ROFR
-
గిరిజనులకు భూమి పట్టాల పంపిణీలో ఏపీ ఆదర్శం
సాక్షి, అమరావతి: అర్హత కలిగిన గిరిజనులందరికీ అటవీ హక్కుల చట్టం (ఆర్ఓఎఫ్ఆర్) పథకం ద్వారా భూమి పట్టాలను అందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విధానం అన్ని రాష్ట్రాలకు ఆదర్శప్రాయమని తెలంగాణ అధికారుల బృందం ప్రశంసించింది. గిరిజనులకు భూమి పట్టాల పంపిణీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొంది. ఏపీలో ఆర్ఓఎఫ్ఆర్ పథకం అమలు అవుతున్న తీరుపై తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని ఆ రాష్ట్ర అధికారులు స్పష్టం చేశారు. తెలంగాణలో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను పంపిణీ చేయడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పట్టాలను ఏ విధంగా పంపిణీ చేశారనే విషయమై అధ్యయనం చేసేందుకు ఆ రాష్ట్ర అధికారుల బృందం శనివారం ఏపీకి వచ్చింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ అధికారులు దిలీప్ కుమార్, ప్రవీణ్‌కుమార్, టి,మహేష్, టి.శ్రీనివాసరావు వెలగపూడి సచివాలయంలో ఏపీ గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ పి.రంజిత్ బాషాతో సమావేశమయ్యారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను పంపిణీ చేయడానికి అనుసరించిన విధానాలను అడిగి తెలుసుకున్నారు. అటవీ హక్కుల పట్టాలను మంజూరు చేసే చట్టాలలో ఉన్న సమస్యలపై సందేహాలను నివృత్తి చేసుకున్నారు. 2.29 లక్షల ఎకరాలు పంపిణీ రాష్ట్రంలో అర్హత కలిగిన గిరిజనులందరికీ ఆర్ఓఎఫ్ఆర్ పథకం ద్వారా అటవీ భూములకు పట్టాలు అందిస్తామని ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేశారని రంజిత్ బాషా తెలంగాణ అధికారులకు వివరించారు. గతేడాది అక్టోబర్ 2న ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల పంపిణీని ప్రారంభించారన్నారు. రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ ఇవ్వనంత భారీగా ఇప్పటి వరకూ 2.29 లక్షల ఎకరాల భూమి పట్టాలను గిరిజనులకు అందించారని చెప్పారు. రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి గిరిజన కుటుంబానికి ఆర్ఓఎఫ్ఆర్ పథకం కింద కనీసం 2 ఎకరాల భూమికి పట్టాలను అందించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారన్నారు. అటవీ భూములలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులందరికీ ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను అందించామని తెలిపారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే.. అటవీ భూములు కాకపోతే తిరస్కరించే వారు ► గిరిజనులు పోడు వ్యవసాయం చేసుకుంటున్న భూములు అటవీ శాఖకు చెందినవి అయితేనే గతంలో వారికి పట్టాలు ఇచ్చే వారు. అటవీ భూములు కాకపోతే దరఖాస్తులు తిరస్కరించే వారు. ఈసారి అలా కాకుండా గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములు అటవీ శాఖకు చెందని రెవెన్యూ భూములైతే వాటికి డీకేటీ పట్టాలను అందించాలని సీఎం ఆదేశించారు. ► ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలతో పాటుగా డీకేటీ పట్టాలను కూడా గిరిజనులకు అందించాం. ఇప్పటి వరకు 2,28,334 ఎకరాల భూమిని 1.24 లక్షల మంది గిరిజనులకు పట్టాలుగా ఇచ్చాం. 26 వేల మంది గిరిజనులకు 39 వేల ఎకరాల రెవెన్యూ భూమిని డీకేటీ పట్టాలుగా అందించాం. ► ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. మరింత మంది గిరిజనులకు భూమి పట్టాలను అందించనున్నాం. పట్టాలు మంజూరు చేసిన భూములలో సరిహద్దు రాళ్లను నాటడంతో పాటు ఉపాధి హామీ పథకం ద్వారా ఆ భూముల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం. ► గిరిజనులకు సంబంధించిన భూమి వివరాలు.. ఇతర సంక్షేమ పథకాల ద్వారా వారు పొందుతున్న ప్రయోజనాలను సమీక్షించడానికి ‘గిరిభూమి’ పోర్టల్‌ను అభివృద్ధి చేస్తున్నాం. -
అడవిని హత్తుకున్న సంక్షేమం!
