riyimbarsment
-
మెడికల్ రీయింబర్స్మెంట్ విధానం రద్దు అవశ్యం
గత సంవత్సరం నవంబర్ నెలలో తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్ తన స్వహస్తాలతో ఉద్యోగ సంఘ నాయకులకు హెల్త్‌కార్డులు అందజేసి, నగదు రహిత వైద్య చికిత్సలకు నాంది పలికారు. దాంతో ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగుల ఆనందానికి అవధు ల్లేవు. దాదాపు ఏడేళ్ల నుంచి నానుతున్న సమస్య పరిష్కారమైనదని అంతా సంతోషపడ్డారు. ఇక మెడికల్ రీయింబర్స్మెంట్ విధానం ఆ నెలాఖరువరకే అమలులో ఉంటుందని ఉత్తర్వులిచ్చారు. కానీ నెల తిరగకముందే ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగుల ఆశలు ఆవిరయ్యాయి. ఏ కార్పొరేట్ హాస్పిటల్‌కు వెళ్లినా హెల్త్‌కార్డులను అనుమతిం చలేదు. తద్వారా, ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగులలో ఆందోళన మొదలైంది. సమస్య మళ్లీ మొదటి కొచ్చింది. ప్రభుత్వం కార్పొరేట్ ఆసుపత్రుల ప్రతిని ధులతో సంప్రదింపులు మొదలుపెట్టింది. ఇంకా ఇప్పటికీ చర్చలు జరుపుతూనే ఉంది. కాని పది నెలలు గడిచినా ఫలవంతం కావడంలేదు. ఈలోగా మెడికల్ రీయింబర్స్మెంట్ సౌకర్యాన్ని మూడు సార్లు పొడిగించారు. మొదలు ఈ సంవత్సరం మార్చి నెల 30 వరకు మల్లీ జూన్ నెల 30వ తేదీ వరకు, ఆ తర్వాత వచ్చే డిసెంబర్ నెల 31వ తేదీ వరకు పొడిగించారు. తద్వారా, కార్పొరేట్ హాస్పి టల్స్‌లో నగదు రహిత వైద్య పరీక్షలు కానీ, వైద్య చికిత్సలు కాని ఎండమావిగా తయారయ్యాయి. మరీ ముఖ్యంగా రిటైర్డు ఉద్యోగులకు ఇది పెనుశా పంగా తయారైంది. వైద్య చికిత్సలకు లక్షల్లో నగదు చెల్లించలేని అశక్తత ఒకవైపు, మెడికల్ రీయింబర్స్ మెంట్ బిల్లులను వృద్ధాప్యంలో సొంతంగా తయా రుచేసి పంపడం చేతగాని దీనావస్థ మరొకవైపు వీరికి చాలా ఇబ్బందిగా పరిణమించింది. ఒకవేళ ఓర్పుతో వాటిని తయారు చేసి పంపినా, ఏళ్ల తర బడి అవి మంజూరు కాకపోవడం వలన సత్వరం చేతికి డబ్బు అందని అయోమయ స్థితిలో కొట్టుమి ట్టాడుతున్నారు. ఉదాహరణకు 2010-2011 సంవత్సరాల్లో రెండు వేర్వేరు మెడికల్ రీయింబర్స్‌మెంటు బిల్లు లను నేను పంపితే నాలుగేళ్లు గడిచినా మంజూరు కాలేదు. ఏ అధికారికి ఉత్తరం రాసినా పట్టించుకో లేదు. ఆఫీసుల చుట్టూ తిరిగే వయసూ కాదు. విసిగి వేసారి లోకాయుక్తకు, తరవాత ఆర్టీఐకి దరఖాస్తు చేయగా విద్యా శాఖాధికారులను మందలిస్తే గానీ మేల్కొనని విద్యాశాఖ ఎట్టకేలకు ఈ యేడు జనవరి 13న ఉత్తర్వులు జారీ చేసింది. ఆ డబ్బు నాచేతికి అందడానికి మరో రెండునెలల కాలం పట్టింది. ఎంతమంది రిటైర్డు ఉద్యోగులకు ఇలా రాజ్యాంగ సంస్థలను ఆశ్రయించి లబ్ధి పొందే అవకాశం ఉం టుంది? మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లుల మం జూరీ వ్యవహారం ఇంత అధ్వానంగా తయారై ఉండగా అదే విధానాన్ని రిటైర్డు ఉద్యోగులపై రుద్దు తామంటే ఎలా? పైగా సీనియర్ పౌరులకు మెడికల్ రీయింబర్స్ బిల్లులను తయారు చేయడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. దాదాపు 20 ధ్రువ పత్రాలను జత పర్చి, నాలుగైదు ప్రతులను (సెట్స్) తయారు చేసి పంపవలసి ఉంటుంది. అంటే ఐదు సెట్లలోని వంద ధ్రుపపత్రాలపై తాను సంతకం చేసి పక్కన గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేయించాలి. ఇలా వంద పత్రాలపై సంతకం చేయడానికి ఏ గెజిటెడ్ ఆఫీసరైనా ఒప్పుకుంటారా? కాబట్టి మెడికల్ రీయింబర్స్మెంట్ విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తే హెల్త్‌కార్డుల అమలు శీఘ్రతరమవుతుంది. ఔట్ పేషెంట్ల వైద్య చికిత్సలకూ, రోగుల వైద్య చికిత్స లకూ హెల్త్‌కార్డుల ద్వారా నగదు రహిత వైద్యమే అనుసరణీయం. ఉద్యోగులు, రిైటైర్డు ఉద్యోగుల వేతనాల నుంచి సముచిత ప్రీమియంలను వసూలు చేసి హెల్త్‌కార్డులను సత్వరంగా అమలులోనికి తెస్తే అభ్యంతరాలు ఉండవు. ఈ సమస్యను ఇంకా ఇంకా వాయిదాలు వేస్తూ పోతే ప్రభుత్వ చిత్తశుద్ధిపైనే అపనమ్మకం ఏర్పడుతుంది. బెంజరం భూమారెడ్డి రిటైర్డ్ హెడ్మాస్టర్, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం మాజీ అసోసియేట్ ప్రెసిడెంట్, నిజామాబాద్. మొబైల్: 99083 70720 -
అర్హులకే ‘ఫీజు’ అందేలా చర్యలు!
రీయింబర్స్‌మెంట్‌పై మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం కట్టుదిట్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులకు ఆదేశం అనర్హులను గుర్తించే విధానంపైనే కసరత్తు బయోమెట్రిక్, ఆధార్‌ను తప్పనిసరి చేయాలని యోచన 11వ తేదీన మరోసారి భేటీ.. తుది నిర్ణయాలు తీసుకునే అవకాశం సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పక్కదారి పట్టకుండా.. బోగస్ కాలేజీలు ప్రయోజనం పొందకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. అర్హులైన విద్యార్థులకు మాత్రమే లబ్ధి చేకూరేలా చూడాలని అభిప్రాయపడింది. అక్రమాలకు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన మార్గదర్శకాలను రూపొందించాలని నిశ్చితాభిప్రాయానికి వచ్చింది. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం మార్గదర్శకాలను రూపొందించేందుకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం తొలి సమావేశం బుధవారం సచివాలయంలో జరి గింది. ఈ భేటీకి విద్యా శాఖ బాధ్యతలు చూస్తున్న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు ఈటెల రాజేందర్, సి.లక్ష్మారెడ్డి, ఉన్నతాధికారులు హాజరుకాగా.. కమిటీలోని మరో మంత్రి జగదీశ్‌రెడ్డి రాలేదు. 371డీ ప్రకారమే స్థానికత.. తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సహాయం (ఫాస్ట్) పథకం రద్దయిన నేపథ్యంలో... ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌ల చెల్లింపులకు సంబంధించి ఎలాంటి పద్ధతులను అవలంబించాలనే దానిపై మంత్రివర్గ ఉప సంఘం సమావేశంలో చర్చించారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద విద్యార్థుల స్థానికతను గుర్తించేందుకు 371డీకి అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుందని... అయితే 371డీలో ఏయే అంశాల ప్రాతిపదికన దీనిని నిర్ధారించాలనే అభిప్రాయం వ్యక్తమైంది. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కొన్ని కాలేజీల యాజమాన్యాలు దుర్వినియోగం చేశాయని, విద్యార్థులు లేకపోయినా ఉన్నట్లుగా చూపి ఫీజులను పొందాయని అధికారులు సబ్ కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా వృత్తి విద్యా కాలేజీల్లో తక్కువ సంఖ్యలో ఉన్న విద్యార్థుల కోసమే 80 శాతం నిధులు ఖర్చవుతున్నాయని వారు వివరించారు. ఈ మార్గదర్శకాలను రూపొందించడంపై ఇంకా స్పష్టత రాకపోవడంతో ఈ నెల 11న మరోసారి భేటీ కావాలని.. అదే భేటీలో 371డీపైనా చర్చించాలని నిర్ణయించారు. ఇక కాలేజీల్లో బయోమెట్రిక్ విధానాన్ని తప్పనిసరిగా పాటించాలని, విద్యార్థుల ఎంపికకు సంబంధించి ఆధార్ కార్డులను తప్పనిసరి చేయాలని సంబంధిత అధికారులను మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. అన్ని కాలేజీల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు, ప్రమాణాలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కూడా సూచించింది. కాగా.. ప్రభుత్వ రంగంలోని కాలేజీలను మరింత పటిష్టం చేయాలని.. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సబ్ కమిటీ సూచించినట్లు సమాచారం. అర్హులకు న్యాయం: కడియం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కొనసాగిస్తామని, అర్హులైన పేద విద్యార్థులకు అన్యాయం జరగకూడదనేదే ప్రభుత్వ ఉద్దేశమని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మంత్రి వర్గ ఉప సం ఘం భేటీ అనంతరం పేర్కొన్నారు. పథకం మార్గదర్శకాలు, ఇతర అంశాలకు సంబంధిం చి ప్రాథమికచర్చలే జరిగాయని చెప్పారు. 11న మరోసారి భేటీ అవుతామని, అప్పటికల్లా పూర్తి వివరాలతో రావాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. 11న జరిగే భేటీలో చర్చించిన విషయాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళతామని కడియం పేర్కొన్నారు. -
‘రీయింబర్స్మెంట్’పై స్పష్టత ఎప్పుడో
ఇంకా తేలని స్థానికత వివాదం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగి ఆరు నెలలు దాటినా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై ఇంకా స్పష్టత ఇవ్వకపోవడంతో లక్ష మందికిపైగా విద్యార్థులు ఆందోళనతో కొట్టుమిట్టాడుతున్నారు. తెలంగాణలో చదువుతున్న దాదాపు 80 వేల మంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులతోపాటు ఆంధ్రా ప్రాంతంలో చదువుతున్న సుమారు 40 వేల మంది తెలంగాణ విద్యార్థులు కూడా తమకు ఈ పథకం వర్తిస్తుందా లేదా అన్నది తేలక తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. స్థానికత అంశం ముడిపడి ఉన్న ఫీజులు, స్కాలర్‌షిప్‌లపై ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు దాగుడుమూతలు ఆడుతుండటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కలవరపడుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో నివసిస్తున్న ఏపీ విద్యార్థులకు ఇది పెద్దసమస్యగానే ఉంది. ఓవైపు వార్షిక పరీక్షలు ముంచుకొస్తున్నా ఇంకా ఈ విషయంలో స్పష్టత రాకపోవడం మరోవైపు ఫీజులు చెల్లించాలంటూ యాజమాన్యాల ఒత్తిడితో విద్యార్థులు వేదన చెందుతున్నారు. జటిలంగా మారిన సమస్య: తెలంగాణలో చదువుతున్న విద్యార్థులందరికీ (స్థానికతతో సంబంధం లేకుండా) రీయింబర్స్మెంట్ చేసిన పక్షంలో తెలంగాణ ప్రభుత్వానికి కొన్ని వందల కోట్ల భారం పడనుంది. అదే సమయంలో ఏపీలో చదువుతున్న తెలంగాణ విద్యార్థులకు ఆ ప్రభుత్వం కొన్ని పదుల కోట్ల మేర చెల్లించాలి. ఆర్థికభారం పెరుగుతుందన్న కారణంతో రెండు ప్రభుత్వాలు ముందుగా ఎవరు నిర్ణయం తీసుకుంటారోనని వేచి చూస్తూ విద్యార్థులతో దోబూచులాడుతున్నాయి. తెలంగాణకే చెందిన వారిగా (స్థానికులుగా) ధ్రువీకరణ పత్రాలు తెచ్చుకునే విద్యార్థులకు ‘ఫాస్ట్’ను వర్తింపజేస్తామంటూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించగా హైదరాబాద్, రంగారెడ్డి పరిసర జిల్లాల్లో ఉంటున్న ఏపీ విద్యార్థులకు ఈ సర్టిఫికెట్లను ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరిస్తున్నారు. ఎమ్మార్వోలు నేటివిటీ సర్టిఫికెట్లకు బదులు ఫలానా ఇంట్లో నివసిస్తున్నారని మాత్రమే పత్రాలు ఇస్తున్నారు. -
చదువులకు ఆటంకం కలిగించొద్దు: ఆర్.కృష్ణయ్య
విజయనగర్‌కాలనీ: బీసీ కులాలకు చెందిన విద్యార్థులు ఉన్నత చదువులు చదవకుండా అడ్డంకులు సృష్టించడం తగదని, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. పూర్తి ఫీజులతో రీయింబర్స్మెంట్ పథకం కొనసాగించకుంటే ప్రభుత్వంపై ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. ఫీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చే స్తూ తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మాసబ్‌ట్యాంక్‌లోని బీసీ సంక్షేమ భవన్‌ను ముట్టడించారు. తెలంగాణ జిల్లాల నుంచి వేలాదిగా విద్యార్థులు తరలివచ్చిన ఈ కార్యక్రమంలో ఆర్.కృష్ణయ్య తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బీసీ విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించకుండా చదువులకు ఆటంకం సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. కావాలనే ప్రభుత్వం 170 ఇంజినీరింగ్ కళాశాలల గుర్తింపు రద్దు చేసి బీసీ యువకుల చదువుకు ఆటంకాలు కల్పించిందన్నారు. ఈ విషయంపై బీసీ మంత్రులు, ప్రతిపక్ష నాయకులు నోరెత్తడం లేదని ఆయన అన్నారు. బీసీ సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, కాలేజి విద్యార్థుల స్కాలర్‌షిప్‌లకు, ఫీజుల రీయంబర్స్మెంట్ విధించిన గరిష్ట ఆదాయ పరిమితిని రెండు లక్షలకు పెంచాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. అనంతరం నాయకులు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ అలోక్ కుమార్‌కు అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు ర్యాగ రమేష్, జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, బీసీ విద్యార్థి సంఘం నాయకులు విక్రమ్‌గౌడ్, ఎన్.వెంకటేష్, వంశీ, శివాజీ, గొరిగె మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
