risabh Pant
-
"ఆ విషయం గురించి పంత్‌తో మాట్లాడతాం"
జొహన్నెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్‌లో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే రెండో ఇన్నింగ్స్‌లో కీలక సమయంలో రిషభ్ పంత్ వికెట్ పారేసుకున్న తీరు విమర్శలపాలైంది. తాను ఎదుర్కొన్న మూడో బంతికే ముందుకు దూసుకొచ్చి షాట్ ఆడిన అతను డకౌటయ్యాడు. ఇది అతని సహజ శైలే అయినా ఆడిన సందర్భం తప్పని, దీనిపై పంత్‌తో మాట్లాడతామని ద్రవిడ్ అన్నాడు. ‘పంత్ ఎలా ఆడతాడనేది మనకందరికీ తెలుసు. అదే శైలితో అతను మంచి ఫలితాలు కూడా సాధించాడు. అయితే కొన్నిసార్లు పరిస్థితులను బట్టి కూడా షాట్లను ఎంపిక చేసుకోవాలి. ఈ విషయం గురించి అతనికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ పని మేం చేస్తాం’ అని ద్రవిడ్ స్పష్టం చేశాడు. చదవండి: MS Dhoni: పాక్ పేసర్‌కు ధోని స్పెషల్ గిఫ్ట్.. భావోద్వేగానికి గురైన క్రికెటర్.. దటీజ్ లెజెండ్! -
ఎవరతడు?
‘జట్టులో ఒకటి, రెండు స్థానాలకు ఎవరిని ఖరారు చేయాలనేది తప్ప, ప్రపంచ కప్‌నకు టీమిండియా ఎంపిక దాదాపు పూర్తయినట్లే!’ కొన్నాళ్లుగా విశ్లేషకుల నుంచి వినిపిస్తున్న మాట ఇది. చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అయితే ఈ విషయంలో ఇంకాస్త ముందుకు వచ్చి... ఒక్క స్థానంపైనే తాము ఆలోచిస్తు న్నామని చెప్పారు. వాస్తవంగా చూసినా, భారత జట్టులో ఎవరెవరుంటారు? అనే దానిపై గతంలో ఏ ప్రపంచ కప్ సమయానికీ లేనంత ముందుగానే అభిమానులకు సైతం స్పష్టత వచ్చింది. ఫామ్, ఫిట్నెస్ ప్రమాణాల ప్రకారం ప్రతిష్ఠాత్మక టోర్నీ కోసం ఇంగ్లండ్ విమానం ఎక్కే 14 మంది ఎవరనేది అందరికి తెలిసిపోయింది. మిగిలిన ఒక్క బెర్తుపైనే ఉత్కంఠ నెలకొంది. మరి దానిని చేజిక్కించుకునేదెవరో? సాక్షి క్రీడా విభాగం ప్రపంచ కప్‌నకు 15 మంది జట్టు సభ్యుల ప్రకటనకు తుది గడువు (ఏప్రిల్ 23) దగ్గర పడుతున్న క్రమంలో భారత్–ఆస్ట్రేలియా మధ్య వచ్చే నెలలో జరుగనున్న వన్డే సిరీస్‌పై ఆసక్తి నెలకొంది. రెండు టి20లు, ఐదు వన్డేల సిరీస్ కోసం జట్టు ఎంపికకు ముంబైలో శుక్రవారం సెలెక్టర్లు సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా వారు ‘ఆ ఒక్క బెర్తు’ సంగతినీ తేల్చే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఫామ్, ఫిట్నెస్ ఆధారంగా స్పిన్, పేస్ కోటాల్లో ఎవరుంటారనేది అంచనాకు వచ్చినందున మిగిలిన బెర్త్ ‘రెండో పేస్ ఆల్‌రౌండర్’, ‘స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్’దేనని భావించొచ్చు. దీనికోసం ఆల్ రౌండర్‌గా విజయ్ శంకర్, బ్యాట్స్‌మెన్‌గా అజింక్య రహానే, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ మధ్య పోటీ నెలకొంది. ఎలాగూ ఐపీఎల్ ప్రదర్శన ప్రామాణికం కాదంటున్నారు కాబట్టి... ఆసీస్‌తో సిరీస్‌కు ఎంపిక, మ్యాచ్‌లు ఆడించడాన్ని బట్టి వీరిలో ప్రపంచ కప్‌నకు వెళ్లేదెవరో అప్రకటితంగానే చెప్పేయొచ్చు. ఖరారు... తకరారు! టాప్–3లో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, నాలుగో నంబర్లో అంబటి రాయుడు, అతడి బ్యాకప్‌గా దినేశ్ కార్తీక్, ఐదో స్థానంలో ధోని, తర్వాత కేదార్ జాదవ్, పేస్ ఆల్ రౌండర్‌గా హార్దిక్ పాండ్యా, స్పిన్నర్లుగా చహల్, కుల్దీప్, పేసర్లుగా భువనేశ్వర్, బుమ్రా, షమీ, ఖలీల్! ఈ 14 మంది ఇంగ్లండ్ వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. 15వ ఆటగాడిగా రిషభ్ పంత్, రహానే, రాహుల్, విజయ్ శంకర్ పోటీలో ఉన్నారు. వీరిలో పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు పరిశీలనలోనే లేడని భావించిన రహానే పేరు తెరపైకి రావడం ఆశ్చర్యకరం. టెస్టుల్లో రెగ్యులర్ సభ్యుడైన అతడు ఇటీవల స్వదేశంలో ఇంగ్లండ్ లయన్స్‌తో మూడు మ్యాచ్‌ల అనధికార వన్డే సిరీస్‌లో 59, 91, 0 స్కోర్లతో ఫర్వాలేదనిపించాడు. అయినా, రహానే పేరు ప్రపంచ కప్‌నకు పరిశీలిస్తున్నారంటే అది అనూహ్యమే. ఇంగ్లండ్ వంటిచోట బహుశా అటు రిజర్వ్ ఓపెనర్‌గా, ఇటు మిడిలార్డర్లో పనికొస్తాడని భావిస్తున్నట్లున్నారు. ఫామ్ లేమికి తోడు టీవీ షో వివాదంతో రాహుల్ చేసుకున్న స్వయంకృతం కూడా రహానేకు కలిసొచ్చినట్లైంది. ప్రతిభావంతుడు కాబట్టి ఆస్ట్రేలియాతో సిరీస్ ద్వారా రాహుల్‌కు ఓ అవకాశం ఇవ్వొచ్చని సమాచారం. అతడు రాణిస్తే సరి... లేదంటే ఇక అంతే. మరోవైపు న్యూజిలాండ్‌తో టి20 సిరీస్ ద్వారా విజయ్ శంకర్ కొత్తగా తెరపైకొచ్చాడు. రెండో పేస్ ఆల్ రౌండర్ స్థానానికి బలమైన పోటీదారయ్యాడు. అయితే, శంకర్‌కు చోటివ్వాలంటే జాదవ్‌ను పక్కన పెట్టాలి. కొంతకాలంగా వన్డేల్లో ప్రతిభ చూపుతున్న అతడిని ఏ విధంగానూ తప్పించలేని పరిస్థితి. తద్వారా శంకర్ రేసు నుంచి ఔటైనట్లే. అప్పుడు పేస్ ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యాతోనే సరిపెట్టుకోవాలి. అందరూ ప్రశంసలు కురిపిస్తున్నా పంత్ వన్డే సామర్థ్యం ఇప్పటికీ అనుమానమే. టెస్టులు, టి20లకు ధోని స్థానాన్ని భర్తీ చేయగలిగినా... వన్డేలకు వచ్చేసరికి మధ్య ఓవర్లలో స్ట్రయిక్ రొటేషన్, ఫినిషింగ్ సామర్థ్యాలను పంత్ పెంచుకోవాల్సి ఉంది. ధోని ఉండగా అతడికి ఎలాగూ కీపింగ్ చేసే వీలుండదు కాబట్టి ప్రపంచ కప్‌నకు పంత్‌ను బ్యాట్స్‌మన్‌గానే తీసుకోవాలి. ఈ నేపథ్యంలో రహానే, రాహుల్‌ను కాదని తనవైపు మొగ్గుచూపితే పంత్ అదృష్టవంతుడే. -