సాక్షి, అమరావతి: మారుమూల గిరిజన ప్రాంతంలో నివసించే బిడ్డిక అన్నాజీరావు గతంలో ప్రభుత్వ పథకం పొందాలంటే వ్యయ ప్రయాసలకు ఓర్చి 40 కి.మీ. వెళ్లి ధ్రువీకరణ పత్రాలు తెచ్చుకోవాల్సిందే. సచివాలయాల వ్యవస్థ ఏర్పాటుతో ఇప్పుడా దుస్థితి తప్పింది. ఒక్క వంతెన నిర్మాణంతో దాదాపు 160 గిరిజన గూడేలకు రహదారి అందుబాటులోకి వచ్చిందని సాలూరు మండలం మావుడి గ్రామ సర్పంచ్ పీడిక సుదర్శనదొర సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రం, నూతన పీహెచ్‌సీల ఏర్పాటుతో తమ గూడెం అభివృద్ధి వైపు పరుగులు తీస్తోందన్న సంతృప్తి కొట్టాలచెర్వు చెంచుగూడేనికి చెందిన పులిచర్ల ఈళ్లయ్య కళ్లలో కనిపిస్తోంది. తన కాఫీ తోటకు ఇన్నేళ్లకు ఆర్వోఎఫ్ఆర్ కింద భూమి పట్టా ఇచ్చారని పాడేరు మండలం కోట్లగరువు గ్రామానికి చెందిన ఒంటరి మహిళ, గిరిజనురాలైన జన్ని రాజులమ్మ కృతజ్ఞతలు తెలియచేస్తోంది. ఒక్క విజయనగరం, విశాఖ జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా గిరిజన ఏజెన్సీలన్నిటిలోనూ పట్టణాలకు ధీటుగా ఆదివాసీలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. 2019 జూన్ నుంచి ఈ ఏడాది మే వరకు రెండేళ్లలో గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం ఏకంగా రూ.14,658 కోట్లు ఖర్చు చేయడంతో వాటి ఫలితాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని 9 సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)ల పరిధిలో 16,068 గిరిజన జనావాసాలున్నాయి. పలు నగదు బదిలీ పథకాల ద్వారా 29.71 లక్షల మంది గిరిజనుల ఖాతాల్లోకి రూ.4,915 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం నేరుగా జమ చేసింది. నగదేతర బదిలీ పథకాల ద్వారా 17.11 లక్షల మందికి రూ.1,731 కోట్ల మేర లబ్ధి చేకూర్చింది. మొత్తం రూ.6,646 కోట్ల మేర ప్రయోజనం కలిగింది. గిరిజన ఉప ప్రణాళిక ద్వారా రూ.8,012 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టడం గమనార్హం. గిరిజనోద్ధరణలో ప్రధానమైవి... గిరిజన ప్రాంతాల్లో వైద్య సదుపాయాలను మెరుగుపరిచేందుకు వైద్య కళాశాలల నిర్మాణంతోపాటు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటుకు ప్రభుత్వం రూ.746 కోట్లు మంజూరు చేసింది. గిరిజనుల పాలిట శాపంగా మారిన డోలీల సమస్యకు శాశ్వత పరిష్కారంగా బైక్ అంబులెన్సులు తెస్తోంది. 2,652 మంది గిరిజన కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు (సీహెచ్‌డబ్ల్యూ) కేవలం రూ.400 మాత్రమే ఉన్న జీతాన్ని ఏకంగా రూ.4 వేలకు పెంచింది. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఎస్సీ, ఎస్టీలకు కలిపి ఒకే కమిషన్ ఉండటంతో పూర్తి న్యాయం జరగడంలేదని గుర్తించి ప్రత్యేకంగా ఎస్టీ కమిషన్‌ను ఏర్పాటు చేసి ఛైర్మన్‌గా కుంబా రవిబాబును నియమించింది. గిరిజన రైతులకు భూ యాజమాన్య హక్కులను కల్పించేందుకు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ (ఆర్వోఎఫ్ఆర్) ద్వారా 2.28 లక్షల ఎకరాలకు పట్టాలను పంపిణీ చేసి చరిత్ర సృష్టించింది. 165 కొత్త గిరిజన పంచాయతీలను ఏర్పాటు చేసి ప్రజాప్రతినిధులుగా వారే ఎన్నికయ్యేలా రిజర్వ్ చేస్తూ జీవో నెంబర్ 560 తెచ్చింది. 4,76,206 గిరిజనుల కుటుంబాలకు గృహావసరాలకు ఉచిత విద్యుత్ అందిస్తూ జీవో నెంబర్ 94 జారీ చేసింది. సాంకేతిక విద్యను అందుబాటులోకి తెస్తూ కురుపాంలో రూ.153 కోట్లతో ట్రైబల్ ఇంజనీరింగ్ కళాశాలకు శంకుస్థాపన జరిగింది. విశాఖలో ట్రైబల్ రీసెర్చ్ మిషన్ భవనం కరోనా కష్టకాలంలో గిరిజనులకు అండగా నిలిచిన జీసీసీకి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇటీవల 5 అవార్డులను ప్రకటించింది. రెండేళ్లలో రూ.450 కోట్లతో విద్యా సంస్థల భవనాలు, గిరిజన ప్రాంతాల్లో రహదారులు నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. విశాఖ జిల్లా తాజంగిలో రూ.35 కోట్లతో గిరిజన సమరయోధుల మ్యూజియం, కాపులుప్పాడలో రూ.45 కోట్లతో అల్లూరి స్మారక మ్యూజియంను నిర్మించనున్నారు. విశాఖలో రూ.10 కోట్లతో ట్రైబల్ రీసెర్చ్ మిషన్ (టీఆర్ఎం) భవన నిర్మాణం పూర్తైంది. మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు గత సర్కారు ఇచ్చిన అనుమతిని పూర్తిగా రద్దు చేసి ఆదివాసీలకు ఇచ్చిన మాటను సీఎం వైఎస్ జగన్ నిలబెట్టుకున్నారు. గర్వంగా చెప్పుకుంటాం.. ఆదివాసీల హక్కులు, రక్షణ కోసం పునరంకితమయ్యేలా ఆగస్టు 9వతేదీని అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంగా 1994లో ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఏపీలో రెండేళ్లలో సాధించిన గిరిజనాభివృద్ధిని అంతర్జాతీయ గిరిజన దినోత్సవం రోజే కాదు.. ఎప్పుడైనా గర్వంగా చెప్పగలం. సీఎం జగన్ దార్శనికతతో గిరిజన ప్రాంతాలు కళకళలాడుతున్నాయి. – పాముల పుష్ప శ్రీవాణి, ఉప ముఖ్యమంత్రి -
