robert vaadra
-
‘ప్రియాంక గాంధీ కాంగ్రెస్‌కు రెబల్‌గా మారనుంది’
లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్‌లోని రెండు కాంగ్రెస్ కంచుకోట స్థానాలైన ఆమేథీ, రాయ్‌బరేలీలో అభ్యర్థులను శుక్రవారం ప్రకటించటంతో సస్పెన్షన్ వీడింది. ఆమేథీలో కిషోరీ లాల్ శర్మ, రాయ్ బరేలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని పార్టీ అధిష్టానం బరిలోకి దించటంతో వారు నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఆమేథీ స్థానం విషయంలో బీజేపీ.. రాహుల్ గాంధీ క్యాంప్‌పై తీవ్ర విమర్శలు చేస్తోంది. రాహుల్ గాంధీ క్యాంప్.. ప్రియాంకా గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రాలను కావాలనే కాంగ్రెస్ పార్టీకి దూరం చేసిందని బీజేపీ ఆరోపణలు చేస్తోంది.‘ఆమేథీలో ఎంతో ప్రజాదరణ ఉన్న రాబర్ట్ వాద్రాను ఆ స్థానం నుంచి కావాలనే పక్కకు తప్పించారు. ఇది ఖచ్చితంగా రాహుల్ గాంధీ క్యాంప్ చేసిన పనే. తర్వలో ప్రియాంకా గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా కాంగ్రెస్ నాయకత్వానికి రెబల్‌గా మారుతారు’ అని బీజేపీ నేత అమిత్ మాల్వియా ‘ఎక్స్’ వేదికగా అన్నారు.Sapre a moment for Robert Vadra, who, despite claiming immense popularity in Amethi, was overlooked for the seat. It is obvious that Rahul Gandhi camp is systematically marginalising both, Priyanka Vadra and her husband, in the Congress. How soon before the sister rebels?— Amit Malviya (मोदी का परिवार) (@amitmalviya) May 4, 2024ఇటీవల రాబర్ట్ వాద్రా తనకు ఆమేథీలో ప్రజాధారణ ఉందని పేర్కొన్నారు. అదీ కాక.. తాను క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని దేశంలో కోరుకుంటోందని తెలిపారు. తాను మార్పు తీసుకురాగలనని కాంగ్రెస్ భావిస్తే.. రాజకీయాల్లోకి వస్తాను. తాను ఆమేథీలోనే పోటీ చేయాలని లేదు.. మొరాదాబాద్, హర్యానాలో కూడా పోటీ చేస్తానన్నారు. ఇక.. రాబర్ట్ వాద్రా వ్యాఖ్యలతో ఆయన కాంగ్రెస్ కంచుకోట స్థానమైన ఆమేథీ సీటు ఆశించినట్లు పరోక్షంగా వెల్లడి అయింది.మూడు పర్యాయాలు రాహుల్‌గాంధీ ఆమేథీ స్థానంలో అనూహ్యంగా 2019లో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే మరో నియోజకవర్గంలో కేరళలోని వాయ్‌నాడ్‌లో గెలుపొందిన విషయం తెలిసిందే. 2019లో రాయ్‌బరేలీలో విజయం సాధించిన సోనియా గాంధీ రాజ్యసభకు ఎంపిక కావటంతో ఆ స్థానంలో అనేక సంప్రదింపుల అనంతరం రాహుల్ గాంధీ బరిలోకి దిగారు. -
అమేథీలో రాహుల్ నామినేషన్
అమేథీ (ఉత్తరప్రదేశ్): కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం అమేథీ లోక్‌సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన భారీ రోడ్‌షోలో సోదరి ప్రియాంక గాంధీ వాద్రా, ఆమె భర్త రాబర్ట్ వాద్రా, వారి ఇద్దరు పిల్లలు, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జ్యోతిరాదిత్య సింథియా రాహుల్ వెంట ఉన్నారు. దాదాపు మూడు కిలోమీటర్ల మేర సాగిన ఈ రోడ్‌షోలో తల్లి సోనియాగాంధీ పాల్గొనలేదు. అనంతరం అమేథీ కలెక్టరేట్లో నామినేషన్ పత్రాల దాఖలు సమయంలో తనయుడు రాహుల్ వెంట ఆమె ఉన్నారు. నామినేషన్ సందర్భంగా అమేథీ పట్టణం కాంగ్రెస్ జెండాలు, బ్యానర్లు, రాహుల్, ప్రియాంక కటౌట్లతో నిండిపోయింది. ఎండను సైతం లేక్కచేయని కార్యకర్తలు అమేథీలో రాహుల్, ఆయన కుటుంబసభ్యులకు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. రహదారికి రెండు వైపులా ఎదురు చూస్తున్న అభిమానులకు రాహుల్ అభివాదం చేసుకుంటూ ముందుకు సాగగా అభిమానులు ఓపెన్ టాప్ వాహనంలో ఉన్న రాహుల్ తదితరులపై పూలవర్షం కురిపించారు. అమేథీ మాకు పవిత్ర భూమి అమేథీ నియోజకవర్గం తమ తండ్రి(రాజీవ్‌గాంధీ) కర్మభూమి, తమ కుటుంబానికి పవిత్రమైన చోటు అని ప్రియాంక గాంధీ వాద్రా పేర్కొన్నారు. రాహుల్ నామినేషన్ అనంతరం ఆమె ట్విట్టర్లో..‘ కొన్ని అనుబంధాలు హృదయపూర్వకమైనవి. మా సోదరుని నామినేషన్ దాఖలు సందర్భంగా మా కుటుంబం మొత్తం హాజరయింది. ఇది మా తండ్రి కర్మభూమి, మాకు పవిత్రమైన ప్రాంతం’ అని తెలిపారు. అమేథీలో ద్విముఖ పోరు ఎస్పీ–బీఎస్పీ–ఆర్ఎల్డీ కూటమి అమేథీలో తమ అభ్యర్థిని నిలపకపోవడంతో రాహుల్‌కు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మధ్యనే ప్రధాన పోటీ ఉండనుంది. అమేథీతోపాటు కేరళలోని వయనాడ్ నుంచి రాహుల్ బరిలోఉన్నారు. బీజేపీ తరఫున స్మృతి ఇరానీ గురువారం నామినేషన్ వేయనున్నారు. పొరుగునే ఉన్న రాయ్‌బరేలీ సీటుకు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గురువారం నామినేషన్ వేయనున్నారు. -
బెంగళూరులో వాద్రా భూప్రకంపనలు!
