Richard
-
రిచర్డ్ మూర్కు మరణశిక్ష అమలు
కొలంబియా: స్టోర్ క్లర్క్‌ను కాల్చి చంపిన 1999నాటి కేసులో నల్ల జాతీయుడు రిచర్డ్ మూర్(59)కు సౌత్ కరోలినా జైలు అధికారులు శుక్రవారం మరణ శిక్ష అమలు చేశారు. అతడికి క్షమాభిక్ష ప్రసాదించిన శిక్షను జీవిత కారాగారంగా మార్చాలంటూ కేసును విచారించిన ముగ్గురు జ్యూరర్లు, ఒక జడ్జితోపాటు పాస్టర్లు, జైలు మాజీ డైరెక్టర్, మూర్ కుటుంబం చేసిన వినతిని గవర్నర్ హెన్రీ మెక్‌మాస్టర్ తోసిపుచ్చారు. దీంతో, జైలు అధికారులు శుక్రవారం సాయంత్రం రిచర్డ్ మూర్కు విషం ఇంజెక్షన్ ఇచ్చి శిక్షను అమలు చేశారు. 1999 సెపె్టంబర్లో స్పార్టన్బర్గ్లోని ఓ రిటైల్ స్టోర్‌కు వెళ్లిన మూర్‌ను జేమ్స్ మహోనీ అనే వ్యక్తి తుపాకీతో కాల్చాడు. చేతికి గాయం కాగా వెంటనే స్పందించిన మూర్ అతడి మరో చేతిలోని తుపాకీని లాక్కుని ఛాతీపై కాల్చడంతో మహోనీ అక్కడికక్కడే చనిపోయాడు. కేసు విచారణ చేపట్టిన కోర్టు.. ఘటన సమయంలో మూర్ డ్రగ్స్ ప్రభావంతో ఉన్నాడని పేర్కొంటూ మరణ శిక్ష విధించింది. అయితే, మూర్ నేర చరితుడు కాడని, జైలులో ఉన్న సమయంలో స్రత్పవర్తనతో మెలిగినట్లు తోటి ఖైదీలు తెలిపారంటూ అతడి తరఫు లాయర్లు గవర్నర్ మెక్ మాస్టర్‌కు తెలిపారు. అటువంటి వ్యక్తి మరణశిక్ష బదులుగా క్షమాభిక్ష ప్రసాదించాలని, పెరోల్‌కు అవకాశం లేని జీవిత ఖైదుగా మార్చాలని విజ్ఞప్తి చేశారు. ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపిన మూర్కు మరణ శిక్ష విధించడం అన్యాయమని వాదించారు. మూర్ కేసును విధించిన జ్యూరీలో ఆఫ్రికన్ అమెరికన్లు ఒక్కరూ లేని జ్యూరీలో మరణ శిక్ష పడిన ఏకైక నల్లజాతీయుడు మూర్ అని వారు శుక్రవారం రాసిన లేఖలో గుర్తు చేశారు. అయినా క్షమాభిక్ష ఇచ్చేందుకు మెక్ మాస్టర్ నిరాకరించారు. మూర్ కుమారుడు, కుమార్తె ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తమ తండ్రి తమ జీవితాలపై ఎంతో సానుకూల ప్రభావం చూపారన్నారు. తండ్రి కోరిక మేరకే ఎయిర్ ఫోర్స్‌లో చేరానంటూ అలెగ్జాండ్రా మూర్ తెలిపింది. స్పెయిన్ మిలటరీ బేస్‌లోని తమ నివాసంలో ఫోన్ మోగినప్పుడల్లా ‘తాత ఫోన్ చేశాడా?’అంటూ తన ఐదేళ్ల కూతురు అడుగుతూ ఉంటుందని అలెగ్జాండ్రా అన్నారు. సౌత్ కరోలినాలో 50 ఏళ్ల క్రితం మరణ శిక్షను పునరుద్ధరించాక 45 మందికి ఆ శిక్షను విధించారు. ఇందులో ఒక్కరికి కూడా క్షమాభిక్ష ఇచి్చన దాఖలాలు లేవు. -
ఆ హ్యాండ్సమ్ సీరియల్ కిల్లర్‌పై అమ్మాయిల మోజు.. జైలులో ఉన్నా..
