RJD MP
-
దోచుకోవడానికే రాజకీయాల్లోకి.. వైరల్ వీడియో
పాట్నా: ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజకీయల్లో డబ్బులు ఎలా సంపాదిస్తారో చెప్పినందుకు, కొత్తగా ఎన్నికైన ఆర్జేడీ ఎంపీకి హ్యాట్స్ ఆప్ అంటూ ఒక మెసేజ్‌తో పాటు అతను మాట్లాడిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే బిహార్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొందిన ఆర్జేడీ ఎంపీ మాట్లాడిందిగా చెప్పబడ్డ ఆ వీడియో ఫేక్ అని తేలిపోయింది. వీడియోలో ఉన్న వ్యక్తి ఏమన్నారంటే.. ‘నేను రాజకీయల్లోకి డబ్బు సంపాదించడానికే వచ్చాను, నా దృష్టి అంత ఎలా దోచుకోవాలన్న దానిపైనే ఉంది. ఇతర ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏవిధంగా డబ్బు సంపాదిస్తున్నారో నేను అలాగే సంపాదిస్తా. ఏం చేస్తే డబ్బులోస్తాయో నాకు తెలియదు కానీ అధికారులున్నారుగా చెప్పడానికి, అయినా ప్రతి ప్రాజెక్టులో 25 శాతం వస్తాయని విన్నాను. దేశంలోని 125 కోట్ల మంది ప్రజలను ఫూల్స్ చేస్తూ ఓ వ్యక్తి ప్రధానమంత్రి అయినప్పుడు నేను చేయలేనా’ అని అన్నారు. అయితే ఈ వీడియో ఆర్జేడీ ఎంపీది కాదని.. అసలు ఆ వీడియోలో ఉన్న వ్యక్తి తమ పార్టీకి చెందిన వ్యక్తి కాదని, అసలు బిహార్ కు సంబంధించిన వ్యక్తే కాదని ఆర్జేడీ పార్టీ పేర్కొంది. ఇంతకీ అందులో ఉన్న వ్యక్తి ఎవరంటే.. 2017 ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో ఆగ్రా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వ్యక్తి గోపాల్ చౌదరీ అని తేలింది. -
దోచుకొవడానికే రాజకీయల్లోకి వచ్చా
-
షాబుద్దీన్ నేరస్తుడు కాదు సంఘసేవకుడు
పట్నా: జంట హత్యల కేసులో యావజ్జీవ కారాగారశిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ మాజీ ఎంపీ మహ్మద్ షాబుద్దీన్ క్రిమినల్ కాదట. సంఘసేవకుడట. ఈ మాటలన్నది కోర్టు కాదు.. ఆర్జేడీ యువజన విభాగం అధ్యక్షుడు, ఎంపీ శైలేష్ కుమార్ అలియాస్ బులో మండల్. షాబుద్దీన్ ఇటీవల బెయిల్‌పై విడుదల అయినందుకు వస్తున్న విమర్శలపై ఆయన స్పందించారు. శివాన్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి షాబుద్దీన్ నాలుగుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారని, నేరస్తుడు కాదని శైలేష్ చెప్పారు. 'శివాన్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా షాబుద్దీన్‌కు పాపులారిటి ఉంది. రెండుసార్లు ఎమ్మెల్యేగా, నాలుగుసార్లు ఎంపీగా ప్రజలు ఆయన్ను ఎన్నుకున్నారు' అని అన్నారు. షాబుద్దీన్ విడుదలపై బీజేపీ, మీడియా అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు. షాబుద్దీన్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందని, ఇది ప్రభుత్వ నిర్ణయంకాదని అన్నారు. గతంలో 300 మందిని హత్య చేసిన కేసులో రణవీర్ సేన చీఫ్ బ్రహ్మేశ్వర్ సింగ్ ముఖియాకు ఇదే కోర్టు బెయిల్ ఇచ్చిందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు ఆర్జేడీ-జేడీయూ ప్రభుత్వాన్ని నిందించడం తగదని శైలేష్ చెప్పారు. -
డాక్టర్లు దెయ్యాలు
ఆర్జేడీ ఎంపీ పప్పుయాదవ్ వ్యాఖ్య పాట్నా: వైద్యులపై ఆర్జేడీ ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పూ యాదవ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైద్యుల్లో నిజాయితీగా పనిచేసే 10 నుంచి 15 శాతం మందిని మినహాయిస్తే... మిగిలిన వారందరినీ తలారులు, తాజా మాంసాన్ని తినే దెయ్యాలుగా పేర్కొన్నారు. వారు పూర్తిగా అవినీతిలో మునిగిపోయారని, దళారులుగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల పొట్టలను కోస్తూ డబ్బులు గడిస్తున్నారని మండిపడ్డారు. వారికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని అక్టోబర్ 13న సహస్ర నుంచి మొదలు పెడుతున్నట్లు ఆదివారమిక్కడ తెలిపారు. వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీహార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైద్యులు ప్రైవేటుగా వైద్యసేవలు అందించడాన్ని నిషేధించాలన్నారు.రోగుల సంక్షేమం కోసం నూతన నర్సింగ్ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. పప్పూ యాదవ్ వైద్యులకు వ్యతిరేకంగా మాట్లాడడం ఇదే మొదటిసారి కాదు. వైద్యుల అర్హతల ఆధారంగా వారి ఫీజును రూ.100 నుంచి రూ.300 మధ్య ప్రభుత్వమే నిర్ణయించాలని ఆయన గతంలో డిమాండ్ చేశారు.