గిరిజన సంక్షేమానికి పెద్దపీట
-
గ్రామ స్వరాజ్యం సాకారం చేశాం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్వోఎఫ్ఆర్ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గాంధీ జయంతి రోజున పట్టాల పంపిణీతో పాటు మరిన్ని గిరిజన సంక్షేమ కార్యక్రమాలకు సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. పాడేరులో మెడికల్ కాలేజీ, కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ, గిరిజన ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు ఆన్లైన్ ద్వారా సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఇంటింటికి ప్రభుత్వ పథకాలు, గ్రామగ్రామానికి ప్రభుత్వ సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. గిరిజన సంక్షేమానికి పెద్దపీట వేశామన్నారు.లక్షా 53వేల మంది గిరిజనులకు 3.12లక్షల ఎకరాల భూమి పంపిణీ , రైతు భరోసా సాయం అందిస్తున్నామని తెలిపారు. (చదవండి: గిరిజనుల దశాబ్దాల కల సాకారం..) ‘‘మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావిస్తా. భూ వివాదాలకు ఎక్కడా తావు లేకుండా డిజిటల్ సర్వే ద్వారా పంపిణీ చేశాం. గిరిజనులకు భూమితో పాటు రైతు భరోసా కింద సాయం అందిస్తాం. పట్టాలు పొందిన గిరిజనులకు ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకుంటాం.పంటలు పండించుకునేందుకు గిరిజనులకు ఆర్ధిక సాయం అందిస్తామన్నారు. గిరిజనులకు ఫారెస్ట్ అధికారులతో పాటు కలెక్టర్లు దిశానిర్దేశం చేస్తారని’’ సీఎం పేర్కొన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో గిరిజనులకు మంత్రి పదవి ఇవ్వాలన్న ఆలోచన రాలేదని, గిరిజన సలహా మండలి ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా రాలేదన్నారు. ‘‘పాదయాత్రలో గిరిజన ప్రాంతాల్లో పరిస్థితులను చూశా.గిరిజనుల ఆదాయం, పచ్చదనం పెరగాలి.గిరిజనుల ఆదాయం, పచ్చదనం పెరగాలి. నాడు-నేడులో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నాం. పాడేరులో రూ.500 కోట్లతో వైద్య కళాశాలకు, కురుపాంలో రూ.153 కోట్లతో గిరిజన ఇంజినీరింగ్ కాలేజీకి శంకుస్థాపనకు శ్రీకారం చుట్టాం. సీతంపేట, పార్వతీపురం, దోర్నాల, బుట్టాయిగూడెం, రంపచోడవరంలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులను అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్ఆర్ సంపూర్ణ ప్లస్ పథకం కింద గర్భిణీలకు, చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తున్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం చదువులను తీసుకొచ్చామని’ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. చప్పట్లతో అభినందించాలి.. గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థకు ఏడాది పూర్తయిన సందర్భంగా గ్రామ స్వరాజ్యాన్ని సాధ్యం చేస్తున్న వారికి సీఎం వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. సీఎం జగన్ ఏమన్నారంటే... ‘‘అక్టోబరు 2న గాంధీ జయంతి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తిచేస్తున్నాను. మన గ్రామాల్లో మన ఇంటి వద్దకే వచ్చి మన తలుపు తట్టి మనకు ఏ సహాయం కావాలన్నాకూడా వివక్ష లేకుండా, లంచాలకు తావులేకుండా మనకు మంచి చేస్తున్న గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థలు స్థాపించి దాదాపు ఏడాది పూర్తవుతోంది. ఏడాది పూర్తవుతున్న సందర్భంగా గ్రామ స్వరాజ్యం మన అందరికీ కూడా కళ్ల ఎదుటే కనిపించే విధంగా వీళ్లందరూ కూడా మనకు సేవలు అందిస్తున్నారు. లాభాపేక్ష లేకుండా మనకు సేవలు చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు మనకు మంచి సేవలు అందిస్తున్న వీరందరినీ అభినందిస్తూ ఇళ్లనుంచి బయటకు వచ్చి చప్పట్టు కొట్టి అభినందించాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందికి, వాలంటీర్లను ప్రోత్సహించేలా, వారికి తోడుగా ఉండేలా నిలిచేందుకు వారిని చప్పట్లతో అభినందించాలని కోరుతున్నా. నేనుకూడా సాయంత్రం 7 గంటలకు బయటకు వచ్చి నా ఇంటి బయటకు వచ్చి చప్పట్లు కొడతాను. మన వంతు ఆదరణ వారికి చూపించాలని’’ సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. -
గిరిజనుల దశాబ్దాల కల సాకారం..