లెక్క సరిచేసిన భారత్
ముంబై: మొదటి ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఓడిన భారత జట్టు.. రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి లెక్క సరిచేసింది. గురువారం ముంబైలో ఇంగ్లండ్ ఎలెవన్‌తో తలపడ్డ భారత 'ఎ' కుర్రాళ్లు సత్తా చాటారు. ఇంగ్లండ్ విసిరిన 282 పరుగుల లక్ష్యాన్ని కేవలం 39.4 ఓవర్లలో చేదించి తిరుగులేని విజయాన్ని నమోదు చేశారు. కెప్టెన్ రహానేతో పాటు.. సురేష్ రైనా, కొత్త కుర్రాడు రిషబ్ పంత్ రాణించారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ జట్టు ఆటగాళ్లలో బెయిర్‌స్టో(64 పరుగులు), హెల్స్(51)తో పాటు స్టోక్స్(38 పరుగులు), రషీద్(39 పరుగులు) రాణించారు. భారత బౌలర్లలో పర్వేజ్ రసూల్‌కు 3 వికెట్లు దక్కగా.. సాంగ్వన్, దిండా, నదిమ్లు రెండేసి వికెట్లతో చెలరేగారు. దీంతో ఇంగ్లండ్ 48.5 ఓవర్లలో 282 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత ఎ జట్టు.. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కున్నారు. రహానే 91 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. జాక్సన్(56 బంతుల్లో 59 పరుగులు), రిషబ్ పంత్(36 బంతుల్లో 59 పరుగులు), రైనా(45 పరుగులు) రాణించారు. దీంతో మరో పది ఓవర్లు మిగిలి ఉండగానే భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో.. రంజీ ట్రోఫీలో భీకర ప్రదర్శనతో భారత టి20 టీమ్‌లోకి ఎంపికైన పంత్ తనదైన శైలిలో దూకుడు ప్రదర్శించాడు. -
రిషభ్ పంత్‌పైనే అందరి దృష్టి!
నేడు రెండో వార్మప్ మ్యాచ్ ఇంగ్లండ్ ఎలెవన్‌తో భారత్ ‘ఎ’ పోరు బరిలో రహానే, రైనా ముంబై: సీనియర్ల వార్మప్ ముగిసిపోయింది. ఇప్పుడు ఫామ్‌లో లేని ఆటగాళ్లతో పాటు కొత్త కుర్రాళ్లు తమ సాధనకు పదును పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇంగ్లండ్ ఎలెవన్‌తో గురువారం భారత్ ‘ఎ’ జట్టు రెండో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. భారత జట్టుకు రహానే కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, టి20 టీమ్‌కు ఎంపికైన సురేశ్ రైనా కూడా తన సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నాడు. అయితే వీరికంటే కూడా అందరి చూపూ ఇప్పుడు 19 ఏళ్లు కుర్రాడు రిషభ్ పంత్‌పైనే నిలిచింది. పరిమిత ఓవర్ల క్రికెట్లో ధోనికి వారసుడిగా భావిస్తుండటంతో అతని ఆటతీరుపై ప్రత్యేక దృష్టి ఉండటం ఖాయం. మరోవైపు తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో గెలిచిన ఇంగ్లండ్ మరోసారి తమ ధాటిని ప్రదర్శించాలని పట్టుదలగా ఉంది. రహానేకు పరీక్ష... టి20 జట్టులో స్థానం కోల్పోయి కేవలం వన్డేలకే ఎంపికైన రహానే, ఈ మ్యాచ్‌లో తన సత్తాను ప్రదర్శించాల్సి ఉంది. ఇటీవల టెస్టుల్లోనూ విఫలమైన తర్వాత ఒక రకంగా సెలక్టర్ల హెచ్చరికకు గురైన ఈ ముంబై ఆటగాడు, ప్రాక్టీస్ మ్యాచ్‌లో రాణించడం ఎంతో అవసరం. మరోవైపు సురేశ్ రైనా పరిస్థితి కూడా ఇలాగే ఉంది. వన్డే జట్టులో అవకాశం దక్కించుకోలేని అతను, టి20 సిరీస్‌కు ముందు ఆడుతున్న ఈ ఏకైక మ్యాచ్‌లో చెలరేగాలని పట్టుదలగా ఉన్నాడు. అయితే ఈ మ్యాచ్‌కు ఎంపిక చేసిన జట్టులో ఒకరిద్దరు మినహా ఎక్కువ మంది యువ ఆటగాళ్లే ఉన్నారు. రంజీ ట్రోఫీలో భీకర ప్రదర్శనతో భారత టి20 టీమ్‌లోకి ఎంపికైన పంత్‌కు ఇది చక్కటి అవకాశం. నాలుగు రోజుల మ్యాచ్‌లే అయినా రంజీల్లో కూడా మెరుపు వేగంతో ఆడిన రెండు ఇన్నింగ్స్‌లు అతడి దూకుడును ప్రపంచానికి చూపించాయి. వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌గా ధోని మార్గనిర్దేశనంలో ఎదిగే అవకాశం ఉందనే ఉద్దేశంతోనే సెలక్టర్లు అతడికి చోటు కల్పించారు. తన ఆటను ప్రదర్శించేందుకు ఈ ఢిల్లీ ఆటగాడికి ఇదే సరైన వేదిక. జట్టులో ఇతర సభ్యులలో షాబాద్ నదీమ్ టీమిండియాలో స్థానాన్ని ఆశిస్తున్నాడు. ఈ రంజీ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా (56) నిలిచిన నదీమ్, ఇంగ్లండ్‌ను తన స్పిన్‌తో ఇబ్బంది పెట్టవచ్చు. దీపక్ హుడా, ఇషాన్ కిషన్వంటి కుర్రాళ్లతో పాటు టీమ్‌లో పునరాగమనాన్ని ఆశిస్తున్న వినయ్ కుమార్, అశోక్ దిండా, పర్వేజ్ రసూల్ కూడా ఈ జట్టులో ఉన్నారు. ఇంగ్లండ్ జోరుగా... మరోవైపు తొలి వార్మప్ మ్యాచ్ విజయం ఇంగ్లండ్ జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆశించినట్లుగానే టీమ్ వన్డే స్పెషలిస్ట్‌లు హేల్స్, రాయ్, బట్లర్ గత మ్యాచ్‌లో ఆకట్టుకున్నారు. ఐపీఎల్లో ఢిల్లీ తరఫున ఆడినప్పుడు ద్రవిడ్ సూచనలతో స్పిన్‌ను బాగా ఆడటం నేర్చుకున్నానని చెప్పిన బిల్లింగ్స్ కూడా భారీ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. కాబట్టి బ్యాటింగ్ పరంగా టీమ్‌కు సమస్య లేదు. అయితే వార్మప్ మ్యాచ్‌లో బౌలింగ్ పరంగా మాత్రం ఇంగ్లండ్ కాస్త తడబడింది. బాల్ వికెట్లు తీసినా... అతనితో పాటు వోక్స్, విల్లీ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఇక ప్రధాన స్పిన్నర్లు అలీ, రషీద్ కూడా రాణించాల్సి ఉంది. మొదటి మ్యాచ్ ఆడని కీలక ఆటగాడు స్టోక్స్ ఇందులో బరిలోకి దిగే అవకాశం ఉంది.