రిచర్డ్ రెమిరెజ్ 1960 ఫిబ్రవరి 29న అమెరికాలోని టెక్సాస్ పరిధిలోగల ఎల్ పాసోలో జన్మించాడు. అతని బాల్యం సవ్యంగా సాగలేదు. అతని తల్లిదండ్రులు నిరంతరం గొడవపడుతూ అతనిని పట్టించుకునేవారు కాదు. 12 ఏళ్ల వయసులో రిచర్డ్ తన కజిన్ మైక్ ఇంటికి వెళ్లాడు. అక్కడ ఏదో విషయమై భార్యతో గొడవ పడిన మైక్.. రిచర్డ్ ఎదుటనే ఆమెను హత్య చేశాడు. ఈ ఉదంతం రిచర్డ్ మనసులో ఎంతగా నాటుకుపోయిందంటే తాను కూడా ఎవరినైనా హత్యచేయాలని అనుకున్నాడు. తన బంధువు మైక్ తీరుతెన్నులకు ప్రభావితుడైన రిచర్డ్ పెరిగి పెద్దయ్యాక నేరమార్గాన్ని ఎంచుకున్నాడు. 1984 జూన్‌లో 79 ఏళ్ల వితంతువుపై అత్యాచారం జరిపి, హత్య చేశాడు. ఈ కేసులో పోలీసులు రిచర్డ్‌ను పట్టుకోవడంలో విఫలమయ్యారు. అది మెదలు రిచర్డ్ తన వినోదం కోసం హత్యలు చేయడం మొదలుపెట్టాడు. ఆధారాలు మాయం చేయకుండానే రిచర్డ్ హత్యలు చేస్తూ వచ్చినా.. పోలీసులు అతనిని పట్టుకోలేకపోయారు. దీంతో రిచర్డ్ నేరాల మీద నేరాలు చేస్తూ వచ్చాడు. ఈ నేపధ్యంలోనే అతను సైతానిక్ సొసైటీలో చేరాడు. ఈ సొసైటీ సైతానుకు పూజలు చేసేది. ఈ సొసైటీలో చేరిన దగ్గరి నుంచి ప్రతీరోజూ మత్తుమందులు తీసుకునేవాడు. ఫలితంగా నిస్సత్తువుగా మారి ఏ పనీ చేయలేకపోయేవాడు. మద్యం మత్తులో తేలేందుకే రిచర్డ్ ఈ సొసైటీలో చేరాడు. అయితే అంతకు మందు రిచర్డ్ 13 హత్యలు, 11 అత్యాచారాలు, 14 దోపిడీలు చేశాడు. అక్కడి జనం అతనిని ‘నైట్ స్టాకర్’ అని పిలిచేవారు. పోలీసులు.. కొందరు బాధితులు అందించిన ఆధారాల మేరకు అతని స్కెచ్ రూపొందించారు. అతను మార్కెట్లో తిరుగుతుండగా వలపన్ని పోలీసులు అతనిని పట్టుకున్నారు. కోర్టు రిచర్డ్ రెమిరిజ్ను దోషిగా తీర్మానిస్తూ, 1989 నవంబరు 20న అతనికి ఉరిశిక్ష విధించింది. అతను చేసిన దారుణాలకు ప్రతిగా అతనిని 19 సార్లు ఉరితీయాలని ఆదేశించింది. రిచర్డ్ జైలులో మగ్గుతున్నప్పడు అతనికి అమ్మాయిల నుంచి లవ్ లెటర్లు వచ్చేవి. ఇదేకోవలో డోరిన్ లివోఎ అనే మ్యాగజైన్ ఎడిటర్ నుంచి కూడా అతనికి ఉత్తరాలు వచ్చేవి. ఆమె 11 ఏళ్లలో ఏకంగా 75కు మించిన ఉత్తరాలను రిచర్డ్‌కు రాసింది. ప్రతీవారం అతనిని కలుసుకునేందుకు జైలుకు వచ్చేది. 1996లో రిచర్డ్ జైలులోనే ఆమెను వివాహం చేసుకున్నాడు. అయితే వారి అనుబంధం ఎంతో కాలం నిలవలేదు. డెరిన్ అతనికి విడాకులు ఇచ్చింది. 2013 జూన్ 7న జైలులోనే రిచర్డ్ కన్నుమూశాడు. ఇది కూడా చదవండి: ఈ దేశాల్లో జనం పిల్లలను కనడం లేదు -
ఐఎస్ఎల్-ప్రీమియర్ లీగ్‌ల మధ్య కొత్త ఒప్పందం
ముంబై : ప్రీమియర్ లీగ్, ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్)ల మధ్య కొత్త ఒప్పందం కుదిరింది. నెక్ట్స్ జనరేషన్ ముంబై కప్‌లో భాగంగా శుక్రవారం ఫుట్‌బాల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ లిమిటెడ్ చైర్పర్సన్ నీతా అంబానీ, ప్రీమియర్ లీగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ మాస్టర్స్‌ను కలిశారు. ఈ సందర్భంగా నీతా అంబానీ, రిచర్డ్‌లు కొత్త ఒప్పందంపై సంతకం చేశారు. గత ఆరేళ్ల నుంచి ఈ రెండు లీగ్‌లు కలిసి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. తాజా