సాక్షి, అమరావతి: పోడు వ్యవసాయాన్ని నమ్ముకున్న దాదాపు లక్షన్నర మంది గిరిజన రైతుల స్వప్నం గాంధీ జయంతి రోజున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాకారం చేశారు. వారికి అటవీ భూములపై హక్కులు కల్పిస్తూ ఆయన శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్వోఎఫ్ఆర్ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గాంధీ జయంతి రోజున పట్టాల పంపిణీతో పాటు మరిన్ని గిరిజన సంక్షేమ కార్యక్రమాలకు సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. పాడేరులో మెడికల్ కాలేజీ, కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ, గిరిజన ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. 5 మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులకు ప్రభుత్వం 246.30 కోట్లు మంజూరు చేసింది. (చదవండి: గాంధీ అడుగు నీడలో పాలన : సీఎం జగన్) తొలిసారిగా గిరిజన రైతులు సాగు చేసుకునే అటవీ భూములపై దివంగత వైఎస్సార్ హక్కు పత్రాలను అందచేశారు. 1,30,679 ఎకరాలకు సంబంధించి 55,513 ఆర్వోఎఫ్ఆర్ పట్టాలను ఆయన పంపిణీ చేశారు. తరువాత ప్రభుత్వాలు గిరిజన సంక్షేమాన్ని విస్మరించాయి. ఇప్పుడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మరోసారి అదే స్థాయిలో పంపిణీకి శ్రీకారం చుట్టింది. -
నేడు గిరిపుత్రులకు ‘పట్టా’భిషేకం
గిరిపుత్రుల తలరాతలు మారుతున్నాయి. వారి జీవితాల్లో వెలుగు పూలు పూయించేందుకు సర్కారు నడుం బిగించింది. నాడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర సాక్షిగా వారి కష్టాలు నేరుగా తెలుసుకున్నారు... వారి సమస్యలు కళ్లారా చూశారు... నేనున్నానంటూ భరోసా కల్పించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో వాటిని నెరవేరుస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్నా హక్కుకు ఠికానా లేక... కష్టపడినా ఫలితం దక్కుతుందో తెలీక... దినదిన గండంగా గడుపుతున్న వారికి అటవీభూములపై హక్కు కలి్పస్తున్నారు. ఉన్నత విద్యను వారికి చేరువ చేసేందుకు ఇంజినీరింగ్ కళాశాలను ప్రారంభిస్తున్నారు. అత్యాధునిక వైద్యం ఉచితంగా అందించేందుకు సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి కల సాకారం చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: జిల్లా చరిత్రలో మునుపెన్నడూ లేని రీతిలో గిరిజనులకు విద్య, వైద్యం, జీవనోపాధి అందించే భారీ ప్రాజెక్టులను గాంధీ జయంతి నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఒకేసారి ప్రారంభించనున్నారు. తాను పాదయాత్రలో గిరిపుత్రులకు ఇచ్చిన మాట ప్రకారం వారికి ఉన్నత విద్యను, ఆధునిక వైద్య సదుపాయాలను అందించనున్నారు. ఎన్నో ఏళ్లుగా అడవితల్లిని నమ్ముకొని జీవనాన్ని సాగిస్తున్న గిరిపుత్రులకు వారు సాగుచేసే అటవీ భూమిపై సాగుహక్కు కల్పిస్తూ పట్టాలను ఇవ్వనున్నారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి శుక్రవారం నిర్వహించే వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఈ మూడు కార్యక్రమాలను ఉదయం 11 గంటలకు ప్రారంభిస్తారు. (చదవండి: సాకారం కానున్న గిరిజన రైతుల స్వప్నం) అటవీ భూములపై శాశ్వత హక్కు జిల్లాలోని కురుపాం, పార్వతీపురం, సాలూరు తదితర మూ డు షెడ్యూల్డు ప్రాంత అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు నాన్ షెడ్యూల్డు ప్రాంతంలోని బొబ్బిలి, గజపతినగరం, నెల్లిమర్ల, ఎస్.కోట తదితర అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో వున్న అటవీ భూములపై కూడా స్థానికంగా నివసించే గిరిజనులకు సాగు హక్కు కల్పించే పట్టాలు, ప్రభుత్వ భూముల పై డీకేటీ పట్టాలు పంపిణీ చేసేందుకు జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ నేతృత్వంలో ఐటీడీఏ పీఓ కూర్మనాథ్, అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని షెడ్యూల్డు, నాన్ షెడ్యూల్డు ఏరియాలో కలుపుకొని 13,076 గిరిజన కుటుంబాలకు 25,002 ఎకరాల అటవీ భూమిపై అటవీ హక్కుల పత్రాలు అందజేసేందుకు అంతా సిద్ధం చేశారు. మరో 9,945 మంది గిరిజనులకు 15,012 ఎకరాల విస్తీర్ణంపై హక్కులు కలి్పస్తూ డీకేటీ పట్టాలను కూడా అందజేయనున్నారు. మొత్తం జిల్లాలోని 23,021 గిరిజన కుటుంబాలకు 40,015 ఎకరాల భూములపై సాగు హక్కులు కలి్పంచే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. చేరువలో ఉన్నత విద్య గిరిజన విద్యార్ధులు ఉన్నత చదువుల కోసం ఎంతో దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా నాణ్యమైన ఉన్నత, సాంకేతిక విద్యను వారి ముంగిటనే అందించేందుకు వీలుగా కురుపాంలో జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ కళాశాలను ఏర్పా టు చేస్తున్నారు. కంప్యూటర్ సైన్సు, సివిల్, మెకానికల్, ఈసీఈ, ఈఈఈ బ్రాంచిలతో ఈ ఏడాది నుంచే తరగతు లు మొదలయ్యేలా కళాశాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రభు త్వం కళాశాలకు అవసరమైన భవనాలు, ఇతర మౌలిక సదుపాయాల కోసం రూ.153 కోట్లు మంజూరు చేస్తూ ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయని కురుపాం ఇంజినీరింగ్ కళాశాల స్పెషల్ ఆఫీసర్, జేఎన్టీయూ ప్రొఫెసర్ జయసుమ చెప్పారు. ఇంజినీరింగ్ కళాశాలను ముఖ్యమంత్రి ప్రారంభించడంతోపాటు భవనాల నిర్మాణానికి కూడా ఆన్ లైన్లోనే శంకుస్థాపన చేయనున్నారు. ఆధునిక వసతుల వైద్యం పార్వతీపురంలో రూ.49.26 కోట్లతో 151 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలిచ్చింది. దీనికి సంబంధించి ఇటీవలే వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సహా ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు స్థల పరిశీలన కూడా చేశారు. ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 90 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో, మూడంతస్తుల్లో ఈ ఆసుపత్రి భవనాలను నిర్మించనున్నారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి ఆన్లైన్ ద్వారా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. పార్వతీపుం ఐటీడీఏ చరిత్రలో ఇంతవరకు ఎన్నడూలేని విధంగా ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టడంతో ఈ ప్రాంత గిరిజనులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. పార్వతీపురం మునిసిపల్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్‌లాల్‌తో పాటు, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. పాస్‌పుస్తకాలు పంపిణీకి సిద్ధం అటవీ భూములను డిజిటైజేషన్ ద్వారా సర్వే నిర్వహించి లబి్ధదారులకు కేటాయించిన భూములకు హద్దు రాళ్ళు నాటి, అటవీ హక్కుల పాస్ పుస్తకాలు పంపిణీకి సిద్ధం చేశాం. ఆర్ఓఎఫ్ఆర్, డీకేటీ పట్టాలు పొందిన గిరిజన రైతులకు భూములు సాగుచేసుకొనే నిమిత్తం వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ ద్వారా జీడిమామిడి మొక్కలు, చిరుధాన్యాల విత్తనాలు, పవర్ వీలర్స్, స్ప్రేయర్స్, పవర్ టిల్లర్స్, సూక్ష్మ ధాతువులు రాయితీద్వారా అందించనున్నారు. – ఆర్.కూర్మనాథ్, ఐటీడీఏ పీఓ ఎన్నో ఏళ్ల కల నెరవేరుతోంది మా తాత ముత్తాతల నుంచి ఎంతోమంది అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాం. కానీ మా భూములపై హక్కులు మాకున్నాయో లేదో తెలిసేది కాదు. ఇంతవరకు కష్టపడి వ్యవసాయం చేసుకోవడమే గాని మా భూముల పై హక్కు ఎలా పొందాలి, మా పేరున పట్టాలు ఎలా తీసుకోవాలో తెలీదు. ఇప్పుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి వల్ల ఆ కల నెరవేరుతోంది. మా భూములపై సంపూర్ణ హక్కులు లభిస్తున్నాయి. సీఎంకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. – ఆరిక శ్రీనివాసరావు, టేఖరగండి గ్రామం -
గిరిపుత్రులకు భూ హక్కు
కురుపాం: దశాబ్దాలుగా వారు పోడు వ్యవసాయం చేస్తున్నారు. కానీ వాటిపై హక్కు మాత్రం పొందలేకపోతున్నారు. ఏదైనా ప్రకృతి విపత్తు వల్ల పంట నష్టపోతే వారికి ఏ విధమైన పరిహారమూ అందేది కాదు. దీనివల్ల ఏడాది పొడవునా వారు పడిన శ్రమ వృధా అవుతుండేది. ఈ సమస్యలన్నీ ప్రజాసంకల్పయాత్ర సందర్భంగా ఈ ప్రాంతానికి వచ్చిన వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తెలుసుకుని వారికి శాశ్వత ప్రాతిపదికన న్యాయం చేస్తానని ఆనాడే హామీ ఇచ్చారు. ఈ మేరకు అధికారంలోకి వచ్చిన తరువాత అడవుల్లో పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజన రైతులందరికీ భూమి హక్కు పత్రాలు(పట్టాలు) ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రంలో పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజన రైతులకు 50 వేల ఎకరాలు పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టారు. నాడు రాజన్న... నేడు జగనన్న దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి రైతును రాజు చేయాలన్న సంకల్పంతో పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులందరికీ భూమి హక్కు పత్రాలిచ్చారు. ఆ తరువాత వచ్చిన పాలకులు మిగతా వారిగురించి పట్టించుకోలేదు. మళ్లీ ఆయన తనయుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అధికా రం చేపట్టిన తరువాత గిరిజనుల సమస్యపై దృష్టి పెట్టారు. అటవీశాఖ అధికారుల నుంచి ఇబ్బందులు ఎదురవకుండా పోడు వ్యవసాయం చేస్తున్న రైతులందరికీ ఆర్ఓఎఫ్ఆర్ (రికార్డు ఆఫ్ ఫారెస్ట్ రైట్స్) కింద పట్టాలివ్వాలని ఆదేశించారు. పోడు భూముల్లో ఎవరు సాగు చేస్తే వారికే పట్టాలు ఇవ్వాలని, భూమి లేని వారికి కూడా భూమిని మంజూరు చేయాలని సూచించారు. ప్రభుత్వ సాయం పొందేందుకు అర్హత గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం నుంచి సాయం పొందేందుకు వీలవుతుంది. ప్రభుత్వం ఇప్పటికే రైతు భరోసా కార్యక్రమాన్ని చేపట్టి పెట్టుబడి సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పొందిన రైతులు సైతం రైతు భరోసా పథకం ద్వారా లబి్ధపొందనున్నారు. బ్యాంకు రుణాలు పొందే అవకాశం ఉంది. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2,22,383.02 ఎకరాల భూమిని పంపిణీ చేయడం ద్వారా 88,991 మంది రైతులకు ప్రయోజనం కలిగింది. వారికి ఇప్పటివరకూ అటవీ అధికారుల నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా వ్యవసా యం చేసుకోగలుగుతున్నారు. ఐటీడీఏ పరిధిలో 11,784 ఎకరాలు సిద్ధం పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని ఎనిమిది సబ్‌ప్లాన్ మండలాల్లో రెండవ ఫేజ్‌లో భూమి లేని వారిని గుర్తించారు. మొత్తం 8 సబ్‌ప్లాన్ మండలాల్లో 5,984 మందిని గుర్తించి వారికి 11,784 ఎకరాలను గాంధీజయంతి రోజైన అక్టోబర్ 2వ తేదీన పంపిణి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఐటీడీఏ పీఓ ఆర్.కూర్మనాథ్, రెవెన్యూ సిబ్బంది చురుగ్గా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే భూమిని గుర్తించటంతోపాటు ఆన్లైన్లో నమోదు చేసి, సరిహద్దుల వద్ద రాళ్లను కూడా పాతిపెట్టేందుకు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టారు. చురుగ్గా చర్యలు ఉన్నతాధికారుల సూచనల మేరకు ఆర్ఓఎఫ్ఆర్ భూ పంపిణీకి చురుగ్గా చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే భూమి లేని వారిని గుర్తించి వివరాలను ఆన్లైన్లో నమోదు చేశాం. గుర్తించి ఆర్ఓఎఫ్ఆర్ భూముల వద్ద సరిహద్ధు రాళ్లను కూడా పాతిపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. అక్టోబర్ 2వ తేదీ నాటికి భూమి లేని గిరిజనులందరికీ భూ పట్టాలు అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. – హెచ్.రమణారావు, ఇన్చార్జ్ తహసీల్దార్, కురుపాం కుటుంబానికి ఆసరా ప్రభుత్వం పంపిణీ చేయనున్న భూమి నా కుటుంబ పోషణకు ఆసరాగా నిలుస్తుంది. కురుపాం పంచాయతీ పరిధి టేకరఖండి గిరిజన గ్రామంలో లేని నాకు ఎకరా 27 సెంట్ల భూమి మంజూరు చేసినట్లు, భూ పట్టాలను కూడా పంపిణీ చేయనున్నట్టు రెవెన్యూ అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి రుణ పడి ఉంటాం. – ఆరిక రాము, కురుపాం గతంలో దరఖాస్తు చేసినా పట్టించుకోలేదు ఆర్ఓఎఫ్ఆర్ భూమి కోసం పలుమార్లు గత ప్రభుత్వం హయాంలో వినతులు సమర్పించినా ఎవరూ స్పందించలేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నేరుగా భూమి లేని రైతులకు భూమిని మంజూరు చేయటమే కాకుండా వాటిపై రైతు భరోసా, రుణాలు సైతం వచ్చేలా చర్యలు తీసుకోవడం సంతోషంగా ఉంది. – ఆరిక శ్రీనివాసరావు, టేకరఖండి, కురుపాం మండలం -
అక్టోబర్ 2న ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల పంపిణీ
సాక్షి, అమరావతి: అక్టోబర్ 2(గాంధీ జయంతి) రోజున 35షెడ్యూల్డ్ మండలాల్లో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో కలెక్టర్లు, ఎస్పీలతో స్పందన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. సరిహద్దులను గుర్తించడం, సరిహద్దు రాళ్లను వేయడం, లబ్ధిదారులను వారికి కేటాయించిన భూమి వద్ద నిలబెట్టి పోటోలు తీయడం, రికార్డుల్లో దాన్ని నమోదు చేయడం, వెబ్ ల్యాండ్, ఆర్ఓఎఫ్ఆర్ డేటాబేస్‌లో ఈ వివరాలను నమోదు చేయడం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. (అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్) అదే విధంగా అర్బన్ హెల్త్ క్లినిక్స్‌కు స్థలాల గుర్తింపు పూర్తి చేయాలన్నారు. కొత్తగా 16 టీచింగ్ ఆసుత్రులను నిర్మించబోతున్నామని తెలిపారు. వచ్చే నెలలో వీటికి టెండర్లు జరుగుతాయని చెప్పారు. ఇప్పటివరకు మొత్తం పదకొండు టీచింగ్ ఆసుపత్రులు ఉన్నాయని, వాటికి కొత్తగా పదహారు కలిస్తే 27టీచింగ్ ఆసుపత్రులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. నాడు-నేడు: నాడు-నేడు స్కూల్స్‌కు సంబంధించి తొమ్మిది అంశాలతో పాటు కిచెన్ కూడా జత చేశామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఈ పది అంశాలకు సంబంధించి అక్టోబర్ 5న స్కూల్స్ తెరిచే అవకాశం ఉందని చెప్పారు. ఈ నెల 30వ తేదీలోగా పనులు పూర్తి చేయాలని అధికారులను సూచించారు. నాడు-నేడు పనుల్లో క్వాలిటీపై కలెక్టర్లు, జేసీలు పర్యవేక్షించాలని ఆదేశించారు. 1085 టాయిలెట్లపై స్లాబ్‌లు వేయాల్సి ఉందని వాటిని కూడా పూర్తి చేయాలని సూచించారు. 55,607 అంగన్ వాడీ కేంద్రాల్లో కూడా నాడు-నేడు కింద వసతుల ఏర్పాటు చేయబోతున్నామని పేర్కొన్నారు. వాటిని వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూల్స్ కింద మార్చబోతున్నామని సీఎం వెల్లడించారు. ఈ కేంద్రాల్లో కూడా పది అంశాల్లో అన్ని నాడు-నేడు పనులు చేపడతామని వ్యాఖ్యానించారు. 22979 కేంద్రాలు అద్దె భవనాల్లో ఉన్నాయని వాటికి నూతన భవనాలను సమకూర్చాలన్నారు. 11,961 చోట్ల అంగన్వాడీలకు స్థలం గుర్తించడం జరిగిందని తెలిపారు. 12,018 చోట్ల స్థలం కేటాయించాల్సి ఉందని, కలెక్టర్లు, జేసీలు త్వరగా స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. ఈ నెల 30నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. ప్రైమరీ స్కూళ్లలో స్థలం అందుబాటులో ఉంటే దానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. 1200 నూతన భవనాలు పూర్తయ్యే స్థితిలో ఉన్నాయని చెప్పారు. ఎరువుల లభ్యతపై వ్యవసాయ శాఖతో కలెక్టర్లు సమన్వయం చేసుకుని రైతులకు ఇబ్బంది లేకుండా అందించాలని సీఎం వైఎస్ జగన్ అన్నారు. మండల స్థాయిలో ఎంత అవసరం, ఎంత లభ్యత ఉంది అనే అంశాలను పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. ఈ నెలలో ఎరువులకు అధిక డిమాండ్ ఉంటుందని కలెక్టర్లు దానిపై దృష్టి సారించాలని సీఎం జగన్ సూచించారు. -