అంతా పాస్ పేరుతో..ఫీజుల మాయ
వైద్య, యంత్ర విద్య తర్వాత అంతటి ప్రాధాన్యమున్న కోర్సులు ఎంబీఏ, ఎంసీఏ. అయితే నానాటికీ వృత్తి విద్య ప్రమాణాలు తీసికట్టుగా మారుతున్నాయి. జిల్లాలో కొన్ని కళాశాలల యాజమాన్యాలు ఎంబీఏ కోర్సును కొత్త తరహా వ్యాపారంగా నిర్వహిస్తూ, విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నాయి. తరగతులకు రాకున్నా పర్వాలేదు.. పాస్ గ్యారెంటీ అంటూ హామీలు గుప్పిస్తున్నాయి. ఇదంతా విద్యార్థులపై ప్రేమతో కాదు.. రీయింబర్స్మెంట్ మొత్తం తమ ఖాతాలో వేసుకునేందుకేనన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పైగా ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌లో కొన్ని కాలేజీల్లో సీట్లు భర్తీ కాకపోవడంతో ఎంబీఏపై అలాంటి ప్రభావం లేకుండా కొత్త వ్యూహంతో ముందుకెళుతున్నాయి. సాక్షి, చిత్తూరు: జిల్లాలో సుమారు 27 ఎంబీఏ కాలేజీలు ఉన్నాయి. వీటిలో ఒక్కో కాలేజీలో 60-240 సీట్ల వరకు భర్తీ చేసుకునేందుకు ఏఐసీటీఈ అనుమతిస్తోంది. ఎంబీఏ.. రెండేళ్లు, ఎంసీఏ మూడేళ్ల కాలపరిమితిలో కోర్సు పూర్తవుతుంది. ఈ కళాశాలల్లో 10 వేలమంది వరకూ చదువుతున్నారు. వీరికి ప్రభుత్వం ఏటా ఒక్కో విద్యార్థికి 27 వేల రూపాయలు ఫీజు వాపసు కింద చెల్లిస్తోంది. జిల్లా మొత్తం సుమారు రూ.27 కోట్ల వరకు ఉంటుంది. ఇవి కాక యాజమాన్య కోటా కింద అనుమతిచ్చిన సీట్లలో 25 శాతం నేరుగా చేర్చుకునే అవకాశం ఉంది. అక్కడ వసూళ్లు అదనం. అనుమతి ఒక చోట.. నిర్వహణ మరో చోట ఎంబీఏ, ఎంసీఏ కళాశాలలు ఎక్కువగా అనుమతి లేని చోట నడుస్తున్నాయి. రెండున్నర ఎకరా స్థలంలో భవన సదుపాయాలుంటేనే అనుమతి వస్తుంది. పట్టణ శివార్లలో కొనసాగుతున్న కళాశాలలకు ఆ మేరకు స్థలాలున్నాయి. వీటికి అనుమతులున్నాయి. పట్టణాల్లోని ఉన్నవాటిల్లో చాలా వాటికి అనుమతుల్లేవు. ఇరుకు గదుల్లోనే తరగతులు కొనసాగిస్తున్నారు. కొన్నిచోట్ల ఇంజినీరింగ్ కళాశాలల గదుల్లోనే ఎంబీఏ తరగుతులు నిర్వహిస్తున్నారు. కోర్సులో చేరే విద్యార్థుల నుంచి ముందుగా యాజమాన్యాలు బిల్డింగ్ ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇదేమని అడిగితే ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు వస్తే వాటిని ఇస్తామంటూ చెబుతున్నాయి. తీరా ఫీజు వచ్చాక ఆ నగదు చెల్లింపులు చేయడం లేదు. నైపుణ్యం లేని అధ్యాపకులు వృత్తి విద్యాకోర్సులు నిర్వహిస్తున్న కళాశాలల్లో అనుభవం, నైపుణ్యం లేని అధ్యాపకులే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. 