ఒప్పందం ప్రకారం భారతలో ఫుట్‌బాల్ అభివృద్ధితోపాటు, కోచింగ్ సౌకర్యాలు, యువతలో ఫుట్‌బాల్ నైపుణ్యాలు పెంపొందించడానికి ఈ రెండు సంస్థలు కలిసి పనిచేయనున్నాయి. ఈ సందర్భంగా నీతా అంబానీ మాట్లాడుతూ.. ప్రీమియర్ లీగ్‌తో ఐఎస్ఎల్ భాగస్వామ్యం మరో దశకు చేరుకుందన్నారు. గత ఆరేళ్లుగా భారత్‌లో ఫుట్‌బాల్ అభివృద్ధి తాము చేసిన కృషి సంతృప్తినిచ్చిందని తెలిపారు. యువతలో నైపుణ్యం పెంపొందించడం, కోచింగ్, రిఫరీ అంశాలను మరింత బలోపేతం చేయడానికి రెండు లీగ్‌ల మధ్య కుదిరిన నూతన ఒప్పందం తోడ్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. రిచర్డ్ మాస్టర్స్ మాట్లాడుతూ.. ఐఎస్ఎల్తో కొత్త ఒప్పందాన్ని చేసుకోవడం భారత్‌లో ఫుట్‌బాల్ అభివృద్ధికి తమ నిబద్ధతను మరోసారి చాటిచెప్పింది. ఇందుకు తాము చాలా సంతోషిస్తున్నాం. గత ఆరేళ్లుగా ఐఎస్ఎల్ భాగస్వామ్యంతో ఫుట్‌బాట్ కోచింగ్, అభివృద్ధి, అలాగే మౌలిక సదుపాయాలకు మద్దతిచ్చాం. కొత్త ఒప్పందం ద్వారా యువతలో ఫుట్‌బాల్ నైపుణ్యాన్ని పెంపొందించడం, భారత్‌లో ఫుట్‌బాల్ పరిధిని విస్తృత పరిచేందుకు ఎదురుచూస్తున్నామ’ని తెలిపారు. -
సూపర్ హీరో... రిచర్డ్ స్టాన్టన్
చియంగ్ రాయ్: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన థాయ్‌లాండ్ గుహ ఘటనలో బ్రిటన్ డైవర్ రిచర్డ్ స్టాన్టన్ సూపర్ హీరోగా అందరి అభిమానాలు అందుకుంటున్నారు. కోచ్ సహా ‘వైల్డ్ బోర్స్’ సాకర్ విద్యార్థుల బృందం.. హఠాత్తుగా వచ్చిన వరద కారణంగా గుహ లోపల చిక్కుకున్న ప్రాంతా న్ని మొదటగా గుర్తించిన స్టాన్టన్.. సహాయక చర్యలు ముమ్మరం కావడంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఈయనిచ్చిన సమాచారం ఆధారంగానే వీరిని కాపాడిన ఆపరేషన్ జోరందుకుంది. బ్రిటన్ సహా వివిధ దేశాల డైవర్లు చొరవతీసుకుని మూడ్రోజులపాటు తీవ్రంగా శ్రమించి చిన్నారులను బయటకు తీసుకొచ్చారు. ఆపరేషన్ పూర్తయ్యాక థాయ్‌లాండ్ నుంచి బయలుదేరిన స్టాన్టన్ శుక్రవారం లండన్ చేరుకున్నారు. ప్రమాదం జరిగినప్పటినుంచి.. బాధితులంతా బయటకు వచ్చేంతవరకు జరిగిన రోమాంచిత ఘటనలను ఆయన వివరించారు. గుర్తించేందుకే ఆలస్యమైంది! జూన్ 23న అందరిలాగే థాయ్ పాఠశాల విద్యార్థుల ఫుట్‌బాల్ బృందం, కోచ్ ఎక్కాపోల్ చాంథవాంగ్తో కలిసి థామ్ లువాంగ్ గుహలను సందర్శించేందుకు వెళ్లింది. ఇంతలో హఠాత్తుగా గుహను వరద ముంచేయడంతో కోచ్ సహా సాకర్ చిన్నారుల బృందం తప్పించుకునే ప్రయత్నంలో గుహలోపల చిక్కుకుపోయారు. వీరిని కాపాడాలని థాయ్ అధికారులు, డైవర్లు ప్రయత్నించినప్పటికీ.. పిల్లలను గుర్తించడమే పెద్ద సవాల్‌గా మారిందని స్టాన్టన్ తెలిపారు. ఘటన జరిగిన 10 రోజుల వరకు వీరంతా ఎక్కడున్నారో తెలుసుకోలేకపోయామన్నారు. ఆ తర్వాత లోయలో దాదాపు 4 కిలోమీటర్ల దూరంలో ఓ భారీ రాయి వెనక వీరున్నట్లు తను గుర్తించినట్లు ఆయన తెలిపారు. లోయలో చిన్నారులను తొలిసారి చూసినపుడు ఒక్కరొక్కరిని లెక్కబెడుతూ.. 13 మంది ఉన్నారని నిర్ధారించుకున్నాకే హమ్మయ్య అనిపించింది’ అని స్టాన్టన్ వెల్లడించారు. -
అందరికీ ఇలాంటి బాస్ ఉంటే....
