కోసం ఇప్పటికే టెండర్లను ఆహ్వానించింది. గత ప్రభుత్వ హయాంలో పంపిణీ చేసిన బియ్యాన్ని తినలేక ప్రజలు బహిరంగ మార్కెట్లో అమ్ముకునేవారు. దీంతో నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేస్తే ప్రయోజనం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వంపై అదనపు భారం పడుతున్నప్పటికీ ఏప్రిల్ నుంచి రాష్ట్రమంతటా ఇచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇంతకుముందు పంపిణీ చేసిన బియ్యంలో నూకలు 25 శాతం ఉండేవి. ప్రస్తుతం దీన్ని 15 శాతానికి తగ్గించనున్నారు. అలాగే 3 శాతం ఉండే డ్యామేజీ, రంగు మారిన బియ్యాన్ని 0.75 శాతానికి పరిమితం చేయనున్నారు. గతంలో 5 శాతం ఉన్న షాకీగ్రేన్ ఒక్క శాతం మించకూడదని సీఎం అధికారులను ఆదేశించారు. ప్యాకింగ్ మిషన్ల ఏర్పాటు కోసం ఈ నెల 23న టెండర్లు ఖరారు చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. -
బియ్యం లారీ పట్టివేత 510 బస్తాల బియ్యం స్వాధీనం
మానవపాడు, న్యూస్‌లైన్ : ఎలాంటి అనుమతి లేకుండా కర్ణాటక రాష్ట్రానికి ఓ లారీలో 210 క్వింటాళ్ల బియ్యం తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే... సోమవా రం తెల్లవారుజామున భూత్పూరు మండలం శేర్‌పల్లిలోని వెంకటేశ్వర ఇండస్ట్రీస్ నుంచి 510 బస్తాల బియ్యం (210 క్వింటాళ్లు) తో ఓ లారీ కర్ణాటక రాష్ట్రంలోని బంగారుపేటకు బయలుదేరింది. మార్గమధ్యంలోని అలంపూర్‌చౌరస్తా దాటుతుండగా మానవపాడు పోలీసులు అనుమానం వచ్చి స్టేషన్‌కు తరలించి పౌరసరఫరా ల అధికారులకు సమాచారమిచ్చారు. మధ్యాహ్నం మూడు గంటలకు డివిజన్ అసిస్టెంట్ పౌ రసరఫరాల అధికారి ప్రభాకర్‌రెడ్డి వచ్చి అందులోని బియ్యం స్వాధీనం చేసుకున్నారు. వీటి వి లువ సుమారు *2.6 లక్షలు ఉంటుందన్నారు. ఈ మేరకు డ్రైవర్ తోపాటు బియ్యం విక్రయించే యజమానిపై 6ఏ కేసు నమోదు చేశారు. ఈ కా ర్యక్రమంలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రాజు, ఓంప్రకాశ్; మానవపాడు ఆర్ఐ జయంతి, వీఆర్ఓలు చంద్రయ్య, ఫణిమోహన్‌రావు, సుబ్బారెడ్డి, భానుమూర్తి తదితరులు పాల్గొన్నారు. దాడులు కొనసాగిస్తున్నాం : డీఎస్ఓ కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా రెండు రోజుల్లో 250 క్వింటాళ్ల బియ్యం పట్టుకున్నట్లు డీఎస్ఓ సయ్యద్‌యాసిన్ వెల్లడించారు. సోమవారం త న చాంబర్లో విలేకరులతో మాట్లాడుతూ రేష న్ షాపులపై దాడులు నిర్వహించి విక్రయిం చిన స్టాక్‌తోపాటు నిల్వలో ఏమైనా తేడా ఉంటే వాటిని వెంటనే సీజ్ చేస్తున్నామన్నారు. ఇందు లో భాగంగా అలంపూర్క్రాస్ రోడ్లో బాయిల్డ్ రైస్ 200 క్వింటాళ్లను అనుమతి లేకుండా తరలి స్తుంటే వాటిని సీజ్ చేశామన్నారు. అలాగే గద్వాలలో 50 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని మినీ డీసీఎంలో తరలిస్తుండగా ఏఎస్ఓ పట్టుకుని కే సు నమోదు చేశారన్నారు. అచ్చంపేటలోని ఓ రేషన్ షాపులో అక్రమంగా ఉన్న మూడు క్విం టాళ్ల బియ్యం, వంద లీటర్ల కిరోసిన్‌ని స్వా ధీనం చేసుకున్నామన్నారు. మద్దూరు మండ లం మోమినాపూర్లోని ఓ రేషన్ షాపును తనిఖీ చేశామన్నారు. అక్కడ అమ్మహస్తం పథకానికి సంబంధించి డీడీలు కట్టకపోగా, లబ్ధిదారులకు ఎలాంటి సరుకులు పంపిణీ చేయనందుకు డీలపై చర్య తీసుకోవాలని నారాయణపేట ఆర్డీఓ యాస్మిన్‌బాషాను ఆదేశించామన్నారు. వీటితోపాటు భూత్పూరు మండలంలోని రెండు పెట్రోల్ బంక్‌లను తనిఖీ చేసి కనీస సదుపాయాలు లేనందున జే సీ శర్మన్‌కు నివేదిక సమర్పించామన్నారు.