60 సీట్లున్న కళాశాలలో ఒక ప్రొఫెసర్, 12 మంది వరకూ ఫ్యాకల్టీ అధ్యాపకులు ఉండాలి. ఎంబీఏ పూర్తి చేసిన వారికి అధ్యాపకులుగా ప్రాధాన్యమివ్వాలి. కానీ పీజీ చేసిన వారిని ఎక్కువగా ఫ్యాకల్టీగా తీసుకుంటున్నారు. తక్కువ చదువుకున్న వారితో నిర్వహిస్తే ఎక్కువ జీతం చెల్లించాల్సిన అవసరం లేదన్న వక్రమార్గంలో కొన్ని యాజమాన్యాలు వెళుతున్నాయి. మరికొన్ని కళాశాలలైతే అధ్యాపకుల ఏటీఎంలను తమ వద్దే ఉంచుకుంటున్నాయి. ఎక్కువ జీతాలు ఖాతాలో వేసినట్లు రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. వాస్తవానికి అధ్యాపకుడి బ్యాంకు ఖాతాలో 50-70 వేల రూపాయల వరకూ వేస్తూ వెంటనే ఆ మొత్తాన్ని కళాశాలలే డ్రా చేసుకుంటున్నాయి. అధ్యాపకుని చేతిలో తక్కువగా 10-20వేల రూపాయలు పెడుతున్నారు. నిబంధనల మేరకు అధ్యాపకులకు జీతాలు ఇవ్వడం లేదు. ల్యాబ్ అసిస్టెంట్లను నియమించడం లేదు. ఈ విషయాలన్నీ అధ్యాపకులు ఁసాక్షి*తో చెప్పి బోరుమంటున్నారు. శ్రమదోపిడీ చేయించుకుంటున్నారని యాజమాన్యాలపై విరుచుకుపడుతున్నారు. హాజరు లేకున్నా.. విద్యార్థులకు 75 శాతం హాజరు ఉంటే పరీక్షలకు అనుమతి ఉంటుంది. చాలావరకు కళాశాలల్లో ఈ పద్ధతి అమలు కావడం లేదు. విద్యార్థులు వచ్చినా రాకున్నా యాజమాన్యాలు హాజరు వేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కళాశాలల్లో అధ్యాపకుల కొరత, గదుల కొరత కారణంగా యాజమన్యాలు విద్యార్థుల హాజరు మినహాయింపు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఁమీ కెందుకు మేం పాస్ చేయిస్తాం* అని హామీ ఇస్తున్నారు. దీంతో విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టడం లేదు. ఈ రకంగా కళాశాలలే విద్యార్థులను పెడద్రోవ పటిస్తున్నాయనే విమర్శలున్నాయి. మార్కులు మేమేస్తాం ఈ కోర్సులు చదివే విద్యార్థులకు ఆయా కళాశాలలే ప్రయోగాలు నిర్వహిస్తాయి. ప్రాజెక్టు వర్కులుంటాయి. వీటికి 30 శాతం మార్కులుంటాయి. విద్యార్థి సామర్థ్యం, ప్రతిభతో పని లేకుండా ఈ మార్కులు వేస్తున్నారు. విద్యార్థులు ఉత్తీర్ణలయ్యేందుకు ఇవి చాలా వరకు దోహదపడుతున్నాయి. తరగతులకు హాజరైనా, కాకున్నా ఉత్తీర్ణత మాత్రం ఖాయమన్న నమ్మకంతో విద్యార్థులు విజ్ఞానాన్ని గాలికి వదిలేస్తున్నారు. 70 మార్కులకు వార్షిక పరీక్షలుంటాయి. వీటిల్లో కొంతమేర మార్కులు తెచ్చుకున్నా ఉత్తీర్ణత సాధించడం పెద్ద సమస్య కాదు. దాంతో విద్యార్థులు కళాశాలలకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. ఐసెట్ ఉత్తీర్ణులారా జాగ్రత్త!: త్వరలో ఐసెట్ ఫలితాలు వెలువడనున్నాయి. పరీక్షలు రాసిన విద్యార్థుల అడ్రస్‌లతో ఇప్పటి నుంచే యాజమాన్యాలు అడ్మిషన్ల వేట సాగిస్తున్నాయి. కేవలం డిగ్రీ కావాలంటే ఏదో ఒక కళాశాలలో చేరిపోవచ్చని, ప్రమాణాలతో కూడిన విద్యా కావాలంటే జాగ్రత్తగా విచారించుకునిమంచి కాలేజీని ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అర్హతగల అధ్యాపకులున్నారో లేదో అన్ని రకాలుగా విచారించుకుంటే మంచిదని స్పష్టం చేస్తున్నారు.