ఆఫీస్‌లో ఉన్నప్పుడు ఎవరైనా ఉద్యోగి నిద్రపోవడం అతని పై అధికారి చూస్తే ఏమంటారు? అతన్ని తీసేయడమో, మందలించడమో చేస్తారు. కానీ వర్జిన్ గ్రూప్ యజమాని రిచర్డ్ బ్రాన్సన్ మాత్రం తన కంపెనీకి చెందిన ఉద్యోగి నిద్రపోతుండగా ఫోటో దిగి తన బ్లాగ్‌లో పోస్ట్ చేశారు. ‘అతణ్ణి నేను నిద్ర లేపి ఉంటే ఏం అనుకుని ఉంటాడు? కలకంటున్నాననుకుని మళ్లీ పడుకునేవాడేమో’అని ఆ ఫోటో కింద రాసి తనలోని సెన్సాఫ్ హ్యూ మర్ని చూపించారు. ఆస్ట్రేలియాలోని వర్జిన్ గ్రూప్ అన్ని శాఖలను రిచర్డ్ సందర్శించాడు. ఆ సమయంలో క్లిక్ మనిపించిన ఫోటోనే ఇది. ఫోటో దిగాక కూడా రిచర్డ్ అతన్ని లేపకుండా తన తర్వాతి కార్యక్రమాల్లో మునిగిపోయాడు. -
కోహ్లి ఇప్పటికే దిగ్గజం
రిచర్డ్స్ ప్రశంస ముంబై: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి ఇప్పటికే వన్డే క్రికెట్ దిగ్గజంగా ఎదిగాడని వెస్టిండీస్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ అభిప్రాయపడ్డారు. ఆయన దృష్టిలో ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ వన్డే బ్యాట్స్‌మెన్ జాబితాను వెల్లడించారు. ఇందులో సచిన్‌కు అగ్రస్థానం ఇచ్చారు. ఆ తర్వాత లారా, గేల్, లాయిడ్, పాంటింగ్, హేడెన్, సెహ్వాగ్, మైక్ హస్సీ, డివిలియర్స్, కోహ్లిలను ఆ జాబితాలో ప్రస్తావించారు. ‘చరిత్రలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ పేర్లను ప్రస్తావించినప్పుడు అందులో చివరి పేరు కోహ్లి కావడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. కానీ తను ఇప్పటికే నా దృష్టిలో ఓ దిగ్గజం’ అని రిచర్డ్స్ చెప్పారు. భవిష్యత్‌లో టెస్టు క్రికెట్లోనూ విరాట్ కచ్చితంగా రాణిస్తాడని అభిప్రాయపడ్డారు. -
పర్వతంపై ఐలవ్యూ
కొందరు గులాబీ పువ్వు ఇచ్చి.. ప్రేమను వ్యక్తం చేస్తారు. మరికొందరు డైమండ్ రింగ్ ఇచ్చి.. చెబుతారు. అయితే.. బ్రిటన్‌లోని లాంక్షైర్కు చెందిన రిచర్డ్ మాత్రం ఆంగెలా జోన్స్‌కు 2,500 అడుగులు ఎత్తున్న పర్వతం నేప్స్ నీడిల్ మీద తన మనసులోని మాటను వ్యక్తపరిచాడు. పర్వతారోహకులైన వీరు ఇటీవల నేప్స్ నీడిల్‌ను అధిరోహించారు. అయితే.. అక్కడ సడన్‌గా.. రిచర్డ్ తన ప్రేమను వ్యక్తం చేశాడు. ఈ వినూత్న ప్రతిపాదనను చూసి ఉబ్బితబ్బిబ్బైన అమ్మడు వెంటనే ఓకే చెప్పేసింది.