రూ.850 కోట్ల విలువైన 60 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా అందులో డీఎల్ఎఫ్ అపార్ట్మెంటు: బీజేపీ నేతల ఆరోపణ ఆధారాల విడుదల బనశంకరి (బెంగళూరు): ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా భారీ భూ కుంభకోణానికి పాల్పడినట్లు బెంగళూరు బీజేపీ నేతలు ఆరోపించారు. నగరంలోని బన్నేరుఘట్టరోడ్డులోని బేగూరు గ్రామంలో రూ.850 కోట్లకు పైగా విలువైన 60.04 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని నగర బీజేపీ అధికార ప్రతినిధి ఎన్ఆర్.రమేశ్ చెప్పారు. శనివారం బెంగళూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 2,350 పేజీలతో కూడిన ఆధారాలను ఆయన విడుదల చేశారు. 2004లో మన్మోహన్సింగ్ ప్రభుత్వం వచ్చాక కర్ణాటక- తమిళనాడు సరిహద్దుల్లోని ఈ అటవీప్రాంతాన్ని కబ్జా చేశారన్నారు. దీనిలో డీఎల్ఎఫ్ సంస్థ భారీ అపార్ట్‌మెంట్‌ను నిర్మించిందన్నారు. అటవీ ప్రదేశం, శ్మశానం, గుట్టలతో కూడిన ప్రభుత్వభూమిని రాబర్ట్‌వాద్రా, డిఎల్ఎఫ్ వెస్టెండ్ హైట్స్ అపార్టుమెంట్ల నిర్మాణం కోసం కబ్జాకు పాల్పడ్డారని ఎన్ఆర్.రమేశ్ ఆరోపించారు. మెసర్స్ ఎనేబుల్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఈ భూములను కొందరు కాంగ్రెస్ నాయకులు కొనుగోలు చేసినట్లుగా తప్పుడు రికార్డులు సృష్టించారన్నారు. ఈ వ్యవహారంలో అనేక నకిలీ పట్టాలు, రవిచంద్ర, కిరణ్ ఇతర కాంగ్రెస్ నేతల పేరుతో నకిలీ మ్యుటేషన్లను తయారుచేశారన్నారు. అన్నీ అక్రమ అనుమతులే 18 అంతస్తులతో కూడిన భారీ అపార్టుమెంటును, 2345 కార్లు పార్కింగ్ సామర్థ్యంతో నిర్మించారని రమేష్ చెప్పారు. బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ (బీడీఏ) ఈ భూముల సర్వే చేపట్టకుండానే ఈ ప్లాన్‌కు ఆమోదం మంజూరు చేసిందని దుయ్యబట్టారు. 40కి పైగా సర్వే నెంబర్లు, 100కి పైగా వ్యవసాయదారుల పేర్లతో ఉన్న 60.04 భూములకు అక్రమంగా ఖాతా పొందారన్నారు. రెండు స్థలాల మధ్య ఇతరుల స్థలాలు ఉంటే విలీనానికి అవకాశం లేకపోయినా ఇక్కడ మాత్రం అలా చేశారన్నారు. భూమిని కొనాలంటే రైతుల వంశవృక్ష ధ్రువీకరణ పత్రం తీసుకుని అందులో కుటుంబంలో అందరి నుంచి ఎన్ఓసీ తీసుకోవలసి ఉంటుందని, దానిని కూడా పాటించలేదని ఆరోపించారు. దీనిపై గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదన్నారు. ఈ భూములపై కోర్టులో కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఖాతాలు మంజూరు చేశారని విమర్శించారు. అపార్టుమెంటు కోసం బేగూరు చెరువు నుంచి హుళిమావు చెరువుకు అనుసంధానంగా ఉన్న రాజకాలువను కూడా మూసివేశారని తెలిపారు. దీనిపై నగర జిల్లా కలెక్టర్ శంకర్‌కు, ఏసీబీకి, వాద్రా- డీఎల్ఎఫ్ కుంభకోణాలపై విచారణ చేపడుతున్న ఈడీకి పూర్తి ఆధారాలను అందజేయడం జరిగిందని రమేశ్ తెలిపారు. సోమవారం ఆ భూములను పరిశీలిస్తానని కలెక్టర్ శంకర్ హామీ ఇచ్చారన్నారు. రాబర్ట్‌వాద్రా భూ కుంభకోణంపై సీబీఐ లేదా సీఐడి విచారణకు ఆదేశించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను డిమాండ్ చేశారు.