గిరిజనుల సాగులోని భూములకు పట్టాలు
సాక్షి, అమరావతి: క్లెయిములను పరిశీలించి గిరిజనులకు మేలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆగస్టు 9 ఆదివాసీ దినోత్సవం రోజున గిరిజనులకు పట్టాలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఆర్వోఎఫ్ఆర్ పట్టాలపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అటవీ భూములపై సాగు హక్కుల కోసం చాలా కాలంగా వేచి చూస్తున్న గిరిజనులకు ప్రయోజనం కల్పించాలని సీఎం స్పష్టం చేశారు. సీఎం ఇంకా ఏమన్నారంటే.. ► అర్హత ఉన్న వారందరికీ సాగు హక్కులు కల్పించాలి. పట్టాలు ఇచ్చాక ఆయా భూముల అభివృద్ధిపై కార్యాచరణ తయారు చేయాలి. ► ఆ భూముల్లో ఏయే పంటలు సాగు చేయాలన్న దానిపై ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలి. ఇందుకోసం వ్యవసాయ, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలి. ► ఇందుకోసం గిరిభూమి పేరుతో పోర్టల్‌ను ప్రారంభిస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. సమీక్షలో డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, రెవెన్యూ, అటవీ, గిరిజన సంక్షేమ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. గిరిజనం కోసం సీఎం చొరవ ► గిరిజన రైతులు రిజర్వు ఫారెస్ట్‌ను ఆనుకుని చాలా వరకు సాగు చేసుకుంటున్నారు. ఆర్వోఎఫ్ఆర్ పట్టాల కోసం దరఖాస్తులు చేశారు. అయితే అధికారుల పరిశీలనలో ఇవి బంజరు భూములుగా తేలడంతో మొదట ఆ దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ► ఈ విషయం సీఎం జగన్ దృష్టికి వెళ్లడంతో వారందరికీ పట్టాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ► బంజరు భూముల్లో సాగు చేస్తున్న గిరిజనులు సుమారు 10 వేల మంది ఉన్నారని అధికారులు గుర్తించారు. 21 వేల ఎకరాల బంజరు భూముల్లో ప్రస్తుతం పంటలు సాగు చేస్తున్నారు. ► పోడు వ్యవసాయం చేసుకునే గిరిజన రైతులకు ఫారెస్ట్ వారి నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా భూమి హక్కు పత్రాలు ఇస్తారు. ► వైఎస్సార్ హయాంలో లక్షల మంది గిరిజనులకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చారు. అప్పటి నుంచి వ్యవసాయాన్ని నమ్ముకుని బతుకుతున్నారు. ► గిరిజనులు పండించే వ్యవసాయ ఉత్పత్తులకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్ ద్వారా కొంటోంది. -
ఆర్వోఎఫ్ఆర్ పట్టాలపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి: ఆర్వోఎఫ్ఆర్ పట్టాలపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. శుక్రవారం రోజున సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, రెవిన్యూ, అటవీ, గిరిజన సంక్షేమ శాఖలకు చెందిన అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఆగస్టు 9న ఆదివాసీ దినోత్సవం రోజున పట్టాల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అందుకు సంబంధించిన క్లెయిమ్‌లను పరిశీలించి గిరిజనులకు మేలు చేయాలని అధికారులకు సూచించారు. అటవీ భూములపై సాగు హక్కుల కోసం చాలా కాలంగా వేచి చూస్తున్న గిరిజనులకు ప్రయోజనం కల్పించాలన్నారు. అర్హత ఉన్న వారందరికీ సాగు హక్కులు కల్పించాలని ఆదేశించారు. పట్టాలు ఇచ్చాక ఆయా భూముల అభివృద్ధిపై కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలన్నారు. ఆ భూముల్లో ఏం సాగు చేయాలన్న దానిపై కూడా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు పోవాలని సూచించారు. దీనిపై వ్యవసాయ, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. దీని కోసం 'గిరిభూమి' పేరుతో పోర్టల్‌ను ప్రారంభిస్తున్నట్లు అధికారులు సీఎం వైఎస్ జగన్‌కు తెలిపారు. (అందరికీ పథకాల ఫలాలు దక్కాలి: వైఎస్ జగన్) -
వ్యవసాయం ద్వారా జీవనోపాధి
సాక్షి, అమరావతి: ఆర్వోఎఫ్ఆర్ (రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్) మంజూరు ద్వారా గిరిజనులు వ్యవసాయం చేసుకుని జీవనోపాధి పొందేలా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. గిరిజనులకు దారి చూపించేలా వ్యవహరించాలని, మానవత్వంతో పని చేసి.. ప్రతి ఒక్కరికీ మంచి చేయాలన్నారు. ఆర్వోఎఫ్ఆర్ పట్టాలపై సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మనం చేసే మంచిని గిరిజనులు కలకాలం గుర్తు పెట్టుకుంటారని, ప్రతి ఆర్వోఎఫ్ఆర్ పట్టాను ఆధార్‌తో లింక్ చేయాలని సూచించారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. గిరిజనులకు మేలు జరిగేలా చూడాలి ► ఆర్వోఎఫ్ఆర్ పట్టా ఉన్న వారికి మనం రైతు భరోసా అమలు చేస్తున్నాం. అటవీ భూములపై వారికి హక్కులు కల్పించడం ద్వారా పెట్టుబడి సహాయం పొందడానికి అవకాశం కల్పించినట్లు అవుతుంది. ► గిరిజనులు ఆదాయం పొందడానికి మనం అవకాశాలు కల్పించాలి. అటవీ భూములపై హక్కులు కల్పించే అంశంలో అవినీతి ఉండకూడదు. అధికారులు గిరిజనులకు దారి చూపించేలా వ్యవహరించాలి. ► వచ్చిన దరఖాస్తులను మరోసారి పరిశీలించండి. ఆదివాసీ దినోత్సవం నాటికి వారికి అటవీ భూములపై హక్కులు కల్పించేలా చూడాలి. ► సమీక్షలో డిప్యూటీ సీఎంలు పిల్లి సుభాష్ చంద్రబోస్, పి.పుష్ప శ్రీవాణి, ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ కాంతిలాల్ దండే, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరబ్‌కుమార్ ప్రసాద్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ప్రతీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గిరిజనుల ప్రయోజనాల పరిరక్షణకు కృషి జీవో నంబరు 3పై (షెడ్యూల్ ఏరియాల్లో ఉపాధ్యాయుల నియామకాల్లో నూరు శాతం ఎస్టీలనే నియమించాలి) గిరిజనుల ప్రయోజనాలను రక్షించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. సమీక్షలో డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, అధికారులు ఈ అంశాన్ని ప్రస్తావించినప్పుడు సీఎం పై విధంగా స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పులోని అంశాలను నిశితంగా అధ్యయనం చేయాలని ఇదివరకే ఆదేశాలిచ్చామని, పరిశీలన పూర్తయ్యాక తీసుకోవాల్సిన చర్యలన్నింటినీ తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. గిరిజనుల ప్రయోజనాలను కాపాడేందుకు ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తుందని చెప్పారు. -
ఆర్వోఎఫ్ఆర్ పట్టాలపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, తాడేపల్లి : ఆర్వోఎఫ్ఆర్ (రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్) పట్టాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. సోమవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, పుష్పశ్రీవాణి, ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ కాంతిలాల్ దండే, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులకు పలు సూచనలు చేశారు. వ్యవసాయం చేసుకునే గిరిజనులకు జీవనోపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆర్వోఎఫ్ఆర్ పట్టా ఉన్న వారికి రైతు భరోసా అమలు చేస్తున్నామని సీఎం జగన్ ప్రకటించారు. (చదవండి : రైతుల కోసం జగన్ సర్కార్ మరో ముందడుగు) అటవీ భూములపై గిరిజనులకు హక్కులు కల్పించడం ద్వారా పెట్టుబడి సాయం పొందడానికి అవకాశం కల్పించినట్లవుతుందన్నారు. అటవీ భూములపై హక్కులు కల్పించే అంశంలో అవినీతి ఉండకూడదని అధికారులకు సూచించారు. అధికారులు మానవత్వంతో పని చేయాలని, గిరిజనులు ఆదాయం పొందడానికి అవకాశాలు కల్పించాలన్నారు. గిరిజనులకు దారి చూపించేలా అధికారులు వ్యవహరించాలని కోరారు. ప్రతి ఆర్వోఎఫ్ఆర్ పట్టాను ఆధార్‌లో లింక్ చేయాలని సూచించారు. అదివాసీ దినోత్సవం నాటికి గిరిజనులకు అటవీ భూములపై హక్కులు కల్పించేలా చూడాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. -
ఆర్ఓఎఫ్ఆర్ భూముల్లో ఉమ్మడి పరిశోధన
- అటవీ శాఖ ప్రతిపాదనకు సీఎం ఆమోదం - మెదక్ జిల్లాలో 40 హెక్టార్లలో పరిశోధన కేంద్రం సాక్షి, హైదరాబాద్: అటవీ భూములపై హక్కులు కల్పిస్తూ గతంలో పట్టాలు జారీ చేసిన భూముల్లో (ఆర్ఓఎఫ్ఆర్) తిరిగి అటవీ సంపదను వృద్ధి చేసేందుకు ఉద్దేశించిన ప్రతిపాదనను సీఎం కేసీఆర్ మంగళవారం ఆమోదించారు. అటవీ సంపద వృద్ధిపై పరిశోధనకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టుకు మెదక్ జిల్లా ములుగు అటవీ ప్రాంతంలో సుమారు 40 హెక్టార్ల భూమిని కేటాయించాలని నిర్ణయించారు. ‘ఉమ్మడి పరిశోధన ప్రాజెక్టు’ పేరిట అటవీ, ఉద్యానవన శాఖలు సంయుక్తంగా చేపట్టే ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలను అటవీశాఖ ప్రధాన ముఖ్య సంరక్షణాధికారి పీకేశర్మ సీఎం కేసీఆర్‌కు సమర్పించారు. అంతగా సారవంతం లేని ఈ భూములకు నీటిపారుదల సౌకర్యం లేకపోవడం, పంట ఉత్పత్తి సామర్థ్యం తక్కువగా ఉండటంతో అటవీ సంపదనే వృద్ధి చేయాలని అటవీ శాఖ ప్రతిపాదించింది. అటవీ భూములపై హక్కులు ఉన్న వ్యక్తులు, సమూహాలను ఈ ప్రాజెక్టులో భాగస్వాములను చేయాలని అటవీ శాఖ ప్రతిపాదించింది. అటవీ భూములపై ఆధా రపడి వున్న షెడ్యూలు తెగలతో పాటు ఇతరులకు హక్కులు కల్పిస్తూ 2006లో ప్రత్యేక చట్టం రూపొందించారు. 2008 జనవరి నుంచి అమల్లోకి వచ్చిన ఈ చట్టం ద్వారా 96,238 మందికి (3,13,912 ఎకరాలు), 744 సమూహాల (5,30,082 ఎకరాలు)కు అటవీ భూములపై హక్కులు కల్పించారు. ప్రస్తుతం సీఎం ఆమోదించిన ప్రాజెక్టు ప్రతిపాదనల ప్రకారం ఈ భూముల్లో అట వీశాఖ సహకారంతో ఉద్యానవన శాఖ... అటవీ జాతులు, ఉద్యాన, వ్యవసాయ పంటల సాగుపై పరిశోధనలు నిర్వహిస్తుంది. తద్వారా అటవీ భూములపై ఆధారపడి సాగు చేస్తున్న వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో సీఎం ప్రత్యేక కార్యదర్శులు కె.భూపాల్‌రెడ్డి, ప్రియాంక వ ర్గీస్ పాల్